Salar: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. జులై 7న రెడీగా ఉండండి | Prabhas Salaar Teaser Lock | Sakshi
Sakshi News home page

Salar: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రికార్డ్స్‌ అన్నీ బద్దలే

Published Sun, Jul 2 2023 2:17 PM | Last Updated on Sun, Jul 2 2023 2:21 PM

Prabhas Salaar Teaser Lock - Sakshi

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సలార్‌' . 'కేజీఎఫ్‌' లాంటి బ్లాక్‌ బస్టర్‌ను అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. అలాగే ‘పొగరు’ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి కూడా  ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది.

(ఇదీ చదవండి: Payal Rajput: వాళ్లు అడ్వాంటేజ్ తీసుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్స్)

ఇక 'సలార్‌' టీజర్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టీజర్‌ ఈవారంలోనే రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తయిందని అంటున్నారు.  జూలై 7న టీజర్‌ను విడుదల చేసేదుకు మేకర్స్‌ ఫిక్స్ అయినట్లు సమాచారం. సుమారు 90 సెకన్ల పాటు ఈ టీజర్‌ ఉంటుందట.

ప్రభాస్‌ నుంచి అదిరిపోయే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నారట.  టీజర్ యూట్యూబ్‌లోకి వస్తే.. ఇండస్ట్రీ లెక్కలన్నీ సలార్‌ మార్చేస్తాడని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.  సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సలార్‌ దెబ్బతో ప్రభాస్‌ ఖాతాలో రూ. 1000 కోట్లు రావడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

(ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్‌?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement