MI vs RCB
-
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) పేరును ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడి నీడలో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు తనదైన ముద్ర వేయగలడా అనే సందేహాలు తలెత్తాయి. అంతేకాదు ‘కింగ్’ మాస్ క్రేజ్ అతడికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.డిఫెండింగ్ చాంపియన్‌పై గెలుపుతో మొదలుఅయితే, రజత్ పాటిదార్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్సీబీని విజయపథంలో నడిస్తున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను మట్టికరిపించింది.చెన్నైని చెపాక్‌లో ఓడించికేకేఆర్ను తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాదు.. చెన్నైకి కంచుకోట అయిన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 2008 తర్వాత.. మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.అయితే, తమ సొంత మైదానం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న పాటిదార్ సేనపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆర్సీబీ ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుంది.ముంబై కంచుకోట బద్దలుముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి.. దానిని డిఫెండ్ చేసుకుంది. సొంత మైదానంలో ఈ ఫైవ్ టైమ్ చాంపియన్‌ను 12 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది.ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గాఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో.. ఒకే సీజన్లో కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో, చెన్నైని చెపాక్‌లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో ఈ మూడు చాంపియన్ జట్లను వారి సొంత మైదానంలోనే ఓడించిన సారథిగా అరుదైన ఘనత సాధించాడు.గతంలో పంజాబ్ కింగ్స్ 2012లో ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, అప్పుడు ఆ జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు పనిచేశారు. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో ఓడించింది. అంతకుముందు డేవిడ్ హస్సీ కెప్టెన్సీలో ముంబైని వాంఖడేలో, చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసింది. అయితే, పాటిదార్ సోలోగా ఈ ఘనత సాధించి.. చరిత్ర సృష్టించాడు.బ్యాటర్‌గానూ సూపర్‌హిట్ ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచింది. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు సాధించాడు. కేకేఆర్‌పై 16 బంతుల్లో 34, సీఎస్కేపై 32 బంతుల్లో 51 రన్స్ చేశాడు.అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్‌పై 12 బంతుల్లో 12, ముంబైపై 32 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. చెన్నై, ముంబైపై ఆర్సీబీ విజయాల్లో బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కూడా!.. ఏదేమైనా పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇదే జోరు కనబరిస్తే.. ‘ఈసారి కప్ మనదే’ అని ప్రతిసారీ అనుకునే అభిమానుల కల నెరవేరవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు!!A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. -
MI VS RCB: కృనాల్ పాండ్యాకు అచ్చొచ్చిన ఏప్రిల్ 7
ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యాకు ఏప్రిల్ 7 భలే అచ్చొచ్చే తేదీలా ఉంది. యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ ఈ తేదీన కృనాల్ చెలరేగిపోతాడు. గత కొన్నేళ్లుగా ఈ తేదీలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 2023 సీజన్ నుంచి ఏప్రిల్ 7న ఆడిన ప్రతి మ్యాచ్‌లో కృనాల్ సత్తా చాటాడు. 2023 సీజన్లో కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో కృనాల్ తొలుత బంతితో చెలరేగి (4-0-18-3), ఆతర్వాత బ్యాట్‌తోనూ రాణించాడు (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్). ఫలితంగా లక్నో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ కృనాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.2024 సీజన్లో ఏప్రిల్ 7న నాడు కృనాల్ ప్రాతినిథ్యం వహించిన లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో కృనాల్ బంతితో అదరగొట్టి (4-0-11-3) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా 2025 ఏప్రిల్ 7న కృనాల్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ తేదీన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కృనాల్ చివరి ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతను కొత్తగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. గత మూడేళ్లలో ఏప్రిల్ 7న ఆడిన మ్యాచ్‌ల్లో కృనాల్ రెచ్చిపోవడం చూస్తే ఈ తేదీ అతనికి అచ్చొచ్చిందిగా చెప్పవచ్చు. ఈ మూడు సందర్భాల్లో కృనాల్ రాణించడంతో పాటు అతని జట్టును కూడా గెలిపించాడు. ఓ సందర్భంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కృనాల్ ఈ సీజన్లోనే ఆర్సీబీలో చేరాడు. మెగా వేలంలో ఆర్సీబీ కృనాల్‌ను రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు కృనాల్ మూడేళ్లు (2022, 2023, 2024) లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. దానికి ముందు వరుసగా ఆరు సీజన్లు (2016, 17, 18, 19, 20, 21) ముంబై ఇండియన్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు. కృనాల్ జట్టులో ఉండగా ముంబై ఇండియన్స్ మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది.లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 34 ఏళ్ల కృనాల్ ఇప్పటివరకు 131 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1652 పరుగులు, 83 వికెట్లు తీశాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో దాదాపు పదేళ్ల తర్వాత ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఛేదనలో ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4, హాజిల్‌వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. -
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
గెలుపు జోష్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాల్పడిన తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి భారీ జరిమానా విధించింది. కాగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ వాంఖడేలో తొలి విజయం నమోదు చేసి విషయం తెలిసిందే. పాటిదార్ కెప్టెన్సీలో సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (4) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67) మాత్రం రాణించాడు. ఆకాశమే హద్దుగా ఇక వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేయగా.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో పాటిదార్ 64 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ముంబై బౌలర్లలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడింది. టాపార్డర్ రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17), విల్ జాక్స్ (22)విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్(28) కూడా నిరాశపరిచాడు.తిలక్, హార్దిక్ రాణించినా..ఈ క్రమంలో తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లోనే 42) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టినా.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై 209 పరుగుల వద్ద నిలిచింది. దీంతో పన్నెండు పరుగుల తేడాతో ఆర్సీబీ ముంబైపై విజయం సాధించింది.రూ. 12 లక్షల జరిమానాఅయితే, రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆర్సీబీ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఐపీఎల్ పాలక మండలి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. తొలి తప్పిదం కాబట్టి ఈసారి రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టింది.కాగా ఐపీఎల్-2025 సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టిన రజత్ పాటిదార్ ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో కొనసాగుతోంది. టోర్నీ ఆసాంతం ఇదే జోరు కనబరిస్తే ఈసారి కప్ కొట్టాలన్న ఆర్సీబీ చిరకాల కల నెరవేరే అవకాశాలు లేకపోలేదు.చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025 -
MI VS RCB: చరిత్ర సృష్టించిన భువీ
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. నిన్న (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఈ ఘనత సాధించాడు. భువీ ఐపీఎల్ 179 మ్యాచ్‌లు ఆడి 184 వికెట్లు తీశాడు. భువీ తర్వాత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 పేసర్లు184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్‌లు)183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌లు)170 - లసిత్ మలింగ (122 మ్యాచ్‌లు)165 - జస్ప్రీత్ బుమ్రా (134 మ్యాచ్‌లు)144 - ఉమేష్ యాదవ్ (148 మ్యాచ్‌లు)ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 163 మ్యాచ్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో, అశ్విన్ ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు206 - యుజ్వేంద్ర చహల్ (163 మ్యాచ్‌లు)192 - పియూశ్ చావ్లా (192 మ్యాచ్‌లు)184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్‌లు)183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌లు)183 - రవిచంద్రన్ అశ్విన్ (216 మ్యాచ్‌లు)కాగా, నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ముంబై ఇండియన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసి చివరివరకు పోరాడింది. అయితే లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా ఆర్సీబీ 10 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో ఓడించింది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో గెలుపు. ముంబైకి 5 మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.నిన్నటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటి ఆర్సీబీ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఛేదనలో ముంబైకు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (17) రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ రికెల్టన్ (17) నాలుగో ఓవర్లో పెవిలియన్‌కు చేరాడు. విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) క్రీజ్‌లో నిలదొక్కుకునే క్రమంలో ఔటయ్యారు. ఈ దశలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలుపు దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ బౌలర్ కృనాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంతకుముందు భువీ 18వ ఓవర్లో తిలక్ వర్మను.. 19వ ఓవర్లో హాజిల్‌వుడ్ హార్దిక్ పాండ్యాను ఔట్ చేశారు. -
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. తాజాగా సొంత మైదానం వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముందు తలవంచింది. ఆఖరి వరకు పోరాడినా పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని.. కాబట్టి తాను బౌలర్లను నిందించబోనని స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ ఈరోజు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని హర్షం వ్యక్తం చేశాడు.జస్ప్రీత్ బుమ్రా రాకతో జట్టు మరింత పటిష్టంగా మారిందని.. అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 64) దంచికొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (19 బంతుల్లో 40 నాటౌట్)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్‌కు ఒక వికెట్ దక్కింది. అయితే, బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17) వికెట్లు కోల్పోయింది.తిలక్, హార్దిక్ పోరాటం వృథావిల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) కూడా నిరాశపరచగా.. తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) అద్భుత ఇన్నింగ్స్‌తో గెలుపు ఆశలు రేకెత్తించారు. అయితే, బెంగళూరు బౌలర్ల ప్రతాపం ముందు వీరు తలవంచకతప్పలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై.. 209 పరుగుల వద్ద నిలిచిపోయి.. పరాజయాన్ని ఆహ్వానించింది.రోహిత్ రావడం వల్ల అతడు లోయర్ ఆర్డర్లోఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పరుగుల వరద పారింది. వికెట్ చాలా బాగుంది. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. పిచ్‌ను చూసిన తర్వాత బౌలర్లను తప్పుపట్టడానికి ఏమీ లేదనిపించింది.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం జట్టుకు వెన్నెముక లాంటిది. గత మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో లేడు కాబట్టి నమన్ ధీర్ టాపార్డర్‌లో ఆడాడు. నమన్ బహుముఖ ప్రజ్ఞగల ఆటగాడు. అతడు ఏ స్థానంలోనైనా రాణించగలడు. రోహిత్ వచ్చాడు గనుక ఈసారి లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగాడు.తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుతిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో అతడిని రిటైర్డ్ అవుట్‌గా వెనక్కి పిలిపించాలన్న మా కోచ్ నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నా. ఏదేమైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టడమే అత్యంత ముఖ్యం.ఈరోజు మధ్య ఓవర్లలోనూ మేము ఒకటి, రెండు సందర్భాల్లో గట్టిగా హిట్టింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఇక బుమ్రా జట్టులోకి రావడం.. మా టీమ్‌ను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతుందనడం అతిశయోక్తి కాదు.ఈరోజు తను బాగానే రాణించాడు. మా జట్టు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. మా ఆటగాళ్లకు మేము అండగా ఉంటాం. తప్పక అనుకున్న ఫలితాలు రాబడతాం’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025 -
IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 7) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో (వాంఖడే స్టేడియంలో) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండగా.. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కాస్త ఢీలాగా కనిపిస్తుంది. అయితే నేటి మ్యాచ్‌లో ముంబైకి కూడా జోష్ రావచ్చు. ఈ మ్యాచ్‌తో వారి తరుపుముక్క జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఆర్సీబీ మ్యాచ్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరో శుభవార్త కూడా ఉంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ కూడా నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, రోహిత్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్ వచ్చింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడింట ఓడింది. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది.ముంబైదే పైచేయిహెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 19, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లిముంబైతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. నేటి మ్యాచ్‌లో విరాట్ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 13000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12983 పరుగులు (385 ఇన్నింగ్స్‌ల్లో 41.47 సగటున) ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్ హేల్స్ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్ మాలిక్ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్ పోలార్డ్ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) మాత్రమే విరాట్ కంటే అత్యధిక పరుగులు చేశారు.ప్రస్తుత సీజన్లో విరాట్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (59 నాటౌట్) చేసిన అతను.. సీఎస్కేపై (31) పర్వాలేదనిపించి, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో (7) విఫలమయ్యాడు. కేకేఆర్ మ్యాచ్‌లో విరాట్ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విరాట్ ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్ ఐపీఎల్లో 247 ఇన్నింగ్స్‌లు ఆడి 8101 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ -
MI vs RCB: యార్కర్‌తో దడ పుట్టించిన బుమ్రా.. వీడియో వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. గతేడాది పద్నాలుగింట.. నాలుగు మ్యాచ్‌లే గెలిచిన హార్దిక్ సేన.. ఈసారి ఓటమితో సీజన్‌ను ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంటోంది.బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే శుభవార్త అందింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం నాటి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.యార్కర్‌తో దడ పుట్టించిన బుమ్రా..ఇక ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ పేస్ గుర్రం.. నెట్ సెషన్లో తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన పదునైన యార్కర్ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోగా.. ఆ బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన బ్యాటర్ బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.రెండు నెలల విరామం తర్వాతకాగా బుమ్రా రాకతోనైనా తమ తలరాత మారుతుందని ముంబై జట్టు వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో విలవిల్లాడిన అతడు .. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు.అయితే, ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. అదే విధంగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు కూడా దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. కాగా జనవరి తర్వాత బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్ బరిలోకి దిగనుండటం ఇదే తొలిసారి.రోహిత్ కూడామరోవైపు.. గాయం వల్ల గత మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్, మాజీ సారథి రోహిత్ శర్మ కూడా తిరిగి జట్టుతో చేరాడు. వీరిద్దరి రాకతో ముంబై ఇండియన్స్ శిబిరంలో సరికొత్త ఉత్సాహం నిండింది. కాగా ఆర్సీబీపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇది బుమ్రా వర్సెస్ ఆర్సీబీఇప్పటి వరకు బెంగళూరు జట్టుతో తాను ఆడిన 19 మ్యాచ్‌లలో కలిపి బుమ్రా 29 వికెట్లు తీయడం గమనార్హం. అందుకే సోమవారం నాటి పోరును బుమ్రా వర్సెస్ ఆర్సీబీగా అభివర్ణిస్తూ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించిన హార్దిక్ సేన.. ఆఖరిగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడి మరో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Goodnight Paltan! 😊#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/UYghtBvYMN— Mumbai Indians (@mipaltan) April 6, 2025