Top Stories
ప్రధాన వార్తలు

ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు.

మే నెలలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
ఏప్రిల్ నెల ముగియనుంది. మే నెల వచ్చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెల సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. మే నెలలో శని, ఆదివారాలతో కలిపి మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉంటాయి.మే నెలలో బ్యాంకు సెలవుల జాబితా➤మే 1, 2025 – కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర దినోత్సవం➤మే 4, 2025 – ఆదివారం➤మే 9, 2025 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి➤మే 10, 2025 – రెండవ శనివారం➤మే 11, 2025 – ఆదివారం➤మే 12, 2025 – బుద్ధ పూర్ణిమ➤మే 16, 2025 – సిక్కిం స్టేట్ డే➤మే 18, 2025 – ఆదివారం➤మే 24, 2025 – నాల్గవ శనివారం➤మే 25, 2025 – ఆదివారం➤మే 26, 2025 – కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు➤మే 29, 2025 – మహారాణా ప్రతాప్ జయంతిఇదీ చదవండి: పహల్గాం ఘటన.. ఎల్ఐసీ కీలక ప్రకటనబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).

పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్‌లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.

పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు.

IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఐపీఎల్-2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపుగా సగం మ్యాచ్‌లు ముగిసినందున, ఆయా జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్‌లపై కన్నేశాయి. ప్లే ఆఫ్స్ రేసులో మొత్తం ఆరు జట్లు పోటీపడుతుంటే.. ఐదు సార్లు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు వరుస ఓటములతో వెనకంజలో ఉన్నాయి. ఈ ఏడాదిలో సీజన్లో ఇంకా ఒక్కో జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాయి. దీంతో సెకెండ్ హాఫ్‌లో ప్రతీ మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారనుంది. కేవలం విజయాలు మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ కూడా టాప్-4 జట్లను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రతీ జట్టుకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తం 10 జట్లకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్ములేపుతోంది. గుజరాత్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.ఢిల్లీ సైతం 8 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే గుజరాత్(+1.104) కంటే రన్‌రేట్ పరంగా కాస్త వెనకబడి ఉండడంతో ఢిల్లీ( +0.657) రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్ జట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టొచ్చు.ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ఈ ఏడాది సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా అదరగొడుతోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. అయితే గుజరాత్, ఢిల్లీ కంటే రన్‌రేట్‌పరంగా వెనకబడి ఉండడంతో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లలో రెండు కచ్చితంగా గెలవాలి.మరోవైపు ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. ముంబైకి ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. . ఇందులో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది.లక్నో సూపర్ జెయింట్స్ అండ్ పంజాబ్ కింగ్స్ఈ ఏడాది సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. అదేవిధంగా సీజన్లో ఆరంభంలో దుమ్ములేపిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం కాస్త తడబడుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది.కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్‌కు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్‌కతా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కేకేఆర్ రన్‌రేట్(+0.212) కాస్త మెరుగ్గా ఉండడంతో వారి ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.రాజస్తాన్ రాయల్స్..ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ కథ దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటివరకు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్.. 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. సన్‌రైజర్స్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు గెలిచినా రాజస్తాన్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్(-0.625) కూడా మెరుగ్గా లేదు.ఎస్ఆర్హెచ్ అండ్ సీఎస్కే..ఇక పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్దానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడితో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు ఓడితే మాత్రం అధికారికంగా ఆరెంజ్ ఆర్మీ నిష్క్రమిస్తోంది. మరోవైపు సీఎస్కే పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ సింధు నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం, అందుకు బదులుగా 1972 నాటి సిమ్లా అగ్రిమెంటు అమలును పాక్ సస్పెండ్ చేయడం తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని పాక్ తాజాగా యోచిస్తోంది. 1965లో ఇండియాతో తలెత్తిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పాక్ 1966లో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966 జనవరి 10న తాష్కెంట్ వేదికగా భారత్, పాక్ మధ్య ఈ చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. నాటి సోవియట్ రాజకీయవేత్త అలెక్సీ కోసిజిన్ ఈ కార్యక్రమానికి సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్, పాక్ ఇరు దేశాలూ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతోపాటు దౌత్య, ఆర్ధిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధానాంశాలు. అయితే కశ్మీర్ వివాద పరిష్కారంలో తాష్కెంట్ ఒప్పందం విఫలమైంది. 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం సంభవించడం, బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంటుకు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగునపడింది. సిమ్లా అగ్రిమెంటుకే విలువ ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న పాక్ తాజాగా ఆరు దశాబ్దాల నాటి తాష్కెంట్ ఒప్పందం నుంచి వైదొలగాలని యోచించడం పెద్ద విశేషమేమీ కాదు. కాకపొతే పాక్ వైఖరిని గమనించడానికి ఇదొక ఉదాహరణ. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే, ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటీ! - జమ్ముల శ్రీకాంత్.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా తదితర సినిమాలొచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం దాదాపు 25కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో అరడజనుకు మూవీస్ కి పైగా ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే మ్యాడ్ స్క్వేర్, జ్యూయెల్ థీప్, మజాకా, వీరధీరశూర, ఎల్ 2 ఎంపురాన్, నిరమ్ మరుమ్ ఉళగిల్, లాఫింగ్ బుద్ధా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (ఏప్రిల్ 25)నెట్ ఫ్లిక్స్మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమాహవోక్ - ఇంగ్లీష్ మూవీఈజ్ లవ్ సస్టెయనబుల్ - జపనీస్ సిరీస్జ్యూయెల్ థీప్ - తెలుగు డబ్బింగ్ సినిమాద రెలుక్టెంట్ పీచర్ - జపనీస్ సిరీస్వీక్ హీరో క్లాస్ 2 - కొరియన్ సిరీస్అమెజాన్ ప్రైమ్మజాకా - తెలుగు మూవీవీరధీరశూర - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)కల్లు కాంపౌండ్ - తెలుగు మూవీఫ్లో - ఇంగ్లీష్ సినిమాఇరవనిల్ ఆటమ్ పర్ - తమిళ మూవీల్యాండ్ లైన్ - ఇంగ్లీష్ సినిమావివాహా ఆహ్వానం - మలయాళ చిత్రంనోవకైన్ - ఇంగ్లీష్ మూవీసమర - మలయాళ సినిమాసూపర్ బాయ్స్ మలెగావ్ - తెలుగు డబ్బింగ్ మూవీతకవి - తమిళ సినిమాహాట్ స్టార్ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ - ఇంగ్లీష్ మూవీకజిలియోనైరీ - ఇంగ్లీష్ సినిమావాండర్ పంప్ విల్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఎల్ 2 ఎంపురాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5అయ్యన మానే - కన్నడ సిరీస్ఎస్ఎఫ్ 8 - కొరియన్ సిరీస్సన్ నెక్స్ట్నిరమ్ మరుమ్ ఉళగిల్ - తమిళ సినిమాలాఫింగ్ బుద్ధా - కన్నడ మూవీఆపిల్ ప్లస్ టీవీవోండ్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఆహాగార్డియన్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
న్యూఢిల్లీ: ఏప్రిల్ 16న ఉత్తారఖండ్ మసూరీలో పెళ్లి. 19న హర్యానాలోని కర్నాల్‌లో రిసెప్షన్. ఏప్రిల్ 21న కశ్మీర్లో హనీమూన్. ఏప్రిల్ 23న కర్నాల్‌లో అంత్యక్రియలు. ఇండియన్ నేవి లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ జీవితం ఇలా ముగిసింది.ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన త్రీవవాదుల దాడిలో 26 మంది మరణించారు. వారిలో నేవి అధికారి వినయ్ నార్వాల్ ఒకరు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి కొద్ది నిమిషాల ముందు వినయ్ నార్వాల్, ఆయన సతీమణి హిమాన్షి సరదగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. We're safe. A recent video was misused by some pages, falsely claiming it was the last video of late Vinay narwal and his wife. They have clarified that this video is not theirs. #Pahalgam #Kashmir #pahalgamattack pic.twitter.com/aAdlnTarNf— Shaheen khan (@shaheenkhan09) April 24, 2025 ఆ వీడియో మాదే కానీ,ఆ వీడియోలో ఉన్నది వినయ్ నార్వాల్ దంపతులు కాదని, ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్ శరావత్, యాషికా శర్మ దంపతులు సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ మా వీడియోని షేర్ చేస్తున్నారు. నేవి అధికారి వినయ్ నర్వాల్ దంపతుల పేరిట వైరల్ అవుతున్న వీడియో మాదే. దుర్ఘటన జరిగే సమయంలో మేం అక్కడలేము. మేం బ్రతికే ఉన్నాం.. కశ్మీర్ టూర్లో ఉండగా ఏప్రిల్ 14న రికార్డ్ చేసిన వీడియోని ఏప్రిల్ 22న సోషల్ మీడియాలో షేర్ చేశాం. అయితే అదే రోజు పహల్గాం దాడి జరగడం. మేం పోస్టు చేసిన వీడియోకి నెగిటీవ్ కామెంట్లు వచ్చాయి. వెంటనే వాటిని డిలీట్ చేశాం. కానీ అప్పటికే నేవి అధికారి వినయ్ నర్వాల్ దంపతుల పేరిట వీడియోని షేర్ చేశారని స్పష్టత ఇచ్చారు. యాషికా, ఆశిష్‌లు స్పందిస్తూ.. మేం బ్రతికే ఉన్నాం. మేం షేర్ చేసిన వీడియో ఇలా ఒక విషాద ఘటనకు లింక్ చేయడం మాకు బాధ కలిగింది. మేము లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను షేర్ చేయొద్దని కోరారు.తప్పుడు ప్రచారం మమ్మల్ని మరింత బాధిస్తున్నాయిపహల్గాంలో వినయ్ నర్వాల్ దంపతులు సంతోషంగా గడిపిన చివరి క్షణం ఇదేనంటూ 19సెకన్ల వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియోపై వినయ్ నర్వాల్ సోదరి స్రిష్టి నర్వాల్ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తన సోదరుడు వినయ్, వదిన హిమాన్షి కాదని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ వినయ్‌ను అగౌర పరచొద్దని కోరారు. వినయ్ గురించి కుటుంబసభ్యులు సమాచారం ఇస్తారని అన్నారు. మేం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి పుకార్లు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్‌తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్‌తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.
పదేళ్ల కల: రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
IPL 2025: ధోని అరుదైన రికార్డు..
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
సాంకేతికంగా... ‘నిరభ్యంతరం’గా!
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బతికున్నా..
నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’
సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
మళ్లీ ఉగ్ర కాండ!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ప్రాణాలు కాపాడిన ఉప్పు
సాక్షి కార్టూన్ 25-04-2025
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
యుద్ధమేఘాలు!
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
సింహానికి చిట్టెలుకకు పోలికా?.. భారత్, పాక్ బలాబలాలు ఇలా..
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
మెగా అగచాట్ల డీఎస్సీ!
రంగంలోకి యుద్ధనౌకలు!
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
వైమానిక దాడికి రెడీనా ?
‘పది’పోయిన ఫలితాలు
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
టాపర్ కాస్త హంతకుడిగా..
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
OTTలో ఏం చూడాలో అర్థం కావట్లేదా? ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు!
ఒకే ఇల్లు.. ఒకే వంట
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
ఎన్టీఆర్‌తో స్పెషల్ డ్యాన్స్?
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పట్టాల బోల్టులను తొలగించిన దుండగులు.. తప్పిన పెను రైలు ప్రమాదం
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
పహల్గాం ఘటన.. పేలుడులో కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు ధ్వంసం!
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
హైదరాబాద్‌లో హై అలర్ట్
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు పోయిందా?
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
భారత సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ ఆర్మీ కాల్పులు
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
ఆ హామీ ఏమైంది?
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్
డేంజర్ నుంచి క్రిటికల్ జోన్లోకి.. ఎస్ఎల్బీసీలో ఇప్పుడేం జరుగుతోంది?
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
పహల్గాం దాడిలో హమాస్ నేతల ప్లాన్.. POKలో ఏం జరిగింది?
పదేళ్ల కల: రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
IPL 2025: ధోని అరుదైన రికార్డు..
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
సాంకేతికంగా... ‘నిరభ్యంతరం’గా!
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బతికున్నా..
నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’
సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
మళ్లీ ఉగ్ర కాండ!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ప్రాణాలు కాపాడిన ఉప్పు
సాక్షి కార్టూన్ 25-04-2025
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
యుద్ధమేఘాలు!
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
సింహానికి చిట్టెలుకకు పోలికా?.. భారత్, పాక్ బలాబలాలు ఇలా..
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
మెగా అగచాట్ల డీఎస్సీ!
రంగంలోకి యుద్ధనౌకలు!
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
వైమానిక దాడికి రెడీనా ?
‘పది’పోయిన ఫలితాలు
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
టాపర్ కాస్త హంతకుడిగా..
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
OTTలో ఏం చూడాలో అర్థం కావట్లేదా? ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు!
ఒకే ఇల్లు.. ఒకే వంట
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
ఎన్టీఆర్‌తో స్పెషల్ డ్యాన్స్?
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పట్టాల బోల్టులను తొలగించిన దుండగులు.. తప్పిన పెను రైలు ప్రమాదం
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
పహల్గాం ఘటన.. పేలుడులో కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు ధ్వంసం!
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
హైదరాబాద్‌లో హై అలర్ట్
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు పోయిందా?
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
భారత సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ ఆర్మీ కాల్పులు
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
ఆ హామీ ఏమైంది?
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్
డేంజర్ నుంచి క్రిటికల్ జోన్లోకి.. ఎస్ఎల్బీసీలో ఇప్పుడేం జరుగుతోంది?
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
పహల్గాం దాడిలో హమాస్ నేతల ప్లాన్.. POKలో ఏం జరిగింది?
సినిమా

Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
టైటిల్ : సోదరా నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తి గుప్తా, ప్రాచి బన్సాల్, బాబు మోహన్, బాబా భాస్కర్ తదితరులునిర్మాణ సంస్థలు: క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: చంద్ర చగన్లాఎడిటింగ్: శివ శ్రావణి దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లిసంగీతం: సునీల్ కశ్యప్ విడుదల: ఏప్రిల్ 25, 2025డిఫరెంట్ కామెడీ సినిమాలతో నవ్వించి మెప్పించే సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu ) మొదటిసారి రియల్ ఎమోషన్ చేశాను, న్యాచురల్ కామెడీ సినిమా చేశాను అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించాం అంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చారు. మరి ఈ సోదరా సినిమా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం(Sodara Movie Review )కథేంటంటే..తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లవ్వట్లేదని, వచ్చిన 99 సంబంధాలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్న సమయంలో చిరంజీవి ఎదురింట్లోకి దివి(ఆర్తి గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడతారు. ఇద్దరూ దీవిని ట్రై చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వస్తాయి. అదే సమయంలో కాలేజీలో చదువుకోడానికి చిరంజీవి తమ్ముడు పవన్ ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు పవన్. ఓ సారి పవన్ ఇంటికి వచ్చినప్పుడు దివి తన అన్నయ్యని రిజెక్ట్ చేసిందని తెలిసి మరోసారి నీ ప్రేమని చెప్పు అంటూ అర్ధరాత్రి తన అన్నయ్యని దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అది దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవ అయి రెండు కుటుంబాలు కొట్టుకునే దాకా వెళ్తారు. ఈ గొడవతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. తమ్ముడి వల్లే ఇదంతా జరిగిందని చిరంజీవి పవన్ కి దూరంగా ఉంటాడు. మరి చిరంజీవి - పవన్ మళ్ళీ అన్నదమ్ములుగా క్లోజ్ అవుతారా? దివి చిరంజీవి కోసం తిరిగి వస్తుందా? చిరంజీవి 100వ పెళ్లిచూపులు జరుగుతాయా? పవన్ లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కామెడీ కథలు చేసే సంపూర్ణేష్ బాబుతో మరో హీరోని పెట్టి అన్నదమ్ముల సినిమాతో పాటు ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ తెలంగాణ మట్టి వాసన, స్లాంగ్, జనాలు కాస్త రియలిస్టిగా చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఫస్టాఫ్ బాగా సాగదీసారు. కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్ కొడతాయి. ప్రథమార్థం సింపుల్ గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి నెలకొంటుంది. సెకండాఫ్‌లో కామెడీ, ఎమోషన్ పండించడానికి బాగానే కష్టపడ్డారు. కొన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్వుకుంటాం. ఓ పక్క లవ్ ఎమోషన్, మరో పక్క అన్నదమ్ముల ఎమోషన్ ని బాగానే చూపించే ప్రయాతం చేశారు. క్లైమాక్స్ లో కూడా మళ్ళీ ట్విస్టులు ఇచ్చి కథ ముగిస్తారు. అయితే అన్నదమ్ముల ఎమోషన్ ని లవ్ స్టోరీలు డామినేట్ చేశాయి అనిపిస్తాయి. ఎవరెలా చేసారంటే.. ఇన్నాళ్లు నవ్వించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ విలేజ్ లో సోడాలు అమ్ముకునే కుర్రాడి పాత్రలో సింపుల్ గా బాగానే నటించాడు. ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేసాడు. సంజోష్ కూడా తెలంగాణ యువకుడి పాత్రలో యాక్టివ్ గా కనపడ్డాడు. ఆర్తి గుప్తా కాసేపే కనపడినా పర్వాలేదనిపిస్తుంది. ప్రాచి బన్సాల్ తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రా పరిధి మేరకు నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే చూపించారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంది. సినిమాలో కొంతమందికి డబ్బింగ్ సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే మెప్పిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. మొదటి సినిమా అయినా డైరెక్టర్ మంచి కథ తీసుకొని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్‌లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్‌లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు.

భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్
హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha). ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో పరిచయమైన అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది.మంచి హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ తర్వాత సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. మధ్యలో రజనీకాంత్ తో కలిసి 'లింగా' అనే మూవీ చేసింది కానీ బ్యాడ్ లక్. దీనికి తోడు బొద్దుగా ఉండటం కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. అలా అప్పుడో ఇప్పుడో అన్నట్లు సినిమాలు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) ఇకపోతే ఈమె తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్(Zaheer Iqbal) అనే నటుడితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడింది. గతేడాది జూలైలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ టూర్స్ వేస్తూనే ఉన్నారు.తాజాగా ఈ భార్యభర్తలిద్దరూ కొత్త బీఎండబ్ల్యూ కారు(BMW Car) కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని జహీర్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే ఈ కారు ఖరీదు రూ.కోటి 30 లక్షలకు పైనే ఉంటుందని సమాచారం. సినిమాల విషయానికొస్తే సోనాక్షి నటించిన 'నికితా రాయ్' మే 30న విడుదల కానుంది. జహీర్ మాత్రం ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా తదితర సినిమాలొచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం దాదాపు 25కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో అరడజనుకు మూవీస్ కి పైగా ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే మ్యాడ్ స్క్వేర్, జ్యూయెల్ థీప్, మజాకా, వీరధీరశూర, ఎల్ 2 ఎంపురాన్, నిరమ్ మరుమ్ ఉళగిల్, లాఫింగ్ బుద్ధా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (ఏప్రిల్ 25)నెట్ ఫ్లిక్స్మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమాహవోక్ - ఇంగ్లీష్ మూవీఈజ్ లవ్ సస్టెయనబుల్ - జపనీస్ సిరీస్జ్యూయెల్ థీప్ - తెలుగు డబ్బింగ్ సినిమాద రెలుక్టెంట్ పీచర్ - జపనీస్ సిరీస్వీక్ హీరో క్లాస్ 2 - కొరియన్ సిరీస్అమెజాన్ ప్రైమ్మజాకా - తెలుగు మూవీవీరధీరశూర - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)కల్లు కాంపౌండ్ - తెలుగు మూవీఫ్లో - ఇంగ్లీష్ సినిమాఇరవనిల్ ఆటమ్ పర్ - తమిళ మూవీల్యాండ్ లైన్ - ఇంగ్లీష్ సినిమావివాహా ఆహ్వానం - మలయాళ చిత్రంనోవకైన్ - ఇంగ్లీష్ మూవీసమర - మలయాళ సినిమాసూపర్ బాయ్స్ మలెగావ్ - తెలుగు డబ్బింగ్ మూవీతకవి - తమిళ సినిమాహాట్ స్టార్ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ - ఇంగ్లీష్ మూవీకజిలియోనైరీ - ఇంగ్లీష్ సినిమావాండర్ పంప్ విల్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఎల్ 2 ఎంపురాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5అయ్యన మానే - కన్నడ సిరీస్ఎస్ఎఫ్ 8 - కొరియన్ సిరీస్సన్ నెక్స్ట్నిరమ్ మరుమ్ ఉళగిల్ - తమిళ సినిమాలాఫింగ్ బుద్ధా - కన్నడ మూవీఆపిల్ ప్లస్ టీవీవోండ్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఆహాగార్డియన్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
న్యూస్ పాడ్‌కాస్ట్

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
క్రీడలు

‘అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు.. నీకెందుకంత తొందర?!’
గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. తద్వారా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇక సన్‌రైజర్స్ శుక్రవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో తలపడనుంది. చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తేనే కమిన్స్ బృందానికి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సొంత మైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో రైజర్స్ ముంబై చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్.. ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది.ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) పూర్తిగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంతో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. రైజర్స్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ను దీపక్ చహర్ వేయగా.. బంతిని డౌన్ ది లెగ్ ఆడేందుకు ఇషాన్ ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతిలో పడింది. అయితే, బాల్ ఇషాన్ బ్యాట్ లేదంటే గ్లౌవ్స్‌ను తాకిందా లేదా అన్న సందేహంతో ముంబై బౌలర్‌గానీ, వికెట్ కీపర్‌గానీ అప్పీలు చేయలేదు.అంపైర్ కూడా వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదు. కానీ ఇంతలోనే తాను అవుటయ్యాయని ఫిక్స్ అయి ఇషాన్ క్రీజును వీడాడు. ఏం జరిగిందో అర్థం కాని అంపైర్.. అవుట్ ఇచ్చేందుకు వేలు పైకెత్తాలా అన్న సందిగ్దంలో ఆఖరికి అవుట్ ఇచ్చాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇషాన్ కిషన్ నాటౌట్ అని తేలింది. దీంతో ఇషాన్ అమ్ముడుపోయాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు‘‘చాలాసార్లు ఇలాగే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నిజంగా ఇదొక మతిలేని చర్య. కాసేపు ఆగితే ఏమయ్యేది?.. అంపైర్ కూడా తాను చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాడు కదా!అతడు తన నిర్ణయం ప్రకటించేదాకానైనా ఎదురుచూడాలి. తన పనిని తనను చేసుకోనివ్వాలి. ఇదేం రకమైన నిజాయితీయో నాకైతే అర్థం కావడం లేదు. క్రీడాస్ఫూర్తిని పాటిస్తున్నానని అతడు ఇలా చేసి ఉండవచ్చు, కానీ అవుట్ కాకుండానే వెళ్లిపోవడం.. అది కూడా అంపైర్‌ను తికమకపెట్టేలా వ్యవహరించడం సరికాదు. హఠాత్తుగా అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడో తెలియడం లేదు’’అంటూ సెహ్వాగ్ ఇషాన్‌కు చురకలు అంటించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) వల్ల ఈమాత్రం పరువునిలుపుకోగలిగింది. సన్‌రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు! Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025

పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్‌ను తన పేరిట జరిగే ఈవెంట్‌కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్‌ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్ అయిన అర్షద్‌కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్‌లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్‌లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్‌తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్

కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్ ఆచితూచి అడుగేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించాడు.రూ. 1.10 కోట్లకుదేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడుకెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్ వచ్చాడు. టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్‌తో కలిపి రాజస్తాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కిన ఈ బిహార్ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు.అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ వైభవ్ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడుఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్‌ల ద్వారా ఫేమస్ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్ ప్లేయర్ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్ సీజన్లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025

పాకిస్తాన్ ఉప ప్రధాని వ్యాఖ్యలు.. మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. ఇషాక్ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించింది.స్వాతంత్ర్య సమరయోధులా?అయితే, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్ దార్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.నేరుగా ఒప్పుకోవడమేఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇషాక్ దార్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.అవమానాలు ఎదుర్కొన్నాహిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా పహల్గామ్లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ హస్తం గనుక లేకపోతే.. పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025
బిజినెస్

లాభాలకు చెక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 79,212.53 వద్ద, నిఫ్టీ 207.35 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో.. 24,039.35 వద్ద నిలిచాయి.లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, కారారో ఇండియా, బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్స్, మనక్సియా స్టీల్స్, కంట్రీ కాండోస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలువగా.. SRM కాంట్రాక్టర్స్, PVP వెంచర్స్, భండారీ హొజియరీ ఎక్స్‌పోర్ట్స్, మైండ్టెక్ (ఇండియా), మాగ్నమ్ వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఆన్లైన్ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి, గడువు ఎప్పుడు, రిఫండ్‌ను ఎప్పుడు పొందే అవకాశం ఉందనే అంశాల గురించి తెలుసుకుంది.ఐటీఆర్‌ను ఎప్పుడు ఫైల్ చేయవచ్చు?ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2025-26 మదింపు సంవత్సరానికి మీ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ధ్రువీకరణ తేదీని అధికార వర్గాలు వెల్లడించలేదు. అయినప్పటికీ ఆదాయ పన్ను శాఖ సాధారణంగా ఏటా ఏప్రిల్ నాటికి ఐటీఆర్ ఫారాలను అందుబాటులో ఉంచుతుంది. ఫారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించవచ్చు.ఐటీఆర్ నమోదు చేయడానికి చివరి తేదీ ఏమిటి?గత ఏడాది షెడ్యూల్ ప్రకారం జరిమానా లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా నిర్ణయించారు. జరిమానాలతో ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు.రిఫండ్లు ఎప్పుడు పొందవచ్చు?రిఫండ్ ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ దాఖలు చేసిన వారం నుంచి 20 రోజుల్లో వారి రిఫండ్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఫైలింగ్ సమయంలో ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేసి పాన్‌తో లింక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!కీలక డాక్యుమెంట్లు ఏమిటి?మీ రిటర్న్‌ను సజావుగా, వేగంగా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పని చేస్తున్న యజమాని నుంచి ఫారం 16, వేతన స్లిప్పులు, మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రాలు, ఏదైనా మూలధన లాభాల వివరాలు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఆదాయం పొందినట్లయితే దానికి రుజువులను కూడా జత చేయాల్సి ఉంటుంది.

పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి.. త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది."పహల్గాంలో అమాయక పౌరుల మరణం పట్ల ఎల్ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండగా నిలుస్తుంది" అని ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉందని క్లెయిమ్‌దారులు తప్పకుండా గమనించాలి. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలి. పాలసీ ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించి ఉంటే లేదా గ్రేస్ పీరియడ్లోపు మరణం సంభవించినట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్కు అర్హత ఉంటుంది.క్లెయిమ్ ప్రాసెస్➤నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలి.➤పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.➤నామినీదారునికి, మరణించిన వ్యక్తికి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఫారమ్ Aను సబ్మిట్ చేయాలి.➤అధికారిక మరణ ధ్రువీకరణ పత్రంగా.. స్థానిక మరణ రిజిస్టర్ నుంచి ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.➤మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీదారు మరణించినట్లు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ఏవైనా ఆధారాలు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ఏదైనా పరిహారం వంటివి పాలసీదారు మరణించినట్లు నిర్దారించడానికి ఉపయోగపడతాయి.➤వీటన్నింటినీ.. పరిశీలించి ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!
టాప్ టెక్ కంపెనీల్లో పని చేయాలని చాలామంది భావిస్తుంటారు. అందుకు వర్క్‌ప్లేస్ ఒక కారణం అవుతుంది. కొన్ని కంపెనీలు పరిశ్రమలో ఆదరణ పొందినా సరైన పని వాతావరణాన్ని కల్పించలేవు. అదే ఇంకొన్ని సంస్థల పేర్లు పెద్దగా వినిపించకపోయినా మెరుగైన వర్క్‌ప్లేస్‌ను అందిస్తాయి. భారత్‌లో మంచి పని వాతావరణాన్ని అందిస్తున్న కంపెనీల జాబితాను ‘బ్లైండ్’ అనే సంస్థ రూపొందించింది. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్, మెటా టాప్ 10 బెస్ట్ రేటింగ్ కంపెనీల్లో చోటు దక్కించుకోగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ లీడర్ ఎన్విడియా రిటైల్ దిగ్గజం టార్గెట్ సంస్థ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు అమెజాన్ కంపెనీ ఇండియాలోనే అత్యంత పేలవమైన వర్క్‌ప్లేస్‌గా ఉందని నివేదిక తెలిపింది. పేటీఎం, ఇన్ మొబి, కాయిన్ బేస్, ఐబీఎం, స్ప్రింక్లర్ వంటి ఇతర ప్రధాన టెక్ కంపెనీలు కూడా పేలవమైన వర్క్‌ప్లేస్ జాబితాలో చివరన నిలిచాయి.బ్లైండ్ సంస్థ దేశంలోని 7,020 కంపెనీల ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించి ఈ జాబితాను సిద్ధం చేసింది. ఆరు కేటగిరీల్లో ప్రతి కంపెనీకి 5 పాయింట్ల స్కేలును నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా బ్లైండ్ సంస్థ ఉద్యోగుల వేతనం, సంతృప్తికర పని వాతావరణాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. కొన్ని మెరుగైన కంపెనీలు కూడా కొన్ని అంశాలను అధిగమించలేకపోయాయని తెలిపింది.ఇదీ చదవండి: రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లుకంపెనీ కల్చర్ పరంగా టార్గెట్, ఎన్వీడియా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, అకామై టెక్నాలజీస్, సర్వీస్ నౌ, జోహో, అరిస్టా నెట్వర్క్స్, మోర్గాన్ స్టాన్లీ, వీఎంవేర్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో అత్యధిక స్కోర్లను సాధించాయి. ట్రస్ట్ ఇన్ మేనేజ్మెంట్ కేటగిరీలో టార్గెట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సర్వీస్ నౌ, అరిస్టా నెట్వర్క్స్, ఎన్వీడియా, ప్యూర్ స్టోరేజ్, యాపిల్, హార్నెస్, ఈపీఏఎం సిస్టమ్స్ వంటి సంస్థలు రాణించాయి. గత ఏడాది కాలంలో భారతీయ నిపుణులు ఎక్కువగా సెర్చ్ చేసిన కంపెనీల్లో మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్వీడియా, బైట్ డాన్స్, నెట్‌ఫ్లిక్స్, ఓపెన్ఏఐ, వాల్‌మార్ట్ ఉన్నాయి. వీటితో పాటు ఇండియా ఆఫర్, లేఆఫ్, రిఫరల్, ప్రమోషన్, హెచ్-1బీ వంటి ట్రెండింగ్ సెర్చ్ పదాలు ఉన్నాయి.
ఫ్యామిలీ

ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
మధుమేహ బాధితులూ ఇకపై మీరంతా అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని నిశ్చింతగా తినేయొచ్చు. ఊబకాయులు సైతం కార్బొహైడ్రేట్స్‌ను ఎంత కావాలంటే అంత లాగించేయొచ్చు. అవును.. మీరు వింటున్నది నిజమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ను అదుపులో ఉంచే స్మార్ట్ కుక్కర్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కుక్కర్‌గా పేటెంట్ సైతం దీనికి లభించింది.గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మనం తీసుకునే ఆహారంలో 55% కంటే తక్కువగా ఉంటే రక్తంలో సుగర్ అత్యంత నిదానంగా పెరుగుతాయి. జీఐ 56–70% మధ్య ఉంటే నెమ్మదిగా.. 70% పైబడి ఉంటే వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర పాళ్లు పరిమితికి మించి పెరిగితే క్లోమ గ్రంధి (పాంక్రియాస్)పనితీరు మందగించి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా..ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దల్లోనేకాదు.. పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను నియంత్రించాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డి.సందీప్రాజా నేతృత్వంలో డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, వి.వాసుదేవరావు, ఎల్.ఏడుకొండలుతో కూడిన శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధన ఎట్టకేలకు ఫలించింది. ఎలాంటి వరి రకమైనా సరే ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాటిలోని జీఐ స్థాయిలను తగ్గించి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ ఆహార రంగంలో విప్లవమే.ఇదెలా పనిచేస్తుందంటే..ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా జీఐను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో బియ్యాన్ని స్టీమింగ్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు. గంజిని సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వేరు చేస్తారు. తర్వాత అన్నం వేగంగా చల్లబడే (ర్యాపిడ్ కూలింగ్) చాంబర్లోకి పంపి 1–2 డిగ్రీల సెల్సియస్‌లో ప్రాసెస్ చేస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే.. బియ్యాన్ని రీట్రో గ్రేడ్ చేయడం (అన్నేలింగ్, హీట్ మాయిశ్చర్ ట్రీట్మెంట్ (హెచ్ఎంటీ) ద్వారా అన్నంలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం)లో 20 నిమిషాల్లో జీర్ణమయ్యే పదార్థం (ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్–ఆర్డీఎస్)ను 90 నిముషాల్లో నెమ్మదిగా జీర్ణయ్యే పదార్థం (స్లో డైజెస్టబుల్ స్టార్చ్–ఎస్డీఎస్)గా మారుస్తుంది. దీంతో పాటు అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది అసలు జీర్ణ మవకుండా డైటరీ ఫైబర్‌లా ప్రవర్తించేలా ఒక రకమైన పిండి పదార్థం. బియ్యాన్ని వండే సమయంలో అదనపు పానీడు తీసేయడంతో కొంత స్టార్చ్ తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కుక్కర్లో వండితే 45% ఆర్డీ ఎస్‌ను ఎస్డీఎస్గా మార్చి ఆర్ఎస్ను 121% శాతానికి పెంచుతుంది. ఫలితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గిపోతుంది. ఇలా వండిన అన్నం సాధారణ అన్నంలాగే ఉంటుంది. సాధారణంగా వండే అన్నా నికి ఉన్నట్టుగానే రంగు, రుచి, వాసనలు పాడవకుండా ఉంటుంది.ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్ఇది పూర్తిగా స్మార్ట్ కంట్రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇంటిగ్రేషన్‌తో పనిచేస్తుంది. ఐవోటీ కంట్రోల్ రిమోట్ (మొబైల్ యాప్) ద్వారా ఎంతదూరం నుంచైనా దీనిని నియంత్రించవచ్చు. కేవలం ఒక కమాండ్ ఇస్తే చాలు ఇంట్లో అన్నం నిర్ణయించిన సమాయనికి రెడీ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. రైస్ వేరియంట్, బియ్యం–నీరు నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, స్టీమింగ్ సమయం వంటి వాటిని మొబైల్ ద్వారానే సెట్ చేసేలా ఏర్పాటు చేశారు. మనం పెట్టే బియ్యం రకం ఆధారంగా దానికి అవసరమైన నీటి నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, ఉడికే సమయం, చల్లబడే ఉష్ణోగ్రత, చల్లబడే కాలం, స్టీమింగ్కు అవసరమైన సమయం, వంటి అంశాలను కూడా ప్రత్యేక ఆల్గారిథం ద్వారా స్వయం చాలకంగా నియంత్రిచబడతాయి. 2022లో ప్రారంభమైన ఈ పరిశోధనకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ పరిశోధన పూర్తిగా బాపట్లలోనే జరిగింది. ఫ్యాబ్రికేషన్ కోసం కోయంబత్తురులోని ఓ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఈ వినూత్నమైన రైస్ కుక్కర్‌కు గత నెలలోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు(405194–001) లభించింది.డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగంస్మార్ట్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల రక్తంలోని సుగర్ స్థాయిలను పూర్తిగా నియంత్రించవచ్చు. నిధానంగా జీర్ణమవడం వల్ల మళ్లీ ఆకలి వేయడానికి సమయం పడుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం ఒక కంపెనీతో ఎంవోయూ చేసుకోబోతున్నాం. గతంలో నేను అభివృద్ధి చేసిన ఆప్లాటాక్సిన్ను కనుగొనే ఒక రాపిడ్ కిట్‌తో పాటు అతి తక్కువ ధరలోనే గైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించేలా తయారు చేసిన కిట్‌కు పేటెంట్ హక్కులు లభించాయి. వరుసగా మూడో ఆవిష్కరణకు పేటెంట్ హక్కు రావడం ఆనందంగా ఉంది.– డాక్టర్ దోనేపూడి సందీప్ రాజా, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల(చదవండి: ఇంటిని కూల్‌గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?)

నార్త్ టు సౌత్ నగరానికి క్యూ కడుతున్న నార్త్ ఫుడ్ బ్రాండ్స్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార రుచులు ఆదరణ పొందటం విధితమే. ఈ మధ్య కాలంలో నగరం వేదికగా నార్త్ డిషెస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నగరంలో నార్త్ రెస్టారెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే నార్త్ ఇండియన్ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ నగరానికి విచ్చేసింది. ఢిల్లీ వేదికగా ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ దక్షిణాదిలో మొదటిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45లో ఆవిష్కరించడం ఇక్కడి ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అని ఫుడ్ బ్లాగర్స్ చెబుతున్నారు.స్మోక్ తందూరి కబాబ్‌లు మొదలు మటన్ షికంపురి కబాబ్, పత్తర్ కా గోష్ట్ వంటి వంటకాలు ఉత్తరాది లాజీజ్ అఫైర్ ప్రత్యేకత. వీటితో పాటు షాహి దమ్ కా ఆలూ, భట్టి కా పనీర్, షాదీ కా లాల్ చికెన్, దాల్ లాజీజ్, కేసర్ ఫిర్ని వంటి రుచులను నగరవాసులకు చేరువ చేయడానికి జూబ్లీహిల్స్‌లో లజీజ్ అఫేర్ను ప్రారంభించినట్లు ఇన్నాటో హాస్పిటాలిటీ డైరెక్టర్ యాష్ త్రివేది తెలిపారు. ప్రత్యేకించి నార్ట్ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మరోసారి నగరవాసులకు రుచి చూపించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిసుగంధ ద్రవ్యాల సమ్మిళితంతో సాంస్కృతిక వంటకాలు, ఉత్తరాది పాకశాస్త్ర నైపుణ్యాలతో వడ్డించిన పసందైన రుచులు హైదరాబాదీల మనసు దోచేస్తాయన్నారు. అనాది ప్రపంచ స్థాయి వంటకాలకు నగరం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు వినూత్న రుచులను ఆస్వాదించే లక్షణమే ఈ ఆహార వైవిధ్యానికి కారణం. ఈ ప్రయాణంలో లజీజ్ అఫేర్కు స్పందన వస్తుండటం తమ ప్రయత్నానికి భరోసా లభించిందని సహా డైరెక్టర్ కుష్ త్రివేది వివరించారు.

Payal Rajput వజ్రాభరణాలంటే ఇష్టం..
గచ్చిబౌలి: వజ్రాభరణాలంటే చాలా ఇష్టమని నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) అన్నారు. కొండాపూర్‌లోని ప్రణవ్ వైష్ణాయ్ బిజినెస్ పార్క్‌లో టీబీజడ్–ది ఒరిజినల్ జ్యువెలర్ స్టోర్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో వివిధ రకాల డిజైన్ల భరణాలు ధరించి సందడి చేశారు. అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లడుతూ రూ.75 లక్షల విలువైన వజ్రాలు (Diamonds) పొదిగిన నక్లెస్‌తో పాటు మొత్తం కోటి రూపాయల విలువైన ఆభరణాలు ధరించానని చెప్పారు. ప్రతి ఆభరణం మన సంస్కృతిని తెలియజేసే విధంగా రూపొందించారన్నారు. టీబీజడ్ మూడో స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ రితీష్ గాడే మాట్లాడుతూ ప్రతి ఆభరణం మన వారసత్వానికి ప్రతీకలని, స్టోర్ బంగారంతో పాటు యాంటిక్, టెంపుల్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విస్తృతశ్రేణి మోడళ్లు, వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో సమకాలీన ఆభరణాల నుంచి సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. టీబీజడ్ ఒరిజినల్ సర్టిఫైడ్, స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్‌ను కలిగి ఉందన్నారు. దేశంలో వివిధ నగరాల్లో 37 స్టోర్లు ఉన్నాయని తెలిపారు. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి

ఇంటిని కూల్‌గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?
వేసవిలో ఇల్లు చల్లగా ఉండడానికి ఆవు పేడ ఉపయోగపడుతుందా? కాస్త వెనక్కి వెళితే....‘అవును’ అనే జవాబు వినిపిస్తుంది. ఒకప్పుడు పల్లెల్లో ఇంట్లో నేల, వాకిళ్లను పేడతో అలికేవారు. గోడలకు పూసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్లో ఆవు పేడతో అలకడం అనేది ఎకో–ఫ్రెండ్లీ అల్టర్నేటివ్. ఆవుపేడ పూసిన గృహాలు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. ఇది మన దేశ వైవిధ్య వాతావరణానికి సరిపోయే పద్ధతి. ఈత సంప్రదాయ పద్ధతి మళ్లీ పునర్దర్శనం ఇస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీలో లక్ష్మీబాయి కాలేజి క్లాస్రూమ్ గోడకు ప్రిన్సిపాల్ డా.ప్రత్యూష వత్సల ఆవుపేడను పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాజీ ప్రొఫెసర్, పర్యావరణ ప్రేమికులు డా.శివసుదర్శన్ మాలిక్ ఇళ్లను చల్లబర్చడానికి ఆవు పేడను ఉపయోగించే పురాతన భారతీయ విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు.ఆవుపేడ, బంకమట్టి, వేప ఆకులు, జిప్సం... ఇలాంటి వాటితో ‘వేద ప్లాస్టర్’ను సృష్టించారు మాలిక్. సిమెంట్ ఆధారిత ప్లాస్టర్ మాదిరిగా ఇది వేడిని గ్రహించదు.ఇళ్లలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. స్థానికంగా లభించే పదార్థాలు, ఆవుపేడతో ‘గోక్రెట్ బ్రిక్స్’ తయారు చేశారు మాలిక్. ‘ఈ ఇటుకలు వేడి ప్రవేశాన్ని 70 శాతం తగ్గించడానికి రూపొందించాం’ అంటున్నారు మాలిక్. పురాతన జ్ఞానం, సివిల్ ఇంజనీరింగ్‌ను మిళితం చేసి వాతావరణ మార్పులకు పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు డా.శివసుదర్శన్ మాలిక్.
ఫొటోలు


బాబోయ్.. సుర్రుమంటున్న ఎండలు.. జనం బెంబేలు (చిత్రాలు)


త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)


అందంగా ఆషికా.. అద్దం ముందు నుంచి కదలట్లేదుగా! (ఫోటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్


క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)


గోపీచంద్ కొత్త సినిమా హీరోయిన్ గా ఈ అమ్మాయే ..(ఫొటోలు)


పెళ్లి రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అజిత్ కుమార్ దంపతులు.. (ఫోటోలు)


తిరుపతిలో హీరోయిన్ మీనాక్షిచౌదరి సందడి (ఫొటోలు)


తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్ (ఫొటోలు)
అంతర్జాతీయం

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న పాకిస్థాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో మైఖేల్ రూబిన్.. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్‌లో జీవిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో అమెరికా పాక్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని సూచించారు.ఇదే సమయంలో.. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశానికి వెళ్ళినప్పుడు ఉగ్ర దాడి జరిగినట్లే, ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్ దాడి చేసినట్టు కనిపిస్తోంది అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ఇప్పటి పహల్గాం ఉగ్ర దాడికి.. 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయి. దేశంలో విదేశీ అగ్ర నేతల పర్యటనలు సాగుతున్న వేళే ఇవి చోటుచేసుకున్నాయి. దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే దాడి జరగడం గమనార్హం. అసీం మునీర్‌కు.. భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలూ ఉగ్ర దాడికి పురిగొల్పేలానే ఉంటాయి. దీనికి తోడు జమ్ము కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడం గమనార్హం.పుల్వామా దాడి వేళ మునీరే..2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక, ప్రస్తుత పహల్గాం ఘటనకు సంబంధించిన కూడా ఆయనకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలను బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్ వ్యాఖ్యానించారు.

పొగచూరి ఎండతగలక.. చల్లబడిన న్యూయార్క్!
న్యూయార్క్: సూరీడుని అదృశ్య శక్తి మింగేయడం, దాంతో భూమి మీద సూర్యరశ్మి కరువై ఒక్కసారిగా వాతావరణం చల్లబడం వంటి అభూత కల్పనల్లో వింటుంటాం. అలాంటి అరుదైన, వింత ఘటనకు అగ్రరాజ్యం వేదికైంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2023 జూన్‌లో భానుడు భగభగమండుతున్నా సిటీలో మాత్రం వాతావరణం చల్లబడింది. ఆ నగరంలో భూమిపై సూర్యరశ్శి ప్రసరణ తగ్గిపోవడమే కారణం. ఆనాడు సమీప కెనడా (Canada) దేశంలోని అటవీ కార్చిచ్చు కారణంగా దట్టంగా కమ్ముకున్న దుమ్ము, ధూళి మేఘాల కారణంగా న్యూయార్క్‌లో ఆకాశం మొత్తం మసకబారి సూర్య కిరణాలకు కాస్తంతయినా జాగా లేకుండా పోయిందని, అందుకే ఉష్ణోగ్రత మూడు డిగ్రీ సెల్సియస్ తగ్గిందని ఒక అధ్యయనం తాజాగా వెల్లడించింది. సంబంధిత అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరోన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూఉపరితాన్ని సూర్యరశ్మి తాకలేకపోవడంతో కాస్తంత వెలుతురు, వేడి తగ్గడాన్ని ‘గ్లోబల్ డిమ్మింగ్’ అంటారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిని మరింత గరళం చేసే వాయువులు భూ వాతావరణంలో చిక్కుబడిపోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని రట్గర్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. ఏకంగా 1,000 కిలోమీటర్లు ప్రయాణించి.. ఫిలిప్ డెమొక్రిటో, జార్జియస్ కెలీసిడీస్ల సారథ్యంలోని పరిశోధనా బృందం కెనడా దావానలం తాలూకు పొగ, ధూళి ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను కమ్మేసిన వైనాన్ని ఈ బృందం పరిశోధించింది. ‘‘ఈ దుమ్ము, ధూళి మేఘాల్లోని గోధమ రంగ కర్భన ఆర్గానిక్ అణువుల కారణంగానే సూర్యరశ్మి భూమిని తాకలేకపోయింది. ఉష్ణోగ్రత తగ్గడానికి ఇదే కారణం. ఈ భారీ ‘దుమ్ము గొడుగు’ కారణంగా స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన సహజ గాలికి సైతం ఆటంకాలు ఏర్పడ్డాయి.గాలి అటు ఇ టూ వేగంగా వెళ్లే పరిస్థితిలేకపోవడంతో ఎక్కడి వాయు కాలుష్యం (Air Pollution) అక్కడే గాఢంగా పరుచుకుపోయింది. ఈ కాలుష్య గాలిలోని సూక్ష్మధూ ళి కణాలు అలాగే భూమి సమీప వాతావరణంలోనే తిష్టవేశాయి. ఈ సమయంలో న్యూయార్క్ నగరంలో సూక్ష్మ ధూళి కణాలు (2.5 పీఎం) అత్యంత ఎక్కువ స్థాయిలో పోగుబడ్డాయి. పర్యావరణ పరిరక్షణా సంస్థ నిర్దేశించిన స్థాయి కంటే ఏకంగా మూడు రెట్లు ఎక్కువ సూక్ష్మధూళి కణాలు వాతావరణంలో ఉండిపోయాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుచేసిన స్థాయి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా సూక్ష్మ ధూళి కణాలు నగర గాలిలో ఉన్నాయి’’ అని పరిశోధకులు చెప్పారు. వ్యాధి నిరోధక శక్తి సగానికి.. ఊహించనంతగా పెరిగిన వాయుకాలుష్యం కారణంగా స్థానికులను శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముట్టాయని అధ్యయనకారులు తెలిపారు. రట్గర్స్ బృందం చేసిన మరో పరిశోధన ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పెను వాతావరణ పోకడ కారణంగా నగరంలోని ప్రతి ఒక్క ఒక్కరి ఊపిరితిత్తుల్లోకి అదనంగా సగటున 9.3 మిల్లీగ్రాముల బరువైన పొగ అణువులు చొరబడ్డాయని దీంతో ఇన్ఫెక్షన్లతో పోరాడే వాళ్ల వ్యాధినిరోధక శక్తి సామర్థ్యం ఏకంగా 50 శాతం క్షీణించిందని ఆ పరిశోధన పేర్కొంది.కెనడాలో కార్చిచ్చు ఘటనలు కొనసాగినన్ని రోజులూ న్యూయార్క్‌లో ఆస్తమా సంబంధ కేసులు 44 శాతం నుంచి ఏకంగా 82 శాతానికి పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని పరిశోధన ఉదహరించింది. ‘‘ఈ ప్రాంతంలో ఇలాంటి దృగ్విషయం జరగడం ఇదే తొలిసారి. అయితే ఇదే చివరిసారి అని మాత్రం చెప్పలేం. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి మళ్లీ సంభవించే ప్రమాదం ఉంది’’ అని పరిశోధకుడు ఫిలిప్ డెమొక్రిటో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా ఇకపై తరచూ, అత్యధికంగా కార్చిచ్చు ఘటనలు సంభవించి ఈశాన్య అమెరికాకు కాలుష్య కష్టాలు పెరిగే అవకాశముందని ఫిలిప్ విశ్లేషించారు. కార్చిచ్చులకు, పట్టణ ప్రాంతంలో వాతావరణంలో మార్పులకు, ప్రజారోగ్యానికి మధ్య సంబంధాలను ఈ పరిశోధన విశదీకరించింది.

చివరి నిమిషంలో సమావేశం రద్దు..
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కోసం బుధవారం లండన్‌లో జరగాల్సిన సమావేశం చివరి నిమిషంలో రద్దయ్యింది. మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపించకపోవడం, షెడ్యూల్ సమస్య కారణంగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆకస్మిక రద్దుతో చర్చల దిశపై సందేహాలు వ్యక్తమయ్యాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించడంతో ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది. వెయ్యి కిలోమీటర్ల ఫ్రంట్ లైన్ వెంబడి ఇరు పక్షాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. శాంతి ఒప్పందంపై సమావేశం జరుగుతుందని భావించిన బుధవారం ఉదయం కూడా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో కార్మికులతో వెళ్తున్న బస్సుపై రష్యా చేసిన దాడిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మరణించారు. 40 మందికి గాయపడ్డారు.

జెలెన్స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారు: ట్రంప్
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను రష్యాకు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గకుండా రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని జెలెన్స్కీ పొడిగిస్తున్నారని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ఆలోచనను తోసిపుచ్చిన జెలెన్స్కీ ‘మాట్లాడటానికి ఏమీ లేదు. ఇది మా భూమి, ఉక్రేనియన్ ప్రజల భూమి’ అని మంగళవారం ఉద్ఘాటించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. ఈ ప్రకటన రష్యాతో శాంతి చర్చలకు చాలా హానికరమన్నారు. ఇది చర్చనీయాంశం కూడా కాదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ క్రిమియాను కోల్పోయిందని, క్రిమియా కావాలనుకుంటే పదకొండేళ్ల కిందట రష్యాకు అప్పగించినప్పుడు వారు దాని కోసం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు.
జాతీయం

పహల్గాం దాడిలో హమాస్ నేతల ప్లాన్.. POKలో ఏం జరిగింది?
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై తాజాగా రూవెన్ అజార్ స్పందిస్తూ..‘హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉంది. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. గతంలో ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉంది. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారు.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ముష్కరులు సంగీత కచేరీలో పాల్గొన్న 1,400 మందికి పైగా పౌరులను హత్య చేశారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనడానికి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. దోషులను వేటాడుతాం అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం అభినందనీయం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు అనేక దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.Watch: On the Pahalgam terror attack, Reuven Azar, Ambassador of Israel to India, says, "You have a similar situation in which people were going to a music festival and were massacred, and people here were going on vacation and they were massacred. It’s the same death cult, the… pic.twitter.com/5obbvzh89V— IANS (@ians_india) April 24, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారత్.. పాక్‌పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాక్‌కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. అటారీ-వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్ వేడుకను బీఎస్ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది. పాక్ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రిట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్‌ను యథావిధిగా నిర్వహించామని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

భారత సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ ఆర్మీ కాల్పులు
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది. Small arms firing at some places on the Line of Control were initiated by the Pakistan Army. Effectively responded to by the Indian Army. No casualties. Further details are being ascertained: Indian Army officials pic.twitter.com/SlBSDPSJHA— ANI (@ANI) April 25, 2025మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BREAKINGEncounter breaks out in Bandipora, Jammu & Kashmir as terrorists open fire during a search operation.Security forces retaliate. No casualties reported yet. Updates awaited. pic.twitter.com/7jz8O8x4Ud— 𝕿𝖆𝖗𝖚𝖓 तरुण 卐 🇮🇳 (@fptarun) April 25, 2025

నేడు కశ్మీర్‌కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన రాహుల్ గురువారం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం.. మృతులకు ఘన నివాళిఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది.నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. అలాగే, లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’ అని కేంద్రానికి సూచించింది.రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘‘ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం’’ అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఒక క్షణం మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీడబ్ల్యూసీ, అనంతరం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్ర త కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’అని సీడబ్ల్యూసీ పేర్కొంది. ‘‘లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’’ అని కేంద్రానికి సూచించింది. రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

వికటించిన ప్రేమపెళ్లి
కర్ణాటక: ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్న ఓ యువతి.. నిండు గర్భిణిగా ఉండి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం రాయచూరు జిల్లా సింధనూరు గ్రామీణలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బూదిహాల్కు చెందిన యువకుడు నాగరాజు బ్రతుకుతెరువు కోసం బెంగళూరులో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేసే దుకాణ యజమాని కూతురు, చామరాజనగర జిల్లా కొళ్లేగాళకు చెందిన పల్లవి అలియాస్ అనుపమతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. కట్న వేధింపులు పెరిగి సుమారు ఏడాది కిందట గంగావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పల్లవి తొమ్మిది నెలల గర్భిణి. పల్లవి అగ్రవర్ణురాలు కాగా, నాగరాజ్‌ది మరో కులం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు, కట్న వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ కోసం అందరినీ వదులుకుని వస్తే జీవితం తలకిందులైందని పల్లవి ఆక్రోశించింది. గురువారం బూదిహాల్లో భర్త ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ తలవార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవలు జరగకుండా బూదిహాళలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త నాగరాజ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశామని సిఐ వీరారెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు.

ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు.

కట్టుకున్న భార్యలను కడతేర్చారు..
కలకాలం కాపురం చేస్తామని చేసిన బాసలు మరిచిన ఆ ఇద్దరు భర్తలూ భార్యల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కోపం పెంచుకున్న ఓ భర్త అదనుచూసి సహచరిని అంతం చేయగా, ఆడపిల్లలను కనిందన్న కోపంతో భార్యను హత్య చేశాడు మరో భర్త. నమ్మించి మెడ కోశాడు..గుడిహత్నూర్: కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సహించలేకపోయిన భర్త ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. నాలుగు రోజులు అత్తింటి వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నమ్మించాడు. గురువారం కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌కు చెందిన లట్పటే మారుతికి ఇదే గ్రామానికి చెందిన కీర్తి (28)తో 2012లో వివాహం జరిగింది. మారుతి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై కీర్తి పలుమార్లు భర్తను నిలదీసింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల కీర్తి తన ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్ష పెంచకున్న మారుతి తన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అత్తగారింటికి వచ్చి వారితో మర్యాదగా ప్రవర్తించాడు. గురువారం ఉదయం కీర్తి తాగునీటి కోసం ఇంటి సమీపంలోని నల్లా వద్దకు వెళ్లగా, మారుతి వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తి మెడపై దాడి చేసి పారిపోయాడు. రిమ్స్‌కు తరలించేలోపే ఆమె మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు.ఆడపిల్లలు పుట్టారని హతమార్చాడు..కాగజ్‌నగర్ రూరల్: మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవ పడి తలపై దాడి చేసి చంపాడు. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాంకు ఆసిఫాబాద్‌కు చెందిన భీంబాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఓ కూతురు పుట్టగా, మగసంతానం లేదని జయరాం కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్‌కు చెందిన పోషక్కను (40) 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా ఇద్దరూ కూతుళ్లే రవళి (12), గౌతమి (6) పుట్టారు. దీంతో మగపిల్లలు లేరని జయరాం తరచూ ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా రెండో భార్య పోషక్కతో గొడవ జరిగింది. ఆవేశానికి గురైన జయరాం పలుగుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోషక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనస్థలాన్ని కాగజ్‌నగర్ ఇన్చార్జి సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
వీడియోలు


మాకు అన్యాయం చేయొద్దు బాబుపై డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహం


కేటీఆర్ విత్ కొమ్మినేని పొలిటికల్ ఇంటర్వ్యూ


Perni Nani: చంద్రబాబు అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు


పెళ్లి తర్వాత దూసుకుపోతున్న కీర్తి సురేష్ ..


High Temperature: భానుడి భగభగలకు ఠారెత్తిపోతున్న ప్రజలు


ఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్


మా కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు


DYFI ఆధ్వర్యంలో విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన


విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు


చంద్రమౌళి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి