
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన గిల్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
మరో ఓపెనర్ సాయిసుదర్శన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అభిమానులను ప్రిన్స్ అలరించాడు. ఈ క్రమంలో గిల్ కేవలం 31 బంతుల్లోనే ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు.
ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న గిల్.. 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ తరపున 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా గిల్ రికార్డులకెక్కాడు.
శుబ్‌మన్ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 109 మ్యాచ్‌లు ఆడిన గిల్ 3424 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 22 హాఫ్ సెంచరీలు, నాలుగు శతకాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
గుజరాత్ బ్యాటర్లలో గిల్‌తో పాటు సాయిసుదర్శన్(56), షర్ఫెన్ రూథర్ ఫర్డ్(22) పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించగా.. దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?