
రెండు, మూడు స్థానాల్లో దోహా, టోక్యో విమానాశ్రయాలు
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు
సింగపూర్: ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌లో చాంగీ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్‌పోర్టుకు ఈ ఘనత దక్కడం ఇది 13వసారి కావడం విశేషం. దోహా, టోక్యో ఎయిర్‌పోర్టులు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ అవార్డ్స్–2025ను ఈ నెల 9న ప్రకటించారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ‘బెస్టు ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, సౌత్ అసియా’అవార్డు, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు లభించింది. గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ 5 మిలియన్ ప్యాసింజర్స్’కేటగిరీలో అవార్డు దక్కింది. అలాగే ‘క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’గా నిలిచింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ‘బెస్టు ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు సొంతం చేసుకుంది.
ప్రపంచంలోని టాప్–20 విమానాశ్రయాలు
1. సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు, 2. దోహా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 3. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 4. ఇంచెయాన్ ఎయిర్‌పోర్టు, 5. నారిటా ఎయిర్‌పోర్టు, 6. హాంకాంగ్ ఎయిర్‌పోర్టు, 7. పారిస్ చార్లెస్ డిగాల్ ఎయిర్‌పోర్టు, 8. రోమ్ ఫుమిసినో ఎయిర్‌పోర్టు, 9. మ్యూనిక్ ఎయిర్‌పోర్టు, 10. జ్యూరిచ్ ఎయిర్‌పోర్టు, 11. దుబాయ్ ఎయిర్‌పోర్టు, 12. హెల్సింకీ–వాంటా ఎయిర్‌పోర్టు, 13. వాంకోవర్ ఎయిర్‌పోర్టు, 14. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు, 15. వియన్నా ఎయిర్‌పోర్టు, 16. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టు, 17. చుబూ సెంట్రాయిర్ ఎయిర్‌పోర్టు, 18. కోపెనహగెన్ ఎయిర్‌పోర్టు, 19. అమ్‌స్టర్‌డ్యామ్ ఎయిర్‌పోర్టు, 20. బహ్రెయిన్ ఎయిర్‌పోర్టు.