Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Chief YS Jagan Fires On Chandrababu Govt1
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్‌ చేయకుండా ఆయనకు వాచ్‌మెన్‌ల మాదిరిగా పని చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా..! ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు. అలా వ్యవహరించిన పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నా. మీ యూనిఫామ్‌ తీయించి ఉద్యోగాలు ఊడగొడతామని చెబుతున్నా. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం -వైఎస్‌ జగన్‌ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు.. సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. రెడ్‌బుక్‌ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి..’ అని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో బిహార్‌.. ఇప్పుడు ఏపీ!! రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు జరిగింది? రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి..? అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కు తోచక తల్లడిల్లిపోతోంది. గతంలో బిహార్‌ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్‌పోన్‌ చేయించారు. అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా.. 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్యా బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్సార్‌సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేదని తెలిసి కూడా భయపెడుతూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఎంపీపీ పోతే ఏమవుతుంది బాబూ? చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ఒకచోట ఎంపీపీ పోతే ఏమవుతుంది? ఒకచోట జెడ్పీ చైర్మన్, ఉప సర్పంచ్‌ పదవి పోతే ఏమవుతుంది? ఆయన సీఎం కాబట్టి.. అధికారంలో ఉన్నారు కాబట్టి.. బలం లేకపోయినా.. తాను ముఖ్యమంత్రినన్న అహంకారంతో ఏ పదవైనా తమకే దక్కాలనే దురుద్దేశంతో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి రహదారిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ రామగిరిలో రాక్షసత్వం.. రామగిరి మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్సార్‌సీపీకి చెందిన 9 మంది సభ్యులు గెలిచారు. కేవలం ఒకటి మాత్రమే టీడీపీది. మరి ఇక్కడ ఎంపీపీ పదవికి నోటిఫికేషన్‌ జారీ అయితే 9 మంది సభ్యులున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పదవి దక్కాలా? లేక ఒకే ఒక సభ్యుడున్న టీడీపీకి రావాలా? తొమ్మిది మంది సభ్యులు చంద్రబాబు ప్రలోభాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి తమకు ప్రాణహాని ఉందని, ఎంపీపీ పదవికి పోటీ చేయాలంటే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. కోర్టు ఆదేశాలతో సభ్యులను తీసుకొస్తుంటే.. ప్రొటెక్షన్‌ ఇవ్వాల్సిన పోలీసులు మధ్యలో రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ అనే వ్యక్తిని వీళ్ల కాన్వాయ్‌లోకి ఎక్కించారు. వీళ్లందరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడితో వీడియో కాల్‌ చేయించారు. నువ్వు ఓటు వేయకుంటే మీ అమ్మనాన్న ఇంటికి రారని భారతమ్మ అనే ఎంపీటీసీని వీడియో కాల్‌ చేయించి బెదిరించారు. వీటికి లొంగకపోవడంతో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తరువాత ఇదే ఎస్‌ఐ పెనుకొండకు తీసుకెళ్లి ఎంపీటీసీ సభ్యులను బైండోవర్‌ చేశారు. దీంతో ప్రకాష్‌రెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే), ఉషశ్రీ (పార్టీ జిల్లా అధ్యక్షురాలు) మా పార్టీకి చెందిన ఎంపీటీసీలకు మద్దతుగా వెళ్లడంతో వారిద్దరిపై కేసులు పెట్టారు. అసలు వీళ్లిద్దరు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? వాళ్లు టీడీపీ ఎంపీటీసీలనేమైనా తెచ్చారా? మా పార్టీ సభ్యుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వెళ్లి ధర్నా చేసినందుకు వాళ్ల మీద కేసులు బనాయించారు. భయోత్పాతం సృష్టించారు.. ఈ ఎన్నికల ప్రక్రియ జరగకూడదన్న దురుద్దేశంతో పాపిరెడ్డిపల్లిలో మా పార్టీకి చెందిన జయచంద్రారెడ్డిపై దాడి చేశారు. 28న మళ్లీ దాడి చేశారు. లింగమయ్య అన్న ఈ దాడిని అడ్డుకుని పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. తమపై దాడులను అరికట్టాలని వేడుకుంటే పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో మార్చి 30న కురుబ లింగమయ్య కుమారుడు బైక్‌పై వెళ్తుంటే రాళ్లతో దాడి చేశారు. కుమారుడు ఈ విషయాన్ని లింగమయ్యకు చెప్పడంతో.. 20 మందికిపైగా టీడీపీ మూకలు మరోసారి లింగమయ్య ఇంటికి వెళ్లి బేస్‌బాల్‌ బ్యాట్, మచ్చుకత్తులు, కర్రలతో దాడి చేసి హింసించడంతో లింగమయ్య చనిపోయారు. రాష్ట్రం ఈ రోజు బిహార్‌ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుతో తల వంచుకునేలా వ్యవహరిస్తున్నారు. 20 మంది దాడి చేస్తే.. ఇద్దరిపై కేసులా? లింగమయ్యపై 20 మంది దాడి చేస్తే కేసులు ఇద్దరి మీదే పెట్టారు. ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్‌నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదు? మిగిలిన వారిని ఎందుకు వదిలేశారు? నిందితులంతా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే బంధువులు. ఎమ్మెల్యే కుమారుడు మార్చి 27న ఆ గ్రామానికి వెళ్లి రెచ్చగొడితే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై గానీ, ఆమె కుమారుడిపైగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్‌ఐ సుధాకర్‌ భయపెడుతుంటే అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లింగమయ్య కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దాడి జరిగింది. కానీ కంప్లయింట్‌ లింగమయ్య కుమారుడితో కాకుండా.. పోలీసులే ఒక ఫిర్యాదు రాసుకుని వచ్చి నిరక్షరాస్యురాలైన లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. వాళ్లు ఏం రాసుకున్నారో తెలియదు..! నిందితులనే సాక్షులుగా చేర్చి.. లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్‌బాల్‌ బ్యాట్‌ ఉన్నట్లు రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందినవారు. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షులను కూడా వీళ్లకు కావాల్సిన వాళ్లను పెట్టుకున్నారు. వీళ్లే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం చూస్తే.. పోలీసు వ్యవస్థ ఇంతకన్నా దారుణంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీ కుటుంబానికి అండగా ఉంటాం⇒ లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం⇒ పాపిరెడ్డిపల్లిలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్‌ జగన్‌ టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన తమ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 30న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామ­ర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నట్లు తెలియడంతో పల్లెలకు పల్లెలు పాపిరెడ్డిపల్లికి తరలివచ్చాయి. హెలిప్యాడ్‌ నుంచి జగన్‌ నేరుగా లింగమయ్య ఇంటికి చేరుకుని తొలుత చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కింద కూర్చుని లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడి ఓదార్చారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. లింగమయ్య అన్న హత్య అత్యంత కిరాతకమన్నారు. టీడీపీ మూకల దుర్మార్గాలను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు వచ్చామ­న్నారు. ఈ కేసును మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని ప్రకటించారు. టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..జగన్‌ పరామర్శిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నా..! మా నాన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త.. అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్నా..! టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..! అంటూ రోదించింది. మా అమ్మ, తమ్ముళ్లకు ఏమీ తెలియదన్నా..! మీరే అండగా నిలవాలన్నా..! గ్రామంలో టీడీపీ దుర్మార్గాలను తట్టుకో­లేక­పోతు­న్నామన్నా..! పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నా..! అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఎలాంటి గొడవలూ లేవన్నా..! ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నా..’ అంటూ కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా.. రెడ్‌బుక్‌ దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ.. కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు: జగన్‌ ‘రామగిరిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే.. ‘దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు. నచ్చని నేతలను కేసుల్లో ఇరి­కించి జైళ్లకు పంపిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ⇒ తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు. పశి్చమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యా బలం లేదు. విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నంరాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈ నెల 6న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి గుడికి వెళ్లి పూజ చేస్తుండగా ఆయన అన్నను చంపేశారు. మా ప్రభుత్వంలో ప్రతాప్‌రెడ్డికి గన్‌మెన్‌ సౌకర్యం కల్పిస్తే చంద్రబాబు వచ్చాక తొలగించారు. పసుపులేటి సుబ్బరాయుడును చంపారు.. గతేడాది ఆగస్ట్‌ 3న శ్రీశైలం నియోజకవర్గం మహానందిలోని సీతారాంపురంలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపేశారు. నేను ఆ ఊరికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించా. నంద్యాల హెడ్‌ క్వార్టర్‌కు కూతవేటు దూరంలో మర్డర్‌ జరిగినా పోలీసులు స్పందించలేదు. అక్కడే ఎస్పీ ఆఫీసు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు. సాంబిరెడ్డిపై దారుణంగా దాడి.. గతేడాది జులై 23న పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఈద సాంబిరెడ్డిని ఇనుప రాడ్‌లతో కొట్టి కారుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో గతేడాది జూలై 17న వైఎస్సార్‌సీపీకి చెందిన రషీద్‌ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఏడేళ్ల తర్వాత పోసానిపై కేసులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేమిటంటే... ఆయనకు నంది అవార్డు ఇస్తే తీసుకోకపోవడం! కుల వివక్ష పాటిస్తున్నారని ఆయన 2017లో స్టేట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడు ఆయనపై 18 కేసులు బనాయించి అరెస్టు చేసి నెల రోజులకుపైగా జైల్లో పెట్టించారు. 145 రోజులకుపైగా జైలులో నందిగం సురేష్‌.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మా మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు మోపి 145 రోజులకుపైగా జైల్లో పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లయితే.. జైళ్లలో పెట్టేది మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులను!! వంశీపై అన్యాయంగా కేసులు.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో లేరని ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారు. అసలు అక్కడ వంశీ లేడని చెప్పినా.. అన్యాయంగా కేసులో ఇరికించి.. 50 రోజులుగా జైల్లో పెట్టారు.అడుగడుగునా భద్రతా వైఫల్యంరామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన భారీ జనసందోహం పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

NIA court sentences five out of six accused to death2
ఆ ఐదుగురు ఉగ్రవాదులకు 'ఉరే సరి'

‘‘అమాయక పౌరులపై ఉగ్రదాడులు జరిపి వారి మరణానికి కారణమైనప్పుడు ఉరిశిక్ష విధించాలనే వాదన సరైందే. నగరంలో పేలుళ్లకు పాల్పడటాన్ని సాధారణ నేరంగా పరిగణించరాదు. చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా అంతమొందించి భయబ్రాంతులకు గురిచేయడం క్రూరత్వమే. దీన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సి ఉంది. అరుదైన నేరాల్లో ఒకటిగా భావించాలి. విచక్షణా రహితంగా ప్రాణాలను హరించడమే లక్ష్యంగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రాసిక్యూషన్‌లోని చిన్న చిన్న లోపాలతో దోషులు లబ్ధి పొందలేరు. సాక్షులు తప్పుడు సాక్ష్యం చెప్పారని దోషుల తరఫు న్యాయవా దులు పేర్కొనడంలో అర్థంలేదు. మృతుల్లో పసికందు కూడా ఉంది. వారి కుటుంబీకులకు తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మరణ వాంగ్మూలాలను నమోదు చేయనంత మాత్రాన ఇలాంటి కేసుల్లో నష్టం జరగదు. దోషుల్లో కొందరు తుపాకీ సహా ఇతర ఆయుధాలను వినియోగించడంలో సిద్ధహస్తులు. ఇలాంటి కిరాతక హత్యల విషయంలో ఉపశమనం ఇవ్వడం అర్థరహితం. కనికరం అన్న దానికి తావే లేదు. అంతిమ శిక్ష మరణశిక్షే..’’ – హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఉరి శిక్షే సరైందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2016 డిసెంబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును యథాతథంగా సమర్థించింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వుల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలో నిరూపించడంలో అప్పీల్‌దారులు విఫలమయ్యారని పేర్కొంది. అసదుల్లా అక్తర్, జియా ఉర్‌ రెహ్మాన్, తెహసీన్‌ అక్తర్, మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీన్‌ భత్కల్, ఎజాజ్‌ షేక్‌ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. దోషులకు మరణ శిక్ష ఖరారు చేస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ శ్రీసుధ ధర్మాసనం మంగళవారం 357 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది. పన్నెండేళ్ల క్రితం.. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుల తరఫున న్యాయవాదులు ఆర్‌.మహదేవన్, అప్పం చంద్రశేఖర్‌ వాదనలు వినిపించగా, ఎన్‌ఐఏ తరఫున సీనియర్‌ న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.విష్ణువర్ధన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సుమారు 45 రోజుల పాటు సాగిన సుదీర్ఘ వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం మంగళవారం కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. దిల్‌సుఖ్‌న గర్‌ వద్ద పేలుడు దృశ్యం(ఫైల్‌) మొత్తం సమాజంపై దుష్ప్రభావం.. ‘ఎన్‌ఐఏ కోర్టు వాస్తవ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పీలుదారులకు వివిధ సెక్షన్ల కింద మరణశిక్ష, జీవిత ఖైదు, ఇతర శిక్షలను విధించింది. అప్పీలుదారులు చేసిన వ్యక్తిగత వాదనలు, సాక్షుల వాంగ్మూలాలను కూలంకషంగా పరిశీలించింది. అప్పీలుదారులకు వ్యతిరేకంగా శిక్షలను విధించడానికి బలమైన, సహేతుకమైన కారణాలను నమోదు చేసింది. శిక్షలను విధించడంలో ట్రయల్‌ కోర్టు ఎక్కడా ఏకపక్షంగా, అసమంజసంగా వ్యవహరించలేదు. ప్రభుత్వ నివేదికలను పరిశీలించిన తర్వాత.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 366 ప్రకారం 2016, డిసెంబర్‌ 19న ట్రయల్‌ కోర్టు విధించిన మరణశిక్ష సరైనదేనని ఈ ధర్మాసనం భావిస్తోంది. ఇలాంటి కేసుల విచారణలో కునాల్‌ మజుందార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్తాన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇది అత్యంత క్రూరమైన నేరం. ఇది బాధితులపైనే కాదు, మొత్తం సమాజంపై దుష్ప్రభావాలు చూపించింది. ఇలాంటి కేసుల్లో నేరస్తుల మనస్తత్వం, నేరం జరిగిన వెంటనే, ఆ తర్వాత దోషుల ప్రవర్తన, నేరస్తుల గత చరిత్ర, నేర పరిమాణం, బాధితులపై ఆధారపడిన వారిపై దాని పరిణామాలు.. ఇలా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే ఇలాంటి కేసుల్లో ఇచ్చే తీర్పు శాంతిని ప్రేమించే పౌరుల మనసుల్లో విశ్వాసాన్ని నింపాలి. ఇతరులు అలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించే లక్ష్యాన్ని సాధించేలా ఉండాలి. కాబట్టి దోషుల సంస్కరణకు, పునరావాసానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ జీవిత ఖైదు పూర్తిగా వ్యర్థం. ఎందుకంటే ఇలాంటి నేరుస్తుల విషయంలో సంస్కరణ శిక్షతో లక్ష్యం పూర్తిగా నెరవేరదు. కాబట్టి దోషుల అప్పీళ్లను కొట్టివేస్తున్నాం. వీరికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన మరణశిక్షనుధ్రువీకరిస్తున్నాం. సీఆర్‌పీసీ సెక్షన్‌ 363లోని సబ్‌ సెక్షన్‌(2) నిబంధన మేరకు దోషులకు తీర్పు కాపీని ఉచితంగా అందజేయాలి. నేటి నుంచి 30 రోజుల్లోగా సుప్రీంకోర్టు ముందు అప్పీల్‌ చేసుకునే హక్కు దోషులకు ఉంటుంది..’ అని ధర్మాసనం పేర్కొంది. ఏ–1 రియాజ్‌ భత్కల్‌ఈ కేసులో ఎన్‌ఐఏ రియాజ్‌ భత్కల్‌ను ఏ–1గా చేర్చింది. అసదుల్లా అక్తర్‌ (ఏ–2), జియా ఉర్‌ రెహ్మాన్‌ (పాకిస్తాన్‌ వాసి, ఏ–3), తెహసీన్‌ అక్తర్‌ (ఏ–4), మొహమ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీన్‌ భత్కల్‌(ఏ–5), ఎజాజ్‌ షేక్‌ (ఏ–6)గా ఉన్నారు. 157 మంది సాక్షులుగా ఉన్నారు. ఎన్‌ఐఏ కోర్టు 502 డాక్యుమెంట్లు, 201 ఎవిడెన్స్‌లను (సాక్ష్యాధారాలు) పరిశీలించి నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఐదుగురికి ఉరి శిక్ష వేసింది. 2016 డిసెంబర్‌ 24న దోషులు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు.

Donald Trump new 50 Percent tariffs on China3
చైనాపై మరో 50%

బీజింగ్‌/వాషింగ్టన్‌: ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్‌ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్‌ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్‌ కమిషన్‌ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్‌ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.భారత్‌పైనా నేటినుంచే!ప్రపంచ దేశాలపై ట్రంప్‌ ఇటీవల విధించిన టారిఫ్‌ల అమలులో ఆలస్యం, డెడ్‌లైన్‌ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్‌ కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్‌ 2న ట్రంప్‌ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్‌ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్‌పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్‌ టారిఫ్‌లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్‌ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

Supreme Court finds Tamil Nadu Governor RN Ravi conduct on 10 re passed Bills was unconstitutional4
గవర్నర్‌కు గడువు 3 నెలలే

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి ఎట్టకేలకు విజయం లభించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ ఆమోద ముద్ర వేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్‌ ముందుకు వచ్చిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించామన్న సాకుతో 10 బిల్లులను చాలాకాలం పెండింగ్‌లో కొనసాగించడం సమంజసం కాదని స్పష్టంచేసింది. బిల్లులను శాశ్వతంగా పెండింగ్‌లో పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని తెలియజేసింది. తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం చట్టవిరుద్ధం, నిర్హేతుకం, ఏకపక్షం అని విమర్శించింది. ఆయన నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. ‘‘అసెంబ్లీలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్‌ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి పంపించారు. వాటిపై గవర్నర్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమే. అందుకే రెండోసారి పంపిన తేదీ నుంచే అవి గవర్నర్‌ సమ్మతి పొందినట్లు పరిగణిస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు ప్రకటించింది. విఫలమైతే జ్యుడీషియల్‌ రివ్యూ తప్పదు రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 200 ప్రకారం.. బిల్లులను గవర్నర్‌ ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై ఎలాంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ, బిల్లులపై గవర్నర్‌ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలకు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుంది పేర్కొంది. అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువకాలం నాన్చకుండా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు గడువు నిర్దేశిస్తున్నట్లు తేల్చిచెప్పింది.బిల్లుకు సమ్మతి తెలపడం లేదా రాష్ట్రపతికి నివేదించడం లేదా శాసనసభకు తిప్పిపంపడం మూడు నెలల్లో పూర్తి కావాలని వెల్లడించింది. గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే నెల రోజుల్లోగా కచ్చితంగా సమ్మతి తెలపాలని స్పష్టంచేసింది. ఈ టైమ్‌లైన్‌ పాటించే విషయంలో విఫలమైతే.. కోర్టుల జ్యుడీషియల్‌ రివ్యూకు గవర్నర్‌ సిద్ధపడాల్సి ఉంటుందని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 142 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే సర్కారు మండిపడుతోంది. 12 బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, తన వద్ద 10 బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్‌ 2023 నవంబర్‌ 13న ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ నవంబర్‌ 18న ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ 10 బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్‌ నవంబర్‌ 28న రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌ చేశారు. మిత్రుడిగా, మార్గదర్శిగా గవర్నర్‌ పనిచేయాలి ‘‘గవర్నర్లు చాలా వేగంగా పనిచేయాలని, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోంది. నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం చేయడం ప్రజాస్వామ్య పరిపాలన స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ వీటో చేయడం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం గవర్నర్‌ తన విచక్షణ మేరకు వ్యవహరించవచ్చు. బిల్లు ప్రజలకు హాని కలిగిస్తుందని భావించినప్పుడు, రాష్ట్రపతి సమ్మతి కచ్చితంగా అవసరమని అనుకున్నప్పుడు కొంతకాలం జాప్యం చేయొచ్చు. గవర్నర్‌ విచక్షణాధికారానికి సైతం ఆర్టికల్‌ 200 కొన్ని పరిమితులు విధిస్తోంది. బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరైంది కాదు. గవర్నర్‌ స్పందించకపోతే బిల్లు కేవలం ఒక కాగితం ముక్కగా, మాంసం లేని అస్థిపంజరంగానే ఉండిపోతుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లును ఇష్టంవచ్చినట్లు తొక్కిపెడతామంటే కుదరదు. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు (మొదటి దాని కంటే వైవిధ్యమైనది అయితే తప్ప) తప్పనిసరిగా సమ్మతి తెలపాల్సిందే. రాష్ట్రపతికి నివేదించకూడదు. అలాంటి బిల్లుపై గవర్నర్‌కు వీటో పవర్‌ ఉండదు. ప్రజల బాగు కోసం పని చేస్తామంటూ గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులకు అడ్డంకులు సృష్టించకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి. మంత్రివర్గం సూచనల మేరకు గవర్నర్‌ వ్యవహరించాలని ఆర్టీకల్‌ 200 చెబుతోంది. గవర్నర్‌ ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలి. రాజకీయపరమైన ఉద్దేశాలతో పనిచేయొద్దు. గవర్నర్‌ ఉ్రత్పేరకంగా ఉండాలి తప్ప నిరోధకంగా ఉండొద్దు. గవర్నర్‌ సైతం న్యాయ సమీక్షకు అర్హుడేనన్న సంగతి మర్చిపోవద్దు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. గవర్నర్‌కు న్యాయస్థానం స్పష్టమైన గడువు నిర్దేశించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చరిత్రాత్మకం: స్టాలిన్‌చెన్నై: గవర్నర్‌ వద్ద పెండింగ్‌ ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ చెప్పారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తంచేశారు. ఇది తమిళనాడుతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు. స్టాలిన్‌ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. సభలో బల్లలు చరిచి సుప్రీంకోర్టు తీర్పుపై సంబరాలు జరుపుకోవాలని అధికారపక్ష సభ్యులకు సూచించారు. తమిళనాడు ప్రజలకు, తమ న్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ స్టాలిన్‌ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో సమతూకాన్ని పునరుద్ధరించే విషయంలో ఈ తీర్పు ఒక కీలకమైన ముందడుగు అని ఉద్ఘాటించారు. అసలైన సమాఖ్య భారత్‌లో ప్రవేశం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న తమిళనాడుకు విజయం దక్కిందన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ మినహా ఇతర పారీ్టలన్నీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. అధికార డీఎంకే నాయకులు మిఠాయిలు పంచుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తమ గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉండే అధికారం కోల్పోయారని డీఎంకే నేత ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం హర్షం వ్యక్తంచేశారు.

Stock Market: Sensex Jumps 1089 Points and Nifty Ends Above 225005
బుల్‌ బౌన్స్‌బ్యాక్‌

ముంబై: ఆసియా, యూరప్‌ మార్కెట్ల ర్యాలీతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. దిగువ స్థాయిలో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 1,089 పాయింట్లు పెరిగి 74,227 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 374 పాయింట్లు బలపడి 22,536 వద్ద నిలిచింది. ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్‌సంకేతాలు ఇచ్చారు. ఆర్‌బీఐ ఈసారి మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డాలర్‌ బలహీనత, అమెరికా బాండ్లపై రాబడులు దిగివచ్చాయి ఇతర దేశాలతో పోల్చితే ప్రతీకార సుంకాల వల్ల భారత్‌ పై పడే ప్రభావం తక్కువేనని అంచనాలూ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఉదయమే సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,721 పాయింట్లు ఎగసి 74,859 వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు దూసుకెళ్లి 22,697 వద్ద గరిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండు శాతం చొప్పున పెరిగాయి. ⇒ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.7.32 లక్షల కోట్లు పెరిగి రూ.396.57 లక్షల కోట్లు (4.62 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరింది. ఇన్వెస్టర్లు సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ⇒ సెన్సెక్స్‌ సూచీలో ఒక్క పవర్‌గ్రిడ్‌ తప్ప (0.19%) మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. రంగాల వారీగా సూచీల్లో అయిల్‌అండ్‌గ్యాస్‌ 2.58%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 2.38%, టెలికం 2.32%, ఇండ్రస్టియల్స్‌ 2.04%, ఇంధన 2.%, కన్జూమర్‌ డిస్క్రేషనరీ 2.02% లాభపడ్డాయి. టెక్, హెల్త్‌కేర్, ఐటీ రెండుశాతం చొప్పున పెరిగాయి. ⇒ మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌లో భాగంగా అదానీ షేర్లు సైతం కోలుకున్నాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 11 షేర్లూ లాభపడ్డాయి. బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్‌ గ్యాస్‌ 3.27%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 3.23%, అంబుజా సిమెంట్స్‌ 2.53% లాభపడ్డాయి. ఏసీసీ 2.32%, అదానీ విల్మార్‌ 2.24%, అదానీ పోర్ట్స్‌ 1.72%, సంఘీ ఇండస్ట్రీస్‌ 1.62%, ఎన్‌డీటీవీ 1.06%, అదానీ పవర్‌ 0.54%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.30 శాతం చొప్పున పెరిగాయి. గ్రూప్‌లో సంస్థల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.12.18 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రపంచ మార్కెట్లు రయ్‌వాణిజ్య సుంకాల చర్చలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయనే ఆశలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. జపాన్‌ నికాయ్‌ 6%, చైనా షాంఘై 2%, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.50%, దక్షిణ కొరియా కోస్పీ అరశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫాన్స్‌ సీఏసీ, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ మూడుశాతం లాభపడ్డాయి. భారత వర్తమాన కాలం ప్రకారం రాత్రి 8:30 గంటలకు నాస్‌డాక్‌ మూడు శాతం లాభంతో 16,063 వద్ద, డోజోన్స్‌ రెండున్నర శాతం పెరిగి 38,895 వద్ద, ఎస్‌అండ్‌పీ 2.50% లాభంతో 5,192 వద్ద ట్రేడవుతున్నాయి.

Sakshi Guest Column On Why To Give Bharat Ratna to Jyotirao Phule, Savitribai Phule6
వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...

మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న ఫూలే దంపతులు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు ‘భారతరత్న’ ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవా నికి ఫూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనస్సుతో జీవితాంతమూ మానవ మార్పునకు కృషి చేసిన జంట మరోటి లేదు. అది ఒక్క ఫూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారిపట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి.మహాత్మా ఫూలే 1827 ఏప్రిల్‌ 11న పుడితే, 1831 జనవరి 3న సావిత్రి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త ఇటు అటు ఈ దేశంలో సంఘ సంస్క ర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్ర లోనే గోవింద రణడే, బెంగాల్‌లో ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు.వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ ఫూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పే వారు. బెంగాల్‌లో కొద్దిపాటిగా ఉన్న భద్రలోక్‌ స్త్రీల సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వరచంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. కందుకూరి గురించి సరేసరి. కానీ ఫూలే గురించి నాకు తెలిసింది 1986–87 ప్రాంతంలో! ఆయన గురించి కాస్తా వివరంగా చదవడానికి ఒక్క పుస్తకం కూడా లేదు. వెతగ్గా, వెతగ్గా కోఠి ఫుట్‌పాత్‌ పాత పుస్తకాల్లో ధనుంజయకర్‌ ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగి పోయింది. అందులో సావిత్రి బాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం వల్ల!ఇప్పుడు ఒక ఆరెస్సెస్‌/బీజేపీ ప్రభుత్వం, అదీ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్‌ ఎందుకు పాస్‌ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేడ్కర్‌ వాళ్ళు ప్రారంభించిన శూద్ర–దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు, దళితులకు ఓటుహక్కు వచ్చింది కనుక! వారి సంఖ్యా బలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆరె స్సెస్‌ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది ఫూలేనే!ఆరెస్సెస్‌ మాత్రమే కాదు, అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదార వాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్‌ మేధా వులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్‌ రాయ్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లను దేశం మొత్తం విద్యా రంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా ఫూలేను, సావిత్రిబాయిని, అంబేడ్కర్‌ను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు. మండల్‌ కమిషన్‌ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం ఫూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర–దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రమూ పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. ఫూలే జంట కేవలం భారత దేశానికే కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్‌ వంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్‌ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీసెస్‌ శిలువేసి చంపబడ్డారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి అర్థాన్నే మార్చారు. అందుకు దీటుగా ఆమె భార్య అనే అర్థాన్నే మార్చారు.వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యా భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదా హరణలతో చూద్దాం. సావిత్రీబాయికి 9వ ఏట, ఫూలేకు 13వ ఏట పెండ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే ఫూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచరై అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పనిచేస్తే పూనా పండితులు తిలక్‌ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి, బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమేయించారు. ఆ యువ దంప తులు దళిత వాడల్లో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్ళకు స్కూలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు ఫూలే.అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు – యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకు ముందు వాళ్ళి ద్దరూ 30 ఏండ్ల వయస్సులో ఉండగా సావిత్రి తండ్రి,ఖండోజీ పాటిల్‌ వచ్చి ఫూలేతో... ‘నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్ళి చేసుకో’ అని కోరాడు. దానికి ఫూలే... ‘లోపం సావి త్రిలో లేదు, నాలో ఉంది. ఆమెకు మరో పెండ్లి చేద్దాం. ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం’ అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా!ఫూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు. ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు (తలకొరివి) పెట్టడానికి వీలులేదు అని గొడవ చేశారు. ఫూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడ తానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి ‘నేనే నా భర్తకు తలగోరు పెడతాన’ని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారత స్త్రీ ఆమె. 1898లో బుబానిక్‌ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రీబాయి, డా‘‘ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు.ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆరె స్సెస్‌ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది ఆరెస్సెస్‌కు పెద్ద ఆయుధమౌతుంది. అంబేడ్కర్‌కు భారతరత్న వీపీ సింగ్‌ ప్రభుత్వం ఇచ్చినా ఆరెస్సెస్‌–బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫూలేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఫూలే లను దీటుగా ఓన్‌ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది.కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్‌ చేసి కేంద్రానికి పంపడం, ఫూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియవ్‌ులను కట్టించడం చెయ్యాలి. ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా ఫూలేలను చూడటం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడటం చెయ్యడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికీ నిదర్శనం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(ఏప్రిల్‌ 11న మహాత్మా ఫూలే జయంతి)

Punjab Kings win over Chennai Super Kings7
ప్రియాంశ్‌ పటాకా

‘కింగ్స్‌’ పోరులో చెన్నైపై పంజాబ్‌దే పైచేయి అయింది. యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య మెరుపులకు శశాంక్‌ సింగ్, యాన్సెన్‌ ఫినిషింగ్‌ టచ్‌ తోడవడంతో పంజాబ్‌ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్‌’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! ముల్లాన్‌పూర్‌: యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్‌ 18వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్‌ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రియాంశ్‌ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్‌ సింగ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో యాన్సెన్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (9)తో పాటు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0), స్టొయినిస్‌ (4), నేహల్‌ వధేరా (9), మ్యాక్స్‌వెల్‌ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... రచిన్‌ (37; 6 ఫోర్లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పోరాడారు. ఫటాఫట్‌... ఖలీల్‌ అహ్మద్‌ వేసిన తొలి బంతికే పాయింట్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన ప్రియాంశ్‌ ఆర్య... రెండో బంతికి క్యాచ్‌ మిస్‌ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్‌లో మరో సిక్స్‌ బాదాడు. రెండో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ డకౌట్‌ కాగా... ఆర్య ఇంకో సిక్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్‌ తదుపరి ఓవర్‌లో శ్రేయస్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయగా... నాలుగో ఓవర్‌లో ఆర్య ‘హ్యాట్రిక్‌’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.స్టొయినిస్‌ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్‌ ఓవర్‌లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ ఒకే ఓవర్‌లో నేహల్‌ , మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్‌ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్‌ 13వ ఓవర్‌లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్‌లో ఆర్య ఔట్‌ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్‌ చక్కటి షాట్‌లతో పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు. 39 ప్రియాంశ్‌ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్‌ (30 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో), మిల్లర్‌ (38 బంతుల్లో) ట్రావిస్‌ హెడ్‌ (39 బంతుల్లో) ముందున్నారు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య (సి) శంకర్‌ (బి) నూర్‌ 103; ప్రభ్‌సిమ్రన్‌ (బి) ముకేశ్‌ 0; శ్రేయస్‌ (బి) ఖలీల్‌ 9; స్టొయినిస్‌ (సి) కాన్వే (బి) ఖలీల్‌ 4; నేహల్‌ (సి) ధోని (బి) అశ్విన్ 9; మ్యాక్స్‌వెల్‌ (సి అండ్‌ బి) అశ్విన్ 1; శశాంక్‌ (నాటౌట్‌) 52; యాన్సెన్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–45–2; ముకేశ్‌ 2–0–21–1; అశ్విన్ 4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్‌ 3–0–32–1; పతిరణ 4–0–52–0. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (స్టంప్డ్‌) ప్రభ్‌సిమ్రన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 37; కాన్వే (రిటైర్డ్‌ అవుట్‌) 69; రుతురాజ్‌ (సి) శశాంక్‌ (బి) ఫెర్గూసన్‌ 1; దూబే (బి) ఫెర్గూసన్‌ 42; ధోని (సి) చహల్‌ (బి) యశ్‌ 27; జడేజా (నాటౌట్‌) 9; శంకర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–39–0; యశ్‌ 4–0–39–1; మ్యాక్స్‌వెల్‌ 2–0–11–1; యాన్సెన్‌ 4–0–48–0; ఫెర్గూసన్‌ 4–0–40–2; స్టొయినిస్‌ 1–0–10–0; చహల్‌ 1–0–9–0.ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X రాజస్తాన్‌ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Minimum Security Drought For Ys Jagan Tour In Sri Sathya Sai District8
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్‌ పర్యటనకు కనీస భద్రత కరువు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్‌ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్‌ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. జగన్‌ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్‌ జగన్‌ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

Congress leader P Chidambaram fell unconscious During CWC Meet Details9
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్‌ నేత చిదంబరం

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్‌తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. #WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25— ANI (@ANI) April 8, 2025కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్‌ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్‌ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్‌ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్‌’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్‌ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు.

Pawan kalyan Press Meet on Singapore School Son Mark Shankar Incident10
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌, సాక్షి: సింగపూర్‌లో తన చిన్నకొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌(Mark Shankar Pawanovich) ప్రమాదానికి గురి కావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) స్పందించారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని.. తన కొడుకుకు గాయాలైన మాట వాస్తవమేనని ధృవీకరించారాయన. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.ఉదయం అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్‌ వచ్చింది. సింగపూర్‌ హైకమిషనర్‌ సమాచారం అందించారు. నా కొడుకు మార్క్‌ శంకర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగింది. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్‌ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్‌ శంకర్‌కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ఫోన్‌​ చేసి విషయం తెలుసుకున్నారు. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్‌ అన్నారు. సింగపూర్‌లో నా కుమారుడి అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ(PM Modi)కి ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పవన్‌ అన్నారు.ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్‌(Singapore) రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్‌-అన్నాలెజినోవాలకు కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ సంతానం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement