
సాక్షి,వికారాబాద్: లగచర్లలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారమే లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్ పారిశ్రామిక పార్క్ కోసం భూ సేకరణ నోటీస్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
2013 చట్టం సెక్షన్ 6(2) కింద భూసేకరణను నోటిఫికేషన్ ఇచ్చారు.కాగా,వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించిన విషయం తెలిసిందే. భూ సేకరణ విషయమై గగ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది.
ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిందని అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారి తీసింది.

ఇదీ చదవండి: లగచర్ల ‘ఫార్మా’ రద్దు