రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ | Ramagiri And Gandlapenta MPP Election 2025 Updates In AP, Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ

Published Fri, Mar 28 2025 8:56 AM | Last Updated on Fri, Mar 28 2025 12:14 PM

Ramagiri And Gandlapenta Mpp Election Updates

ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక ‘పరిటాల’ కుటుంబం పైశాచిక రాజకీయం చేసింది. రౌడీయిజం చేస్తూ.. దౌర్జన్యకాండ సృష్టించి.. అధికారులను అడ్డు పెట్టుకుని ఎంపీపీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించింది.

రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
👉టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్నిక బాయ్ కాట్
👉వైఎస్సార్ సీపీ ఎమ్పీటీసీలకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలం
👉టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులపై పోలీసుల మౌనం
👉నిన్న పేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేసిన పరిటాల వర్గీయులు
👉గాండ్లపెంట ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు
👉పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం

ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్
👉వైఎస్సార్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా పలువురి నేతల హౌస్ అరెస్ట్
👉నేడు నిన్న వాయిదా పడిన గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక
👉నిన్నటి ఎన్నికకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరుకాకుండా రాళ్ళ దాడి చేసిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు
👉కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక
👉నేడు వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు అరెస్టులు
👉ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ
👉వైఎస్సార్సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపడంలో పోలీసుల వైఫల్యం
👉దాడులకు దిగుతున్న టీడీపీ వారిని వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్
👉వైఎస్సార్సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్

టీడీపీ కుట్ర రాజకీయాలు
👉పశ్చిమ గోదావరి జిల్లా: వాయిదా పడిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ స్థానాలకు నేడు ఎన్నికలు
👉సంఖ్యాబలం లేకపోయినా.. కుయుక్తులు పన్నుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
👉అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
👉యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినగుంపర్రు ఎంపిటిసి కంబాల సత్య శ్రీనీ అరెస్టు చేసిన పోలీసులు
👉ఆమెపై కిడ్నాప్ కేసు పెట్టారంటూ కొత్త డ్రామాలకు తెర లేపిన పోలీసులు
👉ఎంపీటీసీ అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి కుట్రలు
👉అక్రమ కేసులు, కిడ్నాపులను ఎదుర్కొని వైసీపీ విజయకేతనం
👉వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేని చోట ఎన్నికలను నేటికి వాయిదా వేయించిన కూటమి నేతలు
👉నేడు జరగనున్న ఎంపీపీ ఉప ఎన్నికలు: యలమంచిలి, అత్తిలి, గాండ్లపెంట, రామగిరి
👉వైస్ ఎంపీపీ ఎన్నికలు : అత్తిలి, ఏలూరు రూరల్, కైకలూరు, కారంపూడి, నరసరావుపేట, దగదర్తి
👉వైఎస్సార్ సీపీ సభ్యులను ఎన్నికలకు హాజరుకాకుండా చేసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం
👉అవసరమైతే కోర్టులను ఆశ్రయించే యోచనలో వైఎస్సార్ సీపీ

👉ఏమాత్రం బలం లేకపోయినా కుటిల రాజకీయంతో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేశారు. రొద్దంలో వారి పాచిక పారకపోగా.. గాండ్లపెంట, రామగిరి ఎంపీపీలను తమ ఖాతాలోకి వేసుకోవాలని అరాచకానికి తెరతీశారు. ఇందులో భాగంగానే ఆ రెండు ఎన్నికలు నేటికి వాయిదా పడ్డాయి.

👉ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక ‘పరిటాల’ కుటుంబం పైశాచిక రాజకీయం చేసింది. రౌడీయిజం చేస్తూ.. దౌర్జన్యకాండ సృష్టించి.. అధికారులను అడ్డు పెట్టుకుని ఎంపీపీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించింది. సజావుగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని తెలిసే ఎమ్మెల్యే పరిటాల సునీత దిగజారుడు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అధికారులను పావులుగా వాడుకొని వైఎస్సార్‌సీపీ సభ్యులను బెదిరించి,  ప్రలోభాలకు గురి చేసి, పదవులను ఆఫర్‌ చేసి లాక్కోవాలనే ప్రయత్నం చేశారు. ప్లాన్‌ ఫలించకపోయేసరికి ఎన్నికను వాయిదా వేయించారు.

👉అభ్యర్థి లేకున్నా.. రామగిరి ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరఫున ఒక్క పురుషుడు మాత్రమే గెలిచారు. పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు కూడా పురుషులే కావడంతో రామగిరి నుంచి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు కూడా అభ్యర్థి లేరు. అయితే ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్‌సీపీ సభ్యులను లాక్కొని టీడీపీ కండువా వేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని పరిటాల సునీత వేసిన ప్లాన్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయింది.

👉రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 9 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. అందులో  ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ మరణించారు.  ఎంపీపీ పదవి దక్కాలంటే కనీసం ఐదుగురు మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున ఐదుగురు సభ్యులు బెంగళూరు క్యాంపులో ఉన్నారు.

👉వైఎస్సార్‌సీపీ సభ్యులు గురువారం బెంగళూరు నుంచి రామగిరికి ఎన్నికల కోసం వస్తుండగా.. బాగేపల్లి టోల్‌ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరి తీసుకెళ్తామని.. మిగతా వాళ్లు రాకూడదని సూచించారు. ఏడు వాహనాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులతో రామగిరికి బయలుదేరారు. అయితే కాన్వాయ్‌ చెన్నేకొత్తపల్లి దాటే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సమయానికి రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి ముగ్గురు సభ్యులు మాత్రమే చేరుకోవడంతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు గడువు మీరింది. దీంతో ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంజీవయ్య ప్రకటించారు. 

👉రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడినట్లు తెలియడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులను తిరిగి కర్ణాటక సరిహద్దు దాటించే వరకూ పోలీసులు బందోబస్తులో ఉండాలి. అయితే ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ కల్పించుకుని వైఎస్సార్‌సీపీ సభ్యులతో వీడియో కాల్స్‌ ద్వారా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో మాట్లాడించారు. పదవులు ఆఫర్‌ చేసి.. డబ్బు ద్వారా ప్రలోభాలకు గురి చేశారు. పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారు. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులందరూ ఒకే మాటపై నిలబడి.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

👉లీగల్‌ ప్రొసీజర్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించాలని పోలీసులు సూచించారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన టీడీపీ నేతలు వాహనాల్లో వచ్చి పేరూరు –2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినా పోలీసులు అడ్డుకున్నారు.

👉వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా అభ్యర్థి ఉంటే.. నామినేషన్‌ దాఖలు చేసి.. ఏదో విధంగా బెదిరించి పార్టీ మార్చుకోవచ్చనే ఆలోచనతో పరిటాల సునీత దళిత మహిళను ఇరకాటంలో పడేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించారు.

👉ఇక.. గాండ్లపెంటలో బలంలేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుటిల యత్నాలకు తెరలేపింది. మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒకచోట మాత్రమే టీడీపీ గెలుపొందింది. అయితే, గురువారం ఎంపీడీఓ కార్యాల యంలో ఎంపీపీ ఎన్నిక కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు కదిరి నుంచి గాండ్లపెంటకు బయలు దేరగా.. మార్గమధ్యలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిలో పోలీసులు సోదాల పేరుతో అడ్డుకున్నారు. దీంతో ఆలస్యం జరిగి ఎన్నికల అధికారి ఎన్నికను నేటికి(శుక్రవారం) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement