Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Govt Red Book Conspiracy against senior IPS officer PSR Anjaneyulu1
పక్కా కక్షే... అక్రమ కేసే

సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్‌ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్‌ఆర్‌ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోప­ణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్‌ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్‌ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్‌ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూ­డదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్‌ఆర్‌పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్ప­గించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్‌ఆర్‌ను విజయ­వాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్‌ ఫోన్‌ ఉన్నా­యని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశా­రు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్‌ఆర్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభి­యో­గం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యా­ధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమ­నార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్‌ నిరో­ధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్‌ అధికా­రులు అనుసరించే విధానాన్నే నాడు విజయ­వాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించా­యి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టా­రని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోప­డం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్‌ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్‌ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్‌ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్‌ఆర్‌పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్‌ఆర్‌ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారా­యణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నా­గానికి నిదర్శనం.

YSRCP Vidadala Rajini Relative Gopi Arrest In Hyderabad Updates2
రెడ్‌బుక్‌ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్‌

సాక్షి, గుంటూరు/హైదరాబాద్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్‌.. వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్‌సీపీ నేతను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు.

PM Narendra Modi Govt Fires On Pakistan For Pahalgam Terror Attack3
పాక్‌కు ‘పంచ్‌’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్‌ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్‌ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్‌ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్‌ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్‌ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్‌ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్‌ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్‌ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్‌ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్‌ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్‌) కింద పాక్‌ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్‌ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్‌. – భారత్, పాక్‌ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్‌ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

Rasi Phalalu: Daily Horoscope On 24-04-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి ప.10.14 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: శతభిషం ఉ.6.52 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె.5.45 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం: ప.12.58, నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: రా.10.04 నుండి 11.36 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.42, సూర్యాస్తమయం: 6.13. మేషం.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.... పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.మిథునం... రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.కర్కాటకం... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.సింహం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కన్య.... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.తుల.... ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.వృశ్చికం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.ధనుస్సు... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం... సోదరులు, సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కుంభం.... కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.మీనం... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

India puts Indus Waters Treaty on hold, special story5
ఏమిటీ సింధూ నదీ  జలాల ఒప్పందం?

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీజలాల అంశం చర్చనీయాంశమైంది. ఘర్షణతో మొదలై ఒప్పందం దాకా..ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్‌ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్‌ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్‌ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్‌ నదులపై భారత్‌కు హక్కులు దఖలుపడ్డాయి. సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్‌ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్‌ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలనూ పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్‌ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్‌లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నీటిబాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడచిన ఆరు దశబ్దాల్లో ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై భారత్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీజలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీజలాల ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్‌ వాదిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్‌ ప్రపంచబ్యాంక్‌ దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్‌ వైదొలిగితే ఇకపై కేంద్రప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్‌ నదీజలాలు పాకిస్తాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాదిదేశాన్ని జలసంక్షోభం చుట్టుముడుతుంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ .

Congress Party Key Decision For Party Posts In Telangana6
65 దాటితే 'నో' పదవి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్‌..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్‌లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్‌ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్‌ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్‌ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్‌ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్‌ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Supreme Court And TN Senthil Balaji Bail Issue7
రాజీనామా చేయకపోతే బెయిల్‌ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక

న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే బెయిల్‌ రద్దు చేస్తామని డీఎంకే నేత వి.సెంథిల్‌ బాలాజీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పదవి కావాలో? స్వేచ్ఛ కావాలో? తేల్చుకోవాలని సూచించింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణానికి సంబంధించిన కేసులో బాలాజీకి సెప్టెంబర్‌ 26న బెయిల్‌ మంజూరు చేశారు.అయితే.. బెయిల్‌ మంజూరైన కొద్ది రోజులకే బాలాజీని తిరిగి తమిళనాడు మంత్రిగా నియమించారు. బాలాజీ విడుదలైన తర్వాత మంత్రి అయినందున, ఈ కేసులోని సాక్షులను బెదిరిస్తున్నారని, కోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్‌ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేపట్టింది. బెయిల్‌ మంజూరు చేయడం అంటే సాక్షులను ప్రభావితం చేసే అధికారం ఇచ్చినట్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘మీరు సాక్షులను ప్రభావితం చేస్తారని తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. పదవి (మంత్రి), స్వేచ్ఛ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మాకు చెప్పండి’అని పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసుల్లో కోర్టు రూపొందించిన ఉదార బెయిల్‌ చట్టాన్ని రాజకీయ నాయకులు దురి్వనియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొంత సమయం కావాలంటూ బాలాజీ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ చేసిన అభ్యర్థనను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.

Mumbai beat Sunrisers Hyderabad by 7 wickets8
రైజర్స్‌ పరాజయాల ‘సిక్సర్‌’

ఐపీఎల్‌–2025 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్‌ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్‌ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్‌ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్‌ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై నెగ్గింది. ముందుగా రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్‌ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్‌ మనోహర్‌ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆదుకున్న క్లాసెన్‌... ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్‌రైజర్స్‌ టాప్‌–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్‌ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్‌ (0), అభిషేక్‌ శర్మ (8), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్‌ కిషన్‌ (1) తన వికెట్‌ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు (24) సన్‌రైజర్స్‌ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్‌ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్‌ కష్టాలు మరింత పెరిగాయి. స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్‌ కుప్పకూలటంతో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అదనపు బ్యాటర్‌ మనోహర్‌ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్‌ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌తో అతను కొట్టిన సిక్సర్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. క్లాసెన్, మనోహర్‌ ఆరో వికెట్‌కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు. చకచకా లక్ష్యం వైపు... స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్‌ (11) వికెట్‌ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్‌ జాక్స్‌ (22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్‌ వెనుదిరిగిన తర్వాత రోహిత్‌కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. హర్షల్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్‌ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) నమన్‌ (బి) బౌల్ట్‌ 0; అభిషేక్‌ (సి) పుతూర్‌ (బి) బౌల్ట్‌ 8; ఇషాన్‌ కిషన్‌ (సి) రికెల్టన్‌ (బి) దీపక్‌ చహర్‌ 1; నితీశ్‌ రెడ్డి (సి) సాంట్నర్‌ (బి) దీపక్‌ చహర్‌ 2; క్లాసెన్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 71; అనికేత్‌ (సి) రికెల్టన్‌ (బి) పాండ్యా 12; మనోహర్‌ (హిట్‌ వికెట్‌) (బి) బౌల్ట్‌ 43; కమిన్స్‌ (బి) బౌల్ట్‌ 1; హర్షల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0– 12–2, బౌల్ట్‌ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్‌ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్‌ 1–0–15–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి అండ్‌ బి) ఉనాద్కట్‌ 11; రోహిత్‌ (సి) అభిషేక్‌ (బి) మలింగ 70; జాక్స్‌ (సి)మనోహర్‌ (బి) అన్సారీ 22; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 40; తిలక్‌వర్మ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్‌: కమిన్స్‌ 3–0–31–0, ఉనాద్కట్‌ 3–0–25–1, హర్షల్‌ 3–0–21–0, ఇషాన్‌ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1. అవుట్‌ కాకుండానే... సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్‌ చహర్‌ వేసిన బంతి అతని లెగ్‌సైడ్‌ దిశగా వెళ్లగా కిషన్‌ గ్లాన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్‌ రికెల్టన్‌ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్‌ అవుట్‌గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్‌ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్‌ కూడా చేయకపోగా... అంపైర్‌ వినోద్‌ శేషన్‌ కూడా వైడ్‌గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు. అయితే కిషన్‌ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్‌గా ఖాయం చేశాడు. కిషన్‌ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్‌కు బంతి తగల్లేదని, నాటౌట్‌ అని తేలింది. ఇషాన్‌ కిషన్‌ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్‌ చేజారేదే కాదు.ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X రాజస్తాన్‌ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Sai Pallavi Comments On Fans9
వాటి కంటే అభిమానులే నాకు ముఖ్యం: సాయిపల్లవి

మాలీవుడ్‌లో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్‌తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్‌ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్‌ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి. మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్‌ సరసన నటించిన అమరన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్‌తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు.

Donald Trump accuses Zelensky of harming Ukraine peace negotiations10
జెలెన్‌స్కీ యుద్ధాన్ని  పొడిగిస్తున్నారు: ట్రంప్‌

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను రష్యాకు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గకుండా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని జెలెన్‌స్కీ పొడిగిస్తున్నారని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ఆలోచనను తోసిపుచ్చిన జెలెన్‌స్కీ ‘మాట్లాడటానికి ఏమీ లేదు. ఇది మా భూమి, ఉక్రేనియన్‌ ప్రజల భూమి’ అని మంగళవారం ఉద్ఘాటించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌.. ఈ ప్రకటన రష్యాతో శాంతి చర్చలకు చాలా హానికరమన్నారు. ఇది చర్చనీయాంశం కూడా కాదని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో రాశారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌ క్రిమియాను కోల్పోయిందని, క్రిమియా కావాలనుకుంటే పదకొండేళ్ల కిందట రష్యాకు అప్పగించినప్పుడు వారు దాని కోసం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement