ఫోన్‌ లేకుంటేనే సూపర్‌ బ్రెయిన్‌! | Less Smart Phone Use Can Change This Says Latest Study | Sakshi
Sakshi News home page

ఫోన్‌ లేకుంటేనే సూపర్‌ బ్రెయిన్‌!

Published Tue, Mar 4 2025 4:52 PM | Last Updated on Wed, Mar 5 2025 7:10 AM

Less Smart Phone Use Can Change This Says Latest Study

మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్‌ అయ్యాం మరి!. అయితే ఫోన్‌ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 

స్మార్ట్‌ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్‌ బర్గ్‌ యూనివర్సిటీ‌ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్‌ చాలెంజ్‌ను కొంతమందిపై  ప్రయోగించారు. 

ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్‌కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా అడిక్షన్‌ను కూడా పరిశీలించారు. రీసెర్చ్‌కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్‌తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. 

పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్‌ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్‌ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్‌ అంత ‘సూపర్‌’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. 

సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన  (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సామ్‌ ఏం చెప్పిందంటే..
ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్‌ చాలెంజ్‌ను సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 

‘‘మూడు రోజులపాటు ఫోన్‌ లేదు. ఎవరితో కమ్యూనికేషన్‌ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement