Prabhas Salaar Movie Premieres Record Locations in USA - Sakshi
Sakshi News home page

Salaar Movie Record: 'సలార్'తో Day-1 రికార్డులు గల్లంతే.. ఈసారి ప్రభాస్!

Published Mon, Jul 17 2023 7:39 PM | Last Updated on Mon, Jul 17 2023 8:15 PM

Salaar Movie Premieres Record Locations USA - Sakshi

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. ఎందుకంటే డార్లింగ్ హీరోకి తగ్గ మూవీ పడి చాలారోజులు అయిపోయింది. 'బాహుబలి' తర్వాత మూడు చిత్రాలు చేశాడు. అవి కలెక్షన్స్ అయితే వందల కోట్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇలా బోలెడన్నీ కారణాల వల్ల 'సలార్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవి కాదన్నట్లు మరో రికార్డు వచ్చి చేరింది.

టీజర్ సూపరే కానీ
జూలై 6న 'సలార్' టీజర్ విడుదలైంది. ఇందులో ప్రభాస్‌ని పట్టుమని పది సెకన్లు అయినా చూపించలేదు. కానీ ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. టీజర్‌లోనే ఇలా ఎలివేషన్స్ ఉన్నాయంటే.. సినిమాలో ఇంకెంత రచ్చ ఉండబోతుందా అని మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లే టీజర్.. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఇప్పటికే సరికొత్త మైలురాళ్లు అందుకుంటోంది.

(ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?)

థియేటర్ల రికార్డు
'సలార్' విడుదలకు ఇంకా రెండు నెలలకు పైనే సమయముంది. ఇంతలో అన్ని ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ డీల్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రూ.200 కోట్లకు విక్రయించారని టాక్ వచ్చింది. సరే దీని గురించి పక్కనబెడితే ఓవర్సీస్‌లో ఈసారి సలార్ ప్రభంజనం ఉండబోతుంది. ఎందుకంటే కేవలం ఉత్తర అమెరికాలోనే ఏకంగా 1979 ప్లస్ థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

5 వేలకు మించి
అయితే కేవలం అమెరికాలో దాదాపు రెండు వేల థియేటర్ల కౌంట్ ఉండగా, మన దేశం తప్పించి ప్రపంచవ్యాప్తంగా 5000 వేల థియేటర్లలో 'సలార్' విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తొలిరోజు వసూళ్లలో ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement