
Puneeth Rajkumar Funerals : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్ అన్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించిన ఎన్టీఆర్
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్, అలీ కూడా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ మరణం తీరని లోటన్న శ్రీకాంత్.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.
మరోవైపు పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి రాజ్‌కుమార్ బెంగళూరుకు చేరుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు పునీత్ అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య!
పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..