Prabhas Deposit Rs 10,000 To 'Salaar' Support Staff - Sakshi
Sakshi News home page

Prabhas: ఇది ప్రభాస్ సర్‌ప్రైజ్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10 వేలు!

Jun 15 2023 3:40 PM | Updated on Jun 15 2023 3:56 PM

Prabhas Deposit 10 Thousand Rupees Salaar Support Staff - Sakshi


అందరూ ప్రభాస్ అంటారు కానీ ఆయన ఫుల్ నేమ్ ప్రభాస్ రాజు. మరి పేరులో రాజు ఉందనో ఏమో గానీ ఆతిథ్యం, మర్యాదలు విషయంలో ఏ మాత్రం లోటు ఉండదు. ఇప్పుడు ప్రభాస్ కొందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్స్ లో తలో రూ.10 వేలు వేశారట. ఇంతకీ ఏంటి విషయం?

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. సరిగ‍్గా ఇలాంటి టైంలో మన డార్లింగ్ హీరో.. 'సలార్' టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ చిత్రానికి పనిచేసిన సహాయక సిబ్బంది ఒక్కొక్కరి ఖాతాల్లో ప్రభాస్.. తలో రూ.10 వేలు చొప్పున డిపాజిట్ చేశాడట.

ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ విషయమే హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ 'ఆదిపురుష్' హడావుడిలో ఉంటే.. ప్రభాస్ మాత్రం 'సలార్' టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజులో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న 'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement