
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో అభిమానులను అలరిస్తున్నారు. పుష్ప-2లో కీ రోల్ ప్లే చేసిన జగ్గు భాయ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన సన్నీ డియోల్ జాట్ మూవీలోనూ కనిపించారు.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే సోషల్ మీడియా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. సరదా పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల ఉగాది సందర్భంగా ఇంటికెళ్లిన ఆయన.. తన మాతృమూర్తి చేతుల మీదుగా ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తాజాగా మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు జగపతిబాబు. వీధుల్లో సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్లారు. ఓ మొబైల్ షాప్‌కు వెళ్లేందుకు అందరిలాగే కాలి నడకన రోడ్డుపై నడుస్తూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నా ప్రయాణం బ్లాక్ అండ్ వైట్‌లోకి అని మీకు తెలియజేస్తున్నా అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీరు ఏంటి సార్ ఇంత సింపుల్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Naa payanam black & white loki ani miku telichestuna.. pic.twitter.com/U5M8PF8CVZ
— Jaggu Bhai (@IamJagguBhai) April 11, 2025