వెబ్‌సైట్స్‌ నుంచి సలార్‌ తొలగింపు.. డైనోసార్‌పై భారీ ఎఫెక్ట్‌ | US Theaters Websites Remove Salaar Shows & Tickets - Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్స్‌ నుంచి సలార్‌ తొలగింపు.. ఇలా ఎప్పుడూ జరగలేదంటూ..

Published Sat, Sep 2 2023 8:58 AM | Last Updated on Sat, Sep 2 2023 9:51 AM

US Theaters Websites Remove Salaar Shows - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా వాయిదా ప్రకటన ఆయన ఫ్యాన్స్‌ను  దిగ్భ్రాంతికి గురి చేసింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కానుందని ఎప్పటి నుంచో ప్రకటన ఇస్తూనే ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా సినిమా వాయిదా అనే వార్తలు రావడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. హార్ట్‌ బ్రేక్‌ అంటూ పలు కామెంట్లు పెడుతున్నారు.

(ఇదీ చదవండి: సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్‌ సీన్స్‌ అవసరమా..?)

ఈ సంవత్సరంలో విడుదలైన ఆదిపురుష్‌ విమర్శలతో పాటు భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సలార్‌తో సత్తా చాటి  పాత రికార్డులన్నింటినీ తమ డైనోసార్‌ చెరిపివేస్తుందని ఫ్యాన్స్‌ ఆశించారు. సలార్‌ వాయిదా అనే వార్తలు రావడంతో వారు ఖంగుతిన్నారు. కానీ ఈ విషయంపై మేకర్స్‌ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ అమెరికాలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయం అని తెలుస్తోంది. ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ కావడంతో  ఓవర్సీస్‌లో ఊహించని రేంజ్‌లో బుకింగ్స్ జరిగాయి. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా అక్కడ టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

(ఇదీ చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే)

తాజాగ అమెరికాలో టికెట్ల బుకింగ్‌ వెబ్‌సైట్స్‌ నుంచి సలార్‌ సినిమాను తొలగించారు. మరికొన్నిచోట్ల అయితే ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తిరిగి డబ్బు చెల్లిస్తున్నారు. USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్‌లో ఇప్పటికే దాదాపు 19,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 26రోజుల ముందే 1మిలియన్‌ డాలర్లను USAలో కలెక్ట్‌ చేసింది. అమెరికాతో పాటు పలు విదేశాల్లో ఈ సినిమా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధికారికంగా తెలిపింది.

అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే  సినిమా వాయిదా పడటం ఇక లాంచనమేనని తెలుస్తోంది. ఇలా ఎప్పుడూ జరగలేదంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆవేదన చెందుతున్నారు. సినిమా వాయిదా విషయాన్ని సలార్‌ నిర్మాత(హోంబలే ఫిల్మ్స్‌) నేడు ప్రకటించే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement