రిలీజ్‌కు ముందే రోర్.. కళ్లు చెదిరేలా సలార్ ప్రీ బుకింగ్స్! | Prabhas 'Salaar' Movie Tickets Advanced Booking In USA - Sakshi
Sakshi News home page

Prabhas Salaar: సలార్‌ సెన్సేషన్.. హాట్ కేకుల్లా ప్రీ బుకింగ్స్!

Published Wed, Aug 23 2023 9:46 PM | Last Updated on Thu, Aug 24 2023 10:43 AM

Prabhas Salaar Tickets Advanced Booking USA - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే'బాహుబలి' తర్వాత వచ్చిన చిత్రాలు  వందల కోట్లు కలెక్షన్స్ వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టలేకపోయాయి. ఇటీవల రిలీజైన ఆదిపురుష్ సైతం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సలార్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్​ యాక్షన్​ థ్రిల్లర్​ మూవీకి ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!)

అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే అంతేస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది ప్రభాస్ సలార్.  విడుదలకే ముందే ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది.  ఇటీవల అమెరికాలో సలార్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. కొద్ది క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్‌లో సలార్ కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇప్పటికే 150 వేల డాలర్ల ప్రీ బిజినెస్‌ జరిగిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక్క అమెరికాలోనే ఈ రేంజ్‌లో సలార్‌ ప్రీ బుకింగ్స్‌ కావడంతో.. ఇక ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: సినిమా ఫ్లాప్ అయితే తప్పు ఫ్యాన్స్‌దా? ఇదెక్కడి లాజిక్!)

కాగా.. గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్‌' సిరీస్​ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రమిదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ పతాకంపై‌ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్​, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం  సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement