Prabhas Salaar Movie Teaser To Be Out On July 6th - Sakshi
Sakshi News home page

Prabhas Salaar Teaser Date: ప్రభాస్‌ 'సలార్‌' టీజర్‌ అఫీషియల్ ప్రకటన ఇదే

Published Mon, Jul 3 2023 1:48 PM | Last Updated on Mon, Jul 3 2023 3:40 PM

Prabhas Salaar Teaser On July 6th - Sakshi

ఆదిపురుష్‌ సినిమా విషయంలో ఎన్ని వివాదాలు వచ్చినా ప్రభాస్‌ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ప్రస్థుతం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ పేరు మారు మ్రోగిపోతుంది.  దీనికి నిదర్శనమే 'సలార్‌'పై  వస్తున్న బజ్‌ చెప్పేస్తుంది.  'కేజీఎఫ్‌' లాంటి బ్లాక్‌ బస్టర్‌ను అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా 'సలార్‌'కు సంబంధించిన అదిరిపోయే వార్తను మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా టీజర్‌ను (జులై 6) ఉదయం 5:12 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మోస్ట్‌ వయ్‌లెంట్ మ్యాన్‌ వస్తున్నాడని ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేసి పోస్ట్‌ చేశారు.

(ఇదీ చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్‌)

ప్రభాస్‌, శ్రుతీహాసన్‌ జంటగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు సలార్‌ రానుంది. టీజర్ యూట్యూబ్‌లోకి వస్తే.. పలు రికార్డులు బద్దలు కావాడం ఖాయమని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement