
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. కొడుకు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోక మెహతా, మనవడు పృథ్వీతో కలిసి సిద్ధి వినాయకున్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మనవడు పృథ్వీని ముఖేష్ అంబానీ ఎత్తుకుని కనిపించారు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు, ఆలయంలో ఉన్నంత సేపు ఆయన తన మనవడిని ఎత్తుకునే ఉన్నారు. వారి వెంట పృథ్వీ తల్లి, ప్రస్తుతం గర్భిణిగా ఉన్న శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీ ఉన్నారు.
ముఖేష్ అంబానీ కుటుంబం గత వారం కూడా సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించింది. అప్పుడు కూడా ముఖేష్ అంబానీ మనవడిని ఇలాగే ఎత్తుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.
ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!