
ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న థియేటర్‌లోకి రావాల్సిన సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో నిరుత్సాహ పడ్డారు.
(ఇదీ చదవండి: థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా)
తాజాగా ఈ సినిమా విడుదల ప్రకటన అఫీషియల్‌గా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ 22న క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వారి నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిసెంబర్ 22 నుంచి డైనోసార్ వేట మొదలవుతుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించి నవంబర్‌లో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్ కేవలం 24 గంటల్లోపే 83 మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుని రికార్డును సృష్టించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw
— Hombale Films (@hombalefilms) September 29, 2023