సూడాన్‌లో మారణహోమం​.. వందలాది మంది మృతి | Sudan: RSF in Darfur famine-hit camps | Sakshi
Sakshi News home page

సూడాన్‌లో మారణహోమం​.. వందలాది మంది మృతి

Published Sun, Apr 13 2025 10:01 AM | Last Updated on Sun, Apr 13 2025 10:28 AM

Sudan: RSF in Darfur famine-hit camps

కర్టోమ్‌: ఆఫ్రికా దేశం సూడాన్‌ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల శిబిరాలపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, సూడాన్‌లో మారణహోమం జరిగింది.

వివరాల ప్రకారం.. పశ్చిమ సూడాన్‌లోని నార్త్‌ డార్ఫర్‌లో గత రెండు రోజులుగా పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF) బలగాలు దాడులు జరుపుతున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జామ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. 

 ఇక, శనివారం అబూషాక్‌ శిబిరంపై దాడులు జరిపారు. ఇందులో 14 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరంపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల సందర్భంగా భయంతో పౌరులు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణలు అరచేతిలో పట్టుకున్నారు. మరోవైపు.. దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. 

అయితే, 2023 ఏప్రిల్‌లో సూడాన్‌ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (SAF), ర్యాపిడ్ సపోర్ట్‌ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement