‘చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’ | YSRCP Vasireddy Padma Slams Chandrababu Over Assaults On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వాసిరెడ్డి పద్మ

Published Thu, Apr 11 2019 12:01 PM | Last Updated on Thu, Apr 11 2019 3:00 PM

YSRCP Vasireddy Padma Slams Chandrababu Over Assaults On YSRCP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ నాయకులు పసుపు చొక్కాలు వేసుకుని పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రచారాలు చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే రీపోలింగ్‌ అంటున్న చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రాకుండా టీడీపీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఈసీతో చంద్రబాబు మాట్లాడిన విధానం, వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతల దాడులు చూస్తుంటే వారికి ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోందన్నారు. టీడీపీ నాయకుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వారితీరు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement