
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లకు ఆమోదం తెలపాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏపీ విభజన చట్టంపై సెక్షన్ 90ఏ చేర్చాలని బిల్లులో పేర్కొన్నారు.
కాగా, లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు.