Sachin Tendulkar: సచిన్‌ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా. . వీడియో వైరల్‌ | Sachin, Sachin Chants Buzzing In Entire Flight As Tendulkar Travels Economy, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Sachin Tendulkar Viral Video: సచిన్‌ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా. . వీడియో వైరల్‌

Published Wed, Feb 21 2024 3:39 PM

Sachin Sachin Chants Buzzing In Entire Flight As Tendulkar Travels Economy - Sakshi

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కోసం విమానమే మినీ స్టేడియంలా మారిపోయింది. ఫ్లైట్‌లో క్రికెట్‌ గాడ్‌ను చూడగానే అభిమానులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. సచిన్‌ నామస్మరణతో విమానంలో కేరింతలు కొట్టారు. దిగ్గజ ఆటగాడు సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం చూసి అతడి నిరాడంబరతకు ఫిదా అయ్యారు.

సచిన్‌ టెండుల్కర్‌ సైతం తనను విష్‌ చేసిన వారికి నమస్కరిస్తూ హుందాతనాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సచిన్‌ టెండుల్కర్‌ ప్రస్తుతం ట్రావెల్‌ మూడ్‌లో ఉన్నాడు.

కుటుంబంతో కలిసి కశ్మీర్‌ సందర్శనకు వెళ్లినట్లు ఆయన సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘భూతల స్వర్గం కశ్మీర్‌’’ అంటూ విమానం నుంచి కశ్మీర్‌ అందాలు వీక్షిస్తున్న వీడియోను సచిన్‌ పంచుకున్నాడు. కాగా భారత క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌.

అంతర్జాతీయ క్రికెట్‌లో శతకాల సెంచరీ కొట్టిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సాధించిన టెండుల్కర్‌.. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మరెన్నో ఘనతలు సాధించాడు. టీమిండియా తరఫున మొత్తంగా   మూడు ఫార్మాట్లలో కలిపి 664 మ్యాచ్‌లు ఆడి.. 34, 357 పరుగులు సాధించాడు. ఇందులో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు ఉన్నాయి. 

ఇలాంటి అరుదైన ఘనతలు సాధించి ఆధునిక తరం క్రికెటర్లలో ఎవరూ కూడా తనను అందుకోలేనంత ఎత్తులో నిలిచి క్రికెట్‌గాడ్‌గా పేరొందాడు సచిన్‌. ఇక సచిన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతడి కుమారుడు అర్జున్‌.. ఆల్‌రౌండర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌​-2023 సందర్భంగా టీమిండియా సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి 50వ శతకం నమోదు చేసి సచిన్‌ వన్డే సెంచరీల రికార్డును బ్రేక్‌ చేశాడు.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement