నిన్న రాత్రి ప్రభాస్ ఫ్యాన్స్‌ని ప్రశాంతంగా నిద్రపోకుండా చేశాడు ప్రశాంత్ నీల్. ఉదయం 5.12 గంటలకే సలార్ టీజర్ రిలీజ్ ఉండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అలారం పెట్టుకొని మరి నిద్ర లేచి ఉంటారు. ఫ్యాన్స్‌కి అంచనాలకు తగ్గట్టే టీజర్ ఓ రేంజ్‌లో అదిరిపోయింది. భారీ పంచ్ డైలాగ్స్ లేకున్నా, హీరోని పూర్తిగా చూపించకపోయినా.. 1 నిమిషం 46 సెకన్ల నిడివి గల ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
‘కేజీయఫ్’సిరీస్ తరహాలోనే సలార్ టీజర్‌ని కట్ చేశారు. హీరో చేత ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేదు కానీ అతని ఇంట్రడక్షన్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. అచ్చం ఇలాంటి ఇంట్రడక్షన్‌నే ‘కేజీయఫ్-2’లోనూ ఉంటుంది. అక్కడ ‘హిస్టరీ టెల్స్ అజ్ ద పవర్‌ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రం పవర్‌పుల్ ప్లేసెస్. బట్ హిస్టర్ వాజ్ రాంగ్. పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్’అంటూ ఓ వ్యక్తి వాయిస్ ఓవర్‌తో హీరో పరిచయం ఉంటుంది. ఇప్పుడు సలార్‌లోనూ అలాంటి ఇంగ్లీష్ డైలాగ్‌తోనే ప్రభాస్ ఇంట్రడక్షన్స్ చెప్పించారు. ‘లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్.. వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్, బికాజ్ ఇన్ దట్ పార్క్.. ’అంటూ హీరోని ఎలివేట్ చేస్తూ టీజర్ సాగుతుంది.
(చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి .. 'సీజ్‌ఫైర్' అంటే ఏమిటో తెలుసా?)
కేజీయఫ్ సినిమా గోల్డ్ మైన్స్‌లో సాగితే.. సలార్ బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుందని టాక్. ఇక కేజీయఫ్ మాదిరే సలార్ కూడా రెండు భాగాలు రాబోతుంది. అందులో పార్ట్ 1 కి 'సీజ్ ఫైర్' అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే.. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ, హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు కానీ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడే 'సీజ్ ఫైర్'. రెండో ప్రపంచ యుద్ధంలో మొదటిసారి ఈ పదాన్ని వాడారు. ‘సీజ్‌ఫైర్’ అనే పదాన్ని ఈ సినిమాలో వాడారంటే.. ప్రభాస్ వేట ఎంత వైల్డ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28 విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment