
మెల్‌బోర్న్: ఆస్ట్లేలియాలో మెల్‌బోర్న్‌లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గతంలోనూ పలుమార్లు కార్యాలయం గోడల నిండా అభ్యంతర చిత్రాలు, వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ కార్యాలయం అధికారులకు సమాచారం అందించింది.
దేశంలోని భారత దౌత్య, కాన్సులేట్ కార్యాలయాలకు, అధికారులకు రక్షణ కలి్పస్తామని ఆ్రస్టేలియా ప్రభుత్వం హామీ ఇచి్చందని హై కమిషన్ వెల్లడించింది. కార్యాలయం గేటు వద్ద గోడపై అర్ధరాత్రి దాటాక అభ్యంతరకర చిత్రాలు గీసినట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తు చేపట్టామని విక్టోరియా పోలీసులు శుక్రవారం తెలిపారు.