
Photo Courtesy: BCCI
గుజరాత్‌పై లక్నో విజయం
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించారు.
అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బదోని సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు.
పూరన్ ఔట్
15.2వ ఓవర్- 155 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ (61) ఔటయ్యాడు.
23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్
23 బంతుల్లో 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే 42 బంతుల్లో మరో 41 పరుగులు మాత్రమే చేయాలి. పూరన్ 51, బదోని 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన లక్నో
11.1వ ఓవర్- 123 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్దిద్ కృష్ణ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (58) ఔటయ్యాడు.
26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్
181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ మార్క్రమ్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మార్క్రమ్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (8 ఫోర్లు, సిక్స్) పూర్తి చేశాడు. పంత్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పూరన్ కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. 10 ఓవర్లలో లక్నో స్కోర్ 114/1గా ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ ఔట్
6.2వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సుందర్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (21) ఔటయ్యాడు.
టార్గెట్ 181.. 6 ఓవర్లలో 61 పరుగులు చేసిన లక్నో
181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఆడుతుంది. ఓపెనర్లు పంత్ (17), మార్క్రమ్ (38) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 61/0గా ఉంది.
టార్గెట్ 181.. ఓపెనర్‌గా పంత్.. రెచ్చిపోయి ఆడుతున్న మార్క్రమ్
181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్‌గా రిషబ్ పంత్ బరిలోకి దిగాడు. మార్క్రమ్‌కు జతగా పంత్ క్రీజ్‌లో ఉన్నాడు. పంత్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా ఉన్న మార్క్రమ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 33 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ గైర్హాజరీలో పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 49/0గా ఉంది.
లక్నో బౌలర్ల అద్బుత ప్రదర్శన.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది.
అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. రూథర్‌ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
16.4వ ఓవర్- 145 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (16) ఔటయ్యాడు. రూథర్‌ఫోర్డ్‌కు (6) జతగా షారుక్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్
ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి సాయి సుదర్శన్ (56), ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్‌ను (2) రవి బిష్ణోయ్ ఔట్ చేశారు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 127/3గా ఉంది. బట్లర్ (3), రూథర్‌ఫోర్డ్ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
12.1వ ఓవర్- 120 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో మార్క్రమ్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టడంతో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. సాయి సుదర్శన్‌కు (55) జతగా జోస్ బట్లర్ క్రీజ్‌లోకి వచ్చాడు.
హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన గిల్, సుదర్శన్.. 11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే..?
11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 109/0గా ఉంది. గిల్ (53), సాయి సుదర్శన్ (51) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
నిలకడగా ఆడుతున్న గిల్, సాయి సుదర్శన్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?
7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 66/0గా ఉంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (30), శుభ్‌మన్ గిల్ (34) నిలకడగా ఆడుతున్నారు.
ఆచితూచి ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (15), సాయి సుదర్శన్ (11) ఆచితూచి ఆడుతున్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో ఓ కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాడు, ఇన్ ఫామ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల చేత మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానాన్ని హిమ్మత్ సింగ్ భర్తీ చేయనున్నాడు. గుజరాత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కుల్వంత్ కేజ్రోలియా స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.
ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. లక్నో ఐదింట మూడు గెలిచి ఆరో స్థానంలో ఉంది.
తుది జట్లు..
లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్