
స్క్రీన్‌పై షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్‌కు తల్లిగా నటించనున్నారట దీపికా పదుకోన్. షారుక్ ఖాన్ హీరోగా ఆయన కుమార్తె సుహానా మరో లీడ్ రోల్‌లో నటించనున్న చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్ టాక్. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నారు.
తాజాగా ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ లీడ్ చేయనున్నారనే టాక్ తెర పైకి వచ్చింది. సుహానా ఖాన్‌కు తల్లిగా కనిపిస్తారట దీపికా పదుకోన్. ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందట. మే లేదా జూన్‌లో ‘కింగ్’ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా ‘ఫాల్స్’ అని పేర్కొన్నారు. మరి... ‘అవాస్తవం’ అని ఆయన పేర్కొన్నది దీపికా పదుకోన్ తల్లి పాత్ర గురించా? లేదా వేరే ఏదైనా సినిమా గురించా లేక వేరే ఏ విషయం గురించా అనేది తెలియాల్సి ఉంది.