పౌర్ణమి రోజు రాత్రి నాకు రెక్కలు వస్తాయి..? | 9th Class Student Missing Case | Sakshi

పౌర్ణమి రోజు రాత్రి నాకు రెక్కలు వస్తాయి..?

Published Tue, Mar 18 2025 10:45 AM | Last Updated on Tue, Mar 18 2025 1:26 PM

9th Class Student Missing Case

విచిత్రంగా వ్యవహార శైలి 

పౌర్ణమి రాత్రి రెక్కలొస్తాయని వ్యాఖ్యలు

వికారాబాద్‌ జిల్లా: గురుకుల విద్యార్థి(Gurukulam School) అదృశ్యమ య్యాడు. వికారాబాద్‌ జిల్లాలో(Vikarabad District) ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. చౌడాపూర్‌ మండలం పాచావ్‌కుంటతండాకు చెందిన మూడ వత్‌ శంకర్‌ కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశా లలో 9వ తరగతి(9th grade student) చదువుతున్నాడు. ఈనెల 14న రాత్రి 10.50 గంటలకు హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడు. సిబ్బంది మహారాష్ట్రలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు చుట్టుపక్కల వెతికారు.

ఆచూకీ లభించకపోవడంతో కుల్కచర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంకర్‌ వ్యవహార శైలి విచిత్రంగా ఉండేదని, ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడని సహ విద్యార్థులు తెలిపారు. పౌర్ణమి(Pournami) రోజు రాత్రి వేళ తనకు రెక్కలు వస్తాయని స్నేహితులతో చెప్పేవాడని తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనేష్‌రెడ్డి తెలిపారు.

75 ఏళ్ల మహిళ నుంచి రూ.73 లక్షలు స్వాహా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement