ఇండియా కూటమితోనే దేశరక్షణ | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమితోనే దేశరక్షణ

Published Sun, May 5 2024 4:00 AM

ఇండియా కూటమితోనే దేశరక్షణ

నేరేడుచర్ల, పాలకవీడు: ఇండియా కూటమితోనే దేశ రక్షణ సాధ్యమని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి నేరేడుచర్లలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో కలిసి రోడ్డు షో, సభ నిర్వహించారు. అంతకుముందు పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ గ్రామంలో ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి రఘువీర్‌రెడ్డిని దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలపించాలని కోరారు. ఈ ఎన్నికలతో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌లకు డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోని వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు నెరవేర్చిందని, త్వరలో రైతు రుణమాఫీ చేయబోతున్నామన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రఘువీర్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. కాంగ్రెస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నేరేడుచర్లలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేమురి నాగవేణి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వి.రమేష్‌బాబు, మాజీ సర్పంచ్‌ గంటా మల్లారెడ్డి, మత్స్య సొసైటీ చైర్మన్‌ యామిని వీరయ్యలతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నేరేడుచర్లలో జరిగిన రోడ్‌ షోలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, నల్లగొండ డీడీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, పార్టీ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు కొణతం చిన వెంకట్‌రెడ్డి, నేరేడుచర్ల జెడ్పీటీసీ రాపోలు రాపోలు నర్సయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ బచ్చలకూరి ప్రకాశ్‌, వైస్‌ చైర్మన్‌ అలక సరిత, కౌన్సిలర్లు లలిత, నాగవేణి, సులోచన, బాషా, నాయకులు జ్యోతిబాబు, గోపాల్‌, నాగిరెడ్డి, శకుంతల, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే జానపహాడ్‌లో జరిగిన సభలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శివారెడ్డి, పార్టీ పాలకవీడు మండల అధ్యక్షుడు ఏవీ.సుబ్బారావు, ఎంపీపీ భూక్యా గోపాల్‌, జెడ్పీటీసీ మాలోతు మోతీలాల్‌, నాయకులు బైరెడ్డి జితేందర్‌రెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, సందీప్‌, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఫ నేరేడుచర్ల, జాన్‌పహాడ్‌లో

ఎన్నికల ప్రచారం

Advertisement
 
Advertisement