Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

CIA Document From 1993 Has Resurfaced Following Pahalgam Incident1
భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన కారణంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి ఓ సంచలన నివేదిక బయటకు వచ్చింది. 1990లో పాకిస్తాన్‌, భారత్‌ మధ్య యుద్ధ అవకాశాలు అనే శీర్షికతో అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ(CIA) నివేదికపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.ఇంతకీ ఆ నివేదికలో ఏం ఉందంటే.. భవిష్యత్‌లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నిఘా వైఫ్యలాలు, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్‌ అంశం, కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ అంతర్గత జోక్యం వంటి అంశాలు శత్రుత్వాన్ని ప్రేరేపిస్తాయి. ఇది మతపరమైన విద్వేషాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే ఉద్రిక్తతల మధ్య యుద్ద పరిస్థితులు నెలకొంటాయి.రెండు దేశాల నాయకులు యుద్దాన్ని నివారించాలని కోరుకుంటున్నప్పటికీ.. అది సాధ్యపడకచ్చు అని ఆ నివేదిక పేర్కొంది. అలాగే, సంక్షోభం తీవ్రమైతే.. అది అణ్వాయుధ నిరోధకత విచ్ఛిన్నానికి దారితీస్తుందని పేర్కొంది. ఇరువైపులా అణ్వాయుధాలను మోహరించవచ్చు అని హెచ్చరించింది.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్‌ చర్యలకు ప్రతిగా.. పాక్‌ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

Hyderabad Local Body MLC Elections Counting Updates2
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్‌ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్‌ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్‌ఎంసీ వద్ద మోహరించాయి.

Pakistan Army Over Action Across Line Of Control And India Retaliates3
భారత సరిహద్దుల్లో టెన్షన్‌.. పాక్‌ ఆర్మీ కాల్పులు

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్‌ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్‌ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్‌ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్‌ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది. Small arms firing at some places on the Line of Control were initiated by the Pakistan Army. Effectively responded to by the Indian Army. No casualties. Further details are being ascertained: Indian Army officials pic.twitter.com/SlBSDPSJHA— ANI (@ANI) April 25, 2025మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BREAKINGEncounter breaks out in Bandipora, Jammu & Kashmir as terrorists open fire during a search operation.Security forces retaliate. No casualties reported yet. Updates awaited. pic.twitter.com/7jz8O8x4Ud— 𝕿𝖆𝖗𝖚𝖓 तरुण 卐 🇮🇳 (@fptarun) April 25, 2025

YS Jagan congratulates local government representatives of YSR Anantapur and Tirupati districts4
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్‌ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమా­వేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహ­ల్గాంలో ఉగ్ర­వాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్‌ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమా­వేశంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్‌..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యా­లకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్‌ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్‌ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయ­పెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్‌ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్‌ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్‌సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్‌ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్‌ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్‌సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్‌ టాపిక్‌ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు ఎందుకు లేవు? గతంలో జగన్‌ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్‌ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపో­యామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్‌ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్‌ కొట్టేలా పెంచిన కరెంట్‌ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్‌ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్‌ డైవర్షన్‌ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్‌ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్‌ అని గేమ్స్‌ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్‌ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్‌ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్‌ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్య­క్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్‌ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్‌ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్‌ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్‌సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్‌ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. రెండేళ్లు కోవిడ్‌ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది.

Israel Ambassador Reuven Azar Says Hamas Leaders Visited PoK5
పహల్గాం దాడిలో హమాస్‌ నేతల ప్లాన్‌.. POKలో ఏం జరిగింది?

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్‌ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై తాజాగా రూవెన్‌ అజార్‌ స్పందిస్తూ..‘హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉంది. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. గతంలో ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గామ్‌‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉంది. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారు.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ముష్కరులు సంగీత కచేరీలో పాల్గొన్న 1,400 మందికి పైగా పౌరులను హత్య చేశారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనడానికి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. దోషులను వేటాడుతాం అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం అభినందనీయం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు అనేక దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.Watch: On the Pahalgam terror attack, Reuven Azar, Ambassador of Israel to India, says, "You have a similar situation in which people were going to a music festival and were massacred, and people here were going on vacation and they were massacred. It’s the same death cult, the… pic.twitter.com/5obbvzh89V— IANS (@ians_india) April 24, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారత్‌.. పాక్‌పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాక్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాలను నిలిపేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. అటారీ-వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్‌ వేడుకను బీఎస్‌ఎఫ్‌ నామమాత్రంగా నిర్వహించింది. పాక్‌ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రిట్రీట్‌ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్‌ను యథావిధిగా నిర్వహించామని బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Website not open for some school assistant posts6
మెగా అగచాట్ల డీఎస్సీ!

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపా­ధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థు­లకు చుక్క­లు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకో­వ­డానికి వెబ్‌సైట్‌­ను ఓపెన్‌ చేసిన నిరుద్యోగ ఉపా­ధ్యాయ అభ్య­ర్థులకు సాంకేతిక సమ­స్యలు ఎదు­రవుతు­న్నాయి. ఇప్పటికే కొన్ని నిబ­ంధనలు అడ్డంకి కాగా, ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక కార­ణా­లతో దరఖా­స్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతు­న్నాయి. హెల్ప్‌ లైన్‌ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరు­ద్యోగులు వాపోతు­న్నారు. కఠిన నియ­­మాలతో నిరుద్యో­గులు ఇబ్బందు­లు పడు­తు­న్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఆన్‌లైన్‌­లో దరఖాస్తు చేసు­కు­ంటున్న అభ్యర్థుల­ కు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో కూడా కనీస మార్కులు 45–­50 శాతం లేకుంటే ఇన్‌ వ్యాలి­డ్‌గా చూపి­స్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యా­ర్హత అయిన డిగ్రీలో సగటు మా­ర్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దర­ఖాస్తు సబ్మిట్‌ అవ్వడం లేదు. ఓపెన్‌లో ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతు­న్నా­రు. ఉ­దా­హ­ర­ణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడి­యట్‌లో అరబిక్‌ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో రెండవ భాష సెలెక్ట్‌ చెస్తే డ్రాప్‌–డౌన్‌ మెనూలో అరబిక్‌ ఆప్షన్‌ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్‌ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్‌ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్‌ ఇవ్వలేదు.డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్‌ ఆప్షన్‌ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతు­న్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలిమెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్య­ర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యో­గులు డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్‌ చేశారు. దీంతో హాల్‌ టికెట్‌ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్‌ చేసుకునే అవకాశం ఇవ్వా­లని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్య­ర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యో­గా­లకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. » ఎస్‌జీటీకి ఇంటర్మీడియట్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్‌ అభ్య­ర్థు­లకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకు­న్నట్లు సమాచా­రం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. » పీజీ ఇంగ్లిష్‌లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మా­ర్కులున్న ఓ జనరల్‌ అభ్యర్థి దర­ఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తు­న్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూ­స్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.» టెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కు­లతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్‌ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

A major railway accident was averted near Arakkonam7
పట్టాల బోల్టులను తొలగించిన దుండగులు.. తప్పిన పెను రైలు ప్రమాదం

సాక్షి,చెన్నై: అరకోణం సమీపంలో పెను రైల్వే ప్రమాదం తప్పింది. దుండగులు రైల్వే పట్టాల బోల్ట్‌‌లను తొలగించారు. పట్టాల బోల్టుల తొలగింపుపై రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tollywood Actors Spent Rs 17 Lakh On A Fancy Car Number8
అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్‌..

గత కొంతకాలంగా టాలీవుడ్‌ స్టార్లు తమ వాహనాల నెంబర్ల కోసం ఎంతటి ఖర్చుకైనా సై అంటున్నారు. ఇటీవలె ఓ ప్రముఖ టాలీవుడ్‌ నటుడు తన వాహనం కోసం ఓ ఫ్యాన్సీ నెంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు. ఆయన ఈ నెంబర్‌ కోసం ఏకంగా రూ.7లక్షలకు పైగా వెచ్చించడం విశేషం. ఆయనొక్కరే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. అయితే స్టార్ల ఆరాటం వెనుక అనేక రకాల సెంటిమెంట్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల నగరానికి చెందిన కార్పొరేట్‌ కంపెనీలు సైతం నెంబర్ల వేటలో స్టార్లతో పోటీపడుతుండడం కనిపిస్తోంది. మహేష్‌ నుంచి మాస్‌ మహారాజ్‌ దాకా.. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సైతం నెంబర్ల వేటకు నేను సైతం అంటున్నారట. ఆయన తన వాహనాలైన రేంజ్‌ రోవర్, మెర్సిడీజ్‌ జీఎల్‌ఎస్‌ల కోసం టీఎస్‌ 09 ఇకె 600, టీఎస్‌ 09 జీఒ 600 లను కొనుగోలు చేశారట. నాగార్జున బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కోసం ఏపీ 09 బీడబ్ల్యూ 9000ను వేలంలో దక్కించుకున్నారని సమాచారం. నెంబర్‌ను ఆయన పవర్‌ఫుల్‌ నెంబర్‌గా పరిగణిస్తారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా నెంబర్లపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. ఆయన తన రేంజ్‌రోవర్, వోల్వో ఎక్స్‌సీ 90 నెంబర్‌ టీఎస్‌07 జీఇ 9999 రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారని సమాచారం. సీనియర్‌ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్‌ వాహనం బీవైడీ అట్టో 3 నెంబరు టీఎస్‌ 09 జీబీ 2628 కోసం రూ.17,628 వెచి్చంచారని సమాచారం. కార్పొరేట్‌ కంపెనీలు సైతం.. హీరో బాలకృష్ణ తర్వాత ‘0009’నెంబర్‌ను నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కొనుగోలు చేయడం విశేషం. కంపెనీలు సైతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు పోటీ పడుతున్నాయనడానికి ఇదో నిదర్శనం. వ్యాపార ప్రతిష్ఠను పెంచడంలో, బ్రాండ్‌ గుర్తింపును పెంచడంలో వాహనాల నెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టీఓ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో ‘టీజీ 09 9999’ నంబర్‌ను సోనీ ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థ రూ.25.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్‌ను టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ వాహనానికి కేటాయించారట. మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) ‘టీజీ 09 డీ 0009’ నంబర్‌ను రూ.10.4 లక్షలకు సొంతం చేసుకుంది. ‘టీజీ 09 సీ 9999’ నంబర్‌ను రూ.7.19 లక్షలకు శ్రియాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలు చేసిందట. అదే విధంగా పోరస్‌ అగ్రో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ’ టీజీ 09 డీ 0006’ నంబర్‌ను రూ.3.65 లక్షలకు దక్కించుకుందని, వేగశ్రి గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ‘టీజీ 09 డీ 0005’ నంబర్‌ను రూ.3.45 లక్షలకు కొనుగోలు చేసిందని సమాచారం.జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సైతం.. సినీ హీరో నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు అత్యంత డిమాండ్‌ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అదే విధంగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారట. ఆయన రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లాంబోర్గినీ ఉరూస్‌ వాహనం నెంబర్‌ కోసం భారీగానే వెచ్చించారని విస్వసీయ వర్గాల సమాచారం. టీఎస్‌ 09 ఎఫ్‌ఎస్‌ 9999 కోసం ఏకంగా రూ.17లక్షలు వ్యయం చేశారు. ఎనీ్టయార్‌ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్‌నే ఎంచుకుంటారట. సెంటిమెంట్స్‌తో ఆర్టీఏకి కాసుల పంట.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లను పొందడం ద్వారా తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని చూడడం ఈ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరగడానికి కారణమవుతోంది. అలాగే 6, 9 తదితర నంబర్లను సెంటిమెంట్‌గా లక్కీ నెంబర్లుగా భావించడం కూడా మరో కారణం. కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రత్యేకంగా చూపించేందుకు ప్రత్యేక నంబర్లను ఉపయోగిస్తున్నాయి. ఏదైతనేం.. సదరు సెంటిమెంట్లు, క్రేజ్‌ మూలంగా గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని ఐదు ఆర్టీఓ కార్యాలయాలు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.124.20 కోట్లు ఆదాయాన్ని గడించాయి. పోటీ పెరుగుతుండడంతో వీటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇది గత ఏడాది ఆదాయం రూ.118 కోట్లతో పోలిస్తే సుమారు 5% పెరుగుదల నమోదైందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.

bse md emphasizing importance of investor awareness and responsibility9
‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’

పెట్టుబడుల విషయంలో నియంత్రణ నిబంధనలు మాత్రమే మదుపరులను కాపాడలేవని, ఇన్వెస్టర్లు కూడా తప్పకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని బీఎస్‌ఈ ఎండీ సుందరరామన్‌ రామమూర్తి తెలిపారు. సొంతంగా విషయాలను ఆకళింపు చేసుకోకుండా, వాళ్లూ వీళ్లు చెప్పిన మాటల మీద ఆధారపడి ఇన్వెస్ట్‌ చేసే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు.‘కూరగాయలు కొనుక్కునేటప్పుడు ముందుగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మీ జీవితకాల ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఎవరో చెప్పిన మాటలు విని ముందూ, వెనకా చూసుకోకుండా ఇన్వెస్ట్‌ చేస్తారు. అలా చేయొద్దు. మీకు అర్థమైనదే ట్రేడ్‌ చేయండి. ఏం ట్రేడ్‌ చేస్తున్నారో అర్థం చేసుకోండి. లేకపోతే సమస్యలు తప్పవు. మిమ్మల్ని మీరు కాపాడుకోదల్చుకోకపోతే ఎన్ని నిబంధనలున్నా ఏవీ మిమ్మల్ని రక్షించలేవు. కాబట్టి అలర్టుగా ఉండండి’ అని రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కలకత్తా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: అనుకున్నదొకటి అయినదొకటి..మార్కెట్‌పై అవగాహన లేని రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం మ్యుచువల్‌ ఫండ్‌ మార్గాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరమని సూచించారు. అప్పుడు కూడా థీమ్యాటిక్‌ ఫండ్స్‌ జోలికి వెళ్లకుండా విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యుచువల్‌ ఫండ్లు లేదా లార్జ్‌ క్యాప్‌ ఫండ్లను ఎంచుకోవడం మంచిదని పేర్కొన్నారు. కెరియర్‌ ప్రారంభించిన తొలినాళ్ల నుంచే పెట్టుబడులు పెట్టడాన్ని అలవర్చుకోవాలని మహిళలు, యువతకు రామమూర్తి సూచించారు. నియంత్రణ సంస్థలు, స్టాక్‌ ఎక్సే్చంజీలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని ఎస్‌ఎంఈ లిస్టింగ్‌లలో అవకతవకలు జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఐపీవో పత్రాల్లో అనుమానాస్పద అంశాలను పసిగట్టేందుకు ఏఐ, లార్జ్‌ ల్యాంగ్వేజ్‌ మోడల్స్‌ను బీఎస్‌ఈ ట్రయల్‌ ప్రాతిపదికన ఉపయోగిస్తోందని రామమూర్తి చెప్పారు.

Megastar Chiranjeevi Responds On Pahalgam Incident Again10
పహల్గామ్ ఘటనపై మరోసారి స్పందించిన మెగాస్టార్‌..!

పహల్గామ్‌ ఉగ్రదాడిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అమాయక ప్రజలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాక్షసుల ఆకృత్యానికి ఎంతోమంది బలైపోయారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని తన బాధను వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరినీ విడిచిపెట్టొద్దని మెగాస్టార్‌ చిరంజీవి కోరారు. ఈ దాడిపై అంతకుముందే చిరు ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైందని.. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టాన్ని ఏదీ పూడ్చలేదని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement