Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Why Terrorists Choose Pahalgam Baisaran Valley For Attack Full Details1
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు

ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్‌​ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్‌ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్‌ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్‌ ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్‌ అల్పైన్‌ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.‌ పైగా ల్యూలియన్‌ సరస్సుకు బైసరన్‌ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్‌ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్‌ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్‌ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్‌ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్‌ ఫైర్‌ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్‌ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్‌ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్‌ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్‌ మీడియాలో బైసరన్‌ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్‌ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్‌భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025

Gold Rates and Silver Price Today On April 23rd 20252
భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price Drop: దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నేడు (ఏప్రిల్ 23) భారీగా దిగివచ్చాయి. అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను మార్క్‌ను దాటేసిన పసిడి ధర ఈరోజు అత్యంత భారీగా తగ్గి రూ.లక్ష దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 23 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి. 👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్‌లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్‌ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,11,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

LET saifullah sajid And Pakistan Army Behind Pahalgam3
పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్‌.. పాక్‌ ఆర్మీ హస్తం?

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే, పహల్గాం దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్‌ ఉన్నట్టు తెలిసింది. దాడులకు పాల్పడింది తామేనని లష్కర్‌-ఏ-తోయిబా ముసుకు సంస్థ ది రిసిస్టెంట్‌ ఫ్రంట్ ప్రకటించుకుంది‌. అంతకుముందు సైఫుల్..లా ముజాహిదీలు కశ్మీర్‌లో దాడులు చేస్తారని ముందుగానే ప్రకటించాడు. త్వరలో కశ్మీర్‌ తమ గుప్పిట్లోకి వస్తుందన్న సైఫుల్లా చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు.. ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌ హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. ఇటీవల పాక్‌ ఆర్మీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఆధారంగా ఉన్నాయి. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను పాకిస్థాన్‌ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోము. ఇస్లామాబాద్‌కు కశ్మీర్‌ అంటే గొంతుకు వెళ్లే రక్తనాళం వంటిది. ప్రతీ విషయంలో మనం హిందువులకంటే విభిన్నమైన వారిమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం.మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనం రెండు విభిన్న దేశాలు, ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్థాన్​ చరిత్రను మరిపోవద్దని మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మరిచిపోవద్దని ప్రతిఒక్కరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పహల్గాం దాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌ మాజీ డీజీపీ శేష్‌ పాల్ వైద్ స్పందిస్తూ.. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉంది. రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీస్‌ భారత్‌పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేవో యాదృచ్ఛికంగా అన్నమాటలు కావు. ఎందుకంటే ఉగ్రవాదులు పర్యటకుల మతాన్ని అడిగి, ఎవరైతే ముస్లింలు కారో వారిని మాత్రమే చంపారు. హమాస్‌ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో, భారత్‌కు అలానే చేయాలి.#WATCH | #PahalgamTerroristAttack | Jammu, J&K | Former J&K DGP Shesh Paul Vaid says, "This is the Pulwama 2 moment of India. This was a Hamas-style attack on 7 October on Israel. It's not a coincidence that Asim Munir (Pakistan Army chief) uttered illogical words two days back,… pic.twitter.com/7LeIjL2cse— ANI (@ANI) April 23, 2025వాస్తవానికి ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం ప్రారంభించింది. ఎందుకంటే దాడి చేసింది ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్‌ సైన్యంలోని ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్‌) కమాండోలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. ఇక మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది. పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అతను తానేంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP IPS officer PSR Anjaneyulu Self Arguments Jethwani Kadambari Case4
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్‌ఆర్‌ స్వీయ వాదనలు

విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్‌ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్‌ఆర్‌ వాదనలు వినిపించారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్‌ఆర్‌ వాపోయారు. అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్‌ఆర్‌కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్‌ విధించారు. దీంతో విజయవాడ సబ్‌ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.ఇదీ చదవండి: పీఎస్‌ఆర్‌ అరెస్ట్‌పై వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

IPL 2025, LSG VS DC: Pant Underlines The Toss Effect In Lucknow5
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 22) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, ఎల్‌ఎస్‌జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్‌ (52), మిచెల్‌ మార్ష్‌ (45) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్‌ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్‌ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్‌ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్‌ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన పంత్‌ ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్‌ (57 నాటౌట్‌), అభిషేక్‌ పోరెల్‌ (51), అక్షర్‌ పటేల్‌ (34 నాటౌట్‌) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌గా కూడా విఫలమైన పంత్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.నిన్నటి మ్యాచ్‌ అనంతరం లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్‌ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్‌ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్‌ చేసే జట్టుకు వికెట్‌ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్‌ సమయంలో పిచ్‌ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్‌పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్‌ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్‌ను ముందుగా పంపాము. మిల్లర్‌ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్‌ తీరు ముందు ఇవేవి వర్కౌట్‌ కాలేదు. తదుపరి మ్యాచ్‌లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్‌ ప్లాన్స్‌పై డిస్కస్‌ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేస్తాము. ఈ మ్యాచ్‌లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్‌రేట్‌ మాత్రం మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్‌, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్‌-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్‌ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Pahalgam Attack  April 23rd Latest updates6
పహల్గాం ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల

పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్‌.. అప్‌డేట్స్‌ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంబాడీ క్యామ్‌ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులు పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన కీలక సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్‌ కీలక సమావేశం పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్‌ క​శ్మీర్‌ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్‌ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఇవాళ హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్‌, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ టీం పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌ కంట్రోల్‌ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

Young Singer Pravasthi Against Counter To Singer Sunitha7
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి

‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్‌ సునీత, నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. అయితే, తాజాగా వాటికి సమాధానంగా ప్రవస్తి మరో వీడియో చేసి తన యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేసింది. ఈ క్రమంలో సింగర్‌ సునీతకు పలు ప్రశ్నలు సిందిస్తూ.. వాటికి సమాధానం చెప్పాలని కోరింది.'సునీత గారు మీరు ఒక రీల్‌ పోస్ట్‌ చేస్తూ నా గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి. మీరు రీల్‌లో చాలా చక్కగా మాట్లాడారు. రియల్‌లో కూడా ఇలాగే మాట్లాడింటే ఇదంతా జరిగేది కాదు. పాటల ఎంపిక విషయంలో ఛానల్‌కు రైట్స్‌ ఉన్న వాటిని మాత్రమే నేను సెలెక్ట్‌ చేసుకున్నాను. నేను ఎప్పుడూ ఆ లైన్‌ దాటలేదు. ఛానల్‌కు ఉన్న రైట్స్‌ ప్రకారం నేనొక పాటను ఎంపిక చేసుకుని రిహార్సల్‌ పూర్తి చేసుకున్న తర్వాత నో చెప్పారు. కానీ, అదే ఎపిసోడ్‌లో అదే పాటను మరో అమ్మాయి పాడింది. దానిని మీరు ఎంకరేజ్‌ చేశారు. ఎందుకు..? మరోసారి 'కన్యాకుమారి' అనే పాట పాడక ముందే మీరు జడ్జిమెంట్‌ ఇచ్చేసి వెళ్లిపోయారు. ఇదెంత వరకు కరెక్ట్‌ చెప్పిండి..? స్టేజీపై పాట మధ్యలో లిరిక్స్‌ మరిచిపోయిన వారు ఎందుకు టాప్‌లో ఉన్నారు..? చేతి మీద రాసుకొచ్చిన వారిని మీరు ఎంకరేజ్‌ చేయలేదా..? లిరిక్స్‌ మరిచిపోయిన వారిని ఫైనల్‌ వరకు ఎలా తీసుకొచ్చారు..? మ్యాంగో వీడియోలో పాడే అవకాశం నాకు మీరు (సునీత) ఇవ్వలేదు మేడం.. మా గురువు గారు నిహాల్‌ కొండూరి ఆ ఛాన్స్‌ ఇచ్చారు. నేను పాడింది కూడా ఆయన కంపోజ్‌లోనే. సాంగ్‌ పూర్తి అయిన తర్వాత నన్ను, మా అమ్మను చాలా సేఫ్‌గా ఇంటికి చేర్పించానని చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆరోజు మా అమ్మ నాతో లేదు. నన్ను మీ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ కోసం తీసుకెళ్లేందుకు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే మళ్లీ ఇంటి వద్దకు చేర్చే బాధ్యత మీదే అని మీ అసిస్టెంట్‌తో మా అమ్మ చెప్పింది.కీరవాణి గారు కూడా స్టేజీపైనే కొన్ని మాటలు అన్నారు. అవి నన్ను బాధించాయి. పెళ్లి వేడుకలలో పాటలు పాడేవారు సింగర్స్‌ ఎంతమాత్రం కాదని ఆయన అన్నారు. అది చాలా హర్ట్‌ చేసే విషయం అని చెప్పాను. అందులో తప్పేముంది..? నాకిప్పుడు 19 ఏళ్లు. సంగీతమే నా ప్రాణం అని బతుకుతున్నాను. అందుకోసం నా చదువును కూడా వదులుకున్నాను. ఐదేళ్ల వయసు నుంచే నేను పాటల పోటీలలో ఉన్నాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఓటమి, విజయం నాకు కొత్త కాదు. నేను ఎలాంటి డిప్రెషన్‌లో లేను. నా వెనుక ఎవరూ లేరు. సొంతంగా పాటలు రెడీ చెసి విడుదల చేసేంత డబ్బులు మాకు లేవు. ఓటమి వచ్చినా తట్టకుని నిలబడే శక్తి నాకు ఉంది. కానీ, అన్యాయం జరిగింది కాబట్టే ప్రశ్నిస్తున్నాను. మీరంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. మీరోక లెజండరీ సింగర్‌.. ఎప్పటికీ నా అభిమాన సింగర్‌ మీరే..' అంటూ సునీతకు పలు ప్రశ్నలు ప్రవస్తి సందించింది. అయితే, సంగీతమే తన ప్రపంచం అని నమ్ముకుని 14 ఏళ్ల పాటు పాటల ప్రపంచంలోనే బతికిన ప్రవస్తికి ఛాన్సులు వస్తాయా..? అనే ప్రశ్నలు నెజన్లలో వస్తున్నాయి. ఈ వివాదంలో ఎక్కువగా ప్రవస్తికే నెటిజన్లు మద్ధతుగా నిలుస్తున్నారు.

Visakha Chandramouli Death In Kashmir Pahalgam8
కశ్మీర్‌ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి

శ్రీనగర్‌/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు.⁠ ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్‌గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్‌ టూర్‌కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్‌లోని పహాల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్‌ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్‌కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు.

mee Ettaboyina Sai Shivani who cracked UPSC 2024 with AIR 119
కఠోర సాధన, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే, సివిల్స్‌లో సత్తా

వరంగల్‌ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని (Ettaboyina Sai Shivani) యూపీఎస్‌సీ (UPSC) సివిల్స్‌లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేసిన శివాని మెయిన్స్‌ లోనూ మెరిసి 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్‌ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్‌ వన్‌ పరీక్షలోనూ జోనల్‌ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్‌ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ హోదా లేదా డీఎస్‌పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్‌ లో ఏకంగా 11వ ర్యాంక్‌ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘నాన్న రాజు మెడికల్‌ రిప్రంజెటివ్‌గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్‌ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్‌ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్‌ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువు కునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ్ర΄ోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్‌ మిస్‌ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్‌ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. కఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలతోపాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్‌ అనే వ్యక్తి నిర్వహించే అండర్‌ స్టాండింగ్‌ యూపీఎస్సీ ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్‌ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్‌

Special Story On Marriage Invitation To CM Revanth10
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి

బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో.. నాకేం తెలుసు.. ఆయనకు ఎప్పుడు ఖాళీదొరికితే అప్పుడే నా పెళ్లి.. ఓహో.. పురోహితుడు డేట్స్ కుదరలేదా.. అవునులే.. అసలే ఇప్పుడు పంతుళ్ళకు బిజీ ఉంది.. అయన తీరిక దొరికాక ఏదో డేట్ చెబుతాడు.. చేసుకుందువులే.. .. పురోహితుడు కాదు.. వేరే అయన డేట్స్ కుదరాలి.. ఓహో.. అర్థమైందిరా పిల్ల అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఆయనకు సెలవులు.. డేట్స్ దొరకలేదు.. అయన వస్తేగానీ పెళ్లి వద్దన్నారు ఆడపిల్లవాళ్ళు.. అయన వచ్చాకే చేసుకుందువులే.. అన్నారు పెద్దలు.. అది కాదు.. అన్నాడు గణేష్.. మరింకేందిరా.. ఇంకెవరి డేట్స్ కుదరాలి.. రేవంత్ రెడ్డి డేట్స్ కుదరాలి.. చెప్పాడు గణేష్.. వార్నీ.. అదేందిరా అన్నారు పెద్దలు.. అదంతే.. రేవంత్ రెడ్డి వస్తేనే నా పెళ్లి.. లేదంటే లేదు అంటుకుంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కుర్రాడు.. పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లను ఎవరైనా ఒరేయ్ అబ్బాయ్ నీ పెళ్లి ఎప్పుడురా అంటే ఇదిగో జాబ్ రాగానే చేసుకుంటాను.. ఇదిగో మా మరదలు ఒకే అనడమే లేటు.. అయ్యో.. ఇల్లు పని మధ్యలో ఉంది.. అది పూర్తయ్యాక బ్యాండ్ వాయించడమే.. జీతం తక్కువ ఉంది పెద్దయ్యా.. వచ్చే ఏడాది జీతం పెరగ్గానే చేస్కుంటా.. నువ్వే పిల్లను చూడు... నేనా అమెరికా వెళ్తున్న రెండేళ్లు అక్కడ ఉండి వస్తాను.. రాగానే చేసేసుకుంటా... లేదు బాబాయ్.. పిల్లలు దొరకడం లేదు.. పోనీ నువ్వైనా చూడు.. చేస్కుంటా.. అంటూ సమాధానాలు వస్తాయి.. కానీ ఈ కుర్రాడు మాత్రం.. నీ పెళ్లి ఎప్పుడురా అంటే షాకిచ్చే సమాధానం ఇచ్చాడు.. ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి సార్ నాకు ఉద్యోగం చూడండి.. లేదా మంత్రికి చెప్పి ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పించండి.. ఇంకా పెద్దాయనకు చెప్పి నాకు మెడిసిన్ సీట్ ఇప్పించండి అని కోరుకుంటారు.. సదరు నాయకుడు కూడా తన కార్యకర్త మాటను గౌరవించి మున్ముందు తనకు ఉపయోగపడే తీరునుబట్టి రికమెండేషన్ చేస్తారు. కానీ ఇదిగో తెలంగాణలోని వైరా నియోజకవర్గానికి చెందిన భూక్యా గణేష్ అనే యూత్ నాయకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరాడు. తన పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే అని పట్టుబట్టాడు.. అయన ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను అని ఫిక్షయ్యాడు. దీంతో ఏకంగా ఎమ్మెల్యే రామ్ దాస్ మాలోత్ కు ఒక లెటర్ రాసాడు.. ఇదిగో అన్నా.. నేను మీ నియోజకవర్గంలో నాయకుణ్ణి పెళ్ళికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ.. ఒక విజ్ఞాపన అందించాడు.. దాన్ని సదరు ఎమ్మెల్యే సీఎం కు ఫార్వార్డ్ చేసాడు.. మా ఊరి కుర్రాడికి పెళ్లి కుదిరింది.. మీరైతే రావాల్సిందే.. రాకుంటే నాకు ఇజ్జత్ పోయేలా ఉంది.. ఏదైనా చేసి రండి సారూ అంటూ ఆ ఎమ్మెల్యే కూడా సీఎం కు ఆ లెటర్ పంపాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు డేట్స్ కుదురుతాయో.. భూక్యా గణేష్ పెళ్ళికి.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement