IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భార‌త క్రికెట‌ర్‌గా | Hardik Pandya Enters History Books, Scripts A Rare Feat In IPL History, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భార‌త క్రికెట‌ర్‌గా

Published Mon, Apr 7 2025 10:29 PM | Last Updated on Tue, Apr 8 2025 4:02 PM

Hardik Pandya Enters History Books, Scripts A Rare Feat

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. వాంఖ‌డే వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పాండ్యా రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. విరాట్ కోహ్లి, లివింగ్ స్టోన్‌ల‌ను వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు పంపాడు. లివింగ్ స్టోన్ వికెట్ పాండ్యాకు 200వ టీ20 వికెట్ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను పాండ్యా త‌న పేరిట లిఖించుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో 5000 ప‌రుగుల‌తో పాటు 200 వికెట్లు తీసిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఇండియ‌న్ క్రికెట‌ర్ కూడా ఈ ఫీట్ సాధించ‌లేదు. ఓవరాల్‌గా ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన 12వ ప్లేయ‌ర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది సీజన్‌లో పాండ్యా ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆర్సీబీ 5 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(67), ర‌జిత్ పాటిదార్‌(64) హాఫ్ సెంచ‌రీలు సాధించ‌గా.. ప‌డిక్క‌ల్‌(37), జితేష్ శ‌ర్మ‌(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. విఘ్నేష్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.

ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాళ్లు వీరే..
డ్వేన్ బ్రావో - 6970 పరుగులు- 631 వికెట్లు

షకీబ్ అల్ హసన్ - 7438 పరుగులు - 492 వికెట్లు

ఆండ్రీ రస్సెల్ - 9018 పరుగులు - 470 వికెట్లు

మహ్మద్ నబీ - 6135 పరుగులు- 369 వికెట్లు

సమిత్ పటేల్ - 6673 పరుగులు- 352 వికెట్లు

కీరాన్ పొలార్డ్ - 13537 పరుగులు- 326 వికెట్లు

రవి బొపారా - 9486 పరుగులు- 291 వికెట్లు

డేనియల్ క్రిస్టియన్ - 5848 పరుగులు - 281 వికెట్లు

మోయిన్ అలీ - 7140 పరుగులు - 375 వికెట్లు

షేన్ వాట్సన్ – 8821 పరుగులు- 343 వికెట్లు

మహ్మద్ హఫీజ్ – 7946 పరుగులు- 202 వికెట్లు

హార్దిక్ పాండ్యా – 5390 పరుగులు- 200 వికెట్లు
చద‌వండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement