Prashanth Neel
-
రిలీజ్ డేట్ కాదు.. ఎన్టీఆర్-నీల్ మూవీ కొత్త అప్డేట్
ఎన్టీఆర్(Ntr)-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైపోయింది. కాకపోతే తారక్ చిత్రీకరణలో పాల్గొనలేదు. మరోవైపు నిన్నటి నుంచి రిలీజ్ డేట్ వాయిదా గురించి తెగ వార్తలొచ్చాయి. ఇలాంటి సందర్భంగా మూవీ టీమ్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన)'దేవర' తర్వాత తారక్.. 'వార్ 2' మూవీ (War 2 Movie) చేస్తున్నాడు. దీనితో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాకు ఓకే చెప్పారు. కొన్నిరోజుల ముందు ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఏప్రిల్ 22 నుంచి తారక్ సెట్స్ లో అడుగుపెడతాడని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.అనుకున్నది అనుకున్నట్లే జరిగితే లెక్క ప్రకారం వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజయ్యే అవకాశముంది. అయితే ఈ తేదీకి రాకపోవచ్చని.. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న మూవీ థియేటర్లలోకి రావొచ్చని మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి. షూటింగ్ వేగాన్ని బట్టి రిలీజ్ డేట్ పై ఓ అంచనాకు రావొచ్చేమో!(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!) -
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
చాన్నాళ్ల తర్వాత మొన్నీమధ్య 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్(Jr Ntr).. ఇప్పుడు తెలుగు దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)తనతో పాటు పనిచేసిన పలువురు దర్శకులతో తారక్ మంచి బాండింగ్ మెంటైన్ చేస్తూ ఉంటాడు. అలా తనకు 'బృందావనం' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంటికి ఎన్టీఆర్ వెళ్లాడు. అతడి భార్య మాలిని పుట్టినరోజు వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నాడు.ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో తారక్ తో పాటు సుకుమార్(Sukumar)-అతడి భార్య, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటోని సుకుమార్ భార్య బబిత తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మహేశ్ బాబు ప్రస్తుతం రోమ్ టూర్ లో ఉన్నాడు. లేదంటే తన భార్యతో కలిసి ఈ పార్టీలో కనిపించేవాడేమో!(ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్) -
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ (Ntr) ఓ సినిమా ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యాడ్ స్క్వేర్ (Mad Square) సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. చాలా హుషారుగా కనిపించాడు. తన కొత్త సినిమా సంగతుల్ని కూడా బయటపెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ బక్కగా మారిపోవడం మాత్రం అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఏంటీ కారణం?'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న తారక్.. 'దేవర'తో (Devara Movie) బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నాడు. కానీ ఓ మాదిరి వసూళ్లే వచ్చాయి. మొన్నీమధ్య జపాన్ లోనూ ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)ఈ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. త్వరలో సెట్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలో పావుగంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని, దీనికోసమే సన్నగా మారిపోయాడని తెలుస్తోంది. దాని షూటింగ్ పూర్తయిన తర్వాత యధావిధిగా తన పాత లుక్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. తారక్ సినిమాతో ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అనుకుంటున్నారు. మరి చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది పూర్తయిన తర్వాత తారక్.. దేవర 2 చేస్తాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్) -
బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
కొలంబో కాలింగ్
కొలంబో వెళ్లనున్నాడట డ్రాగన్. ఎన్టీఆర్(Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. గత నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలోప్రారంభమైంది.కానీ ఈ షూటింగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదని తెలిసింది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఈ షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలోని కొలంబోలో జరగనుందట. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. -
Jr NTR : న్యూ లుక్ తో ఎన్టీఆర్ (ఫొటోలు)
-
Prashanth Neel: మొదటిరోజే 3వేలమందితో
-
సరికొత్త మాస్ లుక్‌లో...
‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్’ వంటి విజయాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించి, లొకేషన్లోని ఓ ఫొటోని షేర్ చేసింది. ‘‘మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ నీల్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ ఆరంభించాం.తర్వాతి షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారు. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనున్నాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్. -
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్‌కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్‌తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్‌లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్‌కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్‌గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్‌తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్‌తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్‌లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్‌తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్‌తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్‌ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. క్రేజీ కాంబో మొదలైంది!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు సమయం ఆసమన్నమైంది. ఎన్టీఆర్‌నీల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్‌ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మొదటి జనవరిలోనే షూటింగ్ ప్రారంభిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ఈ ఫిబ్రవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్ మొదలైంది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్‌లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun. A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025 -
మరికొద్ది గంటల్లోనే డ్రాగన్ షూటింగ్ ప్రారంభం
-
1000 కోట్ల క్లబ్ ని టార్గెట్ చేసిన ఎన్టీఆర్..
-
ఎన్టీఆర్ డ్రాగన్‌లో టొవినో?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్‌ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్ఎమ్’ చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్‌గా నిలిచాయి. -
Salaar@1 Year: 6 రోజుల్లో 500 కోట్లు.. టెండ్రింగ్‌లో 300 రోజులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి."సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం "సలార్ 2, శౌర్యంగపర్వ" చిత్రీకరణ జరుపుకుంటోంది. -
'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024 -
ఫిబ్రవరిలో ప్రారంభం
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆరంభించే కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్‌లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. -
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
హీరోలకు మించిన ప్లానింగ్ లో స్టార్ దర్శకులు
-
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
దేవర హిట్ తో సలార్ ని పక్కన పెట్టిన నీల్..
-
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
ప్రశాంత్ నీల్ తో చేతులు కలిపిన రామ్ చరణ్
-
ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్డేట్..
-
ఎన్టీఆర్ కోసం 'సప్త సాగరాలు దాటి'వచ్చేస్తోన్న హీరోయిన్! (ఫొటోలు)
-
ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం 'సాగరాలు' బ్యూటీ?
'దేవర' హిట్‌తో ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్గా కన్నడ బ్యూటీని పరిశీలిస్తున్నారని, స్టోరీ కూడా ఇదేనని తెగ మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టింది. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబరు నుంచి తారక్ సెట్స్‌లోకి వస్తాడని తెలుస్తోంది. ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్.. హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది రుక్మిణి. ప్రస్తుతానికి తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తారక్ సరసన అనేసరికి ఈమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!
‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్ మూవీ షూట్లో పాల్గొంటారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది. (చదవండి: శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు)అయితే అప్పుడు ఎన్టీఆర్ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఇదేనా?సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఫుల్ ఫోకస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్, సలార్ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. -
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన ‘దేవర'.!
-
పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్ వెల్లడించారు.తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.తండ్రి జయంతిని స్మరించుకుంటూ..ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. మీ 68వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/yIi5pgFMQI— Jr NTR (@tarak9999) September 2, 2024 ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024 -
మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్
‘‘మా అమ్మ (శాలినీ) స్వగ్రామం కుందాపురానికి నన్ను తీసుకొచ్చి ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకోవాలనేది ఆమె చిరకాల కల.. అది ఎట్టకేలకు నెరవేరింది’’ అన్నారు హీరో ఎన్టీఆర్. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని ఎన్టీఆర్ శ్రావణ శనివారం సందర్భంగా దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లి శాలినీ, భార్య లక్ష్మీ ప్రణతి, కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కనకదాసు దర్శించుకున్న కనక కిటికీ ద్వారా అందరూ నల్లనయ్య (శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని దర్శించారు.దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ‘‘ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో అమ్మ (శాలినీ) కల ఎట్టకేలకు నెరవేరింది. అమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆమె బర్త్‌డేకి రెండు రోజుల ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆమెకు నేనిచ్చిన అత్యుత్తమ బహుమతి.విజయ్ కిరగందూర్ సార్‌కి (హోంబలే ఫిలింస్ అధినేత) థ్యాంక్స్. నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే నా ప్రియ మిత్రుడు రిషబ్ శెట్టి కూడా నాతో వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్
జూ.ఎన్టీఆర్ మళ్లీ చాలారోజుల తర్వాత కుటుంబం గురించి పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలా భార్య గురించి కాకుండా తల్లి గురించి, ఆమెకు ఎప్పటినుంచో ఉన్న కోరిక గురించి చెప్పాడు. ఇదే పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కాంతార' హీరో రిషభ్ శెట్టి గురించి ప్రస్తావించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ తల్లి పేరు శాలిని. ఆమెది కర్ణాటకలోని కుందపుర అనే ఊరు. గతంలో పలు సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే కొడుకుని తన సొంతూరికి తీసుకెళ్లాలని ఎప్పటినుంచో ఈమె అనుకుంటోందట. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయటపెట్టాడు. ఇన్ స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి)'తన సొంతూరు కుందపురకి నన్ను తీసుకొచ్చి, ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం దర్శనం చేయించాలనేది మా అమ్మకు చిరకాల కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఆమె కల నిజమైంది. సెప్టెంబరు 2న అమ్మ పుట్టినరోజు. ఆమె కోరికని నిజం చేయడం ఆమెకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. దీన్ని సాధ్యమయ్యేలా చేసిన మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్‌కి థ్యాంక్యూ. అలానే రిషభ్ శెట్టికి స్పెషల్ థ్యాంక్స్. అతడి మాతో పాటు వచ్చి దీన్ని మరింత ప్రత్యేకం చేశాడు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ కూడా శ్రీ కృష్ణుడి మఠం దర్శనం చేసుకున్న 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టిది కూడా కుందపుర ఊరే. గతంలో ఇదే విషయాన్ని చెప్పాడు. అలానే తాను ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్ అని కూడా అన్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం 'దేవర' చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడు. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
#NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
అట్టహాసంగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అనుకున్నదే జరిగింది. మూడు రోజుల క్రితం రూమర్ ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడే అదే నిజమైంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ షురూ అయింది. ఈ వేడుకలో తారక్, ప్రశాంత్ నీల్ కుటుంబాలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు.(ఇదీ చదవండి: థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!)చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ 'దేవర'తో బిజీ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ 'సలార్' చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఫ్రీ అయిపోవడంతో మూవీ పట్టాలెక్కించారు. ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. 2026 జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.వీళ్ల చెప్పిన దాని బట్టి చూస్తే దాదాపు 16 నెలల సమయముంది. ఇదే టైంలో ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కూడా చేస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు తారక్ సినిమా మొదలైంది. కాబట్టి ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయడమంటే అదీ 2026లో అవుతుంది. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు) Massive Launch Ntr and Neel next project,#TheDragon #NTRNeel pic.twitter.com/kXApJ7GcJS— చందు (@NBK_9999) August 9, 2024This time, the earth will tremble under his reign! 🔥#NTRNeel will step onto the soil on January 9th, 2026 ❤️🔥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/sWDVCs60bO— NTR Arts (@NTRArtsOfficial) August 9, 2024 -
అజిత్, ప్రశాంత్ నీల్ సినిమాపై మేనేజర్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా ప్లాన్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. 'కె.జి.ఎఫ్' కథకు కనెక్ట్ అయ్యేలా మరో స్టోరీని ప్రశాంత్ రెడీ చేశాడాని, అందులో అజిత్ హీరోగా నటించనున్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి తాజాగా అజిత్ మేనేజర్ మాట్లాడుతూ.. అదంతా ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు.అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వాదనలను ఇలా ఖండించారు.. 'ఈ పుకార్లు ఆన్లైన్లో వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కలిశారనేది మాత్రం నిజమే.. కానీ, వారు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నారు. ఒకరినొకరు అత్యున్నత గౌరవం కలిగి ఉంటారు. అయితే, వారు కలిసినప్పుడు ఏ సినిమా గురించి చర్చించలేదు. ప్రశాంత్ డైరెక్షన్లో అజిత్ సినిమా వస్తే చూడటానికి నేనూ ఇష్టపడతాను. కానీ, భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు.' అని సురేష్ చంద్ర తెలిపారు.మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ విడాముయర్చి సినిమాలో నటించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయింది. దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో అజిత్ తర్వాతి సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. -
పెద్ద ప్లానే వేస్తున్న నీల్...
-
శౌర్యంగపర్వం ఎప్పుడు మొదలౌతుంది అంటే..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన కల్కి ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే రూ. 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన కల్కి లాంగ్ రన్లో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది. దీంతో ఆయన నుంచి రాబోయే సినిమాలకు మంచి మార్కెట్ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.గతేడాదిలో విడుదలైన సలార్ సినిమాకు సంబంధించి ఇప్పుడు సీక్వెల్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శౌర్యంగపర్వం’ రానుంది. దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సుమారు 20 శాతం షూటింగ్ పూర్తిచేశారని తెలుస్తోంది. ఆగష్టు 10 నుంచి సలార్ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభం కాట్లు సమాచరం. ఇదే సమయంలో డైరెక్టర్ మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'రాజాసాబ్'. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరడంతో ఇప్పుడు శౌర్యంగపర్వం వైపు ప్రభాస్ అడుగులు వేస్తున్నారట. ప్రశాంత్ నీల్ - జూ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాంటి క్లాష్ రాకుండా శౌర్యంగపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తానని మైత్రి మూవీస్ సంస్థకు ప్రశాంత్ మాట ఇచ్చారట. -
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
చలో మెక్సికో
మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సిక్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు పదిహేను దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ప్రభాస్ 'సలార్ 2' ఆగిపోయిందా? ఇంకెందుకులే అని పక్కనబెట్టేశారా? మీరు కూడా ఇలాంటి రూమర్స్ ఎక్కడో ఓ చోట వినే ఉంటారుగా. గత కొన్నిరోజుల నుంచి ఈ మూవీ గురించి ఏదో ఓ గాసిప్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఆగస్టు నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ మొదలు పెట్టబోతున్నాడు. రీసెంట్‌గానే తారక్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అదిగో అప్పటినుంచి 'సలార్' సీక్వెల్‌పై పుకార్లు షురూ అయ్యాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడి.. గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందనే టాక్ అయితే వచ్చింది గానీ వసూళ్లు మాత్రం రూ.700 కోట్లు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్‌తో ఇతడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుందనేసరికి 'సలార్'ని లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వచ్చాయి.ఈ క్రమంలోనే క్లారిటీ ఇచ్చిన 'సలార్' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. 'వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు' అనే క్యాప్షన్‌తో ప్రశాంత్ నీల్-ప్రభాస్ సెట్లో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అంటే 'సలార్ 2'పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం అన్నట్లు తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే తారక్‌తో మూవీ కంప్లీట్ చేసిన తర్వాతే ప్రశాంత్ నీల్ 'సలార్ 2' తీస్తాడేమో?(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)They can't stop laughing 😁#Prabhas #PrashanthNeel#Salaar pic.twitter.com/FW6RR2Y6Vx— Salaar (@SalaarTheSaga) May 26, 2024 -
ఎన్టీఆర్‌కు జోడీగా...
హీరో ఎన్టీఆర్, హీరోయిన్ రష్మికా మందన్నా జంటగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్, సలార్’ సినిమాలను తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తర్వాతి చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది.మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులోప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు రష్మికా మందన్నాను సంప్రదించారట దర్శకుడు ప్రశాంత్ అండ్ టీమ్. ఈ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. -
ఎన్టీఆర్‌తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య
రెండో రోజుల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఆల్రెడీ 'దేవర' నుంచి సాంగ్ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆగస్టు నుంచి షూటింగ్ అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకోవైపు 'వార్ 2' షూటింగ్‌తోనూ తారక్ బిజీ బిజీ. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒకామెతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)పైన ఎన్టీఆర్‌తో ఉన్న ఆమె పేరు లిఖితా రెడ్డి. 'కేజీఎఫ్'తో సెన్సేషన్ సృష్టించి, 'సలార్'తో కేక పుట్టించి.. ఇప్పుడు తారక్‌తో రచ్చ లేపేందుకు సిద్ధమయ్యాడు ప్రశాంత్. ఇతడి భార్యనే లిఖితా రెడ్డి. రీసెంట్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. అయితే ఈ ఏడాది మార్చిలో తారక్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. అప్పుడు తీసుకున్న పిక్ ఇది.ప్రశాంత్ నీల్ అంటే అందరికీ తెలుసు గానీ ఈయన భార్య లిఖితా ఎవరనేది తెలిసింది తక్కువ మందికే. తెలుగు మూలాలున్న అమ్మాయి కావడంతో ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగి ఉంటుంది. ఇక తన అభిమాన హీరో ఇంటికొచ్చేసరికి ఆనందం పట్టలేక ఇలా గట్టిగా పట్టుకుని ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కానుందని చెప్పారు. అలానే 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?) -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై ఆప్డేట్ ఇచ్చిన మేకర్స్
'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక వచ్చింది. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. నేడు (మే 20) ఆయన పుట్టినరోజు కానుకగా సినిమా అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 2024 ఆగష్టు నుంచి ప్రారంభం కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావొచ్చనే ఊహాగానాలూ ఇటీవల తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు ‘డ్రాగన్’ టైటిల్ హక్కులు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ దగ్గర ఉన్నాయని, దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ అడగడంతో తారక్‌పై ప్రేమతో ఈ టైటిల్‌ను కరణ్‌కు ఇచ్చేశారని బాలీవుడ్ సమాచారం. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ఎన్టీఆర్ డ్రాగన్?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావొచ్చనే ఊహాగానాలూ ఇటీవల తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి సరికొత్త వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. మరోవైపు ‘డ్రాగన్’ టైటిల్ హక్కులు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ దగ్గర ఉన్నాయని, దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ అడగడంతో ఈ టైటిల్‌ను కరణ్ ఇచ్చేశారని బాలీవుడ్ సమాచారం. మరి.. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సినిమాకు ఫైనల్‌గా ‘డ్రాగన్’ టైటిల్ ఖరారవుతుందా? వెయిట్ అండ్ సీ. -
Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్.. ట్రైలర్ అదిరింది!
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాటు కేజీయఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరో ఇండియన్ చిత్రం జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్లతోనే కట్ చేసిన ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. -
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్
-
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. కొద్దిరోజుల క్రితమే బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ క్రమంలో సినిమా చూస్తూ సలార్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని స్టార్ మా వారు అవకాశం కల్పించారు. తాజాగా విన్నర్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోన్ స్టార్ మా షేర్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్ చేసిన ‘సలార్’ రెండో భాగం ‘శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో కొద్దిరోజుల్లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏ విధంగా సలార్ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విజయవాడకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి సలార్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలను వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు.ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలని ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి పంపించాలని మేకర్స్ కోరారు. ఈ ఎస్సెమ్మెస్‌లను డిప్ ద్వారా ఎంపిక చేస్తామని ఆ సమయంలో ప్రకటించింది. వారు చెప్పినట్లుగానే సలార్ బైక్‌ను విజేత వరప్రసాద్‌కు అందచేశారు. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
క్రేజీ గాసిప్.. ప్రశాంత్ నీల్‌తో విజయ్ దేవరకొండ సినిమా?
లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ విజయ్ క్రేజీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు కానీ పాన్ ఇండియా రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు విజయ్‌తో సినిమా చేయడానికి కరణ్ జోహార్ మొదలు.. పాన్ ఇండియా దర్శకనిర్మాతలంతా రెడీగా ఉన్నారు.కానీ విజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆయన నటించిన సినిమాలన్నింటికి మంచి పేరు వస్తుంది కానీ బాక్సాపీస్ వద్ద బోల్తా పడుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్.. రెండు మంచి చిత్రాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పడు విజయ్ దృష్టి అంతా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పైనే ఉంది. ఈ చిత్రంలో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో. గౌతమ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. విజయ్‌ని కలిశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ కోసం ప్రశాంత్ ఓ కథ రెడీ చేశారట. ఇటీవల హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌కి కథ వినిపించాడట. మరి ఆ కథేంటి? వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో పట్టాలెక్కే చాన్స్ లేదు. ప్రశాంత్ ప్రస్తుతం సలార్ 2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాతే ప్రశాంత్ మరో ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. సలార్ 2లో విజయ్ దేవరకొండ?ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగపర్వం’ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాని కోసమే హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌ని కలిశాడట ప్రశాంత్. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఈ క్రేజీ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. -
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకోండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్ చేసింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఇదే నెలలో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్ ఇప్పుడు బుల్లితెరలో వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏ విధంగా సలార్ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుందట, ఆ బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలి. అదే సమయంలో ఎస్సెమ్మెస్ లైన్లు ప్రారంభమౌతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి పంపించాలి. ఈ ఎస్సెమ్మెస్‌లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి పంపించాల్సి ఉంటుంది. దీంతో సలార్‌లో ప్రభాస్ ఉపయోగించిన బైక్ మాడల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. Here's your exclusive opportunity to win the same iconic motorcycle ridden by Rebel Star #Prabhas in #SalaarCeaseFire. All you need to do is count the number of times the bike image/bug appears on the left of the screen during the movie from 5:30 PM to 8 PM. When the SMS lines… pic.twitter.com/WYMJ8FANqj — Hombale Films (@hombalefilms) April 18, 2024 -
వాళ్లకు డబ్బులు తిరిగిచ్చేసిన 'సలార్' నిర్మాత.. అదే కారణమా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్'.. బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ వరకు చాలామంది సందేహపడ్డారు. కానీ థియేటర్లలోక వచ్చిన తర్వాత వసూళ్ల మోత మోగించింది. అలాంటి ఈ సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాలొచ్చాయట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) 'కేజీఎఫ్' లాంట ఊరమాస్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడనేసరికి అందరూ అంచనాలు పెంచుకున్నారు. ఇందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. మంచి లాభాల్ని కూడా చూసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ 'సలార్' రైట్స్‌ని ఎక్కువ ధరకి కొనడం కొంపముంచిందట. పెట్టిన పెట్టుబడి తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో వసూలు కాలేదని, దీంతో 'సలార్' నిర్మాత విజయ్ కిరగందూర్.. సదరు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన మొత్తాన్ని తాజాగా తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగపర్వం' షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే 'సలార్' రెండో పార్ట్.. వచ్చే ఏడాది థియేటర్లలో రావడం గ్యారంటీ. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
సలార్ 'శౌర్యంగపర్వం' యాక్షన్‌తో స్టార్ట్
‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ షూటింగ్‌కు రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఏప్రిల్‌లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట ప్రశాంత్ నీల్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుందని సమాచారం. -
ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే
సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కలిశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన తారక్.. దేవర షూట్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారా అని అనుకున్నారు అందరూ.. కానీ ప్రశాంత్ నీల్ ఇంట్లో మార్చి 1న ఏదో శుభకార్యం ఉండగా తన సతీమణితో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు) ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటుగా వెళ్లారు. అదే కార్యక్రమానికి 'కాంతార' హీరో రిషబ్ శెట్టి కూడా తన సతీమణి ప్రగతితో రావడం జరిగింది. అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తారక్‌తో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 'కాంతారా', 'కేజీఎఫ్' సిరీస్‌లను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అలా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఫోటోపై అభిమానులు భారీగా లైకులతో క్లిక్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా నటించనున్నారా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. -
Jr NTR Photos: ప్రశాంత్ నీల్ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
ఫేవరెట్ డైరెక్టర్ ను రివీల్ చేసిన ప్రశాంత్ నీల్..!
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన సలార్.. కానీ అదే ట్విస్ట్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే తెలుగులో కూడా వచ్చి ఉంటే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ రాబోయే రోజుల్లో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందేమో వేచి చూడాల్సిందే. Jab bhi Deva bulayega, Hum aayenge! #SalaarHindi Now Streaming #Salaar #SalaarOnHotstar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art @anbariv @SalaarTheSaga pic.twitter.com/pZfK2LVagB — Disney+ Hotstar (@DisneyPlusHS) February 16, 2024 -
ఓటీటీలో సలార్.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ రేంజ్లో!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం టాప్ టెన్ మూవీస్‌లో ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది. అయితే గ్లోబల్ వైడ్‌గా ఉన్న అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 5 నుంచి సలార్ ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటి నుంచి సలార్ పాన్ ఇండాయా కాదు.. గ్లోబల్ సినిమాగా మారిపోయింది. ఇప్పటికే గ్లోబల్‌గా దూసుకెళ్తోన్న సలార్ మరింత ట్రెండ్ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సలార్ హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. ఈ విషయంపై అప్డేట్ కూడా ఇవ్వలేదు. 90 రోజుల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉండడంతో హిందీ వర్షన్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. సలార్ హిందీ వర్షన్ మార్చిలో వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బాబీ సింహా కీలకపాత్రల్లో కనిపించారు. కాగా.. చిత్రానికి సీక్వెల్‌గా సలార్: పార్ట్-2 శౌర్యంగపర్వం ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Final voting begins. 🙌 Salaar is now available in English, Telugu, Tamil, Malayalam and Kannada on Netflix! #SalaarOnNetflix pic.twitter.com/8gQpRWNmum — Netflix India South (@Netflix_INSouth) February 5, 2024 -
ఓటీటీలో యానిమల్ దూకుడు.. మూడు రోజుల్లోనే సలార్ రికార్డ్ బ్రేక్!
గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం జనవరి 26న ఓటీటీకి వచ్చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు నుంచే సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన యానిమల్ వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. అంతకుముందే రిలీజైన ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్‌ను అధిగమించింది. కేవలం టాప్ ట్రెండింగ్ ఉన్న సినిమాలే కాదు.. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ మూవీస్ లిస్ట్‌లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఇండియాతో పాటు దాదాపు 16 దేశాల్లో నంబర్‌వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కమర్షియల్ యాక్షన్ మూవీ సలార్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత జనవరి 20న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సలార్ ఇండియా వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. సలార్‌ను దాటేసిన యానిమల్.. టాప్ ట్రెండింగ్ మూవీస్‌లోనే కాదు.. వ్యూస్ విషయంలోనూ సలార్‌కు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి మూడు రోజుల్లోనే 62 లక్షల వ్యూస్‌తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్షిప్ను నమోదు చేసింది. కాగా.. సలార్ మొదటి 10 రోజుల్లో 35 లక్షల వ్యూస్‌తో పాటు 10.3 మిలియన్ గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. దీంతో ఓటీటీలో సలార్‌కు రణ్‌బీర్ కపూర్ యానిమల్ గట్టి పోటీ ఇస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. -
#SalaarGoesGlobal: నెట్‌ఫ్లిక్స్ ఎఫెక్ట్.. హాలీవుడ్లో దుమ్మురేపుతున్న సలార్
ఖాన్సార్ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. శ్రుతిహాసన్ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉన్నా బాలీవుడ్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఆ మార్క్‌ను రీచ్ కాలేకపోయింది. అంతే కాకుండా డంకీ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ జరగడం. సలార్‌కు బాలీవుడ్లో పెద్దగా స్క్రీన్స్ ఇవ్వకపోవడం వంటివి జరగడంతో కలెక్షన్స్‌పై కొంత ప్రభావం పడింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సలార్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నార్త్‌లో టాప్-1లో దూసుకుపోతుంది. టాలీవుడ్ నుంచి మొదలైన ప్రభాస్ దండయాత్ర పాన్ ఇండియా దాటి హాలీవుడ్లో అడుగుపడింది. జనవరి 20 నుంచి ఓటీటీలో రన్ అవుతున్న సలార్ గ్లోబల్ ఆడియన్స్‌కు దగ్గరైంది. హాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం #SalaarGoesGlobal హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌లో కంటే ఫారిన్ దేశాల్లోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ దీంతో వారిలో సలార్‌ను చూసి బాగుందంటూ కామెంట్లు చేయడం విశేషం. ప్రస్తుతం తెలుగు,తమిళ్,కన్నడ,మళయాలం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్లో క్రేజ్ దక్కుతోంది. వారందరూ ఎక్స్ పేజీ ద్వారా సలార్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. దీంతో #SalaarGoesGlobal హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అక్కడి ప్రేక్షకులు సలార్ సూపర్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇండియన్ భాషల్లోనే వారు చూసి ఇలాంటి కామెంట్లు చేస్తే ఇక ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ నుంచి రాబోతున్న కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేస్తే ప్రభాస్ హాలీవుడ్‌కు కూడా దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. The most happiest person right now 🤩🤩🤩🤩❤❤🥰🔥🔥👌👌👌#SalaarGoesGlobal pic.twitter.com/2NrCjJcDX2 — prabhas raju (@prabhasraaaju) January 26, 2024 Normally I don’t watch Bollywood movies but Salaar was worth the hype for real Nice movie 🍿 🎥 from the india 🇮🇳 movie industry 🤝👏#SalaarGoesGlobal pic.twitter.com/Q6auTPPYzd — ✨𝕌ℂℍ𝕀ℍ𝔸Ⓜ️✨ (@Ero__Dy) January 26, 2024 With just the South Indian versions of #Salaar on Netflix, movie lovers worldwide have already started enjoying #Prabhas' #SalaarCeaseFire. Just imagine the reach it will gain after the release of English version🥵 English Version will be out 🔜 on Netflix!#SalaarGoesGlobal 🔥 pic.twitter.com/1JTQpM4SRb — Prabhas FC (@PrabhasRaju) January 26, 2024 Foreign Couple Reacting On Coal Mine Fight Scene 🔥🔥🔥🔥🔥🔥 Look At Her, How Interestingly She Is Waiting & Excited 🤩🤩🤩🤩 Their Reaction 👌👌👌👌 @hombalefilms Please Release English Version Soon 🤞#Prabhas || #Salaar#SalaarCeaseFire pic.twitter.com/F16wzuSEhc — Goutham (@goutham4098) January 26, 2024 #SalaarGoesGlobal pic.twitter.com/0QqNWJAmRQ — Venkat Sai kiran 🦜 (@prabhas_drln) January 26, 2024 #SalaarGoesGlobal pic.twitter.com/0QqNWJAmRQ — Venkat Sai kiran 🦜 (@prabhas_drln) January 26, 2024 -
ఇకపై సలార్ పాన్ ఇండియా కాదు.. అంతకు మించి!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలో టాప్-10లో నిలిచిన నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. త్వరలోనే ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పాన్ ఇండియా మూవీ సలార్.. ఇప్పుడు గ్లోబల్ మూవీగా మారిపోయిందంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thala for every reason 🫠🫠#SalaarTopsOnNetflix #SalaarCeaseFire is trending at top 7 on Netflix🎬 pic.twitter.com/iGyBG2qFfK — Jay (@slowandlow02) January 23, 2024 View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు.. ఎందుకంటే?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ వీడియో నెట్టింట వైరలవుతోంది. సలార్ మూవీ రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలు కాగా.. అందులో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ దాదాపుగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఉండవచ్చు. కానీ అవే డైలాగ్స్ కాస్తా స్పీడ్ వర్షన్లో చూస్తే కేవలం 2 నిమిషాల 33 సెకన్స్ మాత్రమే ఉన్నాయి. దాదాపు మూడు గంటల సినిమాలో కేవలం రెండున్నర నిమిషాలే హీరో డైలాగ్స్ ఉండడం ప్రశాంత్ నీల్ ఘనతే అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు కమర్షియల్ సినిమాలో ఇదొక అద్భుతమైన ప్రయోగమని నీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Prabhas has dialogues for 2 minutes and 33 seconds in the entire movie of #Salaar which has a runtime of 2 hours and 55 minutes. Can also be called as an experiment in commercial cinema! Neel. Take a bow! 👏 pic.twitter.com/EBH3Cq4F9e — idlebrain jeevi (@idlebrainjeevi) January 21, 2024 -
సలార్ కలెక్షన్స్.. మరో నంబర్‌కు రీచ్ అయిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. గతేడాది వచ్చిన సినిమాల్లో అత్యధికంగా వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన 18 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటినట్లు ప్రముఖ సంస్థ Sacnilk గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా భారత్‌లో రూ. 400 కోట్ల మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో డంకీ సినిమాతో పోటీగా బరిలోకి దిగింది. దీంతో అక్కడ కొంతమేరకు థియేటర్ల కొరత ఏర్పడింది. అంతేకాకుండా కార్పొరేట్ బుకింగ్స్ పేరుతో కొందరు సలార్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన సలార్ మూవీ.. ఇక ఇప్పుడు స్పెయిన్, జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. స్పానిష్ భాషలో లాటిన్ అమెరికాలో మార్చి 7న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సినిమా విడుదలయ్యి మూడు వారాలు అయినా సక్సెస్‌ఫుల్‌గా చాలా థియేటర్లలో సలార్ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సలార్ సక్సెస్‌ను తాజాగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ సందడి చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Salaar WW Box Office #Prabhas ' Salaar is racing towards ₹7️⃣0️⃣0️⃣ cr club. Day 1 - ₹ 176.52 cr Day 2 - ₹ 101.39 cr Day 3 - ₹ 95.24 cr Day 4 - ₹ 76.91 cr Day 5 -… pic.twitter.com/2XPEPGQHWp — Manobala Vijayabalan (@ManobalaV) January 8, 2024 The blockbuster success calls for a BLOCKBUSTER CELEBRATION! 💥#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG #HombaleMusic @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/c3knzwB4vK — Prithviraj Sukumaran (@PrithviOfficial) January 8, 2024 -
సలార్ మేకర్స్ బిగ్ ప్లాన్.. అక్కడ కూడా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుండడంతో విదేశీ భాషల్లోనూ సలార్ రిలీజ్ చేయనునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని స్పానిష్ భాషలో రాస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో సలార్ సీజ్ఫైర్ పార్ట్-1 మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల కానుంది. విదేశాల్లోనూ తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ కావడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. #SalaarCeaseFire se estrenará en América Latina el 7 de marzo de 2024, en español, lanzado por @Cinepolis. ¡Prepárate para la acción épica! 💥#SalaarCeaseFire is releasing in Latin America on 7th March 2024, in 𝐒𝐩𝐚𝐧𝐢𝐬𝐡.@IndiaCinepolis#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/B5wV9BVmuM — Hombale Films (@hombalefilms) January 5, 2024 -
జైలర్, బాహుబలి రికార్డ్స్‌ను కొట్టేసిన సలార్ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా సలార్ అన్నీ థియేటర్లలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత కలెక్షన్స్ పరంగా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కాస్త పుంజుకుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'లియో' సినిమా మొత్తం కలెక్షన్లను సలార్ అధిగమించింది. ప్రభాస్ 'బాహుబలి: ది బిగినింగ్' రికార్డును బద్దలు కొట్టేందుకు కూడా సలార్ సిద్ధమైంది. అలాగే తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రికార్డు కూడా మరో రెండు రోజుల్లో బద్దలయ్యే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, సలార్ 11వ రోజు (సోమవారం) రూ.15.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టోటల్ కలెక్షన్ రూ.400 కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 650 కోట్ల రూపాయలను రాబట్టింది. బాహుబలి పార్ట్ వన్ సినిమా టోటల్ కలెక్షన్ 650 కోట్లు. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ 'లియో' చిత్రాన్ని 'సాలార్' అధిగమించింది. లియో ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయలు సంపాదించింది. అలాగే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’ మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 655 కోట్ల రూపాయలు. మరో రెండు రోజుల్లో జైలర్, బాహుబలి రికార్డ్స్‌ను సలార్ బీట్ చేయడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో జరిగే స్నేహితుల కథ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రానికి డంకీ పోటీ లేకపోతే బాలీవుడ్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు. అంతేకాకుండా కార్పోరేట్ బుకింగ్స్ పేరుతో కూడా సలార్ కలెక్షన్స్ కొంతమేరకు దెబ్బతిన్నాయి. ఏదేమైనా సలార్ పార్ట్-2 మీద భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. -
సలార్ VS డంకీ.. మొదటిసారి రియాక్ట్ అయిన ప్రశాంత్ నీల్
'ఉగ్రం' సినిమాతో దర్శకుడిగా 2014లో కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘ఉగ్రం’ తర్వాత మూడు సినిమాలే చేశాడు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్ 1, 2 సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మార్కెట్లో ఫేమస్ డైరెక్టర్‌గా పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టేస్తున్నాడు. 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు నటించిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ విజయం పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్లో సలార్ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు రివ్యూలు కూడా నెగటివ్‌గానే చెప్పడం జరిగింది. సలార్ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని అలా చేసి ఉంటే మరింత వసూళ్లు వచ్చేవని కూడా వచ్చే ప్రశ్నలకు కూడా ఆయన ఇలా చెప్పారు. 'డంకీతో విడుదల కాకుండా మా సినిమా మాత్రమే విడుదలై ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కావు.' అని ప్రశాంత్ నీల్ అన్నారు. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్‌ను దాటింది. -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
రూ.500కోట్ల క్లబ్లో సలార్.. మరో వంద కోట్లు వస్తే
ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ డంకీ చిత్రాన్ని తట్టుకుని అక్కడ కూడా భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. సినిమా విడుదలయ్యి ఇప్పటికి మొదటి వారం పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్‌ను సలార్ అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే సలార్ రూ.1000 కోట్ల టార్గెట్‌ను కూడా రీచ్ అవుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వంద కోట్లు వస్తే సేఫ్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 400 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే సలార్ ఖాతాలో రూ. 500 కోట్లు వచ్చేశాయి. మరో రూ. 100 కోట్లు సలార్‌కు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్- ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సలార్.. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 22న మొదటి భాగం విడుదలైంది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు భారీ ఎలివేషన్స్ అభిమానులను మెప్పిస్తున్నాయి. దీని కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌తో థియేటర్లకు వెళ్తున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
Prabhas Salaar: బాక్సాఫీస్ వద్ద సలార్ జోరు.. ఐదో రోజు ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ నటించిన సలార్ ప్రభంజనం ఐదు రోజు కూడా కొనసాగింది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే.. నాలుగు, ఐదు రోజుల్లో కాస్తా తగ్గినట్లు కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. రూ.500 కోట్ల క్లబ్లో చేరితే.. బాహుబలి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తర్వాత ప్రభాస్ మూడో చిత్రంగా సలార్ నిలవనుంది. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్‌ను దాటేశాయి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు చేరుకున్న సలార్.. ఐదో రోజు అదే ఊపులో దూసుకెళ్లింది. సలార్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.రూ.490.23 కోట్లు కొల్లగొట్టిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ కలెక్షన్స్ పరంగా సలార్ భారీ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల మార్కుకు చేరువలో ఉంది. ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ ఐదు రోజుల్లో రూ.280.30 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించారు. #Salaar WW Box Office #Prabhas is racing towards his 3rd ₹500 cr club film after #Baahubali and #Baahubali2. Day 1 - ₹ 176.52 cr Day 2 - ₹ 101.39 cr Day 3 - ₹ 95.24 cr… pic.twitter.com/0maGBGaqY8 — Manobala Vijayabalan (@ManobalaV) December 27, 2023 -
వీకెండ్ దాటినా సలార్ అదే జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.402 కోట్లు రాబట్టిన ఈ చిత్రం నాలుగు రోజు కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే సోమవారంతో కలిపి రూ.450 కోట్ల వసూళ్లు దాటినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే జోరు కొనసాగితే ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే కేవలం ఇండియా వ్యాప్తంగా రూ.250 కోట్ల కలెక్షన్ల మార్కును దాటడం మరో విశేషం. ఈ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.255.40 కోట్లు కొల్లగొట్టింది. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.76.91 కోట్లు వసూళ్లు రాగా.. ఇండియాలోనే రూ.45.77 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదేవిధంగా కలెక్షన్స్ జోరు కొనసాగితే ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్‌ను దాటేశాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటించారు. -
ప్రశాంత్ నీల్‌తో బిగ్ ప్లాన్ వేస్తున్న మైత్రి మూవీ మేకర్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి విడాముయర్చి అన్న టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా అజిత్ తన తదుపరి చిత్రాలను వరుసగా కమిట్ అవుతున్నట్లు తాజా సమాచారం. విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత అజిత్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన 63వ చిత్రం అవుతుంది. కాగా అజిత్ తన 64వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తన 65వ చిత్రం కూడా దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నట్లు తాజా సమాచారం. ఆయన ఎవరో కాదు తాజా క్రేజీ దర్శకుల్లో ఒకరైన ప్రశాంత్ నీల్. కేజీఎఫ్‌తో తన సత్తాను చాటుకుని పాన్ ఇండియా దర్శకుడుగా మారి తాజాగా సలార్ చిత్రంతో మరోసారి సంచలన విజయాన్ని అందుకున్నారు. దీంతో ప్రశాంత్ నీల్‌కు అవకాశాలు వెంటాడుతున్నాయి అనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా మైత్రి మూవీ మేకర్స్ మంచి పేరు ఉంది. అజిత్ సినిమాతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పాగా వేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఈయన కేజీఎఫ్ 3, సలార్ 2 చిత్రాలను చేయాల్సి ఉంది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ఈ దర్శకుడిపై అజిత్ కన్నేసినట్లు సమాచారం. తనతో చిత్రం చేయమని ఈయనే స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కోరినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అజిత్ 65వ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందనే సమాచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది. -
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియో
-
ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
సినిమా తీసే ప్రతివోడు డైరెక్టర్ కాదు! ఎందుకంటే ప్రేక్షకుడి పల్స్ తెలియాలి. ఎక్కడ ఏ సీన్ పడితే టాప్ లేచిపోద్దో తెలిసుండాలి. అయితే ఈ విషయంలో చాలామంది డిగ్రీలు చేస్తే.. మనోడు మాత్రం ఏకంగా పీహెచ్డీ చేసి పడేశాడు. లేకపోతే ఏంటి.. ఊరమాస్ చిత్రాలు తీయడంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇతడు సినిమా అంటే.. ఆయా హీరోల ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే మనోడి రేంజ్ అలాంటిది మరి. మూవీలో హీరోయిన్ ఉన్నాలేకపోయినా సరే బొగ్గు మాత్రం గ్యారంటీగా ఉండాలి. అలా బొగ్గుతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన వ్యక్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతకీ మనోడు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇన్ని హిట్స్ ఎలా కొడుతున్నాడు? డబ్బుల కోసం సినిమాల్లోకి ఎవరైనా సరే పిచ్చితో సినిమాల్లోకి వస్తారు. ప్రశాంత్ నీల్ మాత్రం అనుకోకుండా, అది కూడా డబ్బులు సంపాదిద్దామని డైరెక్షన్ కోర్స్ చేశాడు. ఇందులో డెప్త్ అర్థమయ్యేసరికి.. కొడితే కుంభస్థలం కొట్టాలని ఫిక్సయ్యాడు. డైరెక్టర్ అయిపోయాడు. ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తోళ్లకు ఛాన్సులంటే చాలా కష్టం. దీంతో మాస్టర్ స్కెచ్ వేసి.. అప్పటికే కన్నడలో హీరోగా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న తన బావ శ్రీమురళికి ఓ కథ వినిపించాడు. అనుభవం లేకపోవడం, స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోయేసరికి.. శ్రీమురళి దీన్ని లైట్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: 2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!) దీంతో ప్రశాంత్ నీల్ మనసు మారింది. శ్రీమురళిని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తూ 'ఉగ్రం' అనే మాస్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇది శ్రీమురళికి నచ్చేయడంతో సినిమా మొదలైంది. కట్ చేస్తే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 2014లో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ అంటే ఎవరబ్బా? అని అందరూ మాట్లాడుకునేలా చేసింది. దీనిదెబ్బకు మనోడికి చాలా ఛాన్సులు వచ్చినా సరే యశ్ కోసం 'కేజీఎఫ్' స్క్రిప్ట్ రెడీ చేశాడు. కోలార్ గోల్డ్ గనుల గురించి అందరూ విన్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం దానిపై ఓ సినిమా తీయాలనుకున్నాడు. అలా 'కేజీఎఫ్'కి బీజం పడింది. ఫేట్ మార్చిన 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' మూవీలో మాస్ అనే పదానికి శాంపిల్ చూపించాడు. 'కేజీఎఫ్'లో ఊరమాస్ అంటే ఏంటో డెఫినిషన్ రాసిపడేశాడు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడేవరకు ఎలివేషన్స్ ఎలా ఇవ్వొచ్చో అనే విషయంలో చాలామంది దర్శకులకు మనోడు గురువు అయిపోయాడు. సాధారణంగా మాస్ సినిమాల్లో కథకి పెద్దగా స్పేస్ ఉండదు. ఒకవేళ స్టోరీ ఉంటే ఎలివేషన్స్‌కి ప్లేస్ ఉండదు. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ప్రశాంత్ నీల్ కింగ్ అయిపోయాడు. దీని తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి గానీ 'కేజీఎఫ్'ని, ప్రశాంత్ నీల్ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు. అలానే 'కేజీఎఫ్' దెబ్బకు ప్రశాంత్ నీల్ ఫేటే మారిపోయింది. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) మందు-బొగ్గు కంపల్సరీ ప్రశాంత్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తాడబ్బా అని చాలామందికి డౌట్. అయితే మందు తాగిన తర్వాతే ఈ స్టోరీలన్నీ రాస్తుంటానని గతంలో ఓసారి ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. స్టోరీ రాయడానికి మందు ఎలా ఇంపార్టెంటో.. కథ ఏదైనా సరే బొగ్గు కూడా అంతే ఇంపార్టెంట్. 'ఉగ్రం'లో జస్ట్ శాంపిల్‌గా ఉంటే.. 'కేజీఎఫ్', 'సలార్' మొత్తం బొగ్గే కనిపిస్తుంది. అయితే తనకున్న ఓసీడీ సమస్య వల్లే ఇలా అంతా బ్లాక్ ఉంటుందని చెప్పాడు. అయితే కలర్ఫుల్గా ఉంటేనే సినిమా చూస్తారు అనే దాన్ని కూడా ప్రశాంత్ నీల్.. బొగ్గుపై తనకున్న ఇష్టంతో బ్రేక్ చేసి పడేశాడు. అలానే హీరోని చూపించాల్సిన పనిలేకుండా హీరో పిడికిలి, నీడ లాంటి వాటితోనూ ఎలివేషన్స్ ఇవ్వొచ్చనే ఆలోచన ప్రశాంత్ నీల్‌కి సాధ్యమైందని చెప్పొచ్చు. తెలుగోడు కాబట్టే? ప్రస్తుతం నార్త్-సౌత్ సినిమాల్లో తెలుగోళ్ల హవా కనిపిస్తుంది. అలానే ప్రశాంత్ నీల్ మూలాలు కూడా తెలుగు నేలపైనే ఉన్నాయి. ఉమ్మడి అనంతపురంలో మడకశిర మండలంలోని నీలకంఠాపురం ఇతడి సొంతూరు. కానీ ప్రశాంత్ నీల్ పుట్టకముందే అతడి తల్లిదండ్రులు బెంగళూరులో సెటిలైపోయారు. అలా కన్నడ వ్యక్తి అయ్యాడు. కానీ దాదాపు 25 ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాడు. ఆ ప్రభావమో ఏమో గానీ మనోడి సినిమాల్లో మాస్, ఎలివేషన్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ 'సలార్' కూడా అలాంటి మూవీనే. ఇక ప్రశాంత్ నెక్స్ట్ మూడు సినిమాలు.. ఎన్టీఆర్, ప్రభాస్, యశ్‌తోనే. ఏదేమైనా సరే ఇలా ప్రశాంత్ నీల్ మరిన్ని మాస్ సినిమాలు తీస్తూ.. ఇండియాలో థియేటర్లన్నీ ఊగిపోయేలా చేయాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) -
రెండు సినిమాలు.. ప్రభాస్ రికార్డు!
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ మేకింగ్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్‌పై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా కాలం తర్వాత తమ హీరోని పూర్తి మాస్ లుక్‌లో చూశామంటూ మురిసిపోతున్నారు. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో ఓ భారీ బ్లాక్ బస్టర్ పడిదంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వెల్లడిస్తున్నారు. (చదవండి: ‘సలార్’ మూవీ రివ్యూ) ఇక సలార్ రికార్డుల వేట మొదలైంది. తొలి రోజే రూ.177 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే ఈ మూవీ ప్రభాస్ ఖాతాలో మరో రికార్డును కూడా చేర్చింది. ఒక్క ఏడాదిలో ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 100 కోట్లను దాటించిన ఏకైక హీరోగా హీరో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా ఈ ఏడాదిలోనే విడుదలై తొలిరోజు రూ. 140 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు సలార్ కూడా తొలి రోజు రూ.177 కోట్లను రాబట్టింది. ఇలా ఓకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదలై..తొలిరోజు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టడం ప్రభాస్‌కి మాత్రమే సాధ్యమైంది. ఓవరాల్‌గా తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రం మాత్రం ఆర్ఆర్ఆర్ . ఆ మూవీ తొలి రోజు రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సలార్ విషయానికొస్తే.. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రమిది. మళయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటించాడు. శృతిహాసన్ హీరోయిన్. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. -
'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
ప్రభాస్ 'సలార్' ప్రభంజనం మాములుగా లేదు. థియేటర్లలో దద్దరిల్లిపోతున్నాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ మూవీని చూసేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా 'సలార్' చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశారు. (ఇదీ చదవండి: సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రభాస్ బంపర్ రికార్డ్!) 'మై డియర్ దేవ రెబల్‌స్టార్ ప్రభాస్.. నీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. సలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రచ్చ సృష్టించింది. అసాధ్యమైనది సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి హ్యేట్సాఫ్. అలానే వరదరాజ్ మన్నార్‌గా చేసిన పృథ్వీరాజ్, ఆద్యగా చేసిన శృతిహాసన్, కర్తగా చేసిన జగపతిబాబుతో పాటు చిత్రబృందంలోని భువన్ గౌడ, రవిబస్రూర్, నిర్మాత విజయ్ కిరగందూర్.. అద్భుతమైన సక్సెస్ సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్' అని చిరు తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. చిరు ఆనందం చూస్తుంటే.. 'సలార్' మూవీని బాగా ఆస్వాదించినట్లు ఉన్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ దగ్గర నుంచి నటీనటులతో పాటు డైరెక్టర్, చిత్రబృందం మొత్తానికి పేరుపేరున శుభాకాంక్షలు చెబుతున్నారు. గతంలో ఓసారి ప్రశాంత్ నీల్.. చిరుని ఇంటికొచ్చి మరీ కలిశారు. అప్పట్లో కలిసి మూవీ చేస్తారనే టాక్ వినిపించింది. ఒకవేళ చిరుతో లేదంటే చరణ్‌తో ప్రశాంత్ నీల్ ఈ తరహా మాస్ మూవీ చేస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలైపోవడం గ్యారంటీ. (ఇదీ చదవండి: పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్) Heartiest Congratulations my dear ‘Deva’ #RebelStar #Prabhas 🤗#SalaarCeaseFire has put the Box Office on Fire 🔥🔥 Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building. My love to the Superb ‘Varadaraja Mannar’ @PrithviOfficial… — Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2023 -
షారుఖ్ ఖాన్ పై ప్రశాంత్ నిల్ కు ఎందుకింత పగ..?
-
'సలార్' బడ్జెట్ అన్ని కోట్లు.. ఇక రెమ్యునరేషన్స్ ఎవరెవరికి ఎంతంటే?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదలడం గ్యారంటీ! మాస్ మూవీ, అందున ప్రశాంత్ నీల్ తీయడం దీనికి చాలా ప్లస్ కాబోతున్నాయి. దీంతో తొలిరోజు వసూళ్లు దద్దరిల్లిపోవడం పక్కా. సరే సినిమా టాక్ ఏంటి అనేది పక్కనబెడితే 'సలార్' కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: 'సలార్' సీక్వెల్‌కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!) 'కేజీఎఫ్' లాంటి సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ఊరమాస్ సినిమా తీశాడు. అదే 'సలార్'. అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై హైప్ మాములుగా లేదు. మధ్యలో వాయిదాల వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు థియేటర్లలోకి మూవీ వచ్చేసిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ప్రభాస్-మాస్ సీన్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. 'సలార్' మూవీకి కూడా అలా రూ.100 కోట్ల వరకు పారితోషికం, అలానే లాభాల్లో 10 శాతం షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి దాదాపు రూ.50 కోట్లు, శృతి హాసన్‌కి రూ.8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్-జగపతిబాబు తలో రూ.4 కోట్ల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. మొత్తం మూవీ బడ్జెట్ రూ 400 కోట్ల వరకు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్ బడ్జెట్లో సగం రెమ్యునరేషన్స్‌కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది! (ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?) -
'డంకీ' అంటే అర్థం తెలుసు.. 'సలార్' అంటే?
ఈ ఏడాది సినీ అభిమానులకు అదిరిపోయే ఫేర్వెల్ దొరికింది. ఎందుకంటే రెండు రోజుల వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. అందులో ఒకటి బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ కాగా.. మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్. డంకీ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా.. సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. రెండు భారీ చిత్రాలు కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రాలపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. రెండు పేర్లు కాస్తా కొత్తగా అనిపించండంతో వీటికి అర్థాలు వెతికేస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) అయితే ఇప్పటికే డంకీ అనే పదానికి అర్థాన్ని ఇప్పటికే హీరో షారుక్ వివరించారు. విదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని డంకీ అని పిలుస్తారని అన్నారు. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో వలసదారులు చాలా మంది ఉన్నారట. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు గతంలో షారుక్ తెలిపారు. అక్రమంగా ప్రవేశించే మార్గాన్ని డంకీ రూట్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని వివరించారు. సలార్‌పై చర్చ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో ప్రస్తుతం సలార్ అనే పదంపై చర్చ మొదలైంది. అసలు ఈ పదానికి అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఈ టైటిల్ అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఊవ్విలూరుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం (ఇది చదవండి: ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?). అయితే సలార్ టైటిల్ అర్థాన్ని తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. సలార్ అనేది ఓ ఉర్దూ పదమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం సమర్థవంతుడైన నాయకుడని అన్నారు. ఒక రాజుకు కుడిభుజంగా ఉంటూ.. అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తి నే అలా పిలుస్తారంటూ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. -
'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?
బాక్సాఫీస్ దగ్గర సలారోడు విధ్వంసం సృష్టిస్తున్నాడు. మాస్ ఊచకోతతో థియేటర్లన్నీ రచ్చరచ్చగా మారిపోయాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే భూమ్మీద నిలబడట్లేదు. ఎందుకంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసరికి గోలగోల చేస్తున్నారు. 'సలార్' టాక్ ఏంటి? అందరికీ నచ్చిందా? నచ్చలేదా? అనే విషయాల్ని పక్కనబెడితే మాత్రం ఒక్క విషయం మాత్రం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి తగ్గ సినిమాలు పడి చాలా ఏళ్లయిపోయింది. 'బాహుబలి' తర్వాత 'సాహో' అనే మాస్ మూవీ వచ్చింది గానీ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయింది. ఇక 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో? దీంతో 'సలార్' కోసం డార్లింగ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇప్పుడు ఇది థియేటర్లలోకి రావడంతో పాత విషయాలన్నీ మర్చిపోయారు. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) అయితే ఓ ఐదు నెలల క్రితం 'సలార్' టీజర్ రిలీజ్ చేశారు. 'కేజీఎఫ్' తాతలా.. ఈ వీడియోలోనూ ఓ తాత, ప్రభాస్‌ని 'డైనోసర్'తో పోల్చడం.. మూవీ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. మొన్నీమధ్య ప్రమోషన్స్‌లోనూ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. డైనోసర్ ఎపిసోడ్ కోసం తాను చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. కానీ ఇప్పుడు జక్కన్న డిసప్పాయింట్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'సలార్ పార్ట్-1'లో ఈ డైనోసర్ ఎపిసోడ్ ఎక్కడా లేదు. బహుశా సీక్వెల్ లో ఉండొచ్చేమో అనిపిస్తుంది. కొంపదీసి దీన్ని ప్రమోషన్ కోసం ఏం షూట్ చేయలేదా కదా అని కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది ఎలివేషన్ సీన్, ప్రభాస్ లాంటి కటౌట్‌కి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. మరి సెకండ్ పార్ట్‌లో అయినా సరే ఉంటుందో లేదో చూడాలి? (ఇదీ చదవండి: 'సలార్' సీక్వెల్‌కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!) -
‘సలార్’ మూవీ రివ్యూ
టైటిల్: సలార్ పార్ట్ 1- సీజ్ఫైర్ నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీహాసన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు తదితరులు నిర్మాతలు: విజయ్ కె. దర్శకత్వం: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫీ: భువన గౌడ్ విడుదల తేది: డిసెంబర్ 22, 2023 ప్రభాస్ ఖాతాలో సూపర్ హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు (రాధేశ్యామ్, ఆదిపురుష్) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(డిసెంబర్ 22)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడులైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా..యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. సలార్ కథేంటంటే.. ఆద్య(శృతిహాసన్) విదేశం నుంచి కలకత్తా వస్తుంది. ఓబులమ్మ(ఝాన్సీ) మనుషుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్(మైమ్ గోపీ) ద్వారా అస్సాంలో ఉన్న దేవా(ప్రభాస్) దగ్గరకు పంపిస్తాడు. దేవా బొగ్గు గనుల్లో మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అతని తల్లి(ఈశ్వరీరావు)ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కొడుకు దేవా కాస్త లేట్‌గా ఇంటికి వచ్చినా..ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే.. ఆందోళన చెందుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పాతికేళ్ల క్రితం ఖాన్సార్‌లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవా, అతని తల్లి ఎందుకు బయటకు వచ్చారు? ఖాన్సార్ కర్త(జగపతి బాబు) రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్)ను చంపాలని కుట్ర చేసిందెవరు? ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరద రాజమన్నార్ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్లీ ఖన్సార్‌కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రాణ స్నేహితుడు వరద రాజమన్నార్ కోసం దేవా ఏం చేశాడు? ఆద్య ఎవరు? ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆద్యకు దేవా ఎందుకు రక్షణగా నిలబడ్డాడు. ఖన్సార్ ప్రాంతం నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సలార్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మేకింగ్ పరంగా ప్రశాంత్ నీల్‌కు ఓ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లో హీరోకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఉంటుంది. లెక్కలేనన్ని పాత్రలు వచ్చి వెళ్తుంటాయి. మదర్ సెంటిమెంట్ మస్ట్‌గా ఉంటుంది. సలార్‌లో కూడా ఈ హంగులన్నీ ఉన్నాయి. కేజీయఫ్‌లో మాదిరి ఇందులో కూడా ఖాన్సార్ అనే ఓ కల్పిత ప్రాంతాన్ని సృష్టించి, కథ మొత్తం దాని చుట్టే అల్లాడు. అయితే ఈ చిత్రంలో వచ్చే చాలా సన్నివేశాలు కేజీయఫ్ మూవీని గుర్తు చేస్తాయి. కథలోని పాత్రలు కూడా ఇంచుమించు అలానే అనిపిస్తాయి. కథనం కూడా అలానే సాగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేనీ సీన్లు చూపిస్తూ అందులో ఏదో విషయం దాగి ఉంది అనేలా కథను ముందుకు నడిపించాడు. కేజీయఫ్‌తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్ కాస్త తక్కువే అయినా.. అక్కడ ఉంది ప్రభాస్ కాబట్టి ఆ సీన్స్ అన్నీ థియేటర్లో ఈళలు వేయిస్తాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని ఫ్యాన్స్‌కి నచ్చేలా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు ప్రశాంత్ నీల్. ఈ విషయంలో ప్రశాంత్‌ని మెచ్చుకోవాల్సిందే. కథలో గందరగోళం.. కథనానికి నిలకడలేమి ఉన్నప్పటికీ.. సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా తీర్చి దిద్దాడు. అయితే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అసలు కథను దాచిపెడుతూ లైటర్ వేలో పార్ట్ 1ని కంప్లీట్ చేశాడు. దేవా, వరద రాజమన్నార్ల చిన్ననాటి స్నేహబంధాన్ని చూపిస్తూ చాలా సింపుల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత భారీ ఎలివేషన్‌తో హీరో పాత్రని ఎంట్రీ చేశాడు. అతన్ని ప్రతిసారి తల్లి నియంత్రించడంతో హీరోయిజం పండించలేకపోతాడు. అయితే ప్రేక్షకులకు మాత్రం అది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తల్లి మాటకోసమే హీరో ఆగుతున్నాడు...ఒక్కసారి ఆమె వదిలేస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సెండాఫ్లో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర హీరోని నియంత్రిస్తుంది. కానీ ఒక్కసారి హీరో చేతికి కత్తి అందిన తర్వాత వచ్చే సీన్స్ గూస్బంప్స్ని తెప్పిస్తాయి. ఇలా రెండు పాత్రలు హీరోని నియంత్రించడం వల్లే యాక్షన్ సన్నివేశాలను మరింత బాగా ఎలివేట్ అయ్యాయి. హీరో ఎలివేషన్స్.. యాక్షన్స్ సీన్స్‌తో ఫస్టాఫ్ అలరిస్తుంది. కానీ సినిమా మొత్తంలో ప్రభాస్ మాట్లాడేది చాలా తక్కువ సేపు. ఫస్టాఫ్‌లో అయితే రెండు, మూడు డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. మిగతాది అంతా ఎలివేషన్.. యాక్షనే. ఇక సెకండాఫ్‌లో కథంతా ఖన్సార్ ప్రాంతం చుట్టూ తిరిగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు గందరగోళానికి గురిచేస్తాయి. కుర్చి కోసం చేసే కుతంత్రలు కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే ఈ క్రమంలో వచ్చే ఒకటి రెండు యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో సంహరించే సన్నివేశం గూస్బంప్స్ తెప్పిస్తాయి. బాహుబలి తరహాలో ఇందులో కూడా తల నరికే సన్నివేశం ఉంటుంది. అది కూడా హైలెట్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే.. రాజమౌళి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని సరిగ్గా వాడుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ పాత్ర ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుందో అచ్చం అలానే దేవా పాత్రను తీర్చి దిద్దాడు. ఇక ఆ పాత్రలో ప్రభాస్ రెచ్చిపోయి నటించాడు. తల్లిమాట జవదాటని కొడుకుగా, స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రబాస్ చేత కత్తిపట్టి విలన్లను నరుకుతుంటే.. ఫ్యాన్స్ ఆనందంతో ఈళలు వేయడం పక్కా. ఇక వరద రాజమన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు బాగా నటించింది. ఓబులమ్మగా ఝాన్సీ కనిపించేది ఒకటిరెండు సన్నివేశాల్లోనే అయినా డిఫరెంట్ పాత్రలో కనిపించింది. మన్సార్ ప్రాంత కర్త(రాజు)గా జగపతి బాబు తెరపై కనిపించింది కాసేపే అయినా గుర్తిండిపోయే పాత్ర చేశాడు. శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఫస్టాఫ్‌లో ఆమే కీలకం. టినూ ఆనంద్, మైమ్ గోపీ, రామచంద్రరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. భువన గౌడ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి.. నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమా స్థాయిక తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ లుక్‌లో కనిపించడంతో సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సీనీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సలార్ కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు. ఎక్స్‌లో సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమార్‌ల యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ప్రశాంత్ టేకింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. #Salaar: ⭐️⭐️⭐️½ SPECTACULAR ||#SalaarReview||#Prabhas as Deva excels in this relentless rollercoaster of adrenaline-pumping action film. #PrashanthNeel transcends the boundaries of the typical action genre, delivering a blend of fights & elevations. After securing… pic.twitter.com/eL9WK7JnIR — Manobala Vijayabalan (@ManobalaV) December 21, 2023 Overall Movies Is Great, The Action Delivered By #Prabhas such a great also Climax & second half is Best the #SalaarCeaseFire is PROVE whole Story very well the One Word Reviews Is " BLCOKBUSTER OF THE YEARS " #Salaar #SalaarReview @baapofbollywdd Rating : ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/WB8pZg18iy — Baap Of Bollywood (@baapofbollywdd) December 21, 2023 SALAAR : ⭐️⭐️⭐️⭐️/5 Prashanth Neel gaves us FULL KGF VIBES 🔥🔥🔥 #Salaar #Prabhas pic.twitter.com/Wfh0ZNohXg — grain grain grup (@darde_discoo) December 21, 2023 Done with #Salaar .For sure it’s the best #Prabhas movie after #Baahubali2 . Action sequences are brutal🔥! Expected a better #BGM . #PrithvirajSukumaran is terrific. It feels surreal to watch #Prabhas in action! ⭐️⭐️⭐️.25/5#SalaarReview #SalaarCeaseFire #UK #Premiere #Telugu pic.twitter.com/UKU9KnXftd — FILMOVIEW (@FILMOVIEW_) December 21, 2023 #Prabhas screen presence is terrific and the elevations purely match his cut out....#PrithvirajSukumaran did a great performance as a friend.....also actor Shafi who played as brother role in Chatrapati also now played a key role in #Salaar — JustAMovieFan📽️🎞️🎟️ (@L_In_Theatre) December 21, 2023 One word about Salaar movie is Mass rampage 🔥🔥🔥🔥 Prabhas screen presence is super 👌 ,some action sequences are fantastic absolutely Neel mark screenplay not doubt 1000 cr+ film Now waiting for part 2 Shauryanga Parvam #Salaar #SalaarReview #BlockbusterSalaar — SAIKUMAR (@viratfansai) December 21, 2023 #PrashanthNeel #SalaarReview - MASS MASS MASS INTERVAL BLOCK - 🔥🔥🔥 WHAT HAVE YOU DONE #Prabhas - 💣💣💣#BlockbusterSalaar#Salaar #SalaarReleaseTrailer #SalaarCeaseFire #SalaarTrailer2 #SalaarTrailer #SalaarVsDunki #SalaarCeaseFireOnDec22 #Darling pic.twitter.com/oKtZ07IBSW — King Kohli World 👑 (@King_KohliWorld) December 21, 2023 Coal mine fight 🔥🔥🔥 I don't remember when was the last time anthala arichindi theater lo..Pure goosebumps stuff from the cutout #Salaar #Prabhas — R a J i V (@RajivAluri) December 21, 2023 #SalaarReview Salaar premiere review by some moive officials Who watched premier -1st half is good 👍 - Prabhas acting and his screen presence in action is next level 🔥 - BGM is Very Good -2nd half is packed with emotional Scenes Overall mass mania repeated by Prabhas🔥❤️ pic.twitter.com/EBh5xTSW5h — Surendra N.S..!Ammulu Chinni Bittu ❤️ (@chakail29453) December 21, 2023 No #Prabhas Anna fan will skip this without like and rt this 🤾🏻🔥❤️ hype check reh luchaaas 🔥❤️ it's #Salaar day 🔥🤾🏻pic.twitter.com/1MuqV3jld6 — Kapil~ (@iamkapil__) December 21, 2023 Actor sree vishnu enjoying In theater 🔥#Salaar pic.twitter.com/2mY0RnfGJn — Charan Varma ™ (@Varma_Tweetz) December 21, 2023 #Salaar is a MONSTER action drama which will satisfy the thirst of action movie lovers The presence of Rebelstar #Prabhas is riveting, eye catchy & goosebumps 🔥🔥🔥 after a long time his persona matched perfectly 👌👌👌✌️✌️✌️✌️ Spectacular Action episodes are purely… pic.twitter.com/D6wvD8gyb2 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 21, 2023 Watching at #NewYorkCity 45 minutes watched... still slow. Messy direction. Unorganized screenplay... First 45 minutes--- Torture 😠 😡 1/2 🌟 #SalaarTickets#SalaarReview#SalaarCeaseFire#Prabhas pic.twitter.com/3VTuHy1v7G — Dil Se SRKian 🤴 (@RnaMmn36452) December 21, 2023 -
అణచగనే పుడతాడు రాజే ఒకడు..
‘విజయ్.. యస్ టీచర్... నేను నేర్పించిన పాట గుర్తుంది కదా.. పాడు...’ అనే డైలాగ్స్‌తో మొదలై... ‘ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచగనే పుడతాడు రాజే ఒకడు.. శత్రువునే కడ తేర్చే పనిలో మన రాజు.. హింసలనే మరిగాడు.. మంచిని మరిచే...’ అంటూ సాగుతుంది ‘సలార్’ సినిమాలోని ‘ప్రతి గాథలో..’ పాట. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదల కానున్న ‘సలార్’ తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలోని పాట ఇది. శ్రుతీహాసన్ నాయికగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతిబాబు, టీనూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ప్రతి గాథలో..’ పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, బాల గాయనీ గాయకులు ఈ పాటను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్. -
మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు మరికొద్ది గంటల్లో రానుంది. యంగ్ రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్ ఈనెల 22న తెల్లవారుజామునే థియేటర్లలో సందడి చేయనుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. లక్షల్లో అమ్ముడయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రతి గాథలో' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. -
Salaar Movie Stills: ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్
-
Vijay Kiragandur: సలార్ అందరి అంచనాలు అందుకుంటుంది
‘‘ప్రభాస్ సూపర్ స్టార్. ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అని అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథ చెబుతున్నారు? ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారు? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి అంచనాలను ‘సలార్’ అందుకుంటుంది’’ అని నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్’ మూవీ తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ... ► ‘సలార్’ ని 2021లో ్ప్రారంభించాం. కోవిడ్ కారణంగా 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ్ప్రారంభించి, 2023 జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. ఐదు భాషల్లో(తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ) సినిమాను విడుదల చేయాలనుకోవడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పోస్ట్‌ప్రొడక్షన్‌కి కూడా సమయం పట్టింది. మా హోంబలే ఫిలింస్ తొలిసారి తెలుగులో హీరో ప్రభాస్‌గారితో పనిచేశాం. ప్రభాస్‌గారు చాలా మంచి వ్యక్తి. అందువల్లే ఈ ప్రయాణం మాకు మధురమైన అనుభూతినిచ్చింది. ► ‘సలార్: సీజ్ఫైర్’ 90 శాతం షూటింగ్‌ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిత్రీకరించాం. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడలేదు. ‘కేజీఎఫ్’తో కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్లోనూ మాకు మంచి గుర్తింపు దక్కింది. మా పై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి. అందువల్ల వాళ్లకి నచ్చేలా మంచి సినిమాలు చేయాలని ముందుకు వెళుతున్నాం. ► మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభి్ప్రాయం. అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించటం లేదు. నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రశాంత్ నీల్ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో కల్పించుకోడు. మా మధ్య మంచి అనుబంధం, అవగాహన ఉంది. ‘సలార్’ లో రెండు భాగాలుగా చేసేంత కథ ఉంది.. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం. ► నాకు కథ, డైరెక్టర్ ముఖ్యం. బడ్జెట్‌కి ఎక్కువ ్ప్రాధాన్యత ఇవ్వను. అవసరం మేరకు ఎంతైనా ఖర్చు పెడతాను. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ. ఓ వైపు ప్రభాస్‌గారు, మరోవైపు ప్రశాంత్ నీల్ గారు బిజీగా ఉండటంతో ‘సలార్’ మూవీ నుంచి గ్రాండ్ ఈవెంట్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తాం. -
అప్పుడు మాహిష్మతి ఇప్పుడు ఖాన్ సార్ సేమ్ స్టోరీ
-
‘సలార్’ టికెట్ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’కు టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సలార్’చిత్రం ప్రదర్శించే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ ధరపై రూ.65, మల్టిప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ టికెట్ ధర పెంపు ఈనెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు షో కు, ఆరోజు ఆరో షో వేసేందుకు అనుమతించారు. ఈనెల 22న తెల్లవారుజామున ఒంటిగంటకు ‘సలార్’చిత్రం బెనిఫిట్ షో వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ టికెట్స్ బుకింగ్ ఎప్పుడంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు. తాజాగా సలార్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి 8.24 నిమిషాలకు సలార్ నైజాం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుది. కాగా.. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Khansaar ee kaadhu, anni theatres housefulls tho erupekkala ❤️🔥❤️🔥#SalaarNizamBookings opens online today at 8.24 PM 🔥#Salaar Nizam Release by @MythriOfficial 💥#SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/FqUidhS126 — Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2023 -
ప్రభాస్ 'సలార్'.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
ప్రభాస్ నటించిన సలార్ ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సలార్ మూవీ టికెట్ల ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సలార్ చిత్రానికి రూ.65, రూ.100ల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. సాధారణ థియేటర్లలో, మల్టీఫ్లెక్సుల్లో మొదటి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 22 నుంచి 28వ తేది వరకు టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. అలాగే 22వ తేదీన అర్థరాత్రి 1 గంటకు బెన్ఫిట్ షోలకు అనుమతులిచ్చింది. రాష్ట్రంలోని పరిమిత థియేటర్లలో మాత్రమే సలార్ బెన్ఫిట్ షోకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షోకు అవకాశం కల్పించింది. అలాగే ఆరో ఆట ప్రదర్శనకు ప్రభుత్వం ఓకే చెప్పిన ప్రభుత్వం.. రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచే సలార్ షోలు వేసుకోవచ్చని తెలిపింది. కాగా.. టికెట్ ధరల పెంపు, బెన్ఫిట్ షో, అదనపు షోలకు అనుమతి కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఖాన్సార్ ఎరుపెక్కాల.!
‘‘చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని.. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు’’ అనే వాయిస్ ఓవర్‌తో ‘సలార్: సీజ్ఫైర్’ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతిబాబు, టీనూ ఆనంద్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్’ మూవీ మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సలార్: సీజ్ఫైర్’ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే.. ఈ చిత్రంలో మెకానిక్ పాత్రలో ప్రభాస్ నటించినట్లు తెలుస్తోంది. ‘ఖాన్సార్‌లో క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఏం లెక్కపెట్టలేం’, ‘అందుకే లెక్కపెట్టలేని ఓ పిచ్చోడిని తీసుకువచ్చాను’ (పృథ్వీరాజ్ సుకుమారన్ ), ‘ఖాన్సార్ ఎరుపెక్కాల..’, ‘మండే నిప్పుతోనైనా.. వీళ్ల రక్తంతోనైనా’ (ప్రభాస్), ‘ఖాన్సార్ వల్ల చాలా కథలు మారాయి.. కానీ, ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరుప్రాణస్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం’’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
'సలార్' నుంచి మరో ట్రైలర్.. ఈసారి యాక్షన్ మాత్రం వేరే లెవల్!
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' నుంచి మరో ట్రైలర్ వచ్చింది. డిసెంబరు 1న తొలి ట్రైలర్ రిలీజ్ చేయగా.. దీన్ని స్టోరీకి తగ్గట్లు కట్ చేశారు. కానీ ఇందులో ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉండటం, ఫైట్ సీన్స్-పంచ్ డైలాగ్స్ లాంటివి లేకపోవడంతో ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇదే విషయమై సోషల్ మీడియా అంతా గోలగోల చేశారు. ఇప్పుడు వీళ్లని సంతృప్తి పరిచేందుకు కొత్త ట్రైలర్‌ని ఇప్పుడు విడుదల చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి బొమ్మ చూపించిన బిగ్‌బాస్.. చివరకు అదొక్కటే మిగిలింది!) తొలి ట్రైలర్‌తో పోలిస్తే దీన్ని యాక్షన్‌తో నింపేశారు. దాదాపుగా అంతా ప్రభాసే కనిపించాడు. అలానే యాక్షన్ సీన్స్ దట్టించారు. ఇప్పుడు ఇది అభిమానుల్ని సంతృప్తి పరచడంతో పాటు సినిమాపై అంచనాలని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబరు 22న 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులు ఎలా అయ్యారనే స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే బయటపెట్టడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
బఘీరా మూవీ టీజర్
-
సలార్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.. టీజర్ రిలీజ్..!
కేజీయఫ్, కాంతార, సలార్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న మరో చిత్రం బఘీరా. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ బఘీరా టీజర్ చేసింది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్. గరుడ రాముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐜𝐢𝐞𝐭𝐲 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐚 𝐣𝐮𝐧𝐠𝐥𝐞... 𝐚𝐧𝐝 𝐨𝐧𝐥𝐲 𝐨𝐧𝐞 𝐩𝐫𝐞𝐝𝐚𝐭𝐨𝐫 𝐫𝐨𝐚𝐫𝐬 𝐟𝐨𝐫 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞...💥 Presenting #BagheeraTeaser to you all ▶️ https://t.co/VRviuMij3o Wishing our 'Roaring Star' @SRIMURALIII a very Happy Birthday.#Bagheera… pic.twitter.com/UxMAaJp1Qr — Hombale Films (@hombalefilms) December 17, 2023 -
ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా 'సలార్' తెరకెక్కింది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, సలార్ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. 'వరదరాజ మన్నార్ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. అది ఫలించిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇన్పుట్ చాలా బలంగా ఉంది. అతను మొత్తం షాట్‌ను ఒక్క క్షణంలో మార్చగల దర్శకుడు. నా కెరీర్లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్ చూడలేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. సలార్‌తో నా కల నెరవేరింది.' అని ఆయన అన్నాడు. ప్రభాస్‌ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది! సలార్‌లో ప్రభాస్‌తో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. 'ప్రభాస్‌ని ఇన్‌స్టంట్‌గా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రభాస్‌తో ఒక్కసారి మాట్లాడితే చాలు ఎవరైనా ఇష్టపడుతారు. నా వ్యక్తిగత జీవితంలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. కానీ నేను ప్రతిరోజూ మాట్లేడే వారిలో ప్రభాస్ ఉన్నారు.. నేను ఎల్లప్పుడూ మెసేజ్ చేసే స్నేహితుల్లో అతను ఒకరు. ఇతరుల సంతోషంలో కనిపించే ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి ప్రభాస్. సెట్లో ప్రతి ఒక్కరి మంచి కోసం మాత్రమే ప్రభాస్ చూస్తారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చూస్తారు. సెట్స్‌లో అందరి కోసం మంచి భోజనం తెప్పిస్తారు. ఇలా ఎప్పుడూ ఇతరుల గురించే ప్రభాస్ ఆలోచిస్తారు. అందుకే ఆయన అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్ అని పిలుస్తారని ఈ షూటింగ్ సమయంలో నాకు అర్థమైంది' అని చెప్పారు. ఆపై సలార్ సినిమా గురించి పృథ్వీరాజ్ చెబుతూ... 'సలార్ సినిమా కథను నేను ఎప్పుడూ వినలేదు.. కనీసం స్క్రిప్ట్ కూడా చదవలేదు. ఈ ప్రాజెక్ట్‌లోకి నాకు అవకాశం దక్కడం చాలా సంతోషం. ఇందులో నా పాత్ర సెకండరీ కావచ్చు అయినా కథలో నా ప్రత్యేకత ఏంటి అనేది చూస్తారు. యావరేజ్ సినిమాలో గొప్ప పాత్ర చేయడం కంటే మంచి సినిమాలో ఇలాంటి పాత్రను పోషించడం చాలా గొప్ప. టీజర్, ట్రైలర్లో మీరు చూసింది చాలా తక్కువ. ఇందులో యాక్షన్ సీన్స్‌తో పాటు ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న స్టోరీ ఇది.' అని పృథ్వీరాజ్ తెలిపారు. -
సలార్ మొదటి టికెట్ కొన్న స్టార్ డైరెక్టర్.. ధర ఎంతో తెలుసా..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటకే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్ కోరిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సింగిల్ థియేటర్ నుంచి మల్టీఫ్లెక్స్ వరకు టికెట్ ధరపై రూ. 100 పెంచాలని ప్రభుత్వాన్ని వారు కోరినట్లు సమాచారం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఆన్‌లైన్‌లోకి టికెట్లు అందుబాటులోకి వస్తాయిని తెలుస్తోంది. సలార్ టికెట్ కోసం రూ.10 వేలు సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్లలో సలార్ టీమ్ కొంచెం నెమ్మదిగానే ఉంది. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని తెరపైకి తెచ్చింది మూవీ టీమ్.. ఇందులో భాగంగా సలార్ మొదటి టికెట్‌ను రాజమౌళి కొన్నారు. డార్లింగ్ సినిమా టికెట్ కోసం రూ. 10 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు సంబంధించి ఉదయం 7గంటల ఆటకు టికెట్‌ను ఆయన కొన్నారని మైత్రి మేకర్స్ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా మొదటి టికెట్‌ను రాజమౌళి కొన్నారని క్యాప్షన్ ఇచ్చింది. త్వరలో జక్కన్నతో ప్రభాస్,ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రభాస్ ఫ్యాన్స్ ఆరు హెలికాప్టర్లతో సెల్యూట్.. వీడియో అదుర్స్
ప్రపంచవ్యాప్తంగా సలార్ జోరు ఒక్కసారిగా పెరిగింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు సలార్ రానుంది. దీంతో ఒక్కసారిగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు పెరిగాయి. నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా ప్రచారం జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో సలార్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేస్తున్న సమయంలో.. డైనోసార్ ప్రభాస్ కూడా ఎంట్రీ ఇచ్చి సినిమాపై పలు ఆసక్తకరమైన విషయాలను పంచుకున్నాడు. ఇదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డార్లింగ్‌పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. తాజాగా కెనడాలోని ప్రభాస్ అభిమానులు వినూత్నంగా భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్ సెల్యూట్ చేశారు. కెనడాలోని టొరొంటోలో పచ్చన మైదానంలో ప్రభాస్ భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసుకుని... ఆ సమయంలో ఒక్కసారిగా ఆరు హెలికాప్టర్లు గాల్లోకి ఎగురుతాయి.. అవన్నీ సెల్యూట్ చేస్తున్నట్లుగా వారు వీడియోను క్రియేట్ చేశారు. ఏంతో కష్టపడి ప్రభాస్‌పై అభిమానంతో వారు ఆ వీడియోను అద్భుతంగా రూపొందించారు. హొంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. A cinematic air salute to #Prabhas by Canada Rebel Star Fans 🚁#SalaarCeaseFire in cinemas worldwide from December 22nd! 💥#PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/3C0AmwpN1Q — Hombale Films (@hombalefilms) December 15, 2023 -
'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..
'సలార్' రిలీజ్‌కి అంతా సిద్ధమైపోయింది. తిప్పితిప్పి కొడితే వారం రోజులు కూడా లేదు. ట్రైలర్, ఓ పాట తప్ప ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏం లేదు. ఇలాంటి టైంలో ప్రభాస్.. సినిమా గురించి మాట్లాడాడు. కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. మూవీ గురించి, దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పుకొచ్చాడు. 'సలార్ మూవీలో చాలా డెప్త్ ఉన్న ఎమోషన్స్ ఉంటాయి. ఆడియెన్స్.. నన్ను ఇలాంటి పాత్రలో తొలిసారి చూడబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ నటించాను. సినిమా చేస్తున్నప్పుడే నా ఆలోచనలు కొన్నింటిని షేర్ చేసుకున్నాను. వాటిని ఎలా చూపించాలో ఆయనకు చెప్పాను. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. అలానే నా 21 ఏళ్ల కెరీర్లో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్' (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) 'ఇకపోతే సలార్ షూట్ కోసం ఎప్పుడు పిలుస్తారా అని తెగ ఎదురుచూశాను. సెట్‌కి వెళ్లి యాక్ట్ చేయడం కంటే ప్రశాంత్ నీల్ టైమ్ స్పెండ్ చేయాలని తెగ ఆత్రుతగా ఎదురుచూశాను. నా కెరీర్లో ఎప్పుడు ఇలా అనుకోలేదు. అలానే షూటింగ్ మొదలైన నెలలోనే ప్రశాంత్ నీల్-నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. శత్రువులుగా మారితే ఏమైంది? అనే స్టోరీతో 'సలార్' మూవీ తీశారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. డిసెంబరు 22న అంటే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దగా ప్రమోషన్స్ లాంటి హడావుడి ఏం లేకుండా 'సలార్'.. థియేటర్లలోకి వస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) -
కేజీఎఫ్ చిత్రానికి మించి ఐదు రెట్లు 'సలార్' ఉంటుంది: భువన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తోన్న చిత్రాల్లో 'సలార్' మొదటి వరసలో ఉంటుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ స్నేహితులుగా ఇందులో కనిపించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కోట్లాది రూపాయలతో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. 'కేజీఎఫ్' తరహాలో ఈ చిత్రానికి గ్రాండ్ సెట్స్ వేశారు. ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ సినిమాకు కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. 'కేజీఎఫ్' సెట్స్‌నే సలార్ కోసం వాడుతున్నారనే పుకార్లను కెమెరామెన్ భువన్ గౌడ తోసిపుచ్చారు. సలార్ సెట్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ కీలకంగా పనిచేశారని ఆయన చెప్పారు. సలార్, కేజీఎఫ్ సెట్స్ పూర్తిగా వేరువేరు అని ఆయన తెలిపారు. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని తెరకెక్కించిన కెమెరామెన్ భువన్ గౌడ ‘సలార్’ కోసం తన కెమెరా కన్నుతో టాలెంట్ చూపించాడని తెలుస్తోంది. 'సలార్' సినిమా కోసం పనిచేసిన తన అనుభవాన్ని భువన్ గౌడ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించాం. అలెక్సా 39 అనే అత్యాధునిక కెమెరాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ కెమెరాలోని సీన్స్ ఐమాక్స్ క్వాలిటీతో ఉన్నాయి. కేజీఎఫ్‌తో పోలిస్తే ఈ సినిమా ఐదు రెట్లు మెరుగ్గా ఉంటుందని భువన్ గౌడ తెలిపారు. సినిమా చాలా రియలిస్టిక్‌గా వచ్చిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే తాము మరో రామోజీ ఫిల్మ్ సిటీని సృష్టించామని భువన్ గౌడ పేర్కొన్నారు. కేజీఎఫ్ చిత్రంతో పాటు ఉగ్రం మూవీ కోసం కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మరోవైపు ఈ సినిమాలో యశ్ నటిస్తున్నారంటూ మళ్లీ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే, 'కేజీయఫ్'కు 'సలార్'కు లింక్ ఉందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆయా కథనాలపై 'సలార్' సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా స్పందించి సలార్‌లో ఎటువంటి ప్రత్యేక పాత్ర లేదని ఆయన తెలిపారు. -
'సలార్' ప్రమోషన్స్ కోసం భారీ స్కెచ్.. త్వరలో అసలు గేమ్ స్టార్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాపై ప్రమోషన్స్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేసిన చిత్ర యూనిట్ తాజాగా దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే మొదటి సాంగ్ విడుదలైంది. స్నేహం గురించి తెలుపుతూ విడుదలైన ఆ పాటపై మంచి రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రం టికెట్స్ బుకింగ్స్ కూడా రేపటి (డిసెంబర్ 15) నుంచి ప్రారంభం అవుతాయని సలార్ మేకర్స్ ప్రకటించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరికెక్కిన సలార్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'సలార్' చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ కోట్లాది రూపాయలతో నిర్మించింది. దేవ- వరదరాజ్ మన్నార్ స్నేహానికి సంబంధించిన కథను ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో వివరించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. కానీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో మేకర్స్ నిర్లక్ష్యం కనిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. సాధారణంగా హోంబలే సంస్థ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంది. ఆ సంస్థ ప్రచార వ్యూహాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసేందుకు డైరెక్టర్ రాజమౌళిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళితో హోంబలే సంస్థకు మంచి అనుబంధం ఉంది. గతంలో 'కేజీఎఫ్' చాప్టర్-1 తెలుగు ఈవెంట్‌కు జక్కన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు 'సాలార్' టీమ్‌ని ఇంటర్వ్యూ చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు. ప్రభాస్‌తో పాటు ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లను ఆయన త్వరలో ఇంటర్వ్యూ చేయనున్నారు. రాజమౌళి, ప్రభాస్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.. గతంలో ‘రాధేశ్యాం’ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రభాస్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. అక్కడి నుంచి ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. ఇప్పుడు 'సలార్' ప్రమోషన్ విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్. రాజమౌళి ఇంటర్వ్యూని న్యూస్ ఛానల్స్‌కి విడిగా ఇవ్వకుండా అన్ని తెలుగు ఛానల్స్‌లో ప్రసారం చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నప్పటికీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పాలి. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్‌కు సలార్‌తో సూపర్ హిట్ కొట్టాలని ఉన్నాడు. -
రిలీజైన 'సలార్' సాంగ్.. ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు!
ప్రభాస్ 'సలార్' మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే మూవీ టీమ్.. కనీసం ప్రచారం లాంటి వాటి జోలికి వెళ్లకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా పక్కనబెడితే తాజాగా సినిమాలోని ఓ పాట రిలీజ్ చేశారు. అదయితే ఫ్యాన్స్‌కి మాములు షాక్ ఇవ్వలేదు. ఇంతకీ ఈ పాట ఎలా ఉంది? సాంగ్‌తో స్టోరీ హింట్ ఇచ్చారా? (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) 'కేజీఎఫ్' తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో మాస్ సినిమా తీస్తున్నాడనేసరికి ఫ్యాన్స్ చొక్కాలు చింపేసుకున్నారు. మాస్ బొమ్మ గ్యారంటీ అని ఊగిపోయారు. కానీ వాయిదాల వాయిదాల పడటంతో సినిమాపై స్వయంగా అభిమానులకే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన పాట అయితే ఎలివేషన్స్ ఉన్న హీరోయిక్ సాంగ్ కాకుండా ఎమోషనల్‌గా ఉంది. ఈ పాటలో సాహిత్యం బాగుంది, 'సలార్' మూవీ ఎలా ఉండబోతుందనే హింట్ కూడా ఇచ్చారు. మూవీ రిలీజ్ పెట్టుకున్న ఈ టైంలో.. మంచి హై ఇచ్చే సాంగ్ రిలీజ్ చేయాలి గానీ ఇలాంటి ఎమోషనల్ పాట విడుదల చేసేరేంటి? అని డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఏదేమైనా సరే సినిమా బాగుంటే.. ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో? డిసెంబరు 22 వరకు వెయిట్ చేస్తే 'సలార్' రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది! (ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్) -
ప్రమోషన్స్ ని లెక్క చేయని సలార్
-
రెండు సినిమాలు బరిలో ఉన్నా సలార్ రిలీజ్.. ఎందుకంటే?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్(పార్ట్ -1). ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ తేదీ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరికి ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో పది రోజుల్లోనే సినిమా రిలీజ్ కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ సలార్ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలీజ్ తేది విషయంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తతో షాకయ్యా!) సలార్ చిత్రం 2014లో వచ్చిన ఉగ్రమ్ చిత్రానికి రీమేక్ కాదని విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. ఉగ్రమ్ మాదిరిగానే ఈ చిత్రం రీమేక్ అని చాలామంది భావించారని.. అలాంటిదేం కాదని కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్.. ఉగ్రమ్‌తో పాటు కేజీఎఫ్ తెరకెక్కించాడని.. ప్రతిసారి భిన్నంగా ఏం చేయాలో అతనికి తెలుసని అన్నారు. సలార్ రీమేక్ అనే వార్తలు కేవలం రూమర్స్ అని అన్నారు. అంతే కాకుండా సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 నిర్ణయించడంపై విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందని అన్నారు. మాకు జాతకాలపై ఉన్న నమ్మకం ప్రకారమే ఆ తేదీని ఎంపిక చేశామని తెలిపారు. డంకీ, అక్వామన్ పోటీలో ఉన్నప్పటికీ.. దశాబ్దం కాలంగా తాము అనుసరిస్తున్న పద్ధతినే సలార్ విషయంలోనూ కొనసాగిస్తున్నట్లు విజయ్ కిరంగదూర్ వివరించారు. (ఇది చదవండి: పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!) సెన్సార్ పూర్తి కాగా.. ఇటీవలే సలార్ పూర్తి కాగా.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదని సెన్సార్ బోర్ట్ చెబుతోంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఎక్కడా కనిపించని 'సలార్' బజ్.. మరి సినిమా పరిస్థితి ఏంటి..?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదలకు రెడీగా ఉంది.. కేజీఎఫ్ హిట్‌తో పాన్ ఇండియా సెన్సేషన్‌గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మాత్రం ఏమీ జరగడం లేదు. ఎప్పుడో సంక్రాంతికి వచ్చే సినిమాలు గుంటూరుకారం,సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆ చిత్రాల నుంచి పోస్టర్స్, టీజర్స్,పాటలు ఇలా అప్పడప్పుడు ఎదో ఒకటి వదులుతూ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. కానీ మరో 10 రోజుల్లోపు వచ్చే సలార్ మేకర్స్ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఉన్నారు. వీటంన్నిటికి తోడు తాజాగా సలార్‌పై మరో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండదనే టాక్ వినిపిస్తోంది. మరోక ట్రైలర్ విడుదల చేసి చేతులు దులుపుకోవాలని సలార్ యూనిట్ చూస్తున్నట్లు సమాచారం. ప్రీ-రిలీజ్ లేకుండా నేరుగా సినిమా విడుదలకు వెళ్తే ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడవచ్చు. ఇలా సలార్ చుట్టూ ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా ఆ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ చిత్రం డంకీ కూడా సలార్‌కు పోటీగా ఉన్న విషయం తెలిసిందే. డంకీ కోసం చాలా రోజుల నుంచి షారుక్ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కానీ బాలీవుడ్లో సలార్ టీమ్ ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కార్యక్రమం కూడా చేయలేదు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదల అవుతుంది అంటే.. ఢిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల్లో ఆ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి.. కానీ సలార్ విషయంలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. సలార్ విషయంలో హోంబలే ఫిల్మ్ మేకర్స్ వ్యూహం ఎలా ఉందో తెలియాల్సి ఉంది. సలార్ మేకర్స్ నిర్లక్ష్యం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. -
సాలార్ ట్రైలర్ పై మిక్స్ రియాక్షన్ కి కారణం ఇదే..
-
ఇద్దరు మిత్రులు శత్రువులు అయితే అనేదే 'సలార్'
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కెరీర్‌కు చాలా ముఖ్యమైన చిత్రం సలార్. ఎందుకంటే బాహుబలి రెండు చిత్రాల తరువాత డార్లింగ్ నటించిన రాధేశ్యామ్, ఆదిపుష్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కినప్పటికీ పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో తాజా చిత్రం సలార్‌తో కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభాస్‌పై పడింది. ఇక ఈ చిత్రం హీరోయిన్ శృతిహాసన్ సలార్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరో ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ నటించడం విశేషం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఇందులో తమిళ నటుడు పశుపతి కూడా కీలక పాత్రను పోషించారు. కెజీఎఫ్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోమ్ బలే సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల నడుమ తెరపైకి రానున్న సలార్ చిత్రం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇది ఇద్దరు మిత్రుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. అయితే ఆ ఇద్దరు శత్రువులుగా మారితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం ఇదని చెప్పారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. గత చిత్రం కేజీఎఫ్ ఛాయలు సలార్‌లో కనిపిస్తున్నాయనే వాదన కరెక్ట్ కాదన్నారు. ఆ చిత్రంకు సలార్ అస్సలు పోలిక ఉండదన్నారు. ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్ చిత్రాన్ని రూపొందించడానికి ముందే సలార్ చిత్ర కథను రాసుకున్నానని చెప్పారు. అదే విధంగా సలార్ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, త్వరలోనే సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రశాంత్ నీల్ చెప్పారు. -
తారక్, యష్ చిత్రాలపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఫ్రాంచైజీతో వచ్చిన రెండు సినిమాలు చరిత్రను సృష్టించాయి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ హీరోలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన చేతిలో పాన్ ఇండియా హీరో జూ ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కథపై ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రశాంత్. తాజాగా ఓ ఇంటరర్వ్యూలో తారక్ సినిమా గురించి మాట్లాడి అంచనాలను పెంచేశాడు. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు విభిన్నంగా తారక్ మూవీ ఉంటుందని ఆయన తెలిపాడు. కానీ.. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఏ నేపథ్యంలో సాగుతుందో అనేది ఆయన రివీల్ చేయలేదు. అభిమానులు మాత్రం భారీ యాక్షన్ చిత్రమని భావిస్తున్నారని ఆయన చెప్పాడు. తారక్‌తో తీస్తున్న జానర్ ఏదైనా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 2024 ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. మరోవైపు యష్ జోడి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్-3 ఉంటుందని ఆయన తెలిపాడు. KGF విడుదలైన 3 సంవత్సరాల తర్వాత, KGF 2 విడుదలైంది. దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనాతో షాక్‌కు గురైన సినిమాలకు ఇది కొత్త ఆశను తెచ్చిపెట్టింది. త్వరలో కేజీఎఫ్- 3 రాబోతుంది. యష్ లేని కేజీఎఫ్ లేదు. త్వరలో ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలుపుతారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయింది. సీక్వెల్ చేయాలనే ఆలోచనతోనే 'కేజీయఫ్ 2' ఎండింగ్లో హింట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్'. ఇందులో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్ భారీగా రికార్డ్లను క్రియేట్ చేసింది. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 15 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
యూట్యూబ్‌ను షేక్ చేసిన 'సలార్' ట్రైలర్.. రికార్డ్స్ అన్నీ బద్దలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్: సీజ్ఫైర్'. ఈ సినిమా ప్రకటన వచ్చిన రోజు నుంచి అన్నీ సంచలనాలే అని చెప్పవచ్చు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తోనే ఇండియన్ రికార్డ్స్ బద్దలు చేశాడు డార్లింగ్.. ఈ సినిమా ట్రైలర్‌తో 24 గంటల పాటు యూట్యూబ్‌ను షేక్ చేశాడు ప్రభాస్. తెలుగు నుంచి హిందీ వరకు రికార్డుల ఊచకోతకు దిగాడు సలార్.. 24 గంటల్లో ఏయే భాషల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో మీరూ తెలుసుకోండి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అన్ని భాషలు కలిపి కేవలం 24 గంటల్లోనే ఏకంగా 116+ మిలియన్ల వ్యూస్ సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు కొట్టింది. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన భారతీయ సినిమాగా సలార్ నిలిచింది. తెలుగులో కూడా సలారే ముందున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌కు 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఈ రికార్డును డైనోసార్ దాటేశాడు. సలార్ తెలుగు ట్రైలర్ వ్యూస్ 24 గంటల్లో 33 మిలియన్ల వ్యూస్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇక హిందీలో 54.3 మిలియన్ మార్క్ దాటేసింది. ఈ క్రమంలో బాలీవుడ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా 'సలార్' రికార్డు క్రియేట్ చేసింది. ఇదివరకు ఆదిపురుష్ (52.3 మిలియన్) టాప్‌లో ఉంది. కాగా, ప్రస్తుతం సలార్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇలా అన్నీ భాషల్లో సలార్ ట్రైలర్ దుమ్ములేపింది. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూఎస్‌లో 1979కి పైగా ప్రాంతాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అమెరికాలో ఇన్ని లొకేషన్లలో రిలీజ్‌కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘సలార్’ నిలవనుంది. ►తెలుగులో - 32.6 మిలియన్ వ్యూస్, 1.24 M లైక్స్ ►హిందీలో - 54.3 మిలియన్ వ్యూస్, 850k లైక్స్ ►తమిళంలో - 9.1 మిలియన్ వ్యూస్, 226k లైక్స్ ►కన్నడలో - 9.6 మిలియన్ వ్యూస్, 215k లైక్స్ ►మలయాళంలో - 7.7 మిలియన్ వ్యూస్, 212k లైక్స్ ►అన్నీ భాషలు కలిపి- 116+ మిలియన్ వ్యూస్, 2.7+ M లైక్స్ 𝐎𝐍𝐄 𝐌𝐀𝐍 𝐀𝐑𝐌𝐘 🔥#SalaarTrailer conquers YouTube with record-breaking 𝟏𝟏𝟔 𝐌 𝐕𝐢𝐞𝐰𝐬 & 𝟐.𝟕 𝐌 𝐋𝐢𝐤𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬💥 ▶️ https://t.co/DDSPRgJ87Z#RecordBreakingSalaarTrailer #Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/GNGCcYL75P — Salaar (@SalaarTheSaga) December 2, 2023 #Salaar Trailer In 24hrs ❤️🔥 Telugu: 32.6M Views, 1.24M Likes Hindi: 54.3M Views, 850K Likes Kan: 9.6M Views, 215K Likes Tam: 9.1M Views, 226K Likes Mal: 7.7M Views, 212K Likes Total: 113.2M Views, 2.76M+ Likes Views- ATR 🦖❤️🌋🔥💥 Likes- TOP3 #Prabhas #SalaarCeaseFire pic.twitter.com/509B8oLD4I — Gjsr27 (@Gjsr2718) December 2, 2023 -
Salaar Part 1: Ceasefire Trailer: రిలీజైన 'సలార్' ట్రైలర్.. స్టోరీ హింట్ ఇచ్చేశారుగా!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా ట్రైలర్ రిలీజైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) సినిమా సంగతేంటి? 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు. అక్టోబరు 28న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అలా డిసెంబరు 22 అని డేట్ ఫిక్స్ చేశారు. ట్రైలర్ ఎలా ఉంది? 'సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు. ట్రైలర్ చివరలో ప్రభాస్ కనిపించాడు. యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఆ ఫైట్ సీన్స్ అన్నీ వేరే లెవల్ హై ఇస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అలరిస్తోంది. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఈసారి థియేటర్లలో దుమ్మరేగ్గొట్టేలా గ్యారంటీ. అలానే బాక్సాఫీస్‌కి బ్యాండ్ కూడా పక్కా అనిపిస్తోంది. 'సలార్' కథేంటి? ఖన్సార్ అనే ప్రాంతాన్ని రాజమన్నార్(జగపతిబాబు) అనే వ్యక్తి ఏలుతుంటాడు. ఇతడి కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్). అయితే రాజమన్నార్ పనిమీద బయటకెళ్లినప్పుడు.. అతడి కొడుకుని అంతమొందించి, ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని కొందరు ప్లాన్ చేస్తుంటాడు. దీంతో వరద రాజమన్నార్, తన చిన్నప్పటి ఫ్రెండ్ దేవా (ప్రభాస్) సహాయం తీసుకుంటాడు. చివరకు ఏమైంది? అనేదే 'సలార్' పార్ట్ 1 స్టోరీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
ఉచితంగా 'సలార్' మూవీ టికెట్స్ కావాలా? ఇలా చేయాల్సిందే!
'సలార్' ట్రైలర్ వచ్చేందుకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. యూట్యూబ్‌లో విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయముంది. ఓవైపు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. 'సలార్' మూవీ టికెట్స్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. కాకపోతే ఓ కండీషన్ పెట్టింది. ట్రైలర్ సంగతేంటి? డార్లింగ్ ప్రభాస్.. చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో చేస్తున్న యాక్షన్ సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కాకపోతే రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చేసరికి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు కానీ ఓవరాల్‌గా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 1న సాయంత్రం 7:19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. (ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ) ఉచితంగా టికెట్స్ ఇక ట్రైలర్ విడుదలకు ఓ రోజు ముందు అంటే.. గురువారం మధ్యాహ్నం 'సలార్' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ ఫొటో ఒకటి ట్విట్టర్ పోస్ట్ చేసింది. దీనికి మంచి క్యాప్షన్ చెప్పిన ఓ ఐదుగురికి.. వాళ్ల ఏరియాలోని ఓ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్, మూవీ పేరున్న టీ-షర్ట్‌ని ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మరి ఇందులో గెలిచే ఆ లక్కీ విన్నర్ ఎవరో చూడాలి? సినిమా రిలీజ్ ప్రస్తుతం 'సలార్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాని డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్.. బద్ద శత్రువుల కావడం అనే స్టోరీతో 'సలార్' తీసినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఇంట్లో పనిమనిషికి ఆ సాయం చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్) 𝐂𝐀𝐏𝐓𝐈𝐎𝐍 𝐓𝐇𝐈𝐒. The best 5 captions will get FDFS tickets in your nearest theater and exclusive #SalaarMerchandise 🎬💬#SalaarCeaseFire Trailer out Tomorrow at 7:19 PM 🔥#Prabhas #PrashanthNeel pic.twitter.com/xSvN8e16Ka — Salaar (@SalaarTheSaga) November 30, 2023 -
'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మేనియా మొదలైపోయింది. మరో రెండు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అప్పుడే హడావుడి చేస్తున్నారు. అదే టైంలో ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని టైమ్ లెక్కేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'సలార్' స్టోరీ లైన్ లీక్ చేసి పడేశాడు. ఇంతకీ స్టోరీ ఏంటి? సినిమా ఎలా ఉండబోతుంది? 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ మూవీస్‌తో వేరే లెవల్ క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో చేస్తున్న సినిమా 'సలార్'. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేయాల్సిన ఈ మూవీ.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. డిసెంబరు 1న సాయంత్రం 7:19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'సలార్' స్టోరీ లైన్ రివీల్ చేయడంతో పాటు కొన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు. 'ఇద్దరు ఫ్రెండ్స్.. శత్రువుల అయ్యే స్టోరీనే 'సలార్'. ఇందులో స్నేహం అనేది మెయిన్ ఎమోషన్. ఇప్పుడు రిలీజయ్యే తొలి భాగంలో సగం స్టోరీ చెప్పబోతున్నాం. ఓవరాల్‌గా ఇద్దరు ఫ్రెండ్స్ చేసే జర్నీనే రెండు పార్ట్స్‌లో చూపించబోతున్నాం. డిసెంబరు 1న రిలీజయ్యే ట్రైలర్‌తో 'సలార్' ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం' అని చెప్పాడు. 'సలార్' సినిమాతో 'కేజీఎఫ్'కి ఎలాంటి పోలిక లేదని.. స్టోరీ దగ్గర నుంచి దేనికదే డిఫరెంట్‌గా ఉంటాయని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజైన తర్వాత కొన్నాళ్లకు రెండో భాగం షూటింగ్ మొదలుపెడతామని చెప్పిన ఈ డైరెక్టర్.. 'సలార్ 2' రిలీజ్ ఎప్పుడనేది మాత్రం తాను ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ 'సలార్' స్టోరీ లైన్ కాస్త బయటపెట్టేసరికి.. ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!) -
సాలార్ లో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్..
-
ఇటలీ నుంచి ఇంటికి...
దాదాపు రెండు నెలల ఇటలీ ట్రిప్‌ను ముగించుకుని బుధవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాస్. ఇక ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సలార్’ చిత్రం తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారట ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం డిసెంబరు 22న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలోని ‘రాజాడీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా ΄ాల్గొనేలా ప్రభాస్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం. -
సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ డిసెంబర్ 22న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో సలార్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత పెద్దగా హిట్ అందుకోకపోయిన రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టాయని టాక్ ఉంది. (ఇదీ చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియో వైరల్.. ఫైర్ అయిన అమితాబ్) కేజీఎఫ్ మొదటి, రెండో భాగాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ సలార్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అలా ఆయనకు పాన్ ఇండియాలో గుర్తింపు దొరికింది. అప్పటికే ఆ స్థాయికి రీచ్ అయిన ప్రభాస్‌తో సినిమా అంటే అంచనాలు ఊహకు అందడం కష్టమని చెప్పవచ్చు. సలార్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సలార్ ట్రైలర్ నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదట్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో సిద్ధమవుతున్న సలార్‌కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్, జగపతిబాబు విలన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కు ప్రాధాన్యమిచ్చి రూపొందిన ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో హాలీవుడ్ చిత్రానికి సమాంతరంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమా పోరాట సన్నివేశాల కోసం జీపులు, ట్రక్కులు ఇలా 750 వాహనాలను వినియోగించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ క్రాకాంతూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న సాలార్ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 22న సాలార్ విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. -
సలార్ Vs డంకీ.. వెనక్కి తగ్గుతున్న ప్రభాస్.. కారణం ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ మరోసారి వాయిదా పడనుందా..? బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ డంకీ చిత్రంతో పోటీ ఎందుకని డైనోసార్ వెనకడుగు వేస్తున్నాడా..? ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన 'సలార్' డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ తేదీన కూడా సలార్ రావడం కష్టమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ) క్రిస్మస్ కానుకగా బాక్సాఫీస్ వద్దకు సలార్,డంకీ చిత్రాలు రానున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్,జవాన్ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడ్ షారుక్.. దీంతో ఆయన నుంచి వస్తున్న డంకీ చిత్రంపై భారీ కలెక్షన్స్ రావడం పక్కా అని బాలీవుడ్ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ల తర్వాత సలార్‌తో ప్రభాస్ వస్తున్నాడు. అయినా కూడా ప్రశాంత్ నీల్,ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సలార్‌పై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కానీ ఈ రెండు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలే కావడంతో ఒకేసారి రిలీజ్ కావడం సరైంది కాదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తేడా వస్తే వసూళ్లపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ క్లాష్ నుంచి రెండు చిత్రాలు తప్పుకుంటే మంచిదని సినీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. డిసెంబర్లో వస్తున్నట్లు షారుక్ డంకీ టీమ్ ముందుగానే ప్రకటించారు.. కానీ సలార్ మాత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ అని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.. దీంతో ఇప్పుడు 'సలార్' మరోసారి వాయిదాకు రెడీ అయిందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే సలార్ 2024 జనవరి లేదా మార్చి నెలలో విడదల కావడం గ్యారెంటీ.. ఈ విషయంపై అధికారకంగా సలార్ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. -
సలార్ కోసం 750 వాహనాలు.. పార్ట్-2 కూడా వెంటనే రిలీజ్!
సలార్ చుట్టూ పాన్ ఇండియా స్టార్లే ఉండటంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ప్రధాన కారణమైతే.. కేజీఎఫ్‌తో తనేంటో ప్రూఫ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మరో కారణం. ఇలా వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉండటం సహజం. అంతేకాకుండా కేజీఎఫ్,కాంతారా లాంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు బడ్జెట్‌కు ఏ మాత్రం తగ్గకుండా సలార్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇలా సలార్ చుట్టూ అదిరిపోయే కాంబినేషన్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సలార్ పార్ట్ 1లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు, ట్యాంకులు, ట్రక్కులు సహా 750కి పైగా వాహనాలను ఉపయోగించారని తెలుస్తోంది. సలార్ యాక్షన్ సన్నివేశాల గురించి చిత్ర నిర్మాణ బృందం కొంత సమాచారాన్ని తాజాగా పంచుకుంది. సాలార్ షూటింగ్ కోసం 750కి పైగా వివిధ రకాల వాహనాలను ఉపయోగించామని కన్నడ మీడియాతో చిత్ర యూనిట్ పంచుకుంది. జీపులు, ట్రక్కులు సహా అనేక వాహనాలను షూటింగ్‌కు వినియోగించారు. హాలీవుడ్ సినిమాలో లాగా భారీ యాక్షన్ సన్నివేశాలను సలార్ కోసం చిత్రీకరించారు. సినిమా కోసం భారీ యుద్ధ భూమినే నిర్మించారు. సినిమాలో అద్భుతమైన యాక్షన్ సిట్యుయేషన్స్‌ని చూపించేందుకు చిత్రబృందం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. KGF సిరీస్‌లో కనిపించిన విధంగా ప్రశాంత్ నీల్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను సలార్ పార్ట్ 1 లో రూపొందించాడని అది ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. సలార్ పార్ట్-2 ఎప్పుడంటే..? ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆరు నెలల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. పార్ట్-2 ఏప్రిల్ 2024లో వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. కానీ సలార్ పార్ట్ 1 విడుదలైన తర్వాత వెంటనే పార్ట్ 2 విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్. సలార్ పార్ట్-1 ఎండ్ కార్డ్‌లోనే పార్ట్-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్ట్-2 కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సలార్ పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇక షారుక్ ఖాన్ నటించిన డుంకీ కూడా అదే సమయంలో విడుదల కానుంది. -
సలార్.. కన్నడలో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన కేజీఎఫ్ విలన్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్' రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 22 సలార్ వార్ డిసైడ్ చేయనున్నాడు. ఇక 'సలార్'కు పోటీగా షారుక్ ఖాన్ నటించిన 'డంకి' సినిమా బరిలోకి దిగనుంది. అలా క్రిస్టమస్ సంబరాల్లో 2 సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ రెండు సినిమాలతో పాటు హాలీవుడ్ 'అక్వామన్' సినిమా కూడా తెరపైకి వస్తోంది.ప్రస్తుతం చికిత్స కోసం ప్రభాస్ విదేశాల్లో ఉంటున్నాడు. త్వరలో ఆయన భారత్‌లో ల్యాండ్ కానున్నాడు. ఆయన ఎంట్రీ ఇచ్చాక 'సలార్' సినిమా ప్రచారం ప్రారంభం కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా సాగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ మరింత బెటర్ ఉండాలని భావించిన ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీని వాయిదా వేసి మరీ సలార్ పనులు చూస్తున్నాడు. ఇక 'కేజీఎఫ్' చిత్రానికి పనిచేసిన స్టార్లు 'సలార్' కోసం పనిచేస్తున్నారు. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, దేవరాజ్ సహా పెద్ద తారగణమే ఈ సినిమాలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న సలార్.. కన్నడలో ప్రభాస్ పాత్రకు నటుడు వశిష్ఠ సింహ వాయిస్ ఇస్తున్నాడు. కన్నడ నటుడు వశిష్ఠ సింహ 'సలార్' టీమ్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు గట్టిగా ధ్వనించే కంఠంతో వాయిస్ అందిస్తున్నాడు. ఈ వార్త విని అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కు ఆయన వాయిస్ బేస్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని వారు అంటున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్‌లో హీరో యష్‌కి తెలుగులో వాయిస్ ఇచ్చింది డబ్బింగ్ ఆర్టిస్ట్ గౌతమ్... మొదట ఆయన వాయిస్ సెట్ కాదని అందరూ చెప్పినా ప్రశాంత్ నీల్ ఓకే చేశాడట. ఫైనల్‌గా రిజల్ట్ తెలిసిందే. (ఇదీ చదవండి: లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. వారికి మాత్రమే ఎంట్రీ.. ఎందుకంటే?) అదే రీతిలో వశిష్ఠ కన్నడ వాయిస్ కూడా ప్రభాస్‌కు బాగా సెట్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారట. తెలుగులో ఎంతటి మాస్ డైలాగ్ అయినా సరే ప్రభాస్ చెబితే విజిల్స్ పడాల్సిందే.. కానీ కన్నడలో యంగ్ రెబల్ స్టార్ డబ్ చేసే సాహసం చేయడం లేదు. అందుకు తను పర్ఫెక్ట్ కాదని వశిష్ఠ వాయిస్‌ను సూచించారట. ఇప్పటికే ప్రభాస్ డైలాగ్స్ అన్నీ వశిష్ఠ పూర్తి చేశాడని తెలుస్తోంది. అతని వాయిస్ మన డైనోసార్ కటౌట్‌కు పక్కాగా సెట్ అయిందట. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా మేకర్స్‌కు తెలిపాడట. ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ 5 భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. 1000 కోట్ల రూ. కలెక్షన్స్ టార్గెట్ చేసి సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక 'సలార్' ట్రైలర్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా సలార్ ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. వశిష్ట ఎవరంటే.. వశిష్ట సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ప్రవేశించాడు. అతను మొదట ఆర్‌యస్ లవ్ చిత్రం ద్వారా 2013లో వెండితెరపై మెరిశాడు. ఆ తర్వాత తమిళ్, తెలుగు చిత్రాలతో మెప్పించాడు. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో సీనప్ప పాత్రలో మెప్పించిన వశిష్ట.. ఒదెలా రైల్వే స్టేషన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. KGF లో , బెంగుళూరుకు చెందిన గ్యాంగ్‌స్టర్ కమల్ పాత్రను వశిష్ట పోషించాడు , ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా ఆయన సూపర్ అనిపించాడు. సింగర్‌గా కూడా కన్నడలో పలు పాటలు పాడాడు. -
రూ.1000 కోట్ల కల.. డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే!
ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్లు దూకుడు మీదుంది. వీటి మధ్య లో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది.ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్ తో,ఇప్పుడు లియోతో రెండు సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఈ ఏడాదిలో ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీ ఒకటే 225 కోట్లు రాబ్టటింది.ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా,ఆది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. (చదవండి: హీరోయిన్‌తో రహస్యంగా లవ్..? సిగ్గుపడిపోయిన యంగ్ హీరో!) ఆశలన్నీ సలార్‌పైనే డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీపై టాలీవుడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2తో ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కూడా రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ హిట్ పడితే మాత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు. (చదవండి: ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ ) భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ సలార్ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ నుంచే ఈ చిత్రం రూ. 300 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంఉటంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.300 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆ లెక్కలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 22 తర్వాత తెలుస్తుంది. -
ఏప్రిల్‌లో సెట్స్‌కి...
వరుస సినిమాలతో మరింత బిజీ కానున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి ΄ార్ట్ షూటింగ్ డిసెంబరు కల్లా పూర్తవుతుందని, అప్పట్నుంచి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోని ‘వార్ 2’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ్ర΄ారంభం కానుందని యూనిట్ వెల్లడించింది. -
‘సలార్’లో ఎన్టీఆర్, యశ్.. ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్!
యావత్ భారత్ సినీలోకం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్‌కు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేమ్ యశ్ నటించారట. సినిమా క్లైమాక్స్‌లో హీరో యశ్‌తో పాటు ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేయనున్నారట. కొట్టి పారేయలేం సలార్‌లో ఎన్టీఆర్, యశ్ నటించారనే రూమర్‌ని కొట్టి పారేయలేం అని సినీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. దేవర షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడు. అలాగే యశ్‌తో కేజీయఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఈ నేపథ్యంలో వీరిద్దరు సలార్‌లో గెస్ట్ రోల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ.. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ముగ్గురు పాన్ ఇండియా హీరోలు కలిసి నటించిన భారీ చిత్రం ‘సలార్’అవుతుంది. సలార్ రీమేకా? సలార్‌కి సంబంధించిన ఇంకో రూమర్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2014లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘ఉగ్రం’ చిత్రానికి ఇది రీమేక్ అనే ప్రచారం జోరందుకుంది. సలార్ ప్రారంభ సమయంలోనూ ఇదే రూమర్ వినిపించింది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఇది రీమేక్ కాదని స్పష్టం చేశాడు. ఉగ్రం షేడ్స్ సలార్ ఉంటాయి కానీ.. ఇది కొత్త కథ అని చెప్పాడు. (చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) చాలా కాలం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ రీమేక్ రూమర్ తెరపైకి వచ్చింది. ఉగ్రం చిత్రాన్ని యూట్యూబ్ నుంచి తొలగించారని, రీమేక్ కాబట్టే దాన్ని తొలగించారిన కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది కావాలని ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఉగ్రం అందుబాటులో ఉందని చెబుతున్నారు. -
ఆ సినిమాకు రీమేక్‌నే సలార్.. మ్యూజిక్ డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్’. ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే ‘పొగరు’ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ సినిమా డిసెంబంర్ 22న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌండ్ బోట్ బ్యూటీ) అయితే గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు సలార్ రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సలార్ విడుదల తేదీ ప్రకటించడంతో ఇలాంటి రూమర్స్‌కు ఇక కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో నెలల క్రితం సంగీత దర్శకుడు రవి బస్రూర్ సలార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్లీ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఇలా చెప్పాడు. ' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్‌కు.. సలార్ రీమేక్ అని అందులో ఆయన ఆయన చెప్పారు. ఆ వీడియోలో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో క్లారిటీ లేదు. కానీ ఉగ్రం సినిమా చూసిన వారికి మూవీ లైన్‌ను సరిచూస్తే కొంతమేరకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇందులో నిజం ఉండదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కన్నడలో ఉగ్రం సినిమా భారీ హిట్ క్టొటింది. మళ్లీ ఇదే సినిమాను రీమేక్‌గా ప్రశాంత్ నీల్ ఎందుకు తీస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఉగ్రం సినిమాకు 50 మిలియన్లకు పైగానే వ్యూస్ వచ్చాయి. ఎవరో కావాలనే ప్రభాస్ సినిమాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. -
KGF ఫ్యాన్స్ బీ రెడీ.. ఛాప్టర్-3 ఎప్పుడంటే
ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. దీంతో 2022లో రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్డేట్ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించి.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. కేజీఎఫ్- ఛాప్టర్ 2 ఎండింగ్లో పార్ట్- 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్‌క్లూజన్ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ను షేర్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) -
ప్రభాస్ 'సలార్' విడుదలపై అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న థియేటర్లోకి రావాల్సిన సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో నిరుత్సాహ పడ్డారు. (ఇదీ చదవండి: థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా) తాజాగా ఈ సినిమా విడుదల ప్రకటన అఫీషియల్‌గా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ 22న క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వారి నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిసెంబర్ 22 నుంచి డైనోసార్ వేట మొదలవుతుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించి నవంబర్‌లో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్ కేవలం 24 గంటల్లోపే 83 మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుని రికార్డును సృష్టించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. 𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw — Hombale Films (@hombalefilms) September 29, 2023 -
సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూవీ రిలీజ్ వాయిదా పడిందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకపోయినా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. సలార్‌పై తాజాగా మరో టాక్ ఊపందుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. కాగా..'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ .. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్'పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. కాగా..ఈ చిత్రంలో శృతి హాసన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సాలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #BreakingNews… PRABHAS: ‘SALAAR’ TO ARRIVE IN NOV… #Salaar is NOT arriving on 28 Sept 2023, it’s OFFICIAL now… The post-production work of this #Prabhas starrer is going on in full swing… #HombaleFilms - the producers - are bringing the film in Nov 2023… New release date… pic.twitter.com/SbOLGSobz5 — taran adarsh (@taran_adarsh) September 2, 2023 -
వెబ్‌సైట్స్ నుంచి సలార్ తొలగింపు.. డైనోసార్‌పై భారీ ఎఫెక్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా వాయిదా ప్రకటన ఆయన ఫ్యాన్స్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుందని ఎప్పటి నుంచో ప్రకటన ఇస్తూనే ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా సినిమా వాయిదా అనే వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. హార్ట్ బ్రేక్ అంటూ పలు కామెంట్లు పెడుతున్నారు. (ఇదీ చదవండి: సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్ సీన్స్ అవసరమా..?) ఈ సంవత్సరంలో విడుదలైన ఆదిపురుష్ విమర్శలతో పాటు భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సలార్‌తో సత్తా చాటి పాత రికార్డులన్నింటినీ తమ డైనోసార్ చెరిపివేస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. సలార్ వాయిదా అనే వార్తలు రావడంతో వారు ఖంగుతిన్నారు. కానీ ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ అమెరికాలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయం అని తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఓవర్సీస్లో ఊహించని రేంజ్లో బుకింగ్స్ జరిగాయి. షారుక్ ఖాన్ జవాన్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా అక్కడ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. (ఇదీ చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే) తాజాగ అమెరికాలో టికెట్ల బుకింగ్ వెబ్‌సైట్స్ నుంచి సలార్ సినిమాను తొలగించారు. మరికొన్నిచోట్ల అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి తిరిగి డబ్బు చెల్లిస్తున్నారు. USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్‌లో ఇప్పటికే దాదాపు 19,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 26రోజుల ముందే 1మిలియన్ డాలర్లను USAలో కలెక్ట్ చేసింది. అమెరికాతో పాటు పలు విదేశాల్లో ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా తెలిపింది. అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సినిమా వాయిదా పడటం ఇక లాంచనమేనని తెలుస్తోంది. ఇలా ఎప్పుడూ జరగలేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. సినిమా వాయిదా విషయాన్ని సలార్ నిర్మాత(హోంబలే ఫిల్మ్స్) నేడు ప్రకటించే అవకాశం ఉంది. -
మూడు రోజులు.. మూడు భాషలు
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్ గా, పృధ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సలార్’ తొలిపార్టు ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రభాస్, ప్రశాంత్ అండ్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌తో బిజీగా ఉంటున్నారు. రీసెంట్గా ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాకు బెంగళూరులో డబ్బింగ్ చెప్పారట ప్రభాస్. ఈ సినిమాలో ఆద్య అనే జర్నలిస్ట్ పాత్రలో శ్రుతీహాసన్ నటిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ చిత్రంలో ఆమెది జర్నలిస్ట్ పాత్ర కాదని, టీచర్ ఆద్య పాత్ర అని తాజాగా తెరపైకి వచ్చింది. కాగా హిందీ, తెలుగు, తమిళంలో మూడు రోజుల్లో మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పారు శ్రుతీహాసన్. -
రిలీజ్‌కు ముందే రోర్.. కళ్లు చెదిరేలా సలార్ ప్రీ బుకింగ్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే'బాహుబలి' తర్వాత వచ్చిన చిత్రాలు వందల కోట్లు కలెక్షన్స్ వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాయి. ఇటీవల రిలీజైన ఆదిపురుష్ సైతం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సలార్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!) అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే అంతేస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది ప్రభాస్ సలార్. విడుదలకే ముందే ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఇటీవల అమెరికాలో సలార్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. కొద్ది క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్లో సలార్ కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 150 వేల డాలర్ల ప్రీ బిజినెస్ జరిగిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక్క అమెరికాలోనే ఈ రేంజ్లో సలార్ ప్రీ బుకింగ్స్ కావడంతో.. ఇక ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సినిమా ఫ్లాప్ అయితే తప్పు ఫ్యాన్స్‌దా? ఇదెక్కడి లాజిక్!) కాగా.. గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రమిదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. #Salaar USA Presales crossed $150,000🦖💥 DINOSALAAR ROARS FROM 28 Sep 2023 💥😎#Prabhas#SalaarCeaseFire #SalaarTakeOverUSA pic.twitter.com/8dDGp8ROBB — Sai Eswar 💖 (@Prabhas_Raju44) August 23, 2023 idi kuda 36 Days before with only 5% Of the bookings open tho ne... Just imagine if songs & trailer were released by now and Bookings official ga 500+ shows tho open chesi unte eh range lo undevoo🙏🔥🔥🔥🔥#Prabhas 👑#SalaarTakeOverUSA https://t.co/okLXvwSoa7 — • (@Roopuuuu) August 23, 2023 Without Any Songs/Trailer Release, #Prabhas's #Salaar Already Grossed Over $150K in the USA 🙏🔥🔥🔥 More than 50% of the Total Premiere Advance Sales Are From These #CineMark Theatres: • Dallas XD And IMAX • Legacy And XD • West Plano And XD#SalaarTakeOverUSA 🔥 pic.twitter.com/5NuwtL1JxU — Hail Prabhas (@HailPrabhas007) August 23, 2023 -
రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. ఎందుకంటే డార్లింగ్ హీరోకి తగ్గ మూవీ పడి చాలారోజులు అయిపోయింది. 'బాహుబలి' తర్వాత మూడు చిత్రాలు చేశాడు. అవి కలెక్షన్స్ అయితే వందల కోట్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇలా బోలెడన్నీ కారణాల వల్ల 'సలార్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవి కాదన్నట్లు మరో రికార్డు వచ్చి చేరింది. టీజర్ సూపరే కానీ జూలై 6న 'సలార్' టీజర్ విడుదలైంది. ఇందులో ప్రభాస్‌ని పట్టుమని పది సెకన్లు అయినా చూపించలేదు. కానీ ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. టీజర్లోనే ఇలా ఎలివేషన్స్ ఉన్నాయంటే.. సినిమాలో ఇంకెంత రచ్చ ఉండబోతుందా అని మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లే టీజర్.. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఇప్పటికే సరికొత్త మైలురాళ్లు అందుకుంటోంది. (ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?) థియేటర్ల రికార్డు 'సలార్' విడుదలకు ఇంకా రెండు నెలలకు పైనే సమయముంది. ఇంతలో అన్ని ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ డీల్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రూ.200 కోట్లకు విక్రయించారని టాక్ వచ్చింది. సరే దీని గురించి పక్కనబెడితే ఓవర్సీస్లో ఈసారి సలార్ ప్రభంజనం ఉండబోతుంది. ఎందుకంటే కేవలం ఉత్తర అమెరికాలోనే ఏకంగా 1979 ప్లస్ థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 5 వేలకు మించి అయితే కేవలం అమెరికాలో దాదాపు రెండు వేల థియేటర్ల కౌంట్ ఉండగా, మన దేశం తప్పించి ప్రపంచవ్యాప్తంగా 5000 వేల థియేటర్లలో 'సలార్' విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తొలిరోజు వసూళ్లలో ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? A grand salute from our side to the 𝘽𝙤𝙭 𝙊𝙛𝙛𝙞𝙘𝙚 𝘽𝙪𝙡𝙡𝙙𝙤𝙯𝙚𝙧…. Marking the Man’s birthday year with the locations we are releasing in North America. PRABHAS 🔥🔥🔥💥💥 1979 Locations - ALL TIME RECORD RELEASE FOR ANY INDIAN FILM. #Salaar 💥 #SalaarCeaseFire… pic.twitter.com/F4drcHnrH4 — Prabhas ™ (@Team_Prabhas) July 17, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) -
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మెగా మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ
-
ఒకేసారి ప్రభాస్, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమాలు
-
'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!
'సలార్' టీజర్ అనుకున్నంతగా లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనలో చాలామందికి నచ్చలేదు. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ వాళ్లలో చాలామందికి ఓకే అనిపించింది. ప్రభాస్‌ని వేరే లెవల్లో చూపిస్తారని, ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయని వాళ్లు మెంటల్‌గా ఫిక్సయ్యారు. కానీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. అందరూ టీజర్ నచ్చలేదు, నచ్చలేదు అంటున్నారు కానీ డైరెక్టర్ని మాత్రం ఓ విషయంలో కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. కావాలనే ఇలా? 'సలార్' టీజర్ చూడగానే చాలామందికి ఇది టీజర్లా అస్సలు అనిపించలేదు. ఎందుకంటే హీరో పాత్ర, స్టోరీ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చిన వీడియోలా అనిపించింది. ఇదంతా చూస్తుంటే.. దర్శకనిర్మాతలు కావాలనే ఇలా చేశారేమో అనే డౌట్ వస్తుంది. టీజర్ లేదా ట్రైలర్ లో అన్నీ చూపించేస్తే.. థియేటర్లలోకి వచ్చినవాళ్లు భారీ అంచనాల వల్ల డిసప్పాయింట్ కావొచ్చు. అందుకే టీజర్ తో ఇలా అంచనాలు తగ్గించి, బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి సర్ప్రైజులు ఇవ్వాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) బొగ్గు.. సూపర్‌హిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడే సినిమాలు తీశాడు. అన్నింట్లోనూ యాక్షన్ మాత్రమే నమ్ముకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకులు.. గ్రాఫిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ, అవి-ఇవి అని తెగ హంగామా చేస్తున్నారు. తీరాచూస్తే తుస్సుమనిపిస్తున్నారు. 'ఆదిపురుష్' విషయంలోనూ ఇలానే జరిగింది. వీళ్లందరితో పోలిస్తే ప్రశాంత్ నీల్ మాత్రం.. ఎంచక్కా అందరికీ తెలిసిన కథ, ఎలివేషన్స్ ఇవ్వడానికి ఓ తాత.. హీరో బాడీ మొత్తం బొగ్గు పూసి.. సింపుల్‌గా హిట్స్ కొడుతున్నాడు. కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. 'సలార్'తో ఇది మరోసారి జరగొచ్చు! 'కేజీఎఫ్' రెండు పార్ట్స్ లోనూ గ్రాఫిక్స్ తక్కువే ఉంటుంది కానీ యాక్షన్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. ఇప్పుడు 'సలార్' సినిమా విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సేమ్ ఫార్ములా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడన్ని అంచనాలున్నాయి. టీజర్ లో అంటే ప్రభాస్ ని దాచేశారు. ట్రైలర్ అయితే దాయలేరుగా! ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి 'సలార్' వస్తుందిగా.. అప్పుడు మాట్లాడుకుందాం! (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) -
'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి
'సలార్' టీజర్ దుమ్ములేపుతోంది. ప్రభాస్ దెబ్బకు రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. సరికొత్త ఘనతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయమే డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది. టీజర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. ఒక్క దెబ్బకు ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఇలా అదరగొట్టేస్తున్న సలార్ టీజర్.. ఓ విషయంలో మాత్రం 'కేజీఎఫ్ 2'ని దాటలేకపోయింది. ఫ్యాన్స్ నిరాశ డార్లింగ్ ప్రభాస్ నుంచి కొన్నిరోజుల ముందు 'ఆదిపురుష్' వచ్చింది. అభిమానుల్ని ఆ సినిమా ఘోరంగా నిరాశపరిచింది. దీంతో వాళ్ల దృష్టంతా 'సలార్' మీదకు మళ్లింది. అందుకు తగ్గట్లే జూలై 6న ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ.. కొత్త తాత ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. కానీ ప్రభాస్ ని 10 సెకన్లలోపే, అది కూడా ముఖం సరిగా చూపించకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) రికార్డ్ వ్యూస్ ప్రభాస్‌ని టీజర్ లో సరిగా చూపించకపోతేనేం.. 24 గంటల్లో యూట్యూబ్ లో దీనికి ఏకంగా 83 మిలియన్ వ్యూస్, 1.67 మిలియన్ లైక్స్ సాధించింది. ఈ క్రమంలోనే ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా అగ్రస్థానం దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో ఆదిపురుష్(68.96 మిలియన్), కేజీఎఫ్ 2(68.83 మిలియన్), రాధేశ్యామ్(42.66 మిలియన్) ఉన్నాయి. ఇలా టాప్-4లో ప్రభాస్‌వే మూడు చిత్రాలుండటం విశేషం. అయితే లైక్స్ విషయంలో 'సలార్' టీజర్.. 'కేజీఎఫ్ 2' టీజర్ దాటలేకపోయింది. సినిమాపై అంచనాలు టీజర్‌పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా.. 'సలార్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు 'కేజీఎఫ్'తో సంబంధం ఉందని, టీజర్ లో అందుకు సంబంధించిన ఆధారాలు కనిపించాయని నెటిజన్స్ అంటున్నారు. మూవీ రిలీజైతే గానీ అసలు విషయం తెలీదు. ఇందులో హీరోయిన్ గా శుత్రిహాసన్, విలన్ గా జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, కీలకపాత్రలో శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సెప్టెంబరు 28న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 7:11 పీఎమ్ మూవీ రివ్యూ) -
ప్రశాంత్ నిల్ మాదిరే మరో డైరెక్టర్ని టార్గెట్ చేసిన సౌత్ నిర్మాతలు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి. (ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...) అలా కేజీఎఫ్‌తో ప్రశాంత్ నిల్తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది. ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'సలార్' టీజర్ విడుదలైపోయింది. యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. మొత్తం టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు. ఇదే అభిమానులని డిసప్పాయింట్ చేసింది. అయితే ఇదే టీజర్లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత మాత్రం బాగా హైలెట్ అయ్యాడు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ నటుడు ఎవరు? ఇంతకీ అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? కొత్త తాత వచ్చాడ్రోయ్ ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది 'కేజీఎఫ్'. ఆ సినిమాలో రాకీభాయ్ గా యష్ ఎంత హైలెట్ అయ్యాడో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలానే రాకీ పాత్రకు ప్రతి సీన్ లో నెక్స్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చిన తాత కూడా మనకు తెగ నచ్చేశాడు. ఆయన కన్నడ నటుడు అనంత్ నాగ్. ఇప్పుడు ఆ తాతని బీట్ చేసేందుకు ప్రశాంత్ నీల్.. కొత్త తాతని బరిలో దింపాడు. ఆయనే 'సలార్' టీజర్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: సేమ్ టు సేమ్..‘సలార్’ టీజర్లో ఇది గమనించారా?) తాత బ్యాక్ గ్రౌండ్ ఇదే 'సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్. ప్రభాస్ తో అతడికి ఇది రెండో సినిమా. 'సాహో'లోనూ ఇతడు నటించాడు. అయితే తెలుగులో టీనూ ఆనంద్ మొదటగా బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీలో నటించాడు. చిరంజీవి 'అంజి'లోనూ భాటియా అనే పాత్రలో విలనిజం పండించాడు. ఫ్యామిలీ అంతా నటులే గతేడాది వచ్చిన 'సీతారామమ్'లో ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించింది టీనూనే. ఆయన ఫ్యామిలీలో టీనూతో పాటు దాదాపు అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈయన మేనల్లుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 'పఠాన్', 'వార్', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలతో బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చింది ఇతడే. సరే ఇది పక్కనబెడితే టీనూ ఆనంద్ లో నటుడితోపాటు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యుసర్ కూడా ఉన్నాడండోయ్. గతంలో హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇప్పటి ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) -
సేమ్ టు సేమ్..‘సలార్’ టీజర్లో ఇది గమనించారా?
నిన్న రాత్రి ప్రభాస్ ఫ్యాన్స్‌ని ప్రశాంతంగా నిద్రపోకుండా చేశాడు ప్రశాంత్ నీల్. ఉదయం 5.12 గంటలకే సలార్ టీజర్ రిలీజ్ ఉండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అలారం పెట్టుకొని మరి నిద్ర లేచి ఉంటారు. ఫ్యాన్స్‌కి అంచనాలకు తగ్గట్టే టీజర్ ఓ రేంజ్లో అదిరిపోయింది. భారీ పంచ్ డైలాగ్స్ లేకున్నా, హీరోని పూర్తిగా చూపించకపోయినా.. 1 నిమిషం 46 సెకన్ల నిడివి గల ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘కేజీయఫ్’సిరీస్ తరహాలోనే సలార్ టీజర్‌ని కట్ చేశారు. హీరో చేత ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేదు కానీ అతని ఇంట్రడక్షన్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. అచ్చం ఇలాంటి ఇంట్రడక్షన్నే ‘కేజీయఫ్-2’లోనూ ఉంటుంది. అక్కడ ‘హిస్టరీ టెల్స్ అజ్ ద పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రం పవర్‌పుల్ ప్లేసెస్. బట్ హిస్టర్ వాజ్ రాంగ్. పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్’అంటూ ఓ వ్యక్తి వాయిస్ ఓవర్‌తో హీరో పరిచయం ఉంటుంది. ఇప్పుడు సలార్‌లోనూ అలాంటి ఇంగ్లీష్ డైలాగ్‌తోనే ప్రభాస్ ఇంట్రడక్షన్స్ చెప్పించారు. ‘లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్.. వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్, బికాజ్ ఇన్ దట్ పార్క్.. ’అంటూ హీరోని ఎలివేట్ చేస్తూ టీజర్ సాగుతుంది. (చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి .. 'సీజ్ఫైర్' అంటే ఏమిటో తెలుసా?) కేజీయఫ్ సినిమా గోల్డ్ మైన్స్‌లో సాగితే.. సలార్ బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుందని టాక్. ఇక కేజీయఫ్ మాదిరే సలార్ కూడా రెండు భాగాలు రాబోతుంది. అందులో పార్ట్ 1 కి 'సీజ్ ఫైర్' అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే.. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ, హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు కానీ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడే 'సీజ్ ఫైర్'. రెండో ప్రపంచ యుద్ధంలో మొదటిసారి ఈ పదాన్ని వాడారు. ‘సీజ్ఫైర్’ అనే పదాన్ని ఈ సినిమాలో వాడారంటే.. ప్రభాస్ వేట ఎంత వైల్డ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28 విడుదల కాబోతుంది. -
టీజర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిని 'సలార్' టీజర్ విడుదలైన సమయం నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. 'సింహం, చిరుత, పులి, ఏనుగు, చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో... అంటూ టీనూ ఆనంద్ డైలాగ్‌తో టీజర్ పీక్స్‌కు చేరుకుంటుంది. దీంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. (ఇదీ చదవండి:సలార్ టీజర్‌తో తేలిపోయింది.. ఇది నిజమేనని) టీజర్లో ప్రభాస్ కటౌట్ క్లియర్‌గా చూపించకపోవడంతో పాటు డార్లింగ్‌కు ఎలాంటి డైలాగ్స్ లేకపోవడంతో కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇది టీజర్నా లేదా గ్లింప్స్ నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసినా ప్రభాస్ ఫేస్ చూపించకపోవడంతో వారు కొంత వరకు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: NKR21:కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ!) కేజీఎఫ్ చాప్టర్-1&2 అని ప్రశాంత్ రెండు భాగాలుగా తీసి విజయవంతమయ్యాడు. ఇప్పడు ప్రభాస్‌తో 'సలార్ పార్ట్-1: సీజ్‌ఫైర్‌తో ట్యాగ్ లైన్ ఇచ్చాడు. అంటే పార్ట్-2 ఉంటుందని ఫైనల్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ 'సీజ్ ఫైర్' అంటే ఏమిటని వెతుకుతున్నారు. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్రమైన కాల్పులు జరిగినప్పుడు కానీ అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో కానీ శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకునేందుకు ఉపయోగించే పేరే సీజ్ ఫైర్. మరి సినిమాలో ప్రభాస్ వేట ఎంత వైల్డ్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. -
Prabhas Salaar Teaser: లయన్, చీతా, టైగర్ అంటూ వేటకొచ్చిన డైనోసార్
డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసిన 'సలార్' టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసి పడేసింది. దాదాపు 106 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇక ఇందులో ఎక్కువగా ప్రభాస్ కారెక్టర్‌కు సంబంధించి హీరో ఎలివేషన్ డైలాగ్ చెప్తూ సీనియర్ యాక్టర్ టిన్ను ఆనంద్‌ను చూపించారు. మిగతా క్యారెక్టర్స్‌ను పెద్దగా చూపించలేదు. ప్రభాస్ ఫేస్ మాత్రం చూపించకుండా పిడికిలి బిగించిన తన చేతిని మాత్రమే చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫినిషింగ్‌లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను చూపిస్తూ టీజర్‌ను ముగించారు. 2023 సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు టీజర్లో స్పష్టం చేశారు. సలార్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా శ్రుతిహాసన్ హీరోయిన్గా చేస్తోంది. విలన్ రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు, మరో విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. తమిళ నటి శ్రియారెడ్డి కూడా కీలకపాత్ర పోషించింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్.. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు. ప్రశాంత్ నీల్ ఎప్పటిలానే మాస్ ఫార్ములాని నమ్ముకున్నాడు. టీజర్ చూస్తుంటే హోంబలే ఫిల్మ్స్ బడ్జెట్‌కి ఏ మాత్రం వెనకాడలేదని క్లియర్‌గా అర్థమవుతోంది. -
సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
'సలార్' టీజర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. టెన్షన్‌తో ఫ్యాన్స్ ఇప్పటికే మెంటలెక్కిపోతున్నారు. అది వచ్చేలోపు హైప్ తోనే పోయేలా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చింది. కానీ ఘోరంగా ఫెయిలైంది. దీంతో అభిమానుల ఆశలన్నీ 'సలార్'పైనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు ఈ మూవీకి 'కేజీఎఫ్'తో కనెక్షన్ ఉందనే టాక్ ఫుల్ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'స్పై' సినిమా ఎఫెక్ట్.. సారీ చెప్పిన హీరో నిఖిల్) 'కేజీఎఫ్' రెండు పార్డ్స్తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చేస్తున్న మూవీ 'సలార్'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటిదైతే కోరుకుంటున్నారో సరిగ్గా అలానే ఉండబోతుంది. అయితే సలార్ టీజర్ ని జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామనడంపై ఫ్యాన్స్ రకరకాల థియరీలు అల్లేసుకున్నారు. 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో రాకీభాయ్ పై సరిగ్గా ఉదయం 5:12 గంటల సమయంలోనే ఎటాక్ జరిగిందని, అందుకే 'సలార్' టీజర్ ని అదే టైమ్‌కి రిలీజ్ చేస్తున్నారని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయం నిర్మాత కార్తీక్ గౌడ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. 'ఇదంతా చూస్తుంటే మా అందరి ముఖంపై స్మైల్ వస్తోంది' అని రీట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే సలార్-కేజీఎఫ్ కనెక్షన్ నిజమేనని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో? This got a smile on all our faces :) https://t.co/GqyqvS8yRg — Karthik Gowda (@Karthik1423) July 3, 2023 (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
కేజీయఫ్-2 క్లైమాక్స్‌తో ‘సలార్’కు లింకు.. టీజర్ టైమ్‌తో క్లారిటీ?
మరో రెండు రోజుల్లో (జూలై 6) ‘సలార్’ టీజర్ రాబోతుంది. ‘ఆదిపురుష్ రిజల్ట్‌తో డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద ఉమశమనం. అందుకే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జులై 6 తర్వాత తమ హీరో పేరు మరోసారి పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగి పోవడం ఖాయమనే ధీమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే సలార్ టీజర్‌ని అంత పొద్దున( ఉదయం 5.12 గంటలకు) రీలీజ్ చేయడం వెనుక కారణం ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది. (చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) ప్రభాస్‌కి ఉదయమే టీజర్‌ని విడుదల చేసే సెంటిమెంట్ ఉందని, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల మాదిరి సలార్ అప్డేట్ కూడా ఉదయమే ఇవ్వాలని ప్రభాస్ సూచించడంతోనే సలార్ టీజర్‌ని అంత పొద్దున రిలీజ్ చేస్తున్నారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక తాజాగా మరో క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. సలార్ మూవీకి కేజీయఫ్ చిత్రంతో లింక్ ఉందంట.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. సరిగ్గా 5.12 గంటలకే ఎందుకు? ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ సిరీస్‌లు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘కేజీయఫ్ 2’ చిత్రం పార్ట్ 1ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. రాఖీ భాయ్ చనిపోవడంతో ఆ చిత్రం ముగుస్తుంది. ఆ క్లైమాక్స్ సీన్‌కి సలార్ టీజర్ విడుదలకి సంబంధం ఉందట. రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో నాలుగు గడియారాలు ఉంటాయి. ఒక్కోక్కటి ఒక్కో సమయాన్ని సూచిస్తుంది. అందులో ఒకటి సరిగ్గా 5.12 నిమిషాలను చూపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. కేజీయఫ్ సిరీస్‌తో సలార్‌కు లింక్ ఉందని.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. కొంతమంది ఇది నిజమే అంటుంటే.. మరికొంత మంది ‘ఇదేం కనెక్షన్స్రా బాబోయ్...’ అని కామెంట్ చేస్తున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ఈ సారి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. #Salaar #KGF #Prabhas 5:12 AM is the time Rocky Bhai gets attacked in KGF-2 climax and it’s the teaser time of Salaar 🔥🔥 . Mother of all collisions Salaar is coming up 🔥🔥🔥. Salaar 🚢 Kgf #Prabhas #Yash @hombalefilms#salaarbhaicoming pic.twitter.com/KduNGXoGAB — NANI CAMERON ™ (@Nani____3) July 3, 2023 -
పొద్దుపొద్దునే 'సలార్' టీజర్ రిలీజ్.. కారణం అదేనా?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'. యాక్షన్ స్టోరీకి తోడు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం ఈ వెయిటింగ్‌కి కారణం. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు చిత్రబృందం.. టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ఖరారు చేసింది. జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మరీ అంత ఉదయాన్నే ఎందుకా అని అందరికీ సందేహం వచ్చుంటుంది. దీనికి కారణం అదేనా? టీజర్ కోసం ఆత్రం! 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సాధించాయి. కానీ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇలా చెబితే ఫ్యాన్స్ బాధపడొచ్చు కానీ ఇదే నిజం! దీంతో డార్లింగ్ హీరోకి సరైన హిట్ పడాలని, అది 'సలార్'తోనే సాధ్యమవుతుందని వాళ్లు భావిస్తున్నారు. అందుకే టీజర్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తే, విమర్శకుల నోళ్లు మూతబడతాయనేది వాళ్ల వాదన. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) అదే సెంటిమెంట్ ప్రభాస్ గత మూడు సినిమాల అప్డేట్స్ ని పరిశీలిస్తే మీకు ఓ విషయం క్లారిటీగా అర్థమవుతుంది. 'రాధేశ్యామ్' ఫస్ట్ లుక్, టీజర్, మూవీ రిలీజ్‌డేట్ లాంటివి ఉదయం 8:28, 8:45, 10:06 గంటలకు రిలీజ్ చేశారు. 'ఆదిపురుష్' చిత్రానికి అయితే అప్డేట్స్ అన్నీ ఉదయం 7:11 గంటలకే ఇచ్చారు. ఇప్పుడు సలార్ టీజర్ అయితే మరీ పొద్దుపొద్దున అంటే ఉదయం 5:12 గంటలకే యూట్యూబ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఏమైనా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా అనే సందేహం వస్తోంది. టీజర్ లో ఆ డైలాగ్? 'సలార్' టీజర్ రిలీజ్ అప్డేట్ పోస్టర్ చూస్తే.. ఓ చేతిలో సుత్తి, మరో చేతిలో సిగరెట్, ఎదురుగా విలన్స్ ఉన్నారు. ఇదేదో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లా అనిపిస్తోంది. అంత ఉదయాన్ని టీజర్ రిలీజ్ చేయబోతుండటాన్ని బట్టి చూస్తుంటే.. 'సూర్యుడు కంటే సలార్ ముందొస్తాడు' లాంటి డైలాగ్ ఏదైనా టీజర్ లో ఉందా అనే డౌట్ వస్తోంది. అలానే సినిమా కలర్ టోన్ కి తగ్గట్లు.. పోస్టరు అన్నీ డార్క్ గా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీజర్ ని కూడా డార్క్ గా ఉండే సమయంలోనే రిలీజ్ చేయాలని ఇలా ఏమైనా ప్లాన్ చేశారా అనిపిస్తుంది. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే జూలై 6 వరకు ఆగాలి. 𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥 Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/Sg2BuxBKNA #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/pMGQZ49eQh — Salaar (@SalaarTheSaga) July 3, 2023 (ఇదీ చదవండి: చిరంజీవి-పవన్ కల్యాణ్.. మధ్యలో అనుష్క!) -
ప్రభాస్ 'సలార్' టీజర్ అఫీషియల్ ప్రకటన ఇదే
ఆదిపురుష్ సినిమా విషయంలో ఎన్ని వివాదాలు వచ్చినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్థుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ పేరు మారు మ్రోగిపోతుంది. దీనికి నిదర్శనమే 'సలార్'పై వస్తున్న బజ్ చెప్పేస్తుంది. 'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా 'సలార్'కు సంబంధించిన అదిరిపోయే వార్తను మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టీజర్‌ను (జులై 6) ఉదయం 5:12 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మోస్ట్ వయ్‌లెంట్ మ్యాన్ వస్తున్నాడని ట్విట్టర్లో ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) ప్రభాస్, శ్రుతీహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు సలార్ రానుంది. టీజర్ యూట్యూబ్‌లోకి వస్తే.. పలు రికార్డులు బద్దలు కావాడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥 Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/Sg2BuxBKNA #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/pMGQZ49eQh — Salaar (@SalaarTheSaga) July 3, 2023 -
Salar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జులై 7న రెడీగా ఉండండి
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సలార్' . 'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే ‘పొగరు’ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. (ఇదీ చదవండి: Payal Rajput: వాళ్లు అడ్వాంటేజ్ తీసుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్స్) ఇక 'సలార్' టీజర్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టీజర్ ఈవారంలోనే రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ అంతా పూర్తయిందని అంటున్నారు. జూలై 7న టీజర్‌ను విడుదల చేసేదుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. సుమారు 90 సెకన్ల పాటు ఈ టీజర్ ఉంటుందట. ప్రభాస్ నుంచి అదిరిపోయే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నారట. టీజర్ యూట్యూబ్‌లోకి వస్తే.. ఇండస్ట్రీ లెక్కలన్నీ సలార్ మార్చేస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సలార్ దెబ్బతో ప్రభాస్ ఖాతాలో రూ. 1000 కోట్లు రావడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) -
ఆదిపురుష్ ఎఫెక్ట్ జులైలో సాలార్ సంచలనం
-
ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. వాళ్లందరికీ తలో రూ.10 వేలు!
అందరూ ప్రభాస్ అంటారు కానీ ఆయన ఫుల్ నేమ్ ప్రభాస్ రాజు. మరి పేరులో రాజు ఉందనో ఏమో గానీ ఆతిథ్యం, మర్యాదలు విషయంలో ఏ మాత్రం లోటు ఉండదు. ఇప్పుడు ప్రభాస్ కొందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్స్ లో తలో రూ.10 వేలు వేశారట. ఇంతకీ ఏంటి విషయం? డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మన డార్లింగ్ హీరో.. 'సలార్' టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ చిత్రానికి పనిచేసిన సహాయక సిబ్బంది ఒక్కొక్కరి ఖాతాల్లో ప్రభాస్.. తలో రూ.10 వేలు చొప్పున డిపాజిట్ చేశాడట. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ విషయమే హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ 'ఆదిపురుష్' హడావుడిలో ఉంటే.. ప్రభాస్ మాత్రం 'సలార్' టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజులో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న 'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) A big appreciation to #Prabhas 👏. He has deposited 10K to every #Salaar support staff for their day and night tireless work for the movie. July teaser🎯 pic.twitter.com/qtWW0PwRYm — MNV Gowda (@MNVGowda) June 14, 2023 -
ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా సందడి చేసి మెప్పించిన ఎన్టీఆర్ తాజాగా 'దేవర'గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ - కొరటాల శివ రాకింగ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నన్ను చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు.. రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి) ఈ ప్రాజెక్ట్ తర్వాత, ఎన్టీఆర్ తన 31వ సినిమా కోసం ప్రశాంత్ నీల్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రం చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిధ్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీపై మరో క్రేజీ బజ్ నెలకొంది. తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. అయితే, ఇంతకు ముందు ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. చివరకు ప్రియాంక కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక, తారక్ జోడి అయితే బాగుంటుందని మేకర్స్ అంచనా వేశారట. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: Bhola Sankar Movie: స్కెచ్ అదిరింది, చిరంజీవికి బాలకృష్ణ జై కొడతాడా?) -
అదిరిపోయిన ప్రశాంత్ నీల్ ప్లానింగ్?
-
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్ పవర్ఫుల్ డైరెక్షన్‌తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
ప్రభాస్ దెబ్బ ప్రశాంత్ నీల్, పరిస్థితి ఏంటబ్బా..
-
శరవేగంగా ప్రభాస్ సలార్ షూటింగ్.. పక్కాగా ప్లానింగ్
‘సలార్’ యూనిట్ ప్రస్తుతం నైట్ మోడ్‌లో ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. దీంతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ‘సలార్’ టీమ్ షూటింగ్ షెడ్యూల్స్‌ని పక్కాగా ప్లాన్ చేసి, గ్యాప్ రాకుండా చూసుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నైట్ షూట్ జరుపుతున్నారు. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. -
తెలుగు హీరోల వెంటపడుతున్న కన్నడ డైరెక్టర్లు
సినిమా రంగంలో ప్రతిభ ఉంటే చాలు.. భాషాపరమైన హద్దులు బద్దలవుతాయి. టాలెంట్ ఉంటే పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటారు ఆయా హీరోలు, నిర్మాతలు. ఇదే కోవలో తాజాగా ప్రశాంత్ నీల్, హర్ష, నార్తన్ వంటి కన్నడ దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. తెలుగు హీరోలతో ఆ కన్నడ దర్శకులు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ► కన్నడలో ‘ఉగ్రం’ (2014) సినిమాతో డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత నాలుగేళ్లకు యశ్ హీరోగా ‘కేజీఎఫ్’ (మొదటి భాగం 2018) మూవీతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్’ (రెండవ భాగం 2022) చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో భారీ అవకాశాలు ప్రశాంత్ నీల్ డోర్‌ని టచ్ చేశాయి. అందులో భాగంగా పాన్ ఇండియా హీరోగా దూసుకెళుతున్న ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ చేసే గోల్డెన్ చాన్స్ అందిపుచ్చుకున్నారు ప్రశాంత్. ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేసే చాన్స్ అందుకున్నారు ప్రశాంత్ నీల్. ‘సలార్’ షూటింగ్ పూర్తి కాగానే ఎనీ్టఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ని ఆరంభించనున్నారు ప్రశాంత్ నీల్. కొరటాల శివతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ప్రశాంత్ సినిమా షూటింగ్లో అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్. ► కథా బలం, యాక్షన్ సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ ఎ. హర్ష. శివరాజ్‌కుమార్‌తో ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘వేద’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన తెలుగులో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 31వ చిత్రమిది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ► రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు చరణ్. అదే విధంగా మరో సినిమాని కూడా లైన్లో పెట్టారట. ‘ముఫ్తీ’ (2017) సినిమాతో దర్శకుడిగా కన్నడలో ఘనవిజయం అందుకున్న నార్తన్‌తో రామ్‌చరణ్ సినిమా చేయనున్నారని టాక్. ఇక ‘ముఫ్తీ’ తర్వాత కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌తో నార్తన్ తీసిన ‘భైరతి రణగల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రామ్‌చరణ్‌కు నార్తన్ ఓ కథ వినిపించగా, నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. శంకర్‌తో చేస్తున్న సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమాని పూర్తి చేశాక నార్తన్ మూవీ చేస్తారట రామ్‌చరణ్. ప్రశాంత్ నీల్, హర్ష, నార్తన్ మాత్రమే కాదు.. మరికొందరు కన్నడ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. -
చెర్రీకి పోటీగా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మారింది!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్ మారిపోయింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను దాటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు. ఇక హాలీవుడ్ లో వీరిద్దరి క్రేజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయింది. వీళ్లిద్దరి తో హాలీవుడ్ సినిమాలు తీసేందుకు అక్కడ మేకర్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నట్లు రామ్ చరణ్ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఎన్టీఆర్ కూడా ఓ పాన్ వరల్డ్ మూవీ స్కేచ్ వేసినట్లు తెలిసింది. రామ్ చరణ్, తారక్ ఇద్దరు మంచి ప్రెండ్స్...ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అయితే కెరీర్ విషయంలో మాత్రం ఇద్దరు పోటీపడుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఫినిషింగ్ లో ఉన్నప్పుడే శంకర్ తో ఆర్.సి.15 అనౌన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్.సి.16 లైన్ లో ఉంది. అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్, లోకేష్ కనగరాజ్, సుకుమార్ రామ్ చరణ్ కి టచ్ లోనే ఉన్నారు. తన చేతిలోని సినిమాలు పూర్తి చేసి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రామ్ చరణ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు . ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏది సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక మార్చి 23న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సంవత్సర కాలం ఎదురుచూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా వాటర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టి ఉంచాడు. ప్రశాంత్ సలార్ కంప్లీట్ కాగానే...అక్టోబర్ లో ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించిన తర్వాత...ప్రశాంత్ నీల్ ప్లాన్ మారింది. ఎన్టీఆర్ తో తెరకెక్కించాలనుకున్న పాన్ ఇండియా మూవీని...పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట. ఎన్టీఆర్ అమెరికా టూర్ లో ఉన్నప్పుడు హాలీవుడ్ ఎంట్రీ గురించి న్యూస్ వచ్చినా..ఆ తర్వాత ఎన్టీఆర్ ఎక్కడా హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడలేదు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం భారీ యాక్షన్ డ్రామా ప్లాన్ చేసిన ఎన్టీఆర్ మూవీని హాలీవుడ్ టార్గెట్ గా ఇంగ్లీష్ లో కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఎన్టీఆర్ 31 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని, హాలీవుడ్ యాక్టర్స్‌ని రంగంలోకి దింపుతాడనే మాట పిల్మ్ సర్కిల్స్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. తన కెరీర్ లోనే ఎన్టీఆర్ తో బెస్ట్ మూవీ తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్ కి వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ రేంజ్ లో కూడా సత్తా చాటే విధంగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేలా స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడట. ఈ విషయం తెలియటంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు సలార్ టీం సర్ప్రైజ్.. ఆ రోజే ప్రకటన!
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ ప్రభాస్ మూవీ లైనప్ చూసి హ్యాపీ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మరే పాన్ ఇండియా స్టార్ దగ్గర లేవు. సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉంటే.. మరో రెండు సినిమాలు లైన్లో వున్నాయి. అయితే ఓ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయితే ఈ కన్ప్యూజన్కు బ్రేక్ వేసేందుకు ప్రభాస్‌తో పాటు సలార్ టీమ్ సిద్ధమైంది. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న ఆదిపురుష్ జూన్ 16 విడుదల కానుంది. ఈ మూవీ హాండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఇక సినిమా తర్వాత సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా విషయంలోనే ఫ్యాన్స్ కొంచెం అయోమయంగా వున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా సలార్. దీంతో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. (ఇది చదవండి: రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ) సలార్ సినిమాను కూడా కేజీఎఫ్ నిర్మాతలే నిర్మిస్తుండగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటప్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై ప్రభాస్ కూడా సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. అయితే సలార్ సింగిల్ మూవీనా... టూ పార్ట్స్‌గా వస్తుందా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే నెటిజన్స్ మాత్రం సలార్ మూవీ టూ పార్ట్స్‌గా వస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్లో కనిపిస్తాడట. గతంలో ప్రభాస్ బాహుబలి సినిమాలో కూడా తండ్రి, కుమారుడిగా నటించాడు. కానీ ఏ సీన్లోనూ కలిసి కనిపించరు. కానీ సలార్ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో ప్రభాస్ కలిసి కనిపిస్తారనే మాట వినిపిస్తోంది. సలార్ ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ సలార్‌గా కనిపించగా.. ఇక సలార్ సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ దేవాగా కనిపిస్తాడట. అయితే సలార్ టీమ్ మాత్రం దేవ క్యారెక్టర్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో దేవా క్యారెక్టర్‌ను పరిచయం చేస్తారనే మాట టాలీవుడ్లో వినిపిస్తోంది. దేవా పాత్ర సలార్ వన్ లాస్ట్‌లో రివీల్ చేస్తే.. పార్ట్ -2 పై అంచనాలు పెరుగుతాయనేది మేకర్స్ ప్లాన్. అయితే సలార్ వన్, టూ షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేస్తారా.. సలార్ రిలీజ్ తర్వాత పార్ట్ -2 షూటింగ్ స్టార్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది. సలార్ మూవీ రెండు పార్టులా లేక సింగిల్ మూవీగా వస్తుందా అనే విషయం ఉగాది రోజు సలార్ టీమ్ అప్డేట్తో క్లారిటీ కానుంది. ఉగాది రోజు సలార్ టీజర్ రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. (ఇది చదవండి: మా నాన్న వల్లే వచ్చా.. ఢిల్లీ ఈవెంట్లో నెపోటిజంపై చరణ్ కామెంట్స్) ఇక ఈ టీజర్లో సలార్ పార్ట్ వన్ అని ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. సలార్ మూవీ ఎన్ని పార్ట్స్ ఉంటుందన్న విషయం పక్కన పెడితే.. కన్ప్యూజన్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఈ ఎండ్ కార్డ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ వంగాతో స్పిరిట్ మూవీ... బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్‌తో ఓ యాక్షన్ మూవీ లైన్లో పెట్టాడు. ఇలా వరుస సినిమాలతో ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్ అందించాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడనే చెప్పాలి. -
ప్రభాస్ సలార్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న శ్రుతిహాసన్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా హీరోయిన్ శ్రుతిహాసన్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్‌తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ మేకర్స్‌కు కృతఙ్ఞతలు తెలిపింది.'థాంక్యూ ప్రశాంత్ సార్.. నన్ను మీ ఆధ్యాగా మార్చినందుకు. మీ అందరితో కలిసిసినిమాలో పనిచేయడం చాలా హ్యాపీ' అంటూ శ్రుతి తన పోస్ట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కూడా గ్యాప్ లేకుండా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఏప్రిల్ నాటికి షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది. -
మహేశ్‌ను తారక్ ఫాలో అవుతున్నాడా? లేక తారక్‌ను మహేశ్ ఫాలో అవుతున్నాడా
మహేష్‌ను తారక్ ఫాలో అవుతున్నాడో, లేక తారక్‌ను మహేష్ ఫాలో అవుతాడో తెలియదు కాని, ఈ ఇద్దరి కెరీర్ టర్న్ తీసుకునే సినిమాలు మాత్రం ఈ ఏడాదే పట్టాలెక్కనున్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు ఒక లెక్క్, డిసెంబర్ నుంచి మరో లెక్క్. అదేంటిటది డిసెంబర్ నుంచి ఏం జరగబోతోంది అంటారా.. అయితే ఈ స్టోరీ చూడండి. మహేష్ బాబు రాజకుమారుడు మూవీ నుంచి, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం వరకు, మహేష్ ఫిల్మ్ జర్నీ ఒక లెక్కలో సాగింది. కానీ డిసెంబర్ నుంచి మాత్రం మహేష్ లైఫ్ మారిపోనుంది. పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోవాల్సి వస్తుంది.ఇంతకీ డిసెంబర్ స్టోరీ ఏంటి అంటే, రాజమౌళి మేకింగ్‌లో మహేష్ నటించే , యాక్షన్ అడ్వెంచర్ మూవీ, అదే ఇండియానా జోన్స్ లాంటి సినిమా, డిసెంబర్ నుంచే పట్టాలెక్కనుంది. తారక్ స్టూడెంట్ నంబర్ వన్ నుంచి, ఇప్పుడు తెరకెక్కే కొరటాల మూవీ వరకు, తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించాడు. అయితే డిసెంబర్ నుంచి మాత్రం, తారక్ కూడా పూర్తి యాక్షన్ హీరోగా మారాల్సి ఉంటుంది. తారక్ ప్రశాంత్ నీల్ మూవీలో పూర్తిస్థాయి డైనమిక్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా డిసెంబర్ నుంచే షూటింగ్ ప్రారంభించుకోనుంది. మొత్తంగా 2023 డిసెంబర్ ఈ ఇద్దరి హీరోల కెరీర్ చాలా కీలకం. అయితే మహేష్ కంటే ముందే తారక్ నటించే యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం ప్రశాంత్ నీల్ ఫాస్ట్ మేకింగ్. ఇక రాజమౌళి సంగతి సరేసరి. మహేష్ తో మూవీని ఎప్పటికి కంప్లీట్ చేసి తీసుకొస్తాడు అనేది ఆయన చేతుల్లో కూడా ఉండదు. -
సలార్‌లో కేజీఎఫ్ హీరో యశ్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ ప్లే చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రశాంత్ నీల్.. యశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.