
చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ (Ntr) ఓ సినిమా ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యాడ్ స్క‍్వేర్ (Mad Square) సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. చాలా హుషారుగా కనిపించాడు. తన కొత్త సినిమా సంగతుల్ని కూడా బయటపెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ బక్కగా మారిపోవడం మాత్రం అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఏంటీ కారణం?
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న తారక్.. 'దేవర'తో (Devara Movie) బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నాడు. కానీ ఓ మాదిరి వసూళ్లే వచ్చాయి. మొన్నీమధ్య జపాన్ లోనూ ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)
ఈ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. త్వరలో సెట్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలో పావుగంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని, దీనికోసమే సన్నగా మారిపోయాడని తెలుస్తోంది. దాని షూటింగ్ పూర్తయిన తర్వాత యధావిధిగా తన పాత లుక్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు.
కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. తారక్ సినిమాతో ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అనుకుంటున్నారు. మరి చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది పూర్తయిన తర్వాత తారక్.. దేవర 2 చేస్తాడు.
(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్)
