
సాక్షి, తాడేపల్లి: నేడు బాబు జగ్జీవన్‌రామ్ జయంతి. ఆయన జయంతి సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించారు. దేశానికి జగ్జీవన్‌రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దళితులు, అణచివేతకు గురైన వర్గాల వారికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అర్పించారు.

దళితులు, అణచివేతకు గురైన వర్గాల వారికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబు… pic.twitter.com/f1NdjMz0g0
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2025