రాపూరు -చిట్వే లి ఘాట్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల లారీ లోయలో బోల్తా పడింది.
రాపూరు, న్యూస్‌లైన్ : రాపూరు -చిట్వే లి ఘాట్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల లారీ లోయలో బోల్తా పడింది. గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిం డర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. అదృష్టవశాత్తు సిలిండర్లు పేలకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. లారీ శిథి ల్లో ఇర్కుపోయిన డ్రైవర్ రాత్రంతా నరకయాతన అనుభవించాడు.
పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా కడప నుంచి బుధవారం రాత్రి 9 గంటలకు 306 ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లోడు తో డ్రైవర్ ఎగ్బాల్ జిల్లాలోని ముత్తుకూరుకు బయలుదేరాడు. అర్ధరాతి 12 గం టల సమయంలో రాపూరు 11,12 కిలో మీటర్ల మధ్యలో ఉన్న మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అదపు తప్పి ఘా ట్ రోడ్డు పిట్టగోడను ఢీకొని లోయలోకి బోల్తాపడింది.
తెల్లవారే వరకు ఎవరూ ఈ సంఘటనను గుర్తించలేదు. ఉద యం 7 గంటల సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు లారీ పడిపోయిన విషయాన్ని గుర్తించారు. డ్రైవ ర్ ఆర్తనాదాలు విని లోయలోకి దిగి అతన్ని రక్షించారు. సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 సిబ్బందికి అందించడంతో అందరూ హుటాహుటిన సంఘటన స్థలానికి చే రుకున్నారు. ైడ్రైవర్‌ను రాపూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి డ్రైవర్ కుటుంబ సభ్యులకు, లారీ యజమానికి, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు తెలియజేశారు. ఎస్‌ఐలు విశ్వనాథ్‌రెడ్డి, కరిముల్లా నేతృత్వంలో లోయలో పడిన సిలిండర్లను బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
తప్పిన పెను ప్రమాదం
గ్యాస్ సిలిండర్లు తీసుకుని వస్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడినప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రాపూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలినా, డిజిల్ ట్యాంకు లీకై ఉండినా పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేది. లారీలో ఎంత మంది ఉన్నారో కూడా తెలిసేది కాదు.
రెండు సిలిండర్లకు రంధ్రాలు
ప్రమాదంలో లారీ నుంచి బయటపడిన రెండు సిలిండర్లుకు చిన్న రంధ్రాలు ఏర్పడ్డాయి. ఘాట్ రోడ్డులోని లోయల్లో మంచు నిండి ఉండడంతో సిలిండర్లుకు రంధ్రాలు పడినా ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. సిలిండర్లు బయటకు తీసే సమయంలో ప్రమాదం సంభవిస్తుందని అగ్నిమాపక వాహనంతో పాటు వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గ్యాస్ సిలిండర్లను బయటకు తీశారు.
వాహనాలు నిలిపివేత
ఘాట్ రోడ్డులో గ్యాస్ సిలిండర్లు లారీ బోల్తా పడడంతో అవి పేలిపోతాయని పోలీసులు వాహనాల రాకపోలకలను నిలిపివేశారు. దాదాపు మూడు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.