Jagapathi Babu
-
హ్యాపీ ఉగాది.. అమ్మ చేసిన పచ్చడిని ఆస్వాదించిన జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తనదైన పాత్రలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. గతేడాది పుష్ప-2లో మెప్పించిన జగపతి.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు గాటి, జాట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగ్గు భాయ్.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటారు. సరదా పోస్టులతో అలరిస్తుంటారు. ఇటీవల ఆమనితో కలిసి ఓ మూవీ సెట్లో సరదాగా తన సినిమా శుభలగ్నం సీన్‌ను అందరికీ గుర్తు చేశారు. మళ్లీ అమ్మేయడానికి మేకప్ వేస్తున్నావా? అంటూ ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ చేతులతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. అమ్మతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జగపతి బాబుకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.Manchivallandharikey ughaadhi subhakhankshalu… pic.twitter.com/Tc0Vq48YfT— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2025 -
కోటి రూపాయలకు మళ్లీ అమ్మేస్తావా?.. శుభలగ్నం సీన్ గుర్తు చేసిన జగపతిబాబు
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో వెండితెరపై అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది పుష్ప-2తో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న కీ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. తాను ఎక్కడికెళ్లినా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.ఇందులో ఆమని, జగపతిబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ మూవీ షూటింగ్ సెట్లో వీరిద్దరు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో పార్ట్-1.. కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.. పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. మొదటి వీడియోలో ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా.. రెండో పార్ట్‌లో ఆమనికి జగపతి బాబు మేకోవర్ చేశారు. ఇదంతా షూటింగ్ సెట్లో సరదా కోసమే చేశారు.అయితే గతంలో వీరిద్దరు జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో తన భర్త అయిన జగపతిబాబును అమ్మకానికి పెడుతుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చుకున్న జగపతి బాబు సరదాగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మళ్లీ ఇద్దరు కలిసి సరదాగా ఇలా చేయడంతో ఇది చూసిన అభిమానులు శుభలగ్నం సినిమాను గుర్తు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025 -
గోరింటాకు పెట్టించుకున్న జగపతిబాబు
గోరింటాకు అంటే ఆడపిల్లలకు ఎంతో ఇష్టం. పండగొచ్చినా, ఫంక్షన్ ఉన్నా చేతికి నిండుగా మెహందీ పెట్టుకోవాల్సిందే! అది ఎర్రగా పండితే చూసి మురిసిపోవాల్సిందే! అయితే గోరింటాకును ఆడాళ్లకు మాత్రమే పరిమితం చేస్తారా? తానూ పెట్టుకుంటానంటున్నాడు సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu). ఆడపిల్లలతో కలిసి తాను కూడా చేతికి గోరింటాకు పెట్టించుకున్నాడు. రెండు చేతులకు మెహందీఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడపిల్లలతో రంగుల రంగేలి అన్న క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు 'సూపర్ సర్', 'మీరు రానురానూ యంగ్ అయిపోతున్నారు', 'మీరు భలే చిలిపివారండీ', 'ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఒకే దగ్గరున్నట్లున్నారు' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు నిరాడంబరంగా ఉంటాడు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండేందుకే ప్రాధాన్యతనిస్తాడు. బాలనటుడిగా కెరీర్ మొదలుసినిమాల విషయానికి వస్తే మంచి మనుషులు (Manchi Manushulu) చిత్రంతో బాలనటుడిగా ఇండస్ట్రీలో రంగప్రవేశం చేశాడు. సింహస్వప్నం సినిమాతో హీరోగా మారాడు. పిల్లలు దిద్దిన కాపురం, భలే పెళ్లాం, జైలర్‌గారి అబ్బాయి, అల్లరి ప్రేమికుడు, శుభలగ్నం, భలే బుల్లోడు, సంకల్పం, మావిచిగురు, ప్రియరాగాలు, మావిడాకులు, అంతఃపురం, బడ్జెట్ పద్మనాభం, ఖుషి ఖుషీగా.. ఇలా ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.అప్పట్లో హీరోగా, ఇప్పుడు విలన్‌గా!2014 నుంచి హీరోగా కన్నా సహాయక నటుడిగా, విలన్‌గానే ఎక్కువ మెప్పించాడు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, పిల్లా నువ్వు లేని జీవితం, జయ జానకి నాయక, హలో, రంగస్థలం, మహర్షి, అఖండ, రాధేశ్యామ్, పుష్ప 2 (Pushpa 2 Movie) ఇలా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. adapilallatho ranggulla ranggelli 🎨 pic.twitter.com/F2r6sy7bqZ— Jaggu Bhai (@IamJagguBhai) December 31, 2024 చదవండి: ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్‌కు నాగవంశీ కౌంటర్ -
రోడ్ సైడ్ ఫుడ్ ఆస్వాదించిన టాలీవుడ్ నటుడు.. వీడియో వైరల్
టాలీవుడ్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు తన చిలిపి పనులతో ఆడియన్స్‌ను అలరిస్తుంటారు. చాలా సరదా, ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.భీమవరం ఫుడ్ ఫెస్టివల్లో రోడ్డు పక్కనే ఉన్న బండి వద్ద ఫుడ్ ఆరగించారు జగపతిబాబు. మరికొందరు నటులతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూటికీ ఈ మనిషి రోడ్డున పడ్డాడు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జగపతి బాబు ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటించారు. Bhimavaram food festival continuity ki ee manishi road na paddadu… Bandi food Bandi foodey… pic.twitter.com/h2KkK09Y0Z— Jaggu Bhai (@IamJagguBhai) December 25, 2024 -
రేవతి కుటుంబం కోసం వెళ్లాను.. జగపతి బాబు ఫస్ట్ రియాక్షన్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలో కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు చాలామంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్లు ఎవరూ వెళ్లలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం గురించి పుష్ప2లో కీలకపాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్‌మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు.'సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నేను ఊరి నుంచి రాగానే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే, మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నాను.' అని జగపతి బాబు అన్నారు.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్ చేశారు. కానీ, అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒక్కరైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారా..? అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజను చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/GrJCCUjMv5— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024 -
ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?)అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు. Vivaaha bojanambu..idhi prabhasa premayam Leykunda jarigindhi. evaru cheppaddhu. Chepthe ee Tanu petey food tho ee babu bali… Adhee baahubali level.. pandikoku laaga thini ambothlaaga Padukuntunanu. pic.twitter.com/64TPjI46L1— Jaggu Bhai (@IamJagguBhai) December 9, 2024 -
ఈ స్టార్ యాక్టర్ స్టైలే వేరు.. పెద్దవాడినన్న సంగతే మరిచిపోయారు!
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియా తన చిలిపి చేష్టల గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. కేవలం నటనలో మాత్రమే ఆయన సిరీయస్.. రియల్ లైఫ్‌లో బిందాస్ అన్నట్లు తన టాలెంట్‌ను చూపిస్తున్నారు. ఇంతకీ మళ్లీ ఆయన ఏం చేశారని అనుకుంటున్నారా? అదేంటో మీరు ఓ లుక్కేయండి.హీరో జగపతి బాబు తాజాగా హైదరాాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సందడి చేశారు. అదేంటీ థియేటర్లకు అందరూ వెళ్తారు.. అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? ఉందండి.. అదేంటంటే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేందుకు చాలా గేమ్స్ ఉన్నాయి. ఇంకేముంది మన హీరో వెంటనే చిన్నపిల్లాడిగా మారిపోయాడు. అక్కడున్న ఏ ఆటను వదలకుండా ఆడేశారు. చివరికీ టాయ్ ట్రైన్లో ప్రయాణించి చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. పెద్దవాడికి బుల్లి కోరికలు క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్, గుంటూరు కారం సినిమాలతో మెప్పించిన జగపతిబాబు.. త్వరలోనే రిలీజ్ కానున్న కంగువాలో నటించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.Peddhavaddiki bulli korikkalu… pic.twitter.com/8mFpV9aO30— Jaggu Bhai (@IamJagguBhai) November 11, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న జగపతిబాబు మూవీ.. ఎక్కడ చూడాలంటే?
జగపతి బాబు, ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన చిత్రం రుస్లాన్. ఈ సినిమాకు కరణ్ దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షుకలను మెప్పించలేకపోయింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరెకెక్కించిన ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం రూ.2.70 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమా వెల్లడించాయి. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు పోలీసుపాత్రలో కనిపించారు. Cinemalloki vachi undakapothe, kachitanga Super Cop ayyevadni… Ipudunna Super Coplu lagaa law & order ni gadagadaladinchevadni… em antaaru?#Ruslaan on April 26th 2024. pic.twitter.com/MORfsfu3D2— Jaggu Bhai (@IamJagguBhai) March 17, 2024 Witness the LION in his hunting mode! 🦁 21st September raat 8 baje dekhiye #Ruslaan ka World Premiere, sirf Colors Cineplex aur @JioCinema Par.#RuslaanOnColorsCineplex #RuslaanOnJioCinema #WorldPremiere #ColorsCineplex #JioCinema pic.twitter.com/OxsBZzIv66— Colors Cineplex (@Colors_Cineplex) September 17, 2024 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ చిత్రం.. పది రోజులుగా టాప్‌లోనే!
అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సింబా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. సందేశాత్మక చిత్రం కావడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రకృతిని కాపాడుకోవాలన్న కథాంశంతో ఈ సినిమాను మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ప్రస్తుతం సింబా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఏకంగా టాప్-6 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఆహాలోనూ గత పది రోజులుగా టాప్‌లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. మేసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఓటీటీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. -
'సింబా' సినిమా రివ్యూ.. థ్రిల్లింగ్ చేస్తుందా..?
టైటిల్: సింబా నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్‌సింగ్ తదితరులు నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి విడుదల తేది: ఆగస్ట్ 9, 2024కథేంటంటే.. ?హైదరాబాద్ నగరంలో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్ సింగ్) సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. విచారణ కోసం పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) నగరానికి వస్తాడు. ఈ క్రమంలో మరో హత్య కూడా అలానే జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని తెలిసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకి తరలించే క్రమంలో హత్య చేయాలని పార్థ ప్లాన్ వేస్తాడు. అయితే వీరిద్దరు కలిసి తమను చంపాడానికి వచ్చిన వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు.ఈ హత్యలో డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) భాగస్వామి అవుతాడు. అసలు ఎలాంటి సంబంధంలే లేని ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? బొద్దింకను కూడా చంపడానికి ఇష్టపడని అక్షిక..దారుణ హత్యలు ఎలా చేసింది? పురుషోత్తమ్ రెడ్డి అలియాస్ సింబా(జగపతి బాబు) ఎవరు? ఆయనకు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పార్థకి, పురుషోత్తమ్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి? పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక రివేంజ్ డ్రామా.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కు డైరెక్టర్ పరిచయం చేశారు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే, ఇందులో వాటన్నింటికి భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. భవిష్యత్ సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పస్టాప్‌లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తిగా చూపించిన దర్శకుడు.. ఈ హత్యల వెనక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలం అయ్యాడు అనిపిస్తుంది.అలా వరుస హత్యలతో పస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తిగా చెప్పడం లో కాస్త విఫలం అయ్యాడు. ఫోన్ కాల్ లిస్ట్‌తోనే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం మెప్పించదు. సెకడాఫ్‌లో క బయాలాజికల్ మెమరీ అంశం అనేది తెరపైకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) కథ ఇక్కడే మొదలౌతుంది. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకూ పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమై అయినా.. దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ముందుగా సింబా దర్శకుడు మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. ఉన్నంతలో బాగానే తీశాడు. జగపతిబాబు, అనసూయ లాంటి స్టార్స్‌ను పాత్రల మేరకు బాగానే ఉపయోగించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. కథ చివర్లో ఆయన నటించిన తీరు మెప్పిస్తుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన కబీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ మేరకు సినిమా మించే ఉందని చెప్పవచ్చు. ఫైనల్‌గా అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చే సింబా మెప్పిస్తాడు. -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
ఒక్కరిలో మార్పు వచ్చినా చాలు : అనసూయ
‘‘పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చూస్తున్నాం. ఈ నేపథ్యంతో మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘సింబా’. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే’’ అని అనసూయ అన్నారు. జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. డైరెక్టర్ సంపత్ నంది అందించిన ‘సింబా’ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ మనోహర్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సింబా’. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు’’ అన్నారు. ‘‘ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముందు తరాల గురించి ఆలోచించండి’’ అన్నారు దాసరి రాజేందర్ రెడ్డి. -
కల్కి మూవీ సక్సెస్.. పార్టీ చేసుకున్న జగపతిబాబు!
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. సలార్‌లో రాజమన్నార్‌గా తనదైన నటనతో మెప్పించారు. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన జగ్గుభాయ్.. ప్రస్తుతం పుష్ప-2, కంగువా లాంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా.. విదేశాల్లో, షూటింగ్స్‌లో ఏక్కడ ఉన్నా తన అనుభవాలను పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్ కలుపుతూ కనిపించారు. ప్రభాస్, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. Darling Prabhasa ki, Kalki team ki Cheers. 🥂 #Kalki2898AD #Prabhas pic.twitter.com/qFoJhAcQ4b— Jaggu Bhai (@IamJagguBhai) July 21, 2024 -
నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
ఒకప్పటి తెలుగు హీరో జగపతిబాబు మోసపోయాడు. స్వయంగా తానే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇన్ స్టాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోని స్టోరీగా పోస్ట్ చేశాడు. తనని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందని అన్నాడు. కానీ ఆ సంస్థ పేరు మాత్రం త్వరలో చెబుతానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: 'హనుమాన్' నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే?)జగపతిబాబు ఏం చెప్పాడు?'రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్గా హెచ్చరించారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నేను నటించాను. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి' అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.హీరోగా కొన్నేళ్ల పాటు అలరించిన జగపతిబాబు.. 'లెజెండ్' మూవీతో విలన్‌గా మారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేశాడు. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చాడు. ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా తనని మోసం చేశారని చెప్పి షాకిచ్చాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
గుంటూరు కారం.. అంతా వేస్ట్ అయిపోయింది: జగపతిబాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి రిలీజైంది. సరిగ్గా అప్పుడే చిన్న చిత్రం హనుమాన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం చిత్రాన్ని వెనక్కు నెడుతూ హనుమాన్ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మహేశ్ సినిమాకు కలెక్షన్స్ అయితే చూపెట్టారు కానీ అదే సమయంలో నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ మూవీలో జగపతిబాబు విలన్‌గా నటించాడు. నిజం చెప్తున్నా తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్‌బాబుతో పని చేయడం నాకెంతో ఇష్టం. కానీ నిజాయితీగా చెప్తున్నా.. గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండాల్సింది. క్యారెక్టర్లను ఇంకా మెరుగ్గా రాసుకోవాల్సింది. కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారింది. దీంతో సినిమా పూర్తి చేయడం కష్టమైంది. వేస్ట్ నేను చేయాల్సింది చేశాను. కానీ.. మహేశ్‌తో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలనుకుంటాను. ఇలాంటి సినిమాల కోసం మా కాంబినేషన్‌ను వేస్ట్ చేయాలనిపించదు' అని చెప్పుకొచ్చాడు. జగపతిబాబు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్, పుష్ప 2 సినిమాలు చేస్తున్నాడు. అలాగే తమిళంలో కంగువా, హిందీలో రుస్లాన్ సినిమాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఒకప్పుడు రూ.500 అద్దె.. ఇప్పుడదే ఇల్లు కోరుకుంటున్న హీరో -
పవర్ఫుల్ పాత్రలో...
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ‘నామ్ తో సునా హోగా’ అన్నది ట్యాగ్‌లైన్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. చెస్ మూవ్‌ని చేతిలో పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న లుక్ బాగుంది. ‘‘మిస్టర్ బచ్చన్’లో జగపతి బాబు పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ సిరీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయనంక బోస్. -
'అందువల్లే నాకు అవకాశాలు రావడం లేదు'.. జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. లెజెండ్ సినిమా తర్వాత పూర్తి స్థాయి విలన్‌గా మారిపోయారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో జగ్గు భాయ్ నటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. తాజాగా జగపతిబాబు ఓ వీడియోను తన ట్విటర్లో పంచుకున్నారు. లెజెండ్ తర్వాత తన కెరీర్లో వచ్చిన మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు చిన్న సినిమాలు చేయాలని కోరిక ఉంది. కమిటేడ్గా చేస్తున్నారు. కొత్తగా ఉంటున్నాయి సినిమాలు. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని. నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఓకే. కానీ ఆ సినిమాల షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అని.. వేరే అవకాశాలు రావడం లేదు. కానీ మరోపక్క.. అమ్మో జగపతిబాబు పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారని' అని చెప్పారు. 'కానీ పెద్ద సినిమాల వాయిదాల వల్ల నాకున్న చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో అటు.. ఇటు కాకుండా అయిపోయా. గతంలో రెండు, మూడుసార్లు నా పని అయిపోయిందని ఓ స్టేజీలో నేనే అనుకున్నా. అది కూడా లెజెండ్ సినిమాకు రెండు నెలల ముందు. కానీ మళ్లీ వచ్చాను. మీ జగపతిబాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్తాను.. కానీ మళ్లీ వస్తూనే ఉంటాను.' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. అంతే కాకుండా లెజెండ్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా.. జగపతిబాబు ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. Dabbunna Pedhavadini….. Inko #Legend kosam Eduruchustuna. pic.twitter.com/C1GzB8RXrR — Jaggu Bhai (@IamJagguBhai) April 2, 2024 -
సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. కచ్చితంగా ఆ జాబ్ కొట్టేవాడిని: టాలీవుడ్ నటుడు
టాలీవుడ్లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. హీరోగా, విలన్‌గా తనదైన నటనతో మెప్పించారు. లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలో మెప్పించిన జగపతి బాబు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ అలరించారు. ఇటీవల సలార్, గుంటూరు కారం చిత్రాల్లోనూ సందడి చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటించనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫన్నీ పోస్టులతో అభిమానులను అలరిస్తుంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ సరదా కామెంట్స్ పెడుతుంటారు. తాజాగా ఇవాళ అలాంటి పోస్ట్ చేశారు. సినిమాల్లోకి వచ్చి ఉండకపోతే.. కచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యేవాడిని.. ఇప్పుడుున్న సూపర్ పోలీసుల్లాగే లా అండ్ ఆర్డర్‌ను గడగడలాడించేవాడిని..మీరేమంటారు? అంటూ పోలీసు డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Cinemalloki vachi undakapothe, kachitanga Super Cop ayyevadni… Ipudunna Super Coplu lagaa law & order ni gadagadaladinchevadni… em antaaru?#Ruslaan on April 26th 2024. pic.twitter.com/MORfsfu3D2 — Jaggu Bhai (@IamJagguBhai) March 17, 2024 -
సిగ్గు లేకుండా అడుగుతున్నా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
-
‘సిగ్గు లేకుండా..’ బర్త్‌డే రోజు జగ్గూ భాయ్ పోస్ట్.. వైరల్!
టాలీవుడ్లో పరిచయం అవసరం లేని విలక్షన నటుడు జగపతి బాబు. ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న జగ్గూభాయ్ తరువాత విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్టుగా తనను తాను మల్చుకుని మరింత సెన్సేషన్‌గా అవతరించాడు. పాత్ర ఏదైనా సరే..తనదైన స్టయిల్లో ట్రెండ్ సెట్ చేస్తాడు. అందుకే దర్శక నిర్మాతల ఫేవరెట్‌గా మారిపోయాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజుగా సందర్బంగా తన ట్విటర్లో ఒక వెరైటీ పోస్ట్పెట్టాడు జగ్గూభాయ్. ‘‘ఎలాగోలా పుట్టేశాను.. సిగ్గు లేకుండా అడుగుతున్న.. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఇక రెండోది.. తొందరగా డిసైడ్ చేయండి..ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు” అంటూ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఒకవైపు మిల్క్ బాటిల్ ఇంకోవైపు గ్లేన్ఫిడిచ్ మద్యం బాటిల్‌తో ఉన్న ఫొటో షర్ చేశాడు. దీంతో ఫన్సీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ సందడిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్ వైరల్‌గా మారింది. Elagola Putteysanu. siggu lekunda adugutuna, mee andari ashishulu naku kaavali.. Rendodhi, alochinchakunda quick ga decide cheyandi ee renditlo edhi kotamantaru? pic.twitter.com/k8FaHEq4KG — Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2024 -
'సిగ్గు లేకుండా అడుగుతున్నా': జగపతి బాబు పోస్ట్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జగ్గుభాయ్ ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలో మెప్పించిన జగపతి బాబు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ మెప్పించారు. బాలనటుడిగా ఎంట్రీ 1962 ఫిబ్రవరి 12న మచిలీపట్నంలో జన్మించిన జగపతి బాబు తెలుగులో మంచి మనుషులు సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సింహ స్వప్నం అనే సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు, శుభలగ్నం, పెళ్లి పందిరి, మావిడాకులు, పెళ్లి పీటలు లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా మనోహరం, గాయం వంటి యాక్షన్ సినిమాల్లోనూ మెప్పించారు. తాజాగా ఇవాళ ఆయన 63వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా జగపతి బాబు చేసిన ఫన్నీ ట్వీట్ నెట్టంట తెగ వైరలవుతోంది. చేతిలో వాటర్ బాటిల్, వైన్ పట్టుకుని ఉన్న ఫోటోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. తన ట్విటర్లో రాస్తూ.. 'ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్నా. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఆలోచించకుండా త్వరగా డిసైడ్ చెయ్యండి. ఈ రెండిట్లో ఏది తాగమంటారు?' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కొత్త ఏడాదిలో గుంటూరు కారం, కాటేరా సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. Elagola Putteysanu. siggu lekunda adugutuna, mee andari ashishulu naku kaavali.. Rendodhi, alochinchakunda quick ga decide cheyandi ee renditlo edhi kotamantaru? pic.twitter.com/k8FaHEq4KG — Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2024 -
అతను మా కుమారుడి లాంటి వ్యక్తి.. జగపతిబాబు పోస్ట్ వైరల్!
టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. విభిన్నమైన పాత్రలతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులనతో టచ్‌లో ఉంటారు. తాజాగా తన మేనేజర్ బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేశారు. జగపతిబాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా మేనేజర్ మహేష్. మా కొడుకు లాంటి వ్యక్తి పుట్టిన రోజు సందర్బంగా ఎప్పటికీ నా ఫ్యామిలీతో పాటు ఉండే.. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో మా ఇంట్లో భోజనాల పండగ…. నాకు ఒక్కడికే రోజంత మజ్జిగా... పాపం నేను.' అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆరాధనా రామ్ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్‌గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. .@dasadarshan 's #Kaatera remains unstoppable at the box office, enjoying a substantial #NewYear2024's boost with a gross collection of Rs 18.26 crore on #Jan1, bringing the total to an impressive Rs 77.6 crore in 4 days. @TharunSudhir @RocklineEnt @jadeshaakhampi #Maasthi… pic.twitter.com/1WQeQL1Yok — A Sharadhaa (@sharadasrinidhi) January 2, 2024 This is huge for 3rd day 💥 Official announcement from team itself 🔥#Kaatera 3rd day collection: 20.94 cr Overall collection from 3 days: 58.8 cr💥 Film crossed 50 cr+ in just 3 days ❤️ Inching towards 💯 cr🔥#Dboss @dasadarshan 👑#BossOfSandalwood #KaateraBORampage pic.twitter.com/RgHsbrbhIP — ಕೃಷ್ಣ❤️ KAATERA 29th DEC (@JacksparrowD60) January 1, 2024 -
అభిమానుల దెబ్బకు మెంటలెక్కిపోయిన జగపతిబాబు!
హీరోలకు ఫ్యాన్స్ ఉండటం చాలా సాధరణం. స్టార్ హీరోలకు కోట్లలో ఫ్యాన్స్ ఉంటే మిడ్ రేంజు హీరోలకు అంతలా కాకపోయినా లక్షల్లో అయినా ఉంటారు. అయితే కొన్నిసార్లు అభిమానులం అని పేరు చెప్పుకొని మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు తెలుగు స్టార్ హీరో, నటుడు జగపతిబాబుకి అలాంటి ఓ పరిస్థితి ఎదురైంది. దీంతో ఫ్యాన్స్ కి దండం పెట్టేసి మరీ ఓ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) ఏం జరిగింది? అందరు హీరోల్లానే జగపతిబాబు కూడా అప్పట్లో హీరోగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం విలన్, తండ్రి పాత్రలు చేస్తున్నాడు. ఇతడు అభిమాన సంఘాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వాళ్లలో కొందరు హీరో అని ప్రేమ చూపించడం కంటే డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నట్లున్నారు. దీంతో ఈ తరహా పనులకు చెక్ పెట్టాలని బాధతో ఓ ట్వీట్ పెట్టాడు. ట్వీట్లో ఏముంది? 'అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లా.. అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్యకారణంగా భావించాను. వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను. కానీ బాధకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులకు ప్రేమ కంటే అశించడం ఎక్కువైపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి అభిమాన సంఘాలు, ట్రస్టుతో నాకు సంబంధం లేదు. వాటి నుంచి విమరించుకుంటున్నాను. కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను' అని జగపతిబాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T — Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023 -
నన్ను చదవనిచ్చేవాడు కాదు...అంతగా అల్లరి చేసేవాడు
-
బసిరెడ్డి పాత్ర నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది: జగపతిబాబు
-
ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను
-
'మీరు అన్నందుకే ఇదంతా'.. వైరలవుతున్న జగపతిబాబు పోస్ట్!
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, ప్రతినాయకుడిగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవలే రుద్రంగి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మెప్పించలేదు. ప్రస్తుతం జగపతిబాబు అల్లు అర్జున్, సుకుమార్ కాంబో తెరకెక్కుతోన్న పుష్ప-2 లో నటిస్తున్నారు. దీంతో ప్రభాస్ సలార్, మహేశ్ బాబు గుంటూరు కారంలోన కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) అయితే ఇటీవల జగపతిబాబు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కాస్తా డిఫరెంట్‌గా పోస్టులు పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. గతంలో ఇంట్లో పని చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా తన ఇన్‌స్టాలో పింక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. అది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేశారు. వయసు ఎంత పెరిగినా మీరు ఇంకా యువకుడిలాగే ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. అయితే జగపతిబాబు ఫ్యాన్స్ కోసమే ఇలా ఉంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొహానికి మేకప్ వేసుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా టిష్యూ పేపర్‌ను అలాగే ఉంచుకుని మరీ ఫన్నీగా కనిపించారు. ట్వీట్లో రాస్తూ..'ఇంతకు ముందు ఇన్‌స్టాలో పింక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను చూసి నన్ను కుర్రాడి లాగా ఉన్నానని మీరందరు చెప్పారు. అందుకే యెచ్చులు ఎక్కువ అయిపోయాయి. నిజంగానే కుర్రాడు అయిపోదామని నా మొహాన్ని రెడీ చేస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం మీరు హ్యాండ్సమ్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగపతి బాబు చేస్తున్న ఫన్నీ పోస్టులు అభిమానులకు సరికొత్త థ్రిల్ అందిస్తున్నాయి. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) Intaka mundhu insta lo Pink dress lo, kurradu laaga unnanu ani meerandharu cheppinnaka, yecchu ekkuvu ayipoyi, nijamga kurradini ayyipoddham ani mokkaani ready chesthunnanu.... pic.twitter.com/1atXaKFxtz — Jaggu Bhai (@IamJagguBhai) September 20, 2023 -
నాలుగు రోజులకే నా సినిమా ఎత్తేశారు: జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్‌దాస్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని అన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సంగతి తెలిసిందే. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్‌పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి : చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు) జగపతి బాబు మాట్లాడుతూ.. 'రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని సినిమా చేశా, కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన వారిలో కనిపించలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయింది. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. నా రేంజ్ కాకపోయినా సినిమా చేశఆను. కానీ నేను సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను కూడా. అవేమీ నిర్మాత పట్టించుకోలేదు.' అని అన్నారు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు. -
డిప్రెషన్లోకి వెళ్లా.. ప్రభాస్‌కి కాల్ చేసి ప్రాబ్లమ్ చెప్తే.. : జగపతిబాబు
ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబు ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్ స్టైలీష్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ అదరగొడుతున్నాడు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్న జగ్గుభాయ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో ప్రభాస్, రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసల జల్లు కురిపించాడు. రాజమౌళి కుటుంబం అంతా అలానే.. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించిన రాజమౌళి ఫ్యామిలీలో గర్వం కనిపించదు. ఒకరో ఇద్దరు కాదు ఆయన ఫ్యామిలీ అంతా అలానే ఉంటుంది. అందరిని ప్రేమగా చూసుకుంటుంది. వాళ్లు హాలీడే ట్రిప్‌లో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు. నా బంధువే కదా అని తన సినిమాలో పాత్ర అడిగే బాగోదు. రాజమౌళి కూడా అలా మొహమాటంతో ఇచ్చే వ్యక్తి కాదు. తన సినిమాలో పాత్రకు ఎవరు సెట్ అవుతారో వారినే తీసుకుంటారు. సినిమా విషయంలో వాళ్లు అంత జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి కుటుంబం నుంచి 20 శాతం నేర్చుకున్న చాలు. ప్రభాస్ది గొప్ప హృదయం హీరో ప్రభాస్‌కి ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు. ఎవరే సాయం కావాలన్నా చేస్తాడు. నేను ఓ సారి డిప్రెషన్లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కి ఫోన్ చేసి మాట్లాడాలని అడిగా. తను జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్.. నేనున్నా కదా? నీ ప్రాబ్లమ్ చెప్పు.. నేను తీరుస్తా’అని ధైర్యం చెప్పాడు. జార్జియా నుంచి తిరిగి రాగానే నన్ను కలిశాడు. ఆ సయమంలో ప్రభాస్ ఓదార్పు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. వయసులో నా కంటె చిన్నవాడైనా గొప్ప హృదయం తనది. అందరిని ప్రేమగా ఆదరిస్తాడు’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
నా జీవితంలో తొలిసారి ఇలా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెడుతున్నారు. ఆ మధ్య ‘పరంపర’ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు మహేశ్‌బాబు-త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటాడు జగ్గూ భాయ్. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణం చేస్తున్న ఫోటోని నేను చేస్తూ.. అందులో మొదటి సారిగా మొదటి ప్రయాణికుడిగా ఎక్కానని చెప్పుకొచ్చాడు. (చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?) ‘నా జీవితంలో ఫస్ట్ టైమ్ మొదటి ప్యాసింజర్‌గా విమానం ఎక్కాను. ఈ సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. ‘విమానం ఎగురుతుంది కానీ.. నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చుంటావ్ అంతే’..త్రివిక్రమ్ చెప్పిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క డైలాగ్‌తో జీవితం మొత్తాన్ని చెప్పాడు’అని జగపతి బాబు రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కాగా.. ‘ఫ్లైట్‌ని హైజాక్ చేస్తున్నారా?’, ఒక్కరే ఫ్లైట్ బుక్ చేసుకున్నారా? ఏ సినిమా షూటింగ్ ఇది? అప్డేట్ ఇవ్వండి’అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్) తాజాగా ఈ చిత్రం రిలీజై నెలరోజులు కాకముందే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 1వ తేది మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. స్వాతంత్య్రం అనంతర తెలంగాణలోని సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. భీమ్రావ్ దేశ్‌ముఖ్‌గా జగపతిబాబు నటించారు. (ఇది చదవండి: నిర్మాతతో సహజీవనం.. నటి సంచలన ఆరోపణలు!) -
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
‘లెజెండ్’ సినిమాను గుర్తుచేసుకున్న జగపతిబాబు
'మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ సినిమా అవకాశం వచ్చింది. అది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అందరూ పేరు పెట్టారు. ‘రుద్రంగి’కి నా థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఇందులోని నా పాత్రలో దమ్ము ఉంటుంది' అని నటుడు జగపతిబాబు అన్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– 'చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్గా విడుదలైన ‘సామజ వరగమన’ మంచి హిట్ అయింది. ‘రుద్రంగి’ కథ కూడా కొత్తగా ఉంటుంది' అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– 'జగతిబాబుగారి ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన వాస్తవ కథే ‘రుద్రంగి’. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా.. ఇప్పుడు ‘రుద్రంగి’ తీశా. అంతేగానీ ఎమ్మెల్యే అని ఈ సినిమా తీయలేదు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి' అన్నారు. -
'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు'
'యమదొంగ’ సినిమాలో మమతా మోహన్ దాస్‌గారి నటనంటే నాకు ఇష్టం. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’లో నటించమని కోరాను. ‘పదేళ్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు.. నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్’ అన్నారామె' అని డైరెక్టర్ అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ– 'బాహుబలి, రాజన్న’ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా చేశాను. ఇక నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’ కథ రాసుకున్నాను. తెలంగాణలో దొరల అణ చివేతల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘రుద్రంగి’ని పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎమోషనల్, సోషల్ డ్రామాగా తీశాను. రసమయిగారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంది.. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. సినిమా బాగుంటే జనాలు చూస్తారు. ‘కాంతారా’కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. కానీ, జనాలు విపరీతంగా చూశారు. మా ‘రుద్రంగి’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్‌గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
నా బిడ్డకు ఓ తండ్రిగా ఉపకారం కంటే అపకారం ఎక్కువ చేశా..
-
యాంకర్ గా నవదీప్ కొత్త అవతారం. రివర్స్ లో ఆదుకున్న జగపతిబాబు, గోపీచంద్
-
సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు
‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది. ► సెకండ్ ఇన్నింగ్స్‌లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని బలంగా మలిచాడు శ్రీవాస్. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ప్రాధాన్యతని చక్కగా చూపించాం. ► నేను హీరో కాదు.. విలన్ కాదు.. యాక్టర్‌ని. అందులోనూ డైరెక్టర్స్ యాక్టర్‌ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ కాదు. పాత్ర నచ్చకపోతే కుదరదని చెబుతున్నాను. ► సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను. ► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్లోనివే. -
రామబాణం టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే....!
-
Ramabanam Movie Stills: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్
Ramabanam Movie HD Stills : గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్ -
మహేశ్ బాబు సినిమాలో నా రోల్ చాలా వైల్డ్‌గా ఉంటుంది : జగపతి బాబు
హీరో జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం అలరిస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో SSMB28 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. అద్భుతమైన పాత్రలను క్రియేట్ చేసే దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. గతంలో ఆయన దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటించాను. చదవండి: అప్పుడే ఓటీటీలోకి లారెన్స్ 'రుద్రుడు' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే.. ఇప్పుడు దానికంటే భిన్నంగా, వైల్డ్‌గా పవర్‌ఫుల్‌గా SSMB28లో కనిపిస్తాను అంటూ వెల్లడించారు జగపతి బాబు. ఈ సినిమాతో పాటు పుష్ప-2, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు జగపతి బాబు. అంతేకాకుండా బాలీవుడ్‌లోనూ మరో మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. -
పుష్ప 2 నుండి అదిరిపోయే అప్డేట్..
-
పుష్ప-2లో జగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా నటిస్తున్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో జగపతిబాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన బాక్సాఫీస్ సునామీ మనందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది పుష్ప2. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెుత్తం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, అల్లు అర్జున్ పిక్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పుష్ప-2 చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జగపతిబాబు.. విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రల్లో మెప్పించారు. తాజాగా పుష్ప-2లో ఓ క్రేజీ క్యారెక్టర్‌తో అభిమానులను అలరించనున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న జగపతిబాబు పుష్ప-2లో నటిస్తున్నట్లు తెలిపారు. జగపతి బాబు మాట్లాడుతూ..'సుకుమార్‌తో కలిసి పనిచేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పుష్ప-2లో ఛాలెంజింగ్ పాత్రలోనే నటిస్తున్నా. నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయడమే ఇష్టం. సుక్కుతో కలిసి పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా.' అంటూ చెప్పుకొచ్చారు. బన్నీ గురించి చెబుతూ.. దాదాపు 20 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ను జిమ్‌లో చూశా. అప్పుడు ఎవరో కూడా నాకు తెలియదు. తాను హార్డ్ వర్క్ చేయడం గమనించా. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్న అతన్ని చూస్తుంటే గర్వంగా ఉంది.' అంటూ ప్రశంసించారు. కాగా.. ప్రస్తుతం జగపతి బాబు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సలార్‌తో పాటు కన్నడలోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. -
‘రామబాణం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
-
గోపిచంద్‌తో శ్రీవాస్ హ్యాట్రిక్ పక్కా! ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది..
‘‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుంది. ఈ చిత్రంతో గోపీచంద్– శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విశేషాలు. ► సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి, ఫ్యాక్టరీ మోడల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా ఎక్కువ తీస్తున్నాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదగడం హ్యాపీ. ► శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనిపించింది. క్రియేటివ్ సైడ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. మంచి ఔట్పుట్ తీసుకొచ్చారు. ► కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్‌తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. -
‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’ ఆసక్తికరంగా టీజర్
‘మై నేమ్ ఈజ్ భీం రావ్ దేశ్‌ముఖ్..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ‘రుద్రంగి’ సినిమా టీజర్ విడుదలైంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 26న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘స్వాతంత్య్రం అన్నది బానిసలకు కాదు.. అది మా కోసం’, ‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’(జగపతి బాబు), ‘నీకు ఎదురు తిరిగిన మల్లేశ్గాడు ఖతం కావాలె(మమతా మోహన్ దాస్) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
జగపతి బాబు తల్లి ఇల్లు చూశారా? అడవిలాంటి ఇంటిలో ఒకటే రూం..
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రతికథానాయకుడిగా మెప్పిస్తున్నారు. బాలకృష్ణ లెజెండ్ మూవీతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత తగ్గేదే లా అంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశమైన తన అభిప్రాయన్ని స్ట్రేట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తుంటాడు. అలా ఆయన చేసిన కామెంట్స్ వార్తల్లో నిలుస్తుంటాయి. చదవండి: విష్ణు-మనోజ్ మధ్య విభేదాలు? మోహన్ బాబు ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే గురువారం(మార్చి 30న) శ్రీరామ నవమి సందర్భంగా జగపతి బాబు ఆసక్తికర వీడియో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని తన తల్లి ఇల్లు చూపిస్తూ స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు. శ్రీరామ నవమి సందర్భంగా పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని చెప్పాడు. ‘అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పానకం తాగాలనిపిచ్చింది. అందుకు మా అమ్మ ఇంటికి వచ్చాను. ఈ ప్లేస్ అంతా ఒక అడవిలా ఉంటుంది. కానీ, హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు, నూకలతోప కావాలన్నా. ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది. చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత అమ్మ చేతితో మంచి భోజనం చేయబోతున్నాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. హ్యాపీగా ఉంటుంది. ఒక యోగి, యోగిని అంటారే ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది. ఓకే బై బై’ అంటూ జగపతి బాబు తన తల్లి ఇంటిని పరిచయం చేశారు. అయితే వాళ్ల అమ్మను మాత్రం చూపించకుండానే వీడియో ముగించారు. ఇక తన తల్లి ఇల్లు చూడటానికి తపోవనంను తలపిస్తోంది. అంతేకాదు ఆమె ఇంటి లోపలికి వెళ్లాగానే రుషి బొమ్మ కూడా దర్శనం ఇస్తుంది. చూట్టూ పచ్చని చెట్లతో ఆహ్లదకర వాతారవరణంతో అడవిని తలపిస్తున్న ఆమె ఇల్లు హైదరాబాద్ నడిబొడ్డున ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
జగ్గూభాయ్‌తో గోపీచంద్.. అదిరిన 'రామబాణం' పోస్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. గతంలో గోపీచంద్‌కి లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్‌కి ఇది మూడో చిత్రం. ఈ వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ(గురువారం)శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో గోపీచంద్‌తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. పంచెకట్టులో చేతులు పట్టుకొని నడుస్తున్న స్పెషల్ లుక్ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. -
జగపతిబాబును ఇలా ఇంతకుముందెన్నడూ చూసి ఉండరేమో! (ఫొటోలు)
-
చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన ప్రస్తుతం విలన్‌గా మెప్పిస్తున్నారు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశంపైన అయిన స్ట్రేట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జగపతి బాబు తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పిల్లలు, వారి పెళ్లిళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి పేరు మేఘన.. అమెరికన్‌ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను అమెరికాలో సెటిల్ అయ్యింది. చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. తనకి పెళ్లి చేసుకోవద్దనే చెప్పా. ఒకవేళ తను చేసుకుంటానంటే మాత్రం కాబోయే భర్తను తానే వెతుక్కోమని చెప్పాను. నేను మాత్రం అబ్బాయిని చూడనని చెప్పాను. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి తప్పు చేశానని ఫీల్ అవుతున్నా’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అనంతరం మాట్లాడుతూ.. ‘నా పిల్లలు అంటూ మన ఆశలను వారిపై రుద్దడం తప్పు. వారికంటూ ఓ జీవితం, స్వతంత్య్రం ఉంటుంది. మన స్వార్థం కోసం పిల్లలను పెళ్లి చేసుకోమనడం, పిల్లలను కను అనడం స్వార్థం అవుతుంది. తండ్రిగా పెళ్లి చేయడం నా బాధ్యత అని అనడం నా దృష్టిలో తప్పు. అది స్వార్థం అవుతుంది. నీ ఇష్టం.. నీకు నచ్చినంటూ నువ్వు ఉండు అని చెప్పడం ప్రేమ’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అదే విధంగా తన పెద్ద అమ్మాయి పిల్లలను కనని చెప్పిందని, కుక్కలు, పిల్లులను పెంచుకుంటానందని చెప్పిందన్నారు. తను అలా చెప్పడంతో వెంటనే సరే.. నీ ఇష్టమని చెప్పానని జగపతి బాబు పేర్కొన్నారు. -
వారం రోజులు తిండి పెట్టలేదు, చులకనగా చూశారు: జగపతిబాబు
హీరోగా, హీరో తండ్రిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు జగపతి బాబు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన కెరీర్లో గుర్తుండిపోయిన ఓ సంఘటనను మీడియాతో పంచుకున్నాడు. 'నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్లవుతోంది. నాకు సినిమా తప్ప మిగతా ఏం తెలియదు. నాకు బాగా గుర్తుండిపోయిన చేదు సంఘటన చెప్తాను.. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ మూవీ షూటింగ్లో ఏడు రోజులపాటు నాకు తిండిపెట్టలేదు, కనీసం తింటారా? అని కూడా అడగలేదు. అప్పుడు లైట్‌బాయ్ కూడా నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఈ అవమానం నాకు మంచి గుణపాఠం నేర్పించింది. ఇక్కడే ఉంటాడులే, ఎలాగో సినిమా చేస్తాడులే అని నన్ను చులకనగా చూసేవారు. ఇతర భాషల్లో సినిమాలు చేసి వస్తే మాత్రం అప్పుడిక్కడ మనకు ప్రత్యేక గౌరవమిస్తారు' అని చెప్పుకొచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'పెద్దమ్మాయి అమెరికన్‌ను పెళ్లాడింది. చిన్నమ్మాయినైతే పెళ్లే వద్దన్నాను. వివాహం అనే సాంప్రదాయాన్నే నమ్మను. పెళ్లి, పిల్లలు.. అని బాధ్యత తీర్చుకోవడానికి వారి వెంటపడటం కరెక్ట్ కాదు. చిన్నమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే తననే వెతుక్కోమన్నాను' అని చెప్పుకొచ్చాడు జగ్గూభాయ్. చదవండి: మనోజ్ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మీ సమాధానం ఏంటంటే? -
ఆస్తులు ఎక్కడికీ పోలేదు.. పోగొట్టుకోలేదు: జగపతి బాబు
టాలీవుడ్లో దశాబ్దాల పాటు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. హీరోగా, విలన్‌గా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆయన నటనకు నిదర్శనం. ఆయన కెరీర్లో వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ హీరోగా నిలదొక్కుకున్నారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఏడు నంది అవార్డులు అందుకున్నారంటే అంత కన్నా చెప్పాల్సిన అవసరం లేదు. జగపతి బాబు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో ఆయన మెప్పించారు. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, శ్రీమంతుడు, అరవింద సమేత వీరరాఘవ చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రలు చేశారు. శుభలగ్నం, హనుమాన్ జంక్షన్ సినిమాలు పోలిస్తే రెండు కూడా ప్రత్యేక పాత్రలు కనిపిస్తాయని అన్నారు. ఆస్తులపై జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు ఆస్తులు ఎందుకు లేవు. మిగతా అందరూ అనుకున్నట్లు నా ఆస్తి ఎక్కడికి పోలేదు. ఆస్తి అనేది ఎలా పోయిందనేది నాకు తెలియదు. నన్ను ఎవరు మోసం చేశారో వారి గురించి ఆలోచించను. దాని గురించి పట్టించుకోను. ఎవరినీ ఇందులో బ్లేమ్ చేయదలచుకోలేదు. రూ.30 కోట్లు ఉంటే హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నా. ఆస్తులు మిగల్చకపోవచ్చు కానీ బిజినెస్ చేద్దామనుకున్నా. ఇది నా సామర్థ్యం. ఈ విషయాన్ని పిల్లలకు కూడా చెప్పేశా. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటాం. లాస్ట్ ఇయర్ రూ.30 కోట్లు వచ్చేశాయి. కానీ నేను మళ్లీ ఎక్కువ సంపాదించాలనుకోలేదు. కోట్ల ఆస్తులు ఉంటే సంతోషంగా ఉంటామనేది రాంగ్. ఎన్ని కోట్లున్నా కొవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చనిపోయిన వారున్నారు. కానీ అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకూడదు. చేతిలో రెండు ఫోన్లు చేతిలో పట్టుకుని అవకాశాల కోసం వెయిట్ చేసిన రోజులున్నాయ్.' అని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూవీ సలార్లోను కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి వద్దని చెప్పా జగపతి బాబు మాట్లాడుతూ.. 'నా పిల్లలు నేను చెప్పినట్లు వినాలనేది రాంగ్ కాన్సెప్ట్. ఎవరినీ మనం తక్కువ చేయకూడదు. ఫ్యామిలీకి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. సెకండ్ మ్యారేజ్ గురించి నేను ఆలోచించను. రెండో పెళ్లి చేసుకుంటే లైఫ్ క్రాష్ అవుతుంది. చిన్న పాపకు పెళ్లి వద్దని చెప్పా. నేనైతే బలవంతం చేయను. నువ్వు చేసుకుంటే వద్దనను. అని నా ఒపినియన్ చెప్పా. పెళ్లి, పిల్లలు అనేది స్వార్థం. వాళ్లకేం కావాలో మనం ఆలోచించడం లేదు. నేను అందరి హీరోయిన్లతో బాగుంటాను. ఎవరైనా నా ఫ్రెండ్స్‌గానే భావిస్తాను.' అని అన్నారు. -
పుష్ప-2లో సీనియర్ హీరో.. సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
అల్లు అర్జున్-రష్మిక మందన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన జగపతిబాబు తాజాగా పుష్ప-2లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ పుష్ప-2లో కూడా సెంటిమెంట్ కంటిన్యూ చేయనున్నారు.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. -
దేవుడా.. ఆ డబ్బంతా నాకిచ్చెయ్.. జగ్గూభాయ్ ట్వీట్ వైరల్
ఒకప్పడు హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. లెజెండ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ ముందుకెళ్లిపోతున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెడుతున్నారు. ఇటీవలే ‘పరంపర’ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు ఎన్టీఆర్ 30వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. (చదవండి: ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్) జగపతి బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తుంటాడు. కొటేషన్లు షేర్ చేస్తుంటాడు. వేధాంతం వల్లిస్తుంటాడు. తాజాగా జగపతి బాబు.. సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ‘దేవుడా.. అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకిచ్చెయ్.. చెప్పలేక చస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. జగ్గూభాయ్ చేసిన ఈ ఫన్నీ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ముందుగా మీ దగ్గర ఉన్న డబ్బు నాకు ట్రాన్స్ఫర్ చేయండి.. ఆ తర్వాత దేవుడు మీకు పంపిస్తాడు’, నీ కోరిక ఈ దేవుడి దగ్గర నెరవేరదు.. ‘లక్ష్మీదేవి లేదా కుభేరుడిని పూజిస్తే.. నీ కోరిక నెరవేరుతుంది’ అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. Devuddaa...Andharu naa daggara undhanukuntuna dabbu naaku iccheyi...cheppaleka Chastuna. pic.twitter.com/mGpe9D4Ty5 — Jaggu Bhai (@IamJagguBhai) November 13, 2022 -
సొంతిళ్లు ఉన్నా..అద్దెకుంటున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!
సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మనకు ఓ ఇల్లు ఉంటే చాలా ఆనందంగా ఫీలవుతాం. ఇక టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఇళ్లు ఇంద్ర భవనాలను తలపిస్తాయి. వారి కోట్లు వెచ్చించి మరీ నచ్చినట్లుగా, చాలా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. అన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఇంట్లో అదృష్టంగా భావిస్తారు. కానీ కొందరు ప్రముఖులు సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. విలాసవంతమైన భవనాలు వదిలి అద్దెకుంటున్న ఆ టాలీవుడ్ ప్రముఖులు ఎవరో ఓ లుక్కేద్దాం. మహేష్ బాబు: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అతిపెద్ద భవనం ఉంది. కానీ మన ప్రిన్స్ అందులో ఉండటం లేదు. నగరంలోని ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇంట్లోకి ఉంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఎదురింటిలోనే ఆమె సోదరీ కూడా నివసిస్తున్నారు. నాగచైతన్య: కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఓ సాధారణ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. నాగచైతన్య రెండో సినిమా నుంచి ఆ ఇంటికి మకాం మార్చాడు. పెళ్లయిన తర్వాత సమంతతో కలిసి ఆ ఇంట్లోనే ఉన్నారు. అయితే అందుకు ఓ ప్రధాన కారణం ఉందట. నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్ వల్లే ఆ ఇంటిని వదలడం లేదని సమాచారం. రాజమౌళి: దర్శకధీరుడు రాజమౌళి పెళ్లయినప్పటి నుంచి మణికొండలో నివాసముంటున్నారు. గతంలో రాజమౌళి ఓ విల్లాలో ఉండేవారు కానీ ఆ తర్వాత అద్దెకి ఇచ్చి మణికొండలోనే త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్‌లో నివసిస్తున్నారు. జగపతిబాబు: నగరంలోని అపోలో ఆస్పత్రికి దగ్గరలో జగపతిబాబుకి పెద్ద భవనం ఉంది. కానీ ఆ ఇంటిలో ఆయన ప్రస్తుతం నివసించడం లేదు. కూకట్‌పల్లిలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. -
సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్
లెజెండరి నటుడు జగపతి బాబుకు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలకు విలన్‌గా నటిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ‘మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి, ఫ్యామిలీ సర్కస్’ కుటుంబ కథా చిత్రాలతో జగపతి బాబు ఎంతో గుర్తింపు పొందారు. అయితే అప్పట్లో జగపతి బాబు, దివంగత నటి సౌందర్యలది హిట్ పెయిర్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్ని మంచి విజయం సాధించాయి. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ దాదాపు తెరపై భార్యభర్తలుగా నటించిన వీరిద్దరిపై అప్పట్లో రూమర్స్ కూడా బాగానే వచ్చేవి. అయితే సౌందర్య పెళ్లి అనంతరం వాటికి చెక్ పడింది. కానీ పెళ్లికి ముందు మాత్రం వీరిద్దరి పెయిర్, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి సౌందర్య, జగపతి బాబు మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ అప్పట్లో అందరూ చెవులు కొరుక్కునేవారు. అంతేకాదు తరచూ సౌందర్య ఇంటికి జగపతి బాబు, ఆయన తన ఇంటికి వెళ్లడం చూసి వారిద్దరి రిలేషన్ గురించి పుకార్లు షికారు చేస్తుండేవనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జగపతి బాబుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆయన స్పందిస్తూ.. తనకు, సౌందర్యకు మధ్య రిలేషన్ ఉన్నమాట నిజమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు ‘కానీ అది మీరు అనుకున్నది కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె అన్యయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్. సౌందర్య వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. మేము మాత్రమే కాదు మా ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సమేతంగా హాజరయ్యేవాళ్లం. ఈ క్రమంలో సౌందర్య తరచూ మా ఇంటికి వస్తుండేవారు. నేను వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని. అది చూసి జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సౌందర్య అలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలు నేను కూడా విన్నా. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ ఆయన వివరించారు. కాగా ప్రస్తుతం జగపతి బాబు ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
పొలిటికల్ ఎంట్రీపై జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో వైరల్
పాత్ర ఏదైనా సరే రఫ్ఫాడించేస్తాడు జగపతిబాబు. ఒకప్పుడు హీరోగా నటించిన జగ్గూభాయ్ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న పరంపర 2 సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీపై స్పందించాడు. 'సినిమానే ఒక మాయ.. పాలిటిక్స్ ఓ మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, ఓపిక అంతకన్నా లేదు. కాబట్టి రాజకీయాల గురించి నేను ఆలోచించడం లేదు. నలుగురితో మాట్లాడే తెలివే లేదు. అలాంటిది రాజకీయాల్లో జాయిన్ అయి వాళ్లతో ముందుకెళ్లడం కష్టం. నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల గురించి నాకున్న అవగాహన సున్నా. కాబట్టి పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం, నేను ఓ పార్టీ పెట్టడం అనేది జరగని పని' అని చెప్పుకొచ్చాడు జగపతిబాబు. చదవండి: అప్పుడు నా కూతుర్ని ఇండస్ట్రీలో అడుగుపెట్టనివ్వలేదు! తారక్ ధరించిన టీషర్ట్ అంత ఖరీదా? -
Parampara 2 Review: ఎమోషనల్ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా 'పరంపర 2'..
టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్ నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు కథ: హరి ఏలేటి మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్ సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్ ఎడిటింగ్: తమ్మిరాజు సంగీతం: నరేష్ కుమరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల విడుదల తేది: జులై 21, 2022 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5 గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. విశ్లేషణ: పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో. ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. ఎవరెలా చేశారంటే? నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు. ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
పరంపర సీజన్-2 వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్. పరంపర సీజన్-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3cue9Vc -
ఫారెస్ట్ మ్యాన్ గా జగపతిబాబు..ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు డైరెక్టర్ సంపత్ నంది కథను అందించగా.. మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంపత్‌నంది, రాజేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం(జూన్ 5) ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ రాసిన వ్యాఖ్యలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. Here’s our Mother Nature's very own child💪🏾💚 Elated to introduce our beloved @iamjaggubhai garu as #SIMBAA - The Forest Man 🔥 on this #WorldEnvironmentDay More details 🔜@mmrdirects@SampathNandi_TW @anusuyakhasba #RajenderReddy @vamsikaka @dhani_aelay pic.twitter.com/j3FzSb5G78 — Sampath Nandi (@IamSampathNandi) June 5, 2022 -
వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్‌గా ?
Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. విలన్‌గా.. దక్షిణాదిన తిరుగు లేని విలన్‌గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్ కబీ దీవాలి’లో విలన్‌గా నటిస్తారనేది బీ టౌన్ టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్ తెలిపింది. చదవండి: ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి -
విదేశాల్లో జగ్గూభాయ్, షాకింగ్ లుక్ షేర్ చేసిన నటుడు
జగ్గూభాయ్.. ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉన్నారు. షూటింగ్‌కు కాస్తా బ్రేక్ తీసుకున్న జగపతి బాబు.. ఫ్యామిలీతో కలిసి అరబ్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎప్పడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అయన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీకి కెటాయిస్తారు. అంతేకాదు తన వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జగ్గుభాయ్ గొప్యత పాటిస్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఆయన ప్రస్తుతం తాను ఛిల్ మూడ్‌లో ఉన్నానంటూ ఫ్యాన్స్‌తో దుబాయ్ ట్రిప్ ఫొటోను పంచుకున్నారు. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఈ ఫొటోకి ‘దుబాయ్ వాటర్ పార్కులో అలసిపోయిన ఫ్యామిలీకి దాహం తీర్చడానికి’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇందులో ఆయన లుక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సినిమాల్లో విలన్‌గా సీరియస్‌గా కనిపించే జగ్గుభాయ్‌ని ఇలా ఎడారి దేశంలో ఛిల్ అవుతూ కనిపించడం చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయన ఫొటోపై రకరకాల కామెంట్స్‌తో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చదవండి: శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లెటేస్ట్ పోస్ట్ వైరల్, ఏం అంటున్నాడంటే కాగా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన తిరుగు లేని నటుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఏ తరహా పాత్రలో అయినా ఇమిడిపోతు తనలోని నటుడిని తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డిమాండ్ ఉన్న నటుడిగా మారారు. ఇటీవల ‘గుడ్‌లక్’ సఖీతో ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘గని’ చిత్రంతో పాటు పాన్ ఇండియా సినిమాలు ‘రాధేశ్యామ్’, ‘సలార్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Dubai water park lo aliasipoyana family ki daaham theerchadaniki. pic.twitter.com/CRWI4QWQ3l — Jaggu Bhai (@IamJagguBhai) March 6, 2022 -
గోపీచంద్ సినిమాలో జగపతి బాబు
Jagapathibabu Will Play Key Role In Gopichand And Srivas Film: ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలతో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ‘లక్ష్యం’లో జగపతిబాబు కీ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కుదిరింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహనిర్మాత. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును తీసుకున్నారు. శనివారం జగపతిబాబు బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. -
60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు
సినిమాల్లో హీరో కన్నా జీవితంలో హీరో అవ్వాలని ఉద్దేశ్యంతో అవయవ దానం చేస్తున్నట్టు నటుడు జగపతి బాబు అన్నారు... సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విలక్షన నటుడు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. చదవండి: Khiladi Movie Review: ఖిలాడి మూవీ ఎలా ఉందంటే.. మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు అని ఆయన అన్నారు... అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత 7,8 మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు అని జగపతి బాబు అన్నారు... అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు పద్మ భూషణ్ లు ప్రదానం చేయాలని ఆయన అన్నారు... ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎండి భాస్కర్ రావు, సీనియర్ IAS అధికారి జయేష్ రంజాన్, జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత, అక్కినేని నాగసుశీల పాల్గొన్నారు. చదవండి: అక్షయ్‌తో వివాదం.. వివరణ ఇచ్చిన ప్రముఖ కమెడియన్ -
గుడ్ లక్ సఖి మూవీ ట్విటర్ రివ్యూ
‘నేను శైలజ’మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది అందాల భామ కీర్తి సురేశ్. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’మూవీతో కీర్తి సురేశ్ జాతకమే మారిపోయింది. ఆ సినిమా తర్వాత కీర్తి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మరో లేడి ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ. . కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జనవరి 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #GoodLuckSakhi Overall A Mostly Lackluster Sports Drama! Keerthy did her best and the film had lscope for comedy and emotion but could not engage with a flat screenplay The makers did not even finish dubbing and the dialogues were hard to understand throughout Rating: 2/5 — Venky Reviews (@venkyreviews) January 28, 2022 సినిమా యావరేజ్‌గా ఉందని, కానీ కీర్తిసురేశ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గుడ్ లక్ సఖి కాదు బ్యాడ్ లక్ కీర్తి అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెబుతున్నారు. #GoodLuckSakhi..! Solo release aithe kalisochindi kani NO Luck! Everything happens and ends abruptly with no reason..! Lacks the punch that is needed in sports drama..! Even shooting scenes did not have impact..! Feels like DSP is the only technician that worked honestly..! 2/5.! — FDFS Review (@ReviewFdfs) January 28, 2022 Papa account lo inkokati #GoodLuckSakhi pic.twitter.com/zmFHDvWDI2 — Kaushik🔔 (@ahvkboon) January 28, 2022 -
అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు: నటుడు
Keerthy Suresh Good Luck Sakhi Trailer Is Out: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి సురేష్, కోచ్ పాత్రలో జగపతిబాబు నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మనదేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ఎలా మారిందన్న నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఆదిపినిశెట్టి కీలక పాత్రలోకనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
కీర్తి సురేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు వచ్చేస్తుంది..
Keerthy Suresh Good Luck Sakhi All Set To Release: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది.తాజాగా ఎట్టకేలకు గుడ్ లక్ సఖి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈనెల 28న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
పదిహేనేళ్ల తర్వాత ‘హీరో’ కోసం థియేటర్‌కు వెళ్లాను : జగపతిబాబు
‘‘పదిహేనేళ్లుగా థియేటర్స్‌కు వెళ్లని నేను ‘హీరో’ సినిమా కోసం వెళ్లాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. పెద్ద సినిమాల్లో నటించిన నాకు కొత్త దర్శకులతో చేయాలనిపించలేదు. అందుకే ‘హీరో’ చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా? లేదా అనిపించింది. కానీ నా అంచనాలు తారుమారయ్యేలా చేశారు దర్శకుడు శ్రీరామ్. ఈ సినిమా చూశాక గతంలో నేను చేసిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం గుర్తొచ్చింది. అశోక్‌లో మంచి తపన కనిపించింది’’ అన్నారు జగపతిబాబు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అశోక్ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్యలో సినిమా చూశాను. వారి పాజిటివ్ రెస్పాన్స్ తెలిసింది’’ అన్నారు. ‘‘అశోక్ పడిన కష్టం తెరపై తెలుస్తోంది. థియేటర్స్‌లో నిజమైన పండగ కనిపిస్తోంది’’ అన్నారు శ్రీరామ్. ∙శ్రీరామ్ ఆదిత్య, నిధీ అగర్వాల్, గల్లా జయదేవ్, పద్మావతి, అశోక్, జగపతిబాబు -
షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ రోజు ఫోన్ చేసి తిట్టేవాడు : జగపతి బాబు
ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబు.. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జగపతి బాబు క్రేజ్ అమాంతం పెరిగింది. వరుసగా విలన్ ఆఫర్లు క్యూ కట్టాయి. హీరోగా మెప్పించిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు రాణిస్తున్నారు. తనకు హీరో అనేది ట్యాగ్‌లైన్ మాత్రమేనని, ఒక నటుడిగా ఉండటమే ఇష్టమని చెబుతున్నాడు జగపతిబాబు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురించి, అందులో చేసిన బసి రెడ్డి పాత్ర గురించి, హీరో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’స్క్రిప్ట్ బాగా కుదిరింది. అందులో నాది ఎగ్రసివ్ క్యారెక్టర్ అయితే.. తారక్‌ది చాలా కూల్ క్యారెక్టర్. దాంతో బసిరెడ్డి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అంత పెద్ద హీరో నా పాత్రను ఒప్పకోవడమే కష్టం. తారక్ యాటిట్యూడ్ బాగా నచ్చింది. అయితే బసిరెడ్డి పాత్రను ఒప్పుకున్న తారక్.. తర్వాత నాకు కావాల్సినంత పనిష్మెంట్ కూడా ఇచ్చేశాడు. షూటింగ్ సమయంలో రోజూ ఫోన్ చేసి వాయించేవాడు. నీ పాత్ర ఇంత బావుంది. అంత బావుందనేవాడు. రక రకాలుగా తిట్టేవాడు.. అది కూడా ప్రేమతోనే. సినిమా విడుదల తర్వాత జరిగిన ఫంక్షన్లో కూడా నా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బసిరెడ్డి గుర్తుంటాడు. తర్వాతే నేను గుర్తుంటాను అన్నాడు. తను అలా అనడం చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ తర్వాత నన్ను దూరం పెడుతున్నానని చెప్పారు. ‘బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్‌తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించకండి’అని తారక్ అన్నారు. దానికి నేను ఓకే తారక్ అన్నాను. అయిపోయింది’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
పరంపర వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: పరంపర కథ: హరి యేలేటి దర్శకత్వం: కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్ నేపథ్య సంగీతం: నరేష్ కుమారన్ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల: 24 డిసెంబర్ 2021 బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా' వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్కా మీడియా ఒక వెబ్ సిరీస్ తీస్తుందనే వార్తలు వినిపించడంతో 'పరంపర'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి మోహన్, జగపతి బాబు, శరత్ బాబు వంటి, ఆమని వంటి సీనియర్ నటీనటుమణులతో తెరకెక్కిన 'పరంపర' మొదటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే హాట్‌స్టార్ ఒరిజినల్స్ మొదటిసారిగా చేసిన తెలుగు వెబ్ సిరీస్ ఇది కావడం విశేషం. యాక్షన్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: రాజకీయం, పవర్, మోసం, కుటుంబం విలువలు వంటి అంశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ పరంపర. విశాఖ జిల్లాకు చెందిన వీర నాయుడు (మురళి మోహన్) ప్రజల మనిషి. రాజకీయాల్లో తనదైన శైలిలీ పట్టు సాధిస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడు. వీర నాయుడికి మోహన రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) ఇద్దరు కుమారులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులను పెద్ద కుమారుడైన మోహన రావుకు కట్టబెడుతూ ప్రాముఖ్యతనిస్తాడు వీర నాయుడు. ఇది చూసిన నాగేంద్ర నాయుడుకు ఈర్శ్య, ద్వేషం కలుగుతాయి. దీంతో ఎలాగైన తాను కింగ్‌మేకర్‌గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడికి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఈ ఒక్క సంఘటనతో రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్ని నాగేంద్ర నాయుడి చేతుల్లోకి వెళతాయి. అక్కడినుంచి నాగేంద్ర నాయుడి ఆధిపత్యం కొనసాగుతోంది. సెంటిమెంట్‌తో తన తండ్రిని పక్కన పెట్టి బాబాయ్ అధికారం చేజిక్కించుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు గోపి (నవీన్ చంద్ర). ఎలాగైన తిరిగి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఇందుకోసం నాగేంద్ర నాయుడితో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు గోపి. ఈ యుద్ధాన్ని కాలేజీ ప్రెసిండెట్ ఎన్నికల్లో నాగేంద్ర నాయుడు కుమారుడు సురేష్ (ఇషాన్)తో పోటీకి దిగుతాడు. అక్కడినుంచి నాగేంద్ర నాయుడితే గోపి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా ? అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడా ? అతనికి ఎదురైన పాత్రలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయి ? అనేదే కథ. విశ్లేషణ: కథ అంత కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆధిపత్య పోరు, కుటుంబం కన్నా రాజకీయం ముఖ్యమనిపించే కథలు ఇది వరకు చాలానే చూశాం. అయితే కథను ఆవిష్కరించిన విధానంలో మాత్రం దర్శకులు విజయం సాధించారు. నాగేంద్ర నాయుడిపై అటాక్‌తో 'ప్రారంభం' అనే ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది 'పరంపర' వెబ్ సిరీస్. ఈ యాక్షన్ సీన్‌తోనే పాత్రల పరిచయం చేస్తూ గోపి మోటివ్ను చూపించారు దర్శకులు. పొలిటికల్ డ్రామా, అధికారానికి ఉన్న శక్తిని చూపిస్తూనే కుటుంబం విలువలు, ఎమోషన్‌ను బాగా చూపించారు. రాజకీయం, అధికారమే తప్ప దేన్ని పట్టించుకోని అత్యంత కఠినమైన పాత్ర నాగేంద్ర నాయుడిది. అలాంటి పాత్ర కూడా ఎమోషనల్ అయి వెంటనే ఈర్శ్య కలగడం వంటి సీన్లతో అహంకారం ముందు ప్రేమ ఎలా నిలవలేదో చూపించి ఆకట్టున్నారు. హరి యేలేటి కథ అందించిన ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి కృష్ణ విజయ్. ఎల్ డైరెక్ట్ చేయగా మిగతా ఎపిసోడ్లన్నింటిని విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి డైరెక్ట్ చేశారు. అయితే వెబ్ సిరీస్ నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్లు కలిపి సుమారు ఐదున్నర గంటలకుపైగా ఉంటుంది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా తీశారు. అస్సలు బోర్ కొట్టదు. నాగేంద్ర నాయుడు, గోపి మధ్య పోటీ, నాగేంద్ర నాయడిపై గెలవాలని గోపి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. మోహన రావును నాగేంద్ర నాయుడు ఎంత తొక్కిపెట్టిన తిరగబడక పోవడం, మోహన రావుపై నాగేంద్ర నాయుడి ఈర్శ్యకు గల కారణాలను బానే ప్రజెంట్ చేశారు. చివరి రెండు ఎపిసోడ్లు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ప్రేక్షకులు నిరాశ పడతారు. అయితే క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్‌లా ఉండదు. ఇంకా వెబ్ సిరీస్ కొనసాగుతుందేమో అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేస్తుంది. వెబ్ సిరీస్‌కు ఇదే ఆరంభం మాత్రమే అనే హింట్ ఇచ్చేందుకే దర్శకులు క్రైమాక్స్ అలా ప్లాన్ చేశారేమో అని తెలుస్తోంది. క్లైమాక్స్‌తో అసలు కథ ఇంకా మిగిలే ఉందని, ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా రానుందని అర్థమైపోతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్లు ఉంటాయి. ఇవి కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. సిరీస్‌లో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే: నలుగురికి సహాయపడే పాత్రలో మురళి మోహన్, జగపతి బాబు చక్కగా ఒదిగిపోయారు. సాధారణంగా కుటుంబంలో పెద్ద కుమారుడి డామినేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లో చిన్న కుమారుడు నాగేంద్ర డామినేషన్, నెగెటివ్ పాత్ర అయిన నాగేంద్ర నాయుడిగా శరత్ కుమార్ వెల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన రావును తొక్కిపెట్టి కపటధారిగా ఆకట్టుకున్నారు. అలాగే మోహన రావు, నాగేంద్ర నాయుడు యుక్త వయసు పాత్రల్లో శ్రీతేజ్, ప్రవీణ్ యండమూరి మంచి నటనతో మెప్పించారు. మోహన రావు భార్య, గోపి తల్లి భానుమతిగా ఆమని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాబాయ్ అధికారాన్ని అంతం చేయాలనే గోపి పాత్రతో నవీన్ చంద్రకు మంచి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నవీన్ చంద్ర. అప్పటివరకు సైలెంట్‌గా ఉండి చివరిలో పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించే సురేష్ పాత్రలో ఇషాన్ (రోగ్ ఫేమ్) నటించి పర్వాలేదనిపించాడు. రచనగా హీరోయిన్ ఆకాంక్ష ఆకట్టుకోగా.. గోపి లవర్‌గా జెన్నీ పాత్రలో తన అందాలతో గ్లామర్‌ను యాడ్ చేసింది నైనా గంగూలి. నాగేంద్ర నాయుడి అధికారానికి నలిగిపోయే ఇందిరా పాత్రలో కస్తూరి తనదైన పరిధిలో ఆకట్టుకుంది. నరేశ్ కుమరన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అక్కడక్కడ వచ్చే పాటలు సన్నివేశాలకు అవసరం లేదనిపిస్తాయి. కథ కొత్తగా అనిపించకపోయిన టేకింగ్ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే 'పరంపర'ను చూసి కొనసాగించవచ్చని చెప్పుకోవచ్చు. -
Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ స్టేజ్‌పై బాలయ్య డైలాగ్ చెప్పిన ఆలియాభట్
Bigg boss 5 Telugu Grand Finale Latest Promo Released: బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్‌గా ముస్తాబయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 5మచ్ సర్ప్రైజ్లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రముఖ సినీ స్టార్స్‌ని రంగంలోకి దించారు. వరుస గెస్ట్‌లతో స్టేజ్ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి ప్రముఖ ప్రేమ జంట, 'బ్రహ్మస్త్ర' టీం నుంచి రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్లు సందడి చేశారు. అంతేకాకుండా ఆలియా.. బాలయ్య ఫేమస్ డైలాగ్ దబిడిదిబిడే.. అంటూ డైలాగ్ చెప్పడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' నుంచి రాజమౌళి, 'శ్యామ్ సింగరాయ్' నుంచి నాని, కృతిశెట్టి, సాయి పల్లవి , 'పరంపర' మూవీ టీం నుంచి జగపతి బాబు, నవీన్‌చంద్ర బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వీరితో పాటు పుష్ప నుంచి సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. All set for #BiggBossTelugu5 Grand Finale evening with lots of surprises and Five much fun!#BBTeluguGrandFinale today at 6 PM on #StarMaa #BiggBossTelugu #FiveMuchFun pic.twitter.com/XETApXv0cN — starmaa (@StarMaa) December 19, 2021 -
‘లక్ష్య’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్య నటీనటులు : నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి సంగీతం : కాలభైరవ సినిమాటోగ్రఫీ :రామ్‌రెడ్డి ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 Lakshya Movie Review: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగశౌర్య .. ఆ మూవీతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వైవిధ్యాన్నిచూపిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఇరవై పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ‘ఛలో’సినిమాతో నిర్మాతగా మారి తొలి చిత్రమే హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, హీరోగా చేసిన నర్తనశాల, అశ్వథ్థామ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఇటీవల లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’తో ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మరోసారి ప్రయోగానికి సిద్దమై.. తన కెరీర్లోనే తొలిసారిస్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో ‘లక్ష్య’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ని కూడా కొత్తగా, చాలా గ్రాండ్‌గా చేయడంతో ‘లక్ష్య’పై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? మరి ఈ సినిమా నాగశౌర్యను హిట్ ట్రాక్ ఎక్కించిందా? రివ్యూలో చూద్దాం కథేంటంటే.. పార్ధు(నాగశౌర్య) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాతయ్య రఘురామయ్య(సచిన్ ఖేడేకర్)దగ్గరే పెరుగుతాడు. అతని తండ్రి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం. అతనిలోని క్రీడాకారుడిని గుర్తించిన తాతయ్య.. ఎలాగైన తన మనవడిని గొప్ప ఆర్చరీ ప్లేయర్ చేయాలని భావిస్తాడు. దాని కోసం ఊరిని వదిలి సిటీకి వస్తాడు. ఆస్తులన్ని అమ్మి మరీ మనవడి కోచింగ్ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి స్టెట్ లెవన్ చాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్ ట్రయల్స్‌కి సన్నద్దం అయ్యే సమయంలో గుండెపోటుతో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పార్ధు.. మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. డ్రగ్స్ తీసుకుంటేనే అతను వదిలిన బాణం గురి తప్పేది కాదు. ఈ విషయం తెలిసి అకాడమీ అతన్ని సస్పెండ్ చేస్తుంది. అసలు పార్థు మత్తు పదార్ధాలకు బానిస కావడానికి కారణం ఎవరు? అతని జీవితంలో రితికా పాత్ర ఏంటి? చనిపోదామనుకున్న సమయంలో పార్ధుని కాపాడిన సారథి(జగపతిబాబు)..ఎవరు? అతని నేపథ్యం ఏంటి? విలువిద్యకు దూరమైన పార్థు మళ్లీ చేత బాణం పట్టి రాణించాడా? వరల్డ్ చాంపియన్‌గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారు? ఆర్చరీ ప్లేయర్ పార్థుగా నాగశౌర్య చక్కగా నటించాడు. ఈ సినిమాకు కోసం ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశాడు. అతను పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా నాగశౌర్య చాలా కొత్తగా కనిపించాడు. తాతయ్య చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక ‘రొమాంటిక్’భామ కేతికా శర్మ.. రితికా పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో కాకుండా నటనతో ఆకట్టుకుంది. హీరో తాతయ్యగా సచిన్ ఖేడేకర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన నితిన్ ‘చెక్’, సందీప్ కిషన్ ‘ ఏ1 ఎక్స్‌ప్రెస్’ కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కినవే. అయితే ‘లక్ష్య’ ప్రత్యేకత ఏంటంటే.. పూర్తిగా విలువిద్య నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో పాటు తాత మనవడి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే అది తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్టాప్ అంతా సింపుల్‌గా, పాత సినిమాలు చూసినట్లుగా సాగుతుంది. ఎక్కడా వావ్ అనే సీన్స్ కానీ, ట్విస్టులు కానీ ఉండవు. కథంతా ముందే తెలిసిపోతుంది. హీరో డ్రగ్స్‌కి బానిస కావడం, దానికి కారణం ఎవరై ఉంటారనేది కూడా సినిమా చూసే సగటు ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టగలడు. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా కథ సాగడం సినిమాకు మైనస్. ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సెకండాప్లో జగపతి బాబు ఎంట్రీ తర్వాత కాస్త ఆసక్తి కరంగా సాగుతుంది అనుకుంటే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ డిమాండ్ మేరకే ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశానని ఇంటర్యూల్లో నాగశౌర్య చెప్పారు. కానీ కథకు అది ఏరకంగా అవసరమే తెరపై చూపించలేకపోయాడు. క్లైమాక్స్ సీన్స్ కూడా చప్పగా సాగుతాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ఇక కాలభైరవ సంగీతం కూడా అంతంత మాత్రమే అనే చెప్పాలి. గతంలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కాలభైరవ లాంటి యంగ్ మ్యూజిక్ డైరక్టెర్ నుంచి దర్శకుడు మంచి సాంగ్స్‌ని రాబట్టుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. దర్శకుడు వదిలిన బాణం గురి తప్పింది. కలెక్షన్ల పరంగా ‘లక్ష్య’ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుంతో వీకెండ్ వరకు వేచి చూడాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Ghani: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే..
మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అందులోని వరుణ్ మాస్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. సినిమా విడుదల కోసం ఎంతగానో వేయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే వారిని సంతోషపెట్టేందుకు మూవీ మేకర్స్ గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో హీరోయిన్ నుంచి విలన్ వరకు కీలకమైన పాత్రలన్నింటినీ చూపించారు. మొదట నదియా, తర్వాత నరేష్ కనిపించగా, క్రమంగా తనికెళ్ల భరణి, నవీన్ చంద్ర, సాయి మంజ్రేకర్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రను చూపించారు. అయితే గని ప్రపంచంలో వీళ్లందరు ఉంటారనట్లుగా వీడియో ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ చూస్తే ఆ అంచనా రెట్టింపు అయ్యేలా ఉంది. బాలీవుడ్ నటుడు మహేష్ ముంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే సినిమా టీజర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు వీడియోలో చూపించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అల్లు వెంకటేష్, సిద్దు ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గని చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. -
ఆకట్టుకుంటున్న ‘మల్లిగా మల్లిగా’ కాలేజీ సాంగ్
సాయిరోనక్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ రేపల్లే దర్శకుడు. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం ఈ మూవీ నుంచి తొలిపాటను విలక్షణ నటుడు జగపతిబాబు విడుదల చేశారు. `ఎమ్బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ పవార్ సాహిత్యాన్ని సమకూర్చగా భీమ్స్ సిసిరోలియో అద్భుత సంగీతాన్ని అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...‘ ప్రస్తుతం మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు. ఈ కాలేజ్ సాంగ్ యూత్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందన్నారు దర్శకుడు సురేశ్ శేఖర్. వరుసగా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామని తెలిపారు. -
'గుడ్‌లక్ సఖి' వచ్చేస్తుంది..
పోటీ స్టార్ట్ అయ్యేటప్పుడు గెట్ సెట్ గో అంటారు. కీర్తీ సురేష్ కూడా పోటీకి సై అన్నారు. కాకపోతే గెట్ షూట్ గో అంటున్నారు. ఎందుకంటే ఆమె రైఫిల్ షూటర్. నగేష్ కుకునూరు దర్శకత్వంలో కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. ఇందులో ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి, కోచ్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
త్వరలో జగ్గుభాయ్ బాలీవుడ్ ఎంట్రీ, ఆ హీరోకు విలన్‌గా..
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన తిరుగు లేని నటుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఏ తరహా పాత్రలో అయినా ఇమిడిపోతు తనలోని నటుడిని తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డిమాండ్ ఉన్న నటుడిగా మారారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాల్లోని హీరోలకు ధీటైన విలన్ ఎవరంటే జగ్గుభాయ్ పేరు వినిపించేంతగా ఆయన తెచ్చుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా అందరి ఆదరణ పొందుతూ దక్షిణాన బిజీగా మారిన ఆయనకు కొంతకాలంగా బాలీవుడ్ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే హిందీ సినిమాల్లో నటించే ఆసక్తి లేకపోవడంతో ఇప్పటి వరకు నో చెబుతూ వచ్చారట జగపతి బాబు. అయితే ఈ తాజా బజ్ ప్రకారం ఆయన త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందనుంది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సినిమాలో మెయిన్ విలన్ కోసం జగ్గుభాయ్‌కి పిలుపు వచ్చిందట. ఇక వస్తున్న అవకాశాలను వదులేక ఆయన ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ మూవీలో డిసెంబర్ నుంచి సెట్‌పై రానుందని టాక్. ఇందులో ఫర్హాన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హరోయిన్‌గా నటించనుంది. కాగ ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్రంలో రాజమన్నార్ అనే విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
గ్రీన్‌ఫండ్ ఏర్పాటు మంచి పరిణామం
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం మంచిపరిణామమని విలక్షణ సినీనటుడు జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపుదలను ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్‌ఫండ్ కల్పిస్తోందని పేర్కొన్నారు. శనివారం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ‘మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం’ అనే నినాదంతో రూపొందుతున్న ‘సింబా – ద ఫారెస్ట్ మ్యాన్’సినిమా షూటింగ్లో జగపతిబాబు పాల్గొన్నారు. అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు అటవీఅధికారి పాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగపతిబాబు ఇక్కడ మొక్కలు నాటారు. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ పీవీ రాజారావు, దర్శకుడు సంపత్ నంది, హీరోయిన్ దివి వధ్వకూడా మొక్కలు నాటారు. కాగా, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌కు మహాబిలం మొక్కను శ్రీనివాస్ బహూకరించారు. -
అమెరికాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న జగపతి బాబు
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. అమెరికాలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘కుటుంబం, పెట్స్, బుక్స్‌తో అమెరికాలో సరదాగా గడపటమంటే నాకు ఇష్టం. వీటి నుంచే నిస్వార్థమైన ప్రేమ దొరుకుంది. అది ప్రతి మనిషి గ్రహించాలి’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. చదవండి: ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం కాగా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగ్గు భాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా అలరిస్తున్నారు. ప్రతినాయకుడిగా, సహా నటుడిగా ఫుల్ బిజీగా మారారు. ఆయన నటించిన ‘టక్ జగదీష్’ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక శర్వానంద్, సిద్దార్థ్ ‘మహా సముద్రం’, సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్‌లో ‘రాజమన్నార్’ అనే పవర్ ఫుల్ విలన్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుని విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు విరామ సమయంలో దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని సరదాగా గడిపెందుకు కుటుంబంతో కలిసి ఆయన అమెరికాలో వాలిపోయారు. చదవండి: Tuck Jagadish Review: ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ Having a loving time in the US with my family, my favorite pets, and my books. Selfless love... Books and pets are the best. Human beings Please learn 🙏#SelflessLove pic.twitter.com/taBUZZrCh1 — Jaggu Bhai (@IamJagguBhai) September 15, 2021 -
‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ
టైటిల్ : టక్ జగదీష్ నటీనటులు : నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, నాజర్, జగపతి బాబు, రావు రమేశ్, నరేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది దర్శకత్వం : శివ నిర్వాణ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం: గోపీసుందర్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా 'అష్టా చమ్మా' మొదలు గత ఏడాదిలో విడుదలైన ‘వి’వరకు ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేచురల్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. తరచూ ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు. నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘టక్ జగదీష్’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. టక్ జగదీష్ కథేంటంటే భూదేవిపురం గ్రామానికి చెందిన టక్ జగదీష్ అలియాస్ జగదీష్ నాయుడుకి కుటుంబం అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)అంటే జగదీష్‌కి ప్రాణం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసు (జగపతి బాబు)కి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు జగదీష్. అయితే తనకు తెలియకుండా వేరే వ్యక్తితో మేనకోడలు పెళ్లి చేస్తారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసకోని జగదీష్ గ్రామానికి వస్తాడు. ఈ లోగా తన కుటుంబంలో సమస్యలు వచ్చి అందరూ విడిపోతారు. గ్రామ ప్రజలు కూడా జగదీష్ కుటుంబంపై ద్వేషం పెంచుకుంటారు. అసలు తన కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారు? అమితంగా ఇష్టపడే మేన కోడలు పెళ్లి జగదీష్‌కు తెలియకుండా ఎవరితో, ఎందుకు చేశారు? పదిమందికి ఆదర్శంగా ఉండే ఆదిశేషు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? దాన్ని జగదీష్ ఎలా పరిష్కరించాడు? ఇందులో రీతు వర్మ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. జగదీష్ నాయుడు అనే బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్, నరేశ్, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో తెరకెక్కిన చిత్రమే ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు టక్ జగదీష్‌తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రుచి చూపించాడు. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. టక్ జగదీష్‌లో కొత్తగా చూపించిదేమి లేదు. పైగా మేనకోడలు బాధ్యత, ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ.. అంటూ చాలా పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథను తెరపై చూపించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ.. కథలోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేష్ ఇస్తూ చాలా క్లారిటీగా చేప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. ‘అయినోళ్లకంటే ఆస్తులు పొలాలు ఎక్కువకాదు..రక్త సంబంధం విలువ తెలుసుకో’, ‘మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు’ లాంటి డైలాగ్స్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. తమన్ పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. గోపీసుందర్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రావడం ప్లస్ పాయింటనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలమైంది. పైగా ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండడం.. ‘టక్ జగదీష్’కి కలిసొస్తుందనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు
‘నాతో నేను ప్రేమలో పడిపోయా’ అంటున్నారు జగపతిబాబు. ‘సలార్’లో చేస్తున్న పాత్ర గురించే ఇలా అంటున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు చేస్తున్న రాజమన్నార్ పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ‘‘నా వరస్ట్ లుక్స్ (విలన్ క్యారెక్టర్ లుక్స్‌ని ఉద్దేశించి)లో ఇది బెస్ట్. ప్రశాంత్ నీల్ సహాయంతో నటుడిగా నా బెస్ట్ ఇస్తాను’’ అని సోషల్ మీడియా ద్వారా జగపతిబాబు పేర్కొన్నారు. ‘‘కథ కీలకమైన మలుపు తిరగడానికి రాజమన్నార్ పాత్రే కారణం అవుతుంది. ఇప్పటికే 20 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు విజయ్ కిరగందూర్. ‘‘సలార్’ షూటింగ్ చకచకా జరుగుతోంది’’ అన్నారు ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. చదవండి : సలార్: బసిరెడ్డిని మించిన రాజమన్నార్! హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్ రిలీజ్ -
సలార్: బసిరెడ్డిని మించిన రాజమన్నార్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఇప్పటికే ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా మరో కీలక అప్డేట్ను వదిలింది. ఈ చిత్రంలో రాజమన్నార్ పాత్రను ఎవరు పోషించనున్నారో మేకర్స్ రివీల్ చేశారు. ముందుగా ఊహించినట్లుగానే రాజమన్నార్ పాత్రను జగపతి బాబు పోషించనున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిలీజ్ చేశారు. ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు ఒదిగిపోతాడన్న విషయం తెలిసిందే. గతంలో అరవింద సమేతలో.. బసిరెడ్డిగా రౌద్రం ప్రదర్శించాడాయన. ఇక తాజాగా రాజమన్నార్ లుక్‌లో అంతకు మించి రౌద్రం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. విలనిజాన్ని ఓ రేంజ్లో చూపెట్టే ప్రశాంత్.. రాజమన్నార్‌ను అంతకుమించి చూపించబోతున్నట్లు లుక్‌తోనే అర్థమవుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్14న విడుదల కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. Introducing #Rajamanaar. Thank you @IamJagguBhai garu for being a part of #Salaar.#Prabhas @shrutihaasan @VKiragandur @hombalefilms @HombaleGroup @bhuvangowda84 @BasrurRavi @shivakumarart @anbariv pic.twitter.com/BXbdrETQEF — Prashanth Neel (@prashanth_neel) August 23, 2021 చదవండి: KGF Chapter2: రిలీజ్ డేట్ ఫిక్స్..ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ హీరోయిన్ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా? -
మందు తాగి చిందేసిన జగపతిబాబు, శర్వానంద్
Hey Rambha Rambha Song In Maha Samudram: శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "మహా సముద్రం". 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. జూలై 9న షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా హే రంభ పాట రిలీజైంది. రంభ మాయలో పడిపోయిన జగపతిబాబు, శర్వానంద్ మందేసి చిందేస్తున్నారు. అందాల రంభకు వీరాభిమానులమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. పూటుగా తాగుతూ 'హే రంభ.. హే రంభ' అని ఆమె జపమే చేస్తున్నారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను చైతన్ భరద్వాజ్ ఆలపించాడు. వైజాగ్ బీచ్‌లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగిపోతోంది. మరి మీరు కూడా ఓసారి ఈ పాటను వినేయండి.. -
హైవే పక్కన భోజనం చేసిన జగపతి బాబు..ఫోటో వైరల్
చెన్నై : ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ర్టీల నుంచి జగ్గూబాయ్‌కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా జగపతి బాబు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారాయన. తాజాగా తమిళనాడులోని ఓ హైవే పక్కన ధాబాలో తన అసిస్టెంట్, డ్రైవర్‌తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలా రోజుల తర్వాత ఇలా హైవే పక్కన నా డ్రైవర్ రాజు, అసిస్టెంట్ చిరూతో ఫుడ్‌ని ఆరగించాను' అంటూ జగపతి బాబు షేర్చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ సంప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
రాజకీయాల్లో ఎంట్రీపై జగపతిబాబు క్లారిటీ!
రాజకీయ నాయకులు ఎక్కువగా ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? తెల్లటి ఖద్దరు బట్టలు. అలా అని తెల్ల బట్టలు వేసుకున్న అందరూ రాజకీయ నాయకులైపోరు! ముఖ్యంగా తననీ గెటప్‌లో చూసి పొలిటీషియన్ అని పొరబాటు పడకండి అంటున్నాడు ప్రముఖ నటుడు జగపతిబాబు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని చెప్తున్నాడు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విటర్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో తెల్ల కుర్తా, పైజామా ధరించిన జగ్గూ భాయ్ చేతిలో నల్ల కళ్లద్దాలు పట్టుకుని గోడపై కూర్చొని సీరియస్‌గా ఫొటోకు పోజిచ్చారు. త్వరలో ఏమైనా పాలిటిక్స్‌లోకి అడుగు పెడుతున్నారా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేయగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు అని క్యాప్షన్‌తోనే క్లారిటీ ఇచ్చాడు. దీంతో మంచి నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకున్న నెటిజన్లు సినిమాల్లో మాత్రం లీడర్ పాత్ర చేయండి అని సూచిస్తున్నారు. Definitely not aspiring to be a politician. pic.twitter.com/0f460dHnwv — Jaggu Bhai (@IamJagguBhai) July 6, 2021 -
ఆనందయ్య మందు: జగపతి బాబుపై బాబు గోగినేని సెటైర్లు
ఒకపక్క కరోనాకు విరుగుడుగా, సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలమంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని మొదటి నుంచి మందు శాస్త్రీయతపై వెటకారం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అయితే ఆనందయ్య మందుకు టాలీవుడ్ నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్ ఇంగ్లీష్ వెబ్ సైట్లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ సీనియర్ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ మాత్రమే! Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS — Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021 -
ఆనందయ్య మందుకు జగపతిబాబు మద్దతు
కరోనాతో అల్లాడిపోతున్న జనాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది ఆనందయ్య మందు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా కట్టడి కాని వైరస్ కేవలం ఆయుర్వే మందు వల్ల నియంత్రణలోకి వస్తుండంతో అందరి దృష్టి ఆనందయ్య మందు మీద పడింది. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకపోవడం, ఉచితంగా ఇస్తుండటంతో కరోనా బాధితులు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా దీనిపై తెలుగు దిగ్గజ నటుడు జగపతిబాబు స్పందించాడు. మానవాళిని కాపాడేందుకు ప్రకృతి ముందుకు వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయనను దేవుడు చల్లగా ఆశీర్వదించాలంటూ ట్వీట్ చేశాడు. Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS — Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021 కాగా ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని ఇదివరకే స్పష్టత ఇచ్చారు. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్ శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయించే అవకాశాలున్నాయి. చదవండి: కరోనాకు ఆనందయ్య మందు! మనకు బుద్ధి చెప్పేందుకు ప్రకృతి రెడీగా ఉంది: జగపతిబాబు -
గుర్తుపెట్టుకోండి, ఇది వార్నింగ్ మాత్రమే: జగపతిబాబు
మదర్స్ డేను పురస్కరించుకుని అందరూ ఎవరికి తోచినట్లు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అమ్మతో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తెగ సందడి చేశారు. నటుడు జగపతిబాబు కూడా మదర్స్‌డే విషెస్ చెప్తూనే హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశాడు. "మదర్స్‌డే సందర్భంగా భూ దేవికి వందనాలు తెలుపుతున్నాను. ప్రకృతితో పాటు సహజీవనం చేద్దామని, అందులో భాగంగా ప్రతిరోజు ధ్యానం చేద్దామని ఇక్కడికి వచ్చాను. మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ధ్యానం చేస్తాను. ఇది చాలా అవసరం. ప్రకృతికి విలువ ఇవ్వకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలీదు. గుర్తుపెట్టుకోండి. కరోనా అనేది వార్నింగ్ మాత్రమే.. మనం ఇలాగే ఉంటే, మన బుద్ధులు మారకపోతే.. మనకు బుద్ధి చెప్పేందుకు ప్రకృతి రెడీగా ఉంది. ఈసారి చాలా గట్టిగా చెప్తుంది. ఎంతమంది ఉంటారో, ఎంతమంది పోతారో మీరే ఆలోచించుకోండి. అందుకని ప్రకృతిని కాపాడుకోవడం చాలా అవసరం. మీతోపాటు నేనున్నా, నాతో పాటు మీరుండండి" అని జగ్గూభాయ్ కోరాడు. చదవండి: అభిమాని మృతి, కలత చెందిన జగపతిబాబు -
నీ మరణం బాధాకరం..: జగపతిబాబు
-
రజనీకాంత్‌కు థ్యాంక్స్ చెప్పిన జగపతి బాబు..
సాక్షి, హైదరాబాద్ : రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’.వచ్చే నెల చివరికల్లా ‘అన్నాత్తే’ సినిమా పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేయాలని చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, జగపతిబాబుపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల 10 వరకు జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ఆ తర్వాత చెన్నైలో ‘అన్నాత్తే’కి ఫైనల్ టచ్ ఇచ్చి, గుమ్మడికాయ కొడతారని తెలిసింది. దీపావళి సందర్భంగా ఈ ఏడాది నవంబరు 4న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బసిరెడ్డిని మించి.. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో బసిరెడ్డి పాత్రలో అదరగొట్టారు జగపతిబాబు. తాజాగా ‘అన్నాత్తే’లోని తన ఈవిల్ లుక్ బాగుంటుందని, ఫైనల్‌గా బసిరెడ్డిని మించిన పాత్ర తనకు ‘అన్నాత్తే’లో దొరికిందని, ఇందుకు రజనీకాంత్సార్కి ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు జగపతిబాబు. -
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్చల్!
రంభ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 1992లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంభ.. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, భోజ్‌పూరీ భాషట్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగమ్మాయే అయిన రంభ మొదట సర్గం అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా అవతారమెత్తారు. అదే ఏడాది ఆ ఒక్కటి ఆడక్కు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, రౌడీ అన్నయ్య, బొంబాయి ప్రియుడు, హిట్లర్, బావగారు బాగున్నారా, హలో బ్రదర్, తొలిముద్దు, ఇద్దరు మిత్రులు వంటి చిత్రాల్లో నటించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలంరితోనూ జోడీ కట్టారు. ఇక చివరగా ఆమె 2008లో వచ్చిన దొంగ సచ్చినోడు సినిమాలో నటించారు. తరువాత 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రంభ సినిమాల నుంచి తప్పుకున్నారు. మూవీస్‌కు గుడ్‌బై చెప్పి ప్రస్తుతం కుటుంబంతో గుడుపుతున్నారు. అనంతరం బుల్లితెరపై కొన్ని షోలకు వ్యాఖ్యాతగా వచ్చారు. అయితే తాజాగా రంభ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'. వివాఖపట్నం బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా సినిమా రూపొందుతోంది. జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో జగపతిబాబు, శర్వానంద్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. దీంతో పాటలో రంభ ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సాంగ్‌లో కేవలం రంభ ఫోటోలు మాత్రమే కనిపిస్తాయో.. లేక రంభ కూడా కనిపించనుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాలి. చదవండి: ఐసోలేషన్లోకి ప్రభాస్.. రాధేశ్యామ్ షూటింగ్‌కు బ్రేక్! -
షూటింగ్‌కు రాలేనని తేల్చి చెప్పిన జగపతి బాబు!
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకూ విజృంభిస్తుంది. ప్రతిరోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా, విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత దృష్ట్యా షూటింగ్లో పాల్గొనేందుకు సైతం సినీ నటులు ఇష్టపడటం లేదు. తాజాగా ప్రముఖ నటుడు జగపతి బాబు సైతం తాను షూటింగ్‌కి రాలేనని చెప్పేశాడట. ప్రస్తుతం ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే వైజాగ్ షెడ్యూల్లో జగపతిబాబు పాల్గొనాల్సి ఉండగా, ఆయన నో చెప్పినట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను షూటింగ్‌కు రాలేనని తేల్చి చెప్పారట జగపతిబాబు. చదవండి : కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు పరిస్థితి విషమిస్తోంది, నా వల్ల కాదు, వదిలేస్తున్నా.. -
కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేకమంది స్టార్స్ దీని బారిన పడ్డారు. దీంతో పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లొకేషన్లలో పాల్గొంటున్నారు. కోవిడ్ దృష్ట్యా చాలా వరకు అసిస్టెంట్ల సహాయం తీసుకోకుండా తమ పనులు తామే చూసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ షూటింగ్ లొకేషన్లో జగపతి బాబు.. కరోనా కారణంగా తనకు తానే మేకప్‌మెన్‌గా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ థ్యాంక్యూ కోవిడ్..నీ వల్ల మేకప్ మెన్ని అయ్యానంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషిస్తూ సత్తా చాటుతున్నారు. చదవండి : కరోనా బారిన నటి సమీరా Thanks to covid..I have become my own make up man. Ha haa.#StayHomeStaySafe pic.twitter.com/oeOBGEkrWd — Jaggu Bhai (@IamJagguBhai) April 18, 2021 -
ఈ టాప్ విలన్స్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోతోపాటు విలన్స్ కూడా క్రేజ్ పెరిగిపోతుంది. హీరో ఎంత బలంగా ఉంటాడో… అతని ప్రత్యర్థి కూడా అంతే బలమైన నాయకుడే అయి ఉండాలి. అప్పుడే హీరోయిజం అంతగా పవర్ఫుల్ అవుతుంది. అప్పుడే సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఈ సూత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి, బోయపాటి శ్రీను, కృష్ణవంశి లాంటి దర్శకులు పక్కాగా ఫాలో అవుతారు. తమ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్‌కు కూడా అంతే ఉండేలా జాగ్రత్తపడతారు. హీరోకి తగిన విలన్ క్యారెక్టర్ని సృష్టిస్తారు. అందుకే టాలీవుడ్లో ప్రస్తుతం విలన్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒకప్పటి స్టార్ హీరోలు సైతం నెగెటివ్ పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. టాలీవుడ్లో టాప్ విలన్స్ రెమ్యునరేషన్ గురించి తెలుసుకుందాం. మంచి తండ్రి, చెడ్డ మొగుడు, రౌడీ పోలీసు, ప్రేమికుడు, విలన్, స్నేహితుడు, తాత ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయే ఏకైక నటుడు ప్రకాశ్ రాజ్.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన అంతపురం సినిమాలో తన నటనతో ప్రకాష్ రాజ్ విలన్ గా ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. అప్పటి నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఆయన విలన్ పాత్రకు అయితే దాదాపు కోటిన్నర వరకు తీసుకుంటారని సమాచారం. అదే సపోర్టింగ్ క్యారెక్టర్‌కు అయితే దాదాపు 10 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటాడట. ఒకప్పుడు ప్యామిలీ హీరోగా రాణించిన జగపతిబాబుని విలన్‌గా మార్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక అప్పటి నుంచి జగపతిబాబుకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోనే ది బెస్ట్ విలన్‌గా కొనసాగుతున్నారు. ఈయన ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న సాయికుమార్..రామ్‌చరణ్ ‘ఎవడు’సినిమాతో విలన్‌గా మారాడు. ఆ సినిమాలో సాయికుమార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సాయికుమార్ ఒక్కో సినిమాకు రూ.50లక్షలు తీసుకుంటున్నాడట. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో టాప్ విలన్ లిస్ట్‌లో చేరాడు సోనూసూద్. విలన్‌గా భయపెడుతూనే అప్పుడప్పుడు నవ్విస్తాడు కూడా. ఈ యంగ్ విలన్ ఒక్కో సినిమాకు రూ.80లక్షల నుంచి కోటి వరకు పుచ్చుకుంటాడట. రాజమౌళి ‘ఈగ’సినిమాతో విలన్‌గా మారాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఈ సినిమాతో టాలీవుడ్లో సుదీప్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన నటించిన కన్నడ సినిమాలు కూడా ఇక్కడ విడుదలయ్యాయి. అలాగే దబాంగ్-3లో కూడా విలన్‌గా నటించాడు. ఈ స్టైలీష్ విలన్ ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు తీసుకంటాడని టాక్. రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినేయ విధేయ రామలో పవర్‌పుల్ విలన్ పాత్ర చేశాడు వివేక్ ఒబేరాయ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినా.. వివేవ్కి మంచి పేరుతెచ్చింది. ఆయన ఒక్కో సినిమాకు రూ.3 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటాడట. కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు సంపత్ రాజ్. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లోలో విలన్‌గా నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు రూ.60లక్షల నుంచి 70లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు రవి కిషన్. తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’లో కూడా మంచి పాత్ర లభించింది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 50 లక్షలు తీసుకుంటాడని సమాచారం. వీరితో పాటు ఒకవైపు హీరోగా రాణిస్తూనే విలన్ రోల్స్ చేస్తున్న ఆది పినిశెట్టి రూ.కోటి, కోలీవుడ్ సినిమాల్లో విలన్‌గా రాణిస్తున్న హరీష్ రూ.50లక్షలుగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. చదవండి : రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
రివ్యూ టైమ్: పిట్ట కథలు
వెబ్ యాంథాలజీ: ‘పిట్టకథలు’; తారాగణం: జగపతిబాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, మంచులక్ష్మి, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా; దర్శకులు: తరుణ్ భాస్కర్– నందినీ రెడ్డి – నాగ్ అశ్విన్ – సంకల్ప్ రెడ్డి; ఓటీటీ: నెట్ ఫ్లిక్స్; రిలీజ్: ఫిబ్రవరి 19 వేర్వేరు రచయితలు, కవులు రాసిన కొన్ని కథలనో, కవితలనో, గేయాలనో కలిపి, ఓ సంకలనం (యాంథాలజీ)గా తీసుకురావడం సాహిత్యంలో ఉన్నదే! మరి, వేర్వేరు దర్శకులు రూపొందించిన కొన్ని వెండితెర కథలను గుదిగుచ్చి, తెరపైకి తీసుకువస్తే? అదీ యాంథాలజీనే. ఓటీటీ వేదికలు వచ్చాక పెరిగిన ఈ వెబ్ యాంథాలజీల పద్ధతి ఇప్పుడు తెలుగులో కూడా ప్రవేశించింది. తమిళంలో గత ఏడాది ‘పుత్తమ్ పుదు కాలై’ (అమెజాన్ ప్రైమ్), ఈ ఏడాది ‘పావ కదైగళ్’ (నెట్ ఫ్లిక్స్) లాంటివి వచ్చాయి. గత సంవత్సరమే తెలుగులో ‘మెట్రో కథలు’ (ఆహా) లాంటి ప్రయత్నాలూ జరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగులో తొలిసారి తమ ఒరిజినల్ ఫిల్మ్‌గా అందించిన వెబ్ యాంథాలజీ ‘పిట్టకథలు’. పాపులర్ దర్శకులు తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి ఈ పిట్టకథలను రూపొందించారు. మన చుట్టూ ఉన్న మనుషుల కథలు, వాళ్ళ మనసులోని వ్యధలు, ప్రేమలు, మోసాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు – ఇలా చాలా వాటిని ఈ కథలు తెర మీదకు తెస్తాయి. స్త్రీ పురుష సంబంధాల్లోని సంక్లిష్టతతో పాటు, వారి మధ్య పవర్ ఈక్వేషన్‌ను కూడా చర్చిస్తాయి. నేటివిటీ నిండిన ‘రాములా’: ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకొని, దర్శకత్వం వహించిన ‘రాములా’ గ్రామీణ నేపథ్యంలోని ఓ టిక్ టాక్ అమ్మాయి రాములా (శాన్వీ మేఘన) కథ. తోటి టిక్ టాక్ కుర్రాడు (నవీన్ కుమార్) ప్రేమిస్తాడు. కానీ, పెద్దల కోసం మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైనప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఓ అమ్మాయి కష్టాన్ని మహిళామండలి అధ్యక్షురాలు స్వరూపక్క (మంచు లక్ష్మి) ఎలా వాడుకుంది ఈ కథలో చూడవచ్చు. సహజమైన నటనతో, తెలంగాణ నేపథ్యంలో, అదే మాండలికంలోని డైలాగ్స్ తో ఈ పిట్టకథ – జీవితాన్ని చూస్తున్నామనిపిస్తుంది. క్లైమాక్స్ గుండె పట్టేస్తుంది. హాట్ హాట్ చర్చనీయాంశం ‘మీరా’: ‘ఓ బేబీ’ ఫేమ్ నందినీరెడ్డి రూపొందించిన ‘మీరా’ – అనుమానపు భర్త (జగపతిబాబు) శారీరక హింసను భరించే పద్ధెనిమిదేళ్ళ వయసు తేడా ఉన్న ఓ అందమైన భార్య (అమలాపాల్) కథ. రచయిత్రి మీరా ఆ హింసను ఎంతవరకు భరించింది, చివరకు ఏం చేసిందనేది తెరపై చూడాలి. లక్ష్మీ భూపాల్ మాటలు కొన్ని చోట్ల ఠక్కున ఆగేలా చేస్తాయి. డిప్రెషన్‌తో బాధపడుతూ, భార్యను బతిమలాడే లాంటి కొన్ని సన్నివేశాల్లో జగపతిబాబులోని నటప్రతిభ మరోసారి బయటకొచ్చింది. అమలా పాల్ కూడా టైటిల్ రోల్‌ను సమర్థంగా పోషించారు. వంశీ చాగంటి, కిరీటి దామరాజు, ప్రగతి లాంటి పరిచిత నటీనటులతో పాటు నిర్మాణ విలువలూ బాగున్నాయి. హాట్ దృశ్యాలతో పాటు, హాట్ హాట్ చర్చనీయాంశాలూ ఉన్న చిత్రం ఇది. ట్విస్టులు, కీలక పాత్ర ప్రవర్తన అర్థం కావాలంటే రెండోసారీ చూడాల్సి వస్తుంది. టెక్నాలజీ మాయలో పడితే... ‘ఎక్స్ లైఫ్’: ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తీసిన పిట్టకథ ‘ఎక్స్ లైఫ్’ ఓ సైన్స్‌ఫిక్షన్. దర్శకుడు క్రిష్ వాయిస్ ఓవర్ చెప్పిన ఈ కథ భవిష్యత్ దర్శనం చేయిస్తుంది. ప్రపంచంలోని మనుషులందరినీ కేవలం డేటా పాయింట్లుగా భావించే విక్రమ్ రామస్వామి అలియాస్ విక్ (సింగర్ సన్నత్ హెగ్డే) ఎక్స్ లైఫ్ అంటూ ప్రపంచంలోనే అత్యాధునిక వర్చ్యువల్ రియాలిటీ కంపెనీ నడుపుతుంటాడు. మనుషుల్లోని ప్రేమను చంపేసే టెక్నాలజీని నమ్ముకున్న మాయాలోకం అది. అక్కడ కిచెన్‌లో పనిచేసే అమ్మాయి దివ్య (శ్రుతీహాసన్)ను చూసి, అమ్మ గుర్తొచ్చి, ప్రేమలో పడతాడు. తరువాత ఏమైందన్నది ఈ కథ. టెక్నాలజీ లోకపు పెను అబద్ధాల కన్నా చిరు సంతో షాలు, ప్రేమలు దొరికిన జీవితమే సుఖమనే తత్త్వాన్ని క్లిష్టంగా బోధపరుస్తుందీ కథ. అసంపూర్తి అనుబంధాల... ‘పింకీ’: ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు తీసిన సంకల్ప్ రెడ్డి రూపొందించిన పిట్ట కథ ‘పింకీ’. ఇద్దరు దంపతుల (సత్యదేవ్ – ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ – ఆషిమా నర్వాల్) మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ప్రేమ కోసం పరితపించే ఒకరు, పాత జ్ఞాపకాలను వదిలించుకోవాలనుకొనే మరొకరు... ఇలాంటి వివిధ భావోద్వేగాలతో నాలుగు పాత్రలు కనిపిస్తాయి. ఆ అనుబంధాల క్రమాన్ని కానీ, చివరకు వారి పర్యవసానాన్ని కానీ పూర్తి స్థాయిలో చూపకుండా అసంపూర్తిగా ముగిసిపోయే కథ ఇది. ఈ యాంథాలజీలో ఒకింత ఎక్కువ అసంతృప్తికి గురిచేసే కథా ఇదే. ప్రధానంగా స్త్రీ పాత్రల చుట్టూ తిరిగే ఈ పిట్టకథల్లో పేరున్న కమర్షియల్ చిత్రాల తారల అభినయ కోణం కనిపిస్తుంది. సంగీతంలో వివేక్ సాగర్ (‘రాములా’), మిక్కీ జె మేయర్ (‘మీరా’), ప్రశాంత్ కె. విహారి (‘పింకీ’) లాంటి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేశారు. అలాగే, ఛాయాగ్రహణం, ఆర్ట్ వర్క్‌లోనూ పాపులర్ టెక్నీషియన్లు ఉన్నారు. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, నవతరం దర్శకులు తీసిన ఈ కథలన్నిటిలో లవ్ మేకింగ్ సీన్లు ఎదురవుతాయి. అశ్లీలపు మాటలూ వినిపిస్తాయి. స్మార్ట్ ఫోన్లో చూస్తే అది ఇబ్బంది కాకపోవచ్చు. కానీ, సకుటుంబంగా చూడాలంటే కష్టమే. చిరకాలంగా ‘నెట్ ఫ్లిక్స్’ ఊరిస్తూ వచ్చిన ఈ యాంథాలజీలో నాలుగు కథలూ ఒకే స్థాయిలో లేకపోవడమూ చిన్న అసంతృప్తే. కొసమెరుపు: ‘పిట్టకథలు’... అద్భుతంగా ఉన్నాయనలేం... అస్సలు బాగా లేవనీ అనలేం! బలాలు ♦సమాజంలోని కథలు ♦పాపులర్ దర్శకులు, నటీనటుల ప్రతిభ ♦నిర్మాణ విలువలు బలహీనతలు ♦హాట్ సన్నివేశాలు ♦కొన్ని అసంతప్తికర కథనాలు రివ్యూ: రెంటాల జయదేవ -
ఎఫ్.సి.యు.కె మూవీ రివ్యూ
చిత్రం: ‘ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్ (ఎఫ్.సి.యు.కె)’ తారాగణం: జగపతిబాబు, అమ్ము అభిరామి, రామ్ కార్తీక్, బేబీ సహస్రిత, కల్యాణీ నటరాజన్, భరత్, బ్రహ్మాజీ మాటలు: కరుణాకర్ అడిగర్ల – బాలాదిత్య పాటలు: బాలాదిత్య సంగీతం: భీమ్స్ సెసిరోలియో ఫైట్స్: స్టంట్స్ జాషువా కెమెరా: జి. శివకుమార్ ఎడిటింగ్: కిశోర్ మద్దాలి నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్; కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: విద్యాసాగర్ రాజు నిడివి: 169 నిమి షాలు రిలీజ్: ఫిబ్రవరి 12 ఒకే సినిమాలో ఎన్నో కథలు చెప్పాలనుకుంటే ఏమవుతుంది? అసలు ఎత్తుకున్న కథ కన్నా మిగతా చుట్టూ అనేక అంశాలు అల్లుకుంటూ పోతే ఏమవుతుంది? కానీ, కుటుంబ కథ చుట్టూరానే తిరగాల్సిన కథను ఎడల్ట్ కామెడీ వ్యవహారంగా మారిస్తే ఏమవుతుంది? డబ్బులు ఎదురిచ్చి ఓ రెండుమ్ముప్పావు గంటలు ఈ పాఠాలన్నీ తెలుసుకోవాలంటే– తాజా రిలీజ్ ‘ఎఫ్.సి. యు.కె’ (ఫాదర్–చిట్టి – ఉమ– కార్తీక్) చూడాలి. కథేమిటంటే..: లేటు వయసులో ఓ పిల్లకు తండ్రి అయిన వ్యక్తి, దాని వల్ల అతని కొడుకుకు వచ్చిన ఇబ్బందులు ఈ చిత్ర ప్రధాన కథ. ఫణి భూపాల్ (జగపతిబాబు) రెండు రాష్ట్రాల్లో ఒక కండోమ్ కంపెనీకి డీలర్. 60 ఏళ్ళ వయసొచ్చినా, అమ్మాయిలతో సరదాలు మానని మనిషి. అతని కొడుకు – తల్లి లేకుండా పెరిగినవాడు కార్తీక్ (రామ్ కార్తీక్). అనుకోకుండా ఓ పిల్లల డాక్టర్ ఉమ (అమ్ము అభిరామి) పరిచయమవుతుంది. ఆమెకూ, అతనికీ స్నేహం పెరిగే లోపలే బంధుత్వాల మీద రిసెర్చ్ చేసే ఓ కుర్రాడు (భరత్)తో ఆమెకు పెళ్ళి కుదురుతుంది. ఉమకూ, కార్తీక్‌కూ మధ్య స్నేహం, పొరపొచ్చాలు సాగుతుండగానే, అరవై ఏళ్ళ తండ్రి తనకు పుట్టిన పసిపాప చిట్టి (బేబీ సహస్రిత)ను తీసుకువస్తాడు. ఎవరా పాప? ఏమిటా కథ? కార్తీక్‌కూ, ఉమకూ మధ్య స్నేహం ఏమైంది అన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: అమ్మాయిలను చటుక్కున పడేసే కళ ఉన్న తండ్రి ఫణి భూపాల్‌గా జగపతిబాబు నటించారు. నిజజీవితంలోనూ 60వ పడిలోకి వస్తున్న ఆయన ఇలాంటి రిస్కీ పాత్ర చేయడం విశేషమే. కానీ, ఆ పాత్రలో జనం ఆయనను ఎంతవరకు అంగీకరిస్తారో చెప్పడం కష్టం. ఫ్లర్ట్ మాస్టర్ అయిన కొడుకు పాత్రలో రామ్ కార్తీక్ కామెడీ, ఫైట్లు, రొమాన్స్– ఇలా అన్నీ చేయడానికి శతవిధాల ప్రయత్నించారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన తమిళమ్మాయి అమ్ము అభిరామి ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’లో స్కూల్ అమ్మాయిగా కనిపించారు. తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ (తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ అవుతోంది)లో హీరో ధనుష్ సరసన నటించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇరవై ఏళ్ళ అభిరామి ఇందులో పిల్లల డాక్టర్ ఉమ పాత్రను పండించడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పాత్రను రాసుకున్న విధానంలోనే ఉన్న తప్పులకు ఆమె బాధ్యురాలు అయింది. ఆ పాత్ర స్నేహం కోరుతోందా, ప్రేమ కోరుతోందా, వాటన్నిటికీ మించి సమాజంలో స్త్రీని చూడాల్సిన విధానంపై పోరు చేస్తోందా అన్నది ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. దగ్గుబాటి రాజా, జయలలిత, శ్రీలక్ష్మి, మెల్కోటే లాంటి పాత తరం నటీనటుల మొదలు ఈ తరం భరత్ దాకా సినిమాలో చటుక్కున చెప్పలేనంత చాలామందే ఉన్నారు. నిడివి, లేని ఆ పాత్రల నుంచి అద్భుతాలు ఆశించలేం. ఎలా తీశారంటే..: ‘‘ఆకలేస్తే అన్నం పెడతాం. అవసరమైతే సాయం చేస్తాం. ఆడాళ్ళడిగితే కాదంటామా... ఇచ్చేస్తాం’’ అనే తండ్రి, ‘‘తల్లిని తెస్తా... తల్లిని తెస్తా.. అని చెల్లిని తెచ్చావేంటి’’ అని ప్రశ్నించే కొడుకు, ‘‘బండి ఇంకా కండిషన్ లోనే ఉంది అంకుల్...’’ అనే చుట్టుపక్కలి ఫ్రెండ్సు – ఇలా ఉంటుందీ సినిమా. 1970లలో మొదలైన శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై తండ్రి కీ.శే. కానూరి రంజిత్ కుమార్ బాటలో ఇప్పటికే చాలా సినిమాలు తీశారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. గతంలో ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు – ఆ తరువాత’ లాంటి ఫ్యామిలీ కథాంశాలతో ఆకట్టుకున్న ట్రాక్ రికార్డ్ ఆయనది. కానీ, ఈసారి ఎడల్ట్ కామెడీ చిత్రంతో ఇలాంటి సాహసం చేయడం విచిత్రం. మూడేళ్ళ క్రితం ‘రచయిత’ (2018) చిత్రం రూపొందించిన దర్శకుడు విద్యాసాగర్ రాజుకు ఇది రెండో సినిమా. కానీ, ఆయన కథ రాసుకోవడం మీద ఎంత శ్రద్ధ పెట్టారన్నది ప్రశ్న. తీసిన సినిమా కన్నా ముందు... రాసుకున్న స్క్రిప్టుకు ఎడిటింగ్ అవసరమనే విషయం మర్చిపోయినట్టున్నారు. కన్యాత్వ పరీక్ష, కండోమ్ లకు ఎందుకు యాడ్స్ వేయాలి, పెట్రోల్ ఎలా ఆదా చేయాలి, వయసు పైబడినంత మాత్రాన కోరికలు పోతాయా – ఇలాంటి చాలా విషయాల మీద ఈ చిన్న సినిమాలో చర్చలూ పెట్టారు. పాత్రలు మాటిమాటికీ వాష్ రూమ్‌కు వెళతామని సైగ చేసే ఈ చిత్రంలో అపానవాయువు, పసిపాపల డైపర్ క్లీనింగ్ లాంటి వాటినీ కామెడీ అనుకొని వాడినట్టున్నారు. ‘‘నా జీవితంలో ఏ ప్రాబ్లమ్ లేకపోవడానికి కారణం మా నాన్న’’ అనే కొడుకు, తీరా తన ‘‘జీవితంలో నాకు సమస్యే నువ్వు’’ అని తండ్రిని ప్రశ్నించే స్థాయికి ఎందుకు వచ్చాడన్నది అసలు కథ. ఆ ఎమోషనల్ యాంగిల్ చుట్టూ కథను మరో రకంగా రాసుకొని ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది. గమ్మత్తేమిటంటే, కథ కూడా తానే రాసుకున్న దర్శకుడు అనుకున్నప్పుడు అనుకున్నట్టల్లా పాత్రల ప్రవర్తన మారిపోతుంటుంది. బలమైన కార్యకారణ సంబంధం కనిపించేది తక్కువ. అనేక మలుపులు తిరుగుతూ సా...గిపోయే కథలో అడపాదడపా బోలెడంత క్రియేటివిటీ పొంగి పొరలుతుంది. సినిమా మధ్యలో సరిగ్గా ఇంటర్వెల్ ముందు పాత్రలతో మన జాతీయ గీతం ‘జనగణమన...’ పాడించడం అందులో హైలైట్. భీమ్స్ సెసిరోలియో సంగీతం, జె.బి. నేపథ్య సంగీతం అందించారు. ‘నేనేం చెయ్య...’ పాట కాస్తంత బాగున్నా, హాలు దాటాక ఎన్ని గుర్తుంటాయో చెప్పలేం. నటుడు బాలాదిత్య ఈ సినిమాకు 4 పాటలు, కరుణాకర్ అడిగర్లతో కలసి మాటలు సమకూర్చడం మరో విశేషం. దురర్థం ధ్వనించేలా సినిమాకు ఇలా ‘ఎఫ్.సి.యు.కె’ అని పేరు ఎందుకు పెట్టారంటే – కేవలం జనం దృష్టిని ఆకర్షించడం కోసమేనని దర్శక, నిర్మాతలు ఆ మధ్య వివరణ ఇచ్చారు. కానీ, ఆ టైటిల్ ఇప్పుడీ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది చెప్పలేం. ఈ చిత్రం ఓ ఫన్ వ్యాక్సిన్ అని చిత్రయూనిట్ మాట. వెరసి, వ్యాక్సిన్ వేసుకుంటే, కాస్తంత సైడ్ ఎఫెక్ట్లకూ సిద్ధపడాల్సిందే! కొసమెరుపు: మరీ ఇన్ని మలుపులతో... ఇంతసేపా... చిట్టీ! బలాలు ♦ బేసిక్ స్టోరీ లైన్ ∙జగపతిబాబు లాంటి పాపులర్ ఫేస్‌లు ♦ అక్కడక్కడి మెరుపులు బలహీనతలు ♦ బోలెడన్ని మలుపులు, సాగదీత కథనం ♦ హీరో హీరోయిన్లు అపరిచితులు కావడం ♦ ఎడల్ట్ కంటెంట్, ముతక కామెడీ ♦ దర్శకత్వం, ఎడిటింగ్ లోపాలు రివ్యూ: రెంటాల జయదేవ -
కన్ ఫ్యూజన్ .. ఫన్
‘‘కార్తీక్, ఉమ ప్రేమకథలో అనుకోకుండా చిట్టి అనే చిన్నపాప ప్రవేశిస్తే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? మా ప్రేమకథని తను ఎలా గట్టెక్కించింది? అనే పాయింట్‌తో రూపొందిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే. ఇందులో పాత్రల మధ్య ఉండే కన్ ఫ్యూజన్ మంచి వినోదం అందిస్తుంది’’ అన్నారు రామ్ కార్తీక్. జగపతిబాబు ప్రధాన పాత్రలో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్–చిట్టి–ఉమా–కార్తీక్)’. కేఎల్ దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇందులో నా పాత్ర పక్కింటబ్బాయి తరహాలో ఉంటుంది. నటుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను ఈ సినిమాతో బయటకు తెచ్చారు విద్యాసాగర్‌గారు. ప్రివ్యూ చూసిన వారంతా నా నటనను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఫన్ గానే కాకుండా ఎమోషనల్గానూ ఉంటుంది. అది ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుంది’’ అన్నారు. -
మా సినిమాలో బూతు లేదు: జగపతి బాబు
‘‘ఎఫ్‌సీయూకే’ టైటిల్‌ను చూసి కొంతమంది వేరేగా అనుకుంటున్నారు. మా సినిమాలో బూతు లేదు. జనాలకు రీచ్ కావాలనే ఆ టైటిల్ పెట్టాం’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్–చిట్టి–ఉమా–కార్తీక్)’. జగపతిబాబు ప్రధానపాత్రలో, రామ్ కార్తీక్ – అమ్ము అభిరామి జంటగా, బేబీ సహస్రిత కీలక పాత్రలో నటించారు. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎఫ్‌సీయూకే బారసాల(ప్రీ రిలీజ్) వేడుక జరిగింది. ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను ఇప్పటికే కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేతుల మీదుగా విడుదల చేయగా, వాటి వీడియో సాంగ్స్‌ను పాపులర్ యూట్యూబర్స్‌తో రిలీజ్ చేయించారు. జగపతిబాబు మాట్లాడుతూ – ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైనర్ ఈ సంవత్సరం ఇంకా రాలేదు. మా చిత్రం ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై 46 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నా. ఒక్క మాటలో ప్రతి విషయంలోనూ ‘ఎఫ్‌సీయూకే’ ది బెస్ట్’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు డైరెక్టర్. ‘‘సినిమాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి’’ అన్నారు రామ్ కార్తీక్. ‘‘సాల్ట్, పెప్పర్ తినే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి’’అన్నారు నటుడు సునీల్. లైన్ ప్రొడ్యూసర్ వాసు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, నటుడు–రచయిత బాలాదిత్య, రైటర్ కరుణాకర్, నటుడు భరత్ పాల్గొన్నారు. (చదవండి: ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్!) (చదవండి: పవన్ సినిమాలో మెరవనున్న స్టార్ డైరెక్టర్!) -
దుర్గారావుతో జగపతి బాబు చిందులు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు.. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామగా మెప్పిస్తున్నారు. ఇక రీల్ లైఫ్‌ని పక్కనపెడితే.. రియల్ లైఫ్‌లో జగపతి బాబు చాలా సైలెంట్. సినిమా వేడుకల్లో కూడా ఎక్కువగా మాట్లాడడు. అసలు సినిమా వేడుకలకు హాజరు కావడమే చాలా అరుదు. అలాంటిది ఓ సాధారణ టిక్‌టాక్ స్టార్ అడిగితే స్టేజ్ మీదికి రావడమే కాదు.. అతని కోరికను కాదనకుండా అతనితో కలిపి స్టెప్పులు వేశారు. ఆ టిక్‌టాక్ స్టార్ ఎవరో కాదు దుర్గారావు. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్). ఈ మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకి సోషల్ మీడియా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో పాటలను విడుదల చేయించారు. దీంట్లో భాగంగా ‘అనుకున్నది అవ్వదురా.. కానీ అయ్యేది తెలవదురా’ అనే సాంగ్‌ను టిక్ టాక్ దుర్గారావు, అతని భార్య చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. తాను జగపతి బాబు అభిమానిని అని.. ఆయనతో కలిసి ఒక్క స్టెప్ వేయాలని ఉందని కోరాడు. దీంతో జగపతి బాబు స్టేజ్ మీదికి వచ్చి.. దుర్గారావుతో కలిసి స్టెప్పులేసి అలరించాడు. తన కోరికను మన్నించి స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేసిన జగపతి బాబుకి దుర్గారావు ధన్యవాదాలు తెలిపాడు. కాగా, టిక్‌టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దుర్గారావు ఒకడు. టిక్‌టాక్‌లో తన భార్యతో కలిసి ఇతడు చేసిన డ్యాన్సులు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అందులో నక్కిలీసు గొలుపు పాటకు ఆ ఇద్దరు వేసిన స్టెప్పులైతే ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. -
‘ఎఫ్‌సీయూకే’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
హ్యపీ బర్త్ డే శౌర్య.. అదిరిపోయిన ‘లక్ష్య’ టీజర్
ఆర్చరీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''లక్ష్య''. యువ నటుడు నాగశౌర్య జన్మదినం సందర్భంగా గురువారం చిత్రబృందం లక్ష్య టీజర్ విడుదల చేసింది. ఈ సినిమా శౌర్యకు ఇది 20వ చిత్రం. ధీరేంద్ర సంతోశ్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పార్థు పాత్రలో ఆర్చరీ ఆటగాడుగా నాగశౌర్య నటిస్తున్నాడు. 'చాలా మందికి ఆడితే గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అంటూ జగపతిబాబు డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. 'పడి లేచిన వాడితో పందెం వేయడం చాలా ప్రమాదకరం' అంటూ వచ్చిన 'లక్ష్య' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శౌర్య సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు. హీరోయిన్గా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టీజర్ అదిరిపోవడంతో నాగశౌర్య ఖాతాలో మరో విజయం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఆర్చరీ నేపథ్యంగా దేశంలో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే. -
ఉద్వేగం.. వినోదం
జగపతిబాబు ప్రధాన పాత్రలో, కార్తీక్, అమ్ము అభిరామి జంటగా బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్స్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొంత విరామం తరువాత మళ్లీ వరుసగా సినిమాలు నిర్మించనున్నాను. ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయగా, వాటిలో ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కథానుసారమే టైటిల్ నిర్ణయించాం. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. మంచి చిత్రాలను కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా చిత్రం రూపొందింది’ అన్నారు. ‘‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్ అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్రకథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి’’ అన్నారు విద్యాసాగర్ రాజు. ఈ చిత్రానికి కెమెరా: శివ.జి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
‘మిస్’ అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది. కథేమిటంటే... విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్). ‘‘అమ్మాయి బిజినెస్ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది. ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ ఇండియన్ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్ ఆలోచన. కానీ, అక్కడి బడా బిజినెస్ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్ శివకుమార్ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’ చేసే హీరోయిన్‌కూ, ‘‘బిజినెస్ ఈజ్ ఎ వార్’’ అని భావించే ఆ విలన్‌కూ మధ్య పోరాటంలో హీరోయిన్ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్ స్టోరీ. ఎలా చేశారంటే... ‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్ ఒప్పుకున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్‌గా విలన్ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్‌గా జరిగిపోతుంటాయి. ఎలా తీశారంటే... ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్ కుమార్). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్ యు ఓన్ట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్‌వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దెయిర్ డ్రీమ్స్’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి. తమన్ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్ సాంగ్ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి. వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్‌ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది. కొసమెరుపు: టార్గెట్ ‘మిస్’ అయింది! బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్ సాంగ్ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్. కీలకమైన సెకండాఫ్‌లో తడబాట్లు ∙అతి సినిమాటిక్ లిబర్టీలు, ఫేక్ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్ ∙తేలిపోయిన క్లైమాక్స్ – రెంటాల జయదేవ -
జగపతి బాబు సోదరుడికి బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు జగపతి బాబు సోదరుడి యుగేంద్ర కుమార్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫిల్మ్ నగర్లో సివసించే ఆయనకు చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గుట్టల బేగంపేట స్థలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు అతని కుమారుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు చెప్పారు. దీని వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
కథకు చాలా ముఖ్యం
నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న 20వ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టై¯Œ మెంట్ పతాకాలపై నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ¯Œ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్న విషయాన్ని గురువారం ప్రకటించారు. ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నెల 18 నుండి మా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: కాలభైరవ. -
మరో వెబ్ సిరీస్‌లో...
‘లెజెండ్’ చిత్రంతో విలన్‌గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు నటుడు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళుతున్న ఆయన 2018లో ‘గ్యాంగ్స్టర్స్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్కా మీడియా నిర్మాణ సంస్థ ఈ సిరీస్‌ని నిర్మించనుందట. త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకునే ఈ వె»Œ æసిరీస్‌కు సంబంధించిన ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను నిర్మాణ సంస్థ త్వరలో అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తుందని సమాచారం. -
లూసిఫర్‌కి విలన్?
హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత జగపతిబాబు కాల్షీట్ డైరీ ఫుల్‌గా ఉంటోంది. ‘లెజెండ్’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో విలన్‌గా జగపతిబాబు నటన అదుర్స్. తాజాగా ఆయన మరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఇందులోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును సంప్రదించారట చిత్రబృందం. అది విలన్ రోల్ అని తెలిసింది. ఇదే చిత్రంలో నటి ఖుష్బూ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
జగ్గూ భాయ్ సాయం.. జక్కన్నకు పోలీసుల థ్యాంక్స్
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో రోజువారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి వారికి సాయం చేయడానికి ఇప్పటికే అనేకమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు ఇబ్బందుల్లో ఉన్న పదివేల మంది పేద సినీ కార్మికులకు నిత్యావసరవస్తువులతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. గతంలో కూడా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు అందించిన విషయం తెలిసిందే. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత) రాజమౌళికి ధన్యవాదాలు: సైబరాబాద్ పోలీసులు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భగభగమండే ఎండలో సైతం తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన శీతల పానీయాలు అందించిన విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా నగరంలో 30,000 బాటిళ్లను పోలీసులకు అందించారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ రాజమౌళి బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ టీంకు సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. (బుట్టబొమ్మ సారీ చెప్తుందా?) Thank you @ssrajamouli @Shobu for the expression of support. @cyberabadpolice enjoyed these tasty and nutritious beverages from @GolisodaDrinks. 30000 bottles distributed over 3 weeks time ensuring social distancing and WHO production guidelines. @TelanganaDGP @KTRTRS pic.twitter.com/VmWnRu5ZKc — Cyberabad Police (@cyberabadpolice) May 30, 2020 -
‘ఎ’ చిత్ర యూనిట్‌కు జగపతి బాబు విషెస్
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన మెడికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నటుడు జగపతి బాబు విడుదల చేశారు. తన ట్విటర్ ద్వారా ‘ఎ’ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదలచేసిన జగపతి బాబు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక మోషన్ పోస్టర్‌కు సైతం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. Here's the #A (AD INFINITUM) Movie Motion Poster. Best wishes to the entire team.@ugandharmuni @avanthikaprodu1 @NithinPrasannaz #PreethiAsrani #MOVIEAADINFINITUM https://t.co/mjsfujGJo3 — Jaggu Bhai (@IamJagguBhai) May 20, 2020 చదవండి: జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది? రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? -
జగపతిబాబు ఔదార్యం
గచ్చిబౌలి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినీ నటుడు జగపతిబాబు శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. ఆపత్కాలంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముందు జాగ్రత్తగా వీటిని అందించినట్లు జగపతిబాబు పేర్కొన్నారు. -
ఫారెస్ట్‌కు పయనం
అడవుల్లో డ్రైవింగ్ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను త్వరలో తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్ చేశారట. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి, విలన్‌గా జగపతిబాబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ జగపతి బాబు
-
విజయం ఖాయం
‘‘కొన్నేళ్లుగా పంపిణీ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాఖ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ రేపు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ– ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే కథాంశం. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. సన్నీ లియో¯Œ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మా చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది’’ అన్నారు. -
రాజా వస్తున్నాడు
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో ‘మన్యం పులి’ ఫేమ్ వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహ’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘అదొక మారుమూల అటవీ ప్రాంతం. ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందు తాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా ఎలా తీర్చాడు? అన్నదే ఈ చిత్రకథాంశం. చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి మాస్ యాక్షన్ , జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్ పోరాటాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
రాజా వస్తున్నాడహో...
మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రలు చేశారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ మలయాళ చిత్రం ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజా నరసింహా’ ట్రైలర్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ యాప్ట్‌గా ఉంది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి పవర్ఫుల్ యాక్షన్, జగపతిబాబు విలనిజం, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు
‘‘సినిమా రాయడాన్ని పాత్రలు తయారు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పుడు సాంకేతిక నిపుణులతో కలసి సినిమా చూస్తాను. నా సినిమాని ఫైనల్‌గా చూసేది కూడా అప్పుడే. ఆ తర్వాత జరిగేదాన్ని పట్టించుకోను. సినిమా ఎలా ఆడుతుంది? కలెక్షన్లు, రివ్యూలు పెద్దగా పట్టించుకోను’’ అన్నారు దర్శకుడు నగేశ్ కుకునూర్. ‘హైదరాబాద్ బ్లూస్’తో దర్శకుడిగా మారిన ఈ తెలుగు దర్శకుడు కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 22 ఏళ్ల తర్వాత తెలుగులో తొలి చిత్రంగా ‘గుడ్ లక్ సఖీ’ని తెరకెక్కిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రధారులు. సుధీర్ చంద్ర నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రవిశేషాలను నగేశ్ కుకునూర్ పంచుకున్నారు. ► నేను పక్కా హైదరాబాదీ. నేను దాచుకున్న సేవింగ్స్‌తో నా తొలి సినిమా ‘హైదరాబాద్ బ్లూస్’ చేశాను. నాన్న ప్రొడక్షన్ చూసుకున్నారు. అమ్మ కుక్, ఆంటీ కాస్ట్యూమ్స్ చూసుకున్నారు. మొదటిసారి స్క్రీన్ మీద నా పేరు చూసుకోగానే నేను దర్శకుడినయిపోయాను అని గర్వంగా ఫీల్ అయ్యాను. ‘హైదరాబాద్ బ్లూస్’ చిత్రాన్ని అమెరికాలో ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపుదాం అనుకుని ప్రింట్లను సూట్‌కేస్‌లో అమెరికా తీసుకెళ్లాను. అనుకోకుండా ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాం. ప్రేక్షకులకు నచ్చింది. అక్కడే ఉండిపోయి సినిమాలు చేస్తున్నాను. ► నేను హిందీ రాయగలను, మాట్లాడగలను. అయితే తెలుగు మాట్లాడతాను. తెలుగు సినిమా చేయాలంటే భాష మీద పూర్తి అవగాహన ఉండాలనుకునేవాణ్ణి. నాకున్న పెద్ద చాలెంజ్ తెలుగు సినిమా చేయడం. హిందీలోనే ఉండకుండా ఇక్కడికెందుకు వచ్చావురా బాబూ అని ప్రేక్షకులు అనుకోకూడదు. ► కీర్తీ సురేష్‌తో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇందులో మేకప్ లేకుండా యాక్ట్ చేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ ‘గుడ్‌లక్ సఖీ’ అనుకుంటున్నాం. 60 శాతం షూటింగ్ చేశాం. 25 రోజుల షూటింగ్ ఉంది. నాటకాలు వేసే కంపెనీలో పనిచేస్తుంటాడు ఆది. జగపతిబాబు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ► నాకు ఇద్దరు దర్శకులంటే విపరీతంగా ఇష్టం. టాలీవుడ్లో కె. విశ్వనాథ్‌గారు, బాలీవుడ్లో రిషికేశ్ ముఖర్జీ. ఈ సినిమాలో ముఖర్జీగారి స్టయిల్ కనిపిస్తోంది. ఇది ఆడియన్స్ టేస్ట్‌కి నచ్చుతుందా లేదా? అని నేను చెప్పలేను. ఇప్పటికీ ఆడియన్స్‌కు ఏం నచ్చుతుందో నాకు తెలియదు. ► నా సినిమా నాకు బిడ్డలాంటిది. కథను తయారు చేయడానికి మానసికంగా, ఎమోషనల్‌గా చాలా శ్రమిస్తాం. ఎవ్వరైనా వచ్చినప్పుడు మీ బిడ్డ బాలేదు అంటే ఎవరికి నచ్చుతుంది? దర్శకులు విమర్శలను తీసుకోవాలి అంటారు? ఎందుకు తీసుకోవాలి? అది విమర్శ కాదు.. వాళ్ల అభిప్రాయం? నీ అభిప్రాయం ఎంత కరెక్ట్ అయినా నేను వినదలచుకోలేదు. ఎవరి గురించైనా మంచి ఉంటే చెప్పండి. ఏదైనా చెడు చెప్పాలనుకుంటే మీలోనే ఉంచుకోండి. దానికి ఎటువంటి విలువ లేదు. ► నా సినిమాలన్నీ నాకు నచ్చినట్టుగానే తీస్తాను. కొన్ని వర్క్ అవుతాయి.. కొన్ని అవ్వవు. పెద్ద పెద్ద స్టార్స్‌తో చేయాలని పరుగులు పెట్టను. నాకు స్టోరీ నరేషన్ ఇవ్వడం రాదు. రాసింది నా యాక్టర్స్‌కి ఇస్తాను. ‘మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం’ అని చెబుతుంటాను. నేను సినిమాలు ఎక్కువగా చూడను. ట్రెండ్‌ని పట్టించుకోను. అప్డేట్ కాను. అప్డేట్ అవాల్సిన అవసరం కూడా లేదు. అప్డేట్ అయితే ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుందో దానికి తగ్గట్టు ఓ సినిమా చేస్తాం. ఆ లోపు వాళ్ల ఇష్టాలు మారిపోవచ్చు. -
రైతులకు లాభం
రైతు సమస్యల నేపథ్యంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘లాభం’. ఈ చిత్రాన్ని ఆరుముగ కుమార్‌తో కలిసి నిర్మించారు విజయ్ సేతుపతి. ఇందులో రైతు సంఘం నాయకుడిగా నటించారాయన. ఈ సినిమా కోసం తమిళనాడులోని పెరువాయల్ అనే గ్రామంలో రైతు సంఘం భవంతిని నిర్మించారు. సెట్ వేద్దామని దర్శకుడు ఎస్.పి. జననాథన్ అన్నప్పటికీ, షూటింగ్ పూర్తయ్యాక రైతులకు ఉపయోగపడాలని నిజమైన బిల్డింగ్‌నే కట్టించారు. ఈ బిల్డింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ పూర్తయ్యాక ముందు అనుకున్నట్లుగానే రైతు సంఘానికి ఆ భవంతిని బహుమతిగా ఇచ్చారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేశారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. -
నవ్వుల కీర్తి
‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి సినిమాలను తెరకెక్కించిన హైదరాబాదీ దర్శకుడు నగేష్ కుకునూర్ స్పోర్ట్స్ రామెడీ (రొమాంటిక్ కామెడీ) జానర్లో తెలుగులో తొలిసారి ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఇవాళ కీర్తీ సురేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో కీర్తీ లుక్‌ను రిలీజ్ చేశారు. మెడలో తాయత్తు, చేతికి మట్టి గాజులతో హాయిగా నవ్వుతూ కీర్తి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: శ్రావ్య వర్మ. -
‘సైరా నరసింహారెడ్డి’ థ్యాంక్యూ మీట్
-
ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!
సాహో సినిమాతో మరోసారి సత్తా చాటిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నెక్ట్స్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 20 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 1950ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు విలన్ పాత్రలో నటించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు పాత్రలో చాలా విభిన్నంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. -
విఠల్వాడి ప్రేమకథ
రోహిత్, సుధ రావత్ జంటగా టి.నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విఠల్వాడి’. నరేష్ రెడ్డి .జి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు జగపతిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విఠల్వాడి’ చిత్రం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్‌కు అభినందనలు. నిర్మాత నరేష్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌లోని విఠల్వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో మా సినిమా నిర్మించాం. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు నరేష్ రెడ్డి. జి. ‘‘విఠల్వాడి’ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషం. నరేష్ రెడ్డిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ చిత్రం మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు రోహిత్. ‘‘నిజ జీవితంలో జరిగిన ఒక వాస్తవ ప్రేమకథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు టి.నాగేందర్. అమిత్, అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర, జయశ్రీ, రోల్ రైడ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ అడపా, సంగీతం: రోషన్ సాలూరు. -
గోవా కాసినోలో టాలీవుడ్ స్టార్
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు గోవాలోని బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేశారు. స్వయంగా ఆయన కాసినోలో దిగిన ఫోటోను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసి ‘నేను గోవా, బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తున్నాను. నన్న విష్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. జగపతి బాబు జూద ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్ సమయాల్లో ఏమాత్రం గ్యాప్ దొరికిన కాసినోలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అలవాటు కారణంగానే జగపతిబాబు తన ఆస్తులను కోల్పోయారన్న అపవాదు కూడా ఉంది. అయితే జగ్గుభాయ్ మాత్రం కొంతమంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం, సినిమా ఎంపికలో సరిగ్గా వ్యవహరించకపోవటం లాంటి కారణాలతోనే తాను ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను గానీ, తన అలవాట్ల కారణంగా కాదని చెపుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్. Enjoying myself in big daddy casino Goa ..... Pls wish me luck.... pic.twitter.com/dDovDKqHKs — Jaggu Bhai (@IamJagguBhai) August 3, 2019 -
సున్నితమైన ప్రేమకథ
జగపతిబాబు, మలయాళ నటి మీరా నందన్ జంటగా 2015లో విడుదలైన చిత్రం ‘హితుడు’. కె.విప్లవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నంది అవార్డు కూడా పొందింది. విప్లవ్ తాజాగా కొత్త సినిమాని తెరకెక్కించనున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘ప్రేమకు రెయిన్ చెక్’ ఫేమ్ అభిలాష్, ‘అరవింద సమేత వీర రాఘవ, మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో నటించిన రాఘవ్ కథానాయకులు. విప్లవ్ మాట్లాడుతూ– ‘‘సున్నితమైన ప్రేమకథతో నిర్మించనున్న చిత్రమిది. నేటి తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు. -
మహేష్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో జగపతిబాబు నటించడం లేదని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్, జగపతి బాబు మధ్య విభేదాల కారణంగానే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై జగపతిబాబు స్పందించారు. తనకు మహేష్‌తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినీ పరిశ్రమ అనేది నాకు కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ నాపై వస్తున్న తప్పుడు కథనాల మూలంగా 33 ఏళ్ల సినీ జీవితంతో తొలిసారి వివరణ ఇస్తున్నా. మహేష్ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు. మహేష్ సినిమా కోసం రెండు చిత్రాలను కూడా వదులుకున్నాను. ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు చేయాలని ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరటంలేదు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా అసత్యం. మహేష్‌కి, చిత్ర యూనిట్‌కి ఆల్ ద బెస్ట్’’ అంటూ జగపతిబాబు వివరణ ఇచ్చారు. అయితే జగపతిబాబు స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. -
‘ది లయన్ కింగ్’.. ఓ విజువల్ వండర్!
హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఏదో మొక్కుబడిగా సినిమాలు తెలుగులో రిలీజ్ చేయటం కాదు ఆ సినిమాకు తెలుగు టాప్ స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పించి సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. అదే బాటలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హాలీవుడ్ విజువల్ వండర్ ‘ది లయన్ కింగ్’. కథ విషయానికి ది లయన్ కింగ్ భారతీయులకు బాగా పరిచయం ఉన్న కథే. ఈ సినిమా కథకు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి కథకు చాలా దగ్గర పోలికలున్నాయి. అడవికి రారాజు ముఫాసా.. తన తరువాత తన కొడుకును సింబాను రాజును చేయాలనుకుంటాడు. కానీ ముఫాసా తమ్ముడు స్కార్‌కు ఇది నచ్చదు. అందుకే కుట్ర పన్ని ముఫాసాను చంపేస్తాడు. అంతేకాదు ముఫాసా చావుకు సింబానే కారణం అని అందరినీ నమ్మించి చిన్న వయసులోనే సింబాను ఆ అడవికి దూరం చేస్తాడు. ముఫాసా భార్య సరభిని ఇబ్బందుల పాలు చేస్తాడు. రాజ్యాధికారం తీసుకున్న స్కార్ తన అరాచక పాలన కొనసాగిస్తుంటాడు. స్కార్ చర్యల కారణంగా అడవితో పాటు జంతువులు కూడా అంతరించిపోతుంటాయి. అడవి వదిలి వెళ్లిన సింబాను పుంబా, టిమెన్ అనే రెండు జంతువులు పెంచి పెద్ద చేస్తాయి. పెద్దవాడైన సింబా.. నల అనే ఆడ సింహాం ద్వారా స్కార్ చేస్తున్న అరాచాకాలు, తన తల్లిని పడుతున్న కష్టాలను తెలుసుకుంటాడు. రాజ్యాన్ని, తల్లిని కాపాడుకునేందుకు సింబా ఏంచేశాడు? తిరిగి అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు..? స్కార్ ఆట ఎలా కట్టించాడు? అన్నదే మిగతా కథ. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు తెలుగులోకి డబ్ చేస్తే డైలాగ్స్ కామెడీగా ఉంటాయి. కానీ ది లయన్ కింగ్ చూస్తే మనకు అలాంటి ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ, రవిశంకర్‌లు చెప్పిన డబ్బింగ్ మనకు మన సినిమానే చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో దాదాపు 1700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళుతుంది. సినిమాలోని క్యారెక్టర్స్మాత్రమే కాదు పరిసరాలు, చెట్లు, వాగులు, చిన్న చిన్న పురుగులు లాంటివాటి విషయంలో కూడా దర్శకుడు తీసుకున్న కేర్ తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం సాంకేతికతను నమ్ముకొని గ్రాండ్ విజువల్స్ క్రియేట్ చేయటమే కాదు అందుకు తగ్గ కథా కథనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జాన్ ఫెవ్రూ. ఓ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన డ్రామా, ఎమోషన్స్, కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ది లయన్ కింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనటంతో సందేహం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. కథపరంగా మనకు పెద్దగా కొత్తగా అనిపించకపోయినా గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఇలా అన్ని కలిసి ది లయన్ కింగ్‌ను ఓ విజువల్ వండర్‌గా మార్చేశాయి. -
మహేష్ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఎఫ్ 2తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ స్పందించకపోయినా జగపతి బాబుకు బదులు ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్లో పాల్గొనేందుకు కాశ్మీర్ వెళ్లిన జగ్గుభాయ్ తన పాత్రను ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
క్రీడల నేపథ్యంలో...
కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్ నగేశ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పించనున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ. -
జగపతిబాబు@ స్కార్ రవిశంకర్@ ముఫార్
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘లయన్ కింగ్’ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జూలై 19న విడుదల కానుంది. జాన్ ఫేవ్రేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్కార్ పాత్రకి నటుడు జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా, ముఫార్ పాత్రకి డబ్బింగ్ స్టార్, నటుడు పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
సాండల్‌వుడ్‌కు జగ్గుభాయ్
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇతర భాషల్లోనే అంతే బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కోలీవుడ్, మాలీవుడ్ వరుస సినిమాలు చేస్తున్న జగ్గుభాయ్ ఇప్పుడు సాండల్ వుడ్మీద దృష్టి పెట్టాడు. గతంలో సుధీప్.. బచ్చన్, నిఖిల్.. జాగ్వర్ చిత్రాల్లో నటించిన జగపతి బాబు కొంత విరామం తరువాత మరో కన్నడ సినిమాకు ఓకె చెప్పాడు. కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోగా తెరకెక్కుతున్న రాబర్ట్ సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటించనున్నాడు. ఈ సినిమా మంగళవారం లాంచనంగా ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాండల్‌వుడ్‌లో కూడా జగపతిబాబు హవా మొదలవుతుందన్న టాక్ వినిపిస్తోంది. -
మరోసారి బాలయ్యతో ఢీ!
ఎన్టీఆర్ బయోపిక్‌తో తీవ్రంగా నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పక్కన పెట్టి మరీ తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం కానుంది. గతంలో బాలకృష్ణ, రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన జైసింహా యావరేజ్ టాక్‌తో పరవాలేదనిపించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడిగా జగపతిబాబు నటించనున్నారట. లెజెండ్ సినిమాతోనే విలన్‌గా మారిన జగ్గుభాయ్, ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. -
తెలుగులో తొలిసారి
‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్లో మంచి పేరున్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు ప్రముఖ దర్శకుడు నగేశ్ కుకునూర్. దాదాపు 20 ఏళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైన ఈ హైదరాబాదీ తెలుగులో మొదటిసారి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వికారా బాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2019లో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వర్త్ ఏ షార్ట్ మోషన్ పోస్టర్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ. శివప్రకాశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ‘తను వెడ్స్ మను’ ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. -
స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీలో కీర్తి సురేష్
‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’ చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా.. ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ.శివప్రకాశ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సినిమా నిర్మాణ రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన నిర్మాతలు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమాను నిర్మిస్తుండటం విశేషం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తను వెడ్స్ మను ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇలా క్వాలీటీ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కావడం లేదు. ప్రస్తుతం వికారాబాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగో భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు మహేస్. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్‌కు ప్రతినాయకుడిగా జగపతి బాబు కనిపించనున్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌కు తండ్రిగా కనిపించిన జగ్గుభాయ్, ఇప్పుడు ప్రతినాయకుడిగా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహర్షిలోనూ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌కు కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మహేష్‌కు జోడిగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే లో లాంచనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సైరా.. వీరా రెడ్డిగా జగ్గుభాయ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్రయూనిట్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. బాహుబలి తరహాలో సినిమాలో నటించిన నటీనటులు పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు(మంగళవారం) జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన పోషిస్తున్న వీరా రెడ్డి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి విలక్షణ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా తమన్నా కీ రోల్లో అలరించనుంది. -
‘హీరో నిఖిల్ క్షమాపణ చెప్పాలి’
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కొద్ది రోజులుగా ‘ముద్ర ’అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా తన సినిమా లోగో, పేరు వాడుకొని మరో సినిమా విడుదల చేస్తున్నారంటూ నిఖిల్ సోషల్ మీడియాలో మండిపడ్డ సంగతి తెలిసిందే. (‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’) తాజాగా నిఖిల్ కామెంట్లపై నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ముద్ర సినిమా టైటిల్ తనదేనని పునరుద్ఘాటించారు. టైటిల్ తనది అనడానికి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. నిఖిల్ నిర్మాతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టైటిల్ తనది అని నిఖిల్ నిరూపించాలని.. లేకపోతే సినిమాల నుంచి వెళ్లిపోవాలని సవాల్ చేశారు. సినిమా విడుదలయ్యే సమయంలో సినిమా చూడోద్దని నిఖిల్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. చిన్న నిర్మాత అయితే ఏదైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి అని నిలదీశారు.అసభ్యపదజాలంతో నిర్మాతలను తిడతారా అని మండిపడ్డారు. సోమవారంలోపు నిఖిల్ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే ఆయన బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఈ విషయంపై ఎమర్జెన్సీ మీటింట్ పెడుతున్నామని.. అన్ని తేలేవరకూ నిఖిల్ సినిమా ఆపేయాలని డిమాండ్ చేశారు. ముద్ర అనే టైటిల్‌తో జగపతిబాబు ప్రధాన పాత్రలో ఎన్.కె. దర్శకత్వంలో క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ సినిమాను నిర్మించారు. లోగో కూడా నిఖిల్ సినిమాకు చేసినట్లే డిజైన్ చేసారు. దీంతో నిఖిల్ సినిమా అనుకుని జగపతి బాబు సినిమాకు నెటిజన్లు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నిఖిల్ సోషల్ మీడియా పేజ్‌లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది. -
సైరా.. జాతర!
హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి వారం రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు ‘సైరా: నరసింహారెడ్డి’ టీమ్. ప్రస్తుతానికైతే యాక్షన్ సన్నివేశాల కోసం కాదు. ఓ సాంగ్ కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రేపటి నుంచి చిత్రీకరించబోయే ఈ సాంగ్‌లో చిరంజీవి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ పాల్గొంటారని సమాచారం. జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ను దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరిస్తారని తెలిసింది. అంతేకాదు.. వెయ్యిమంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటారట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని తెలుస్తోంది. -
వెల్కమ్ అల్లుడు గారు!
వెల్కమ్ అల్లుడు గారు అంటూ తమ కొత్త అల్లుడికి స్వాగతం పలుకుతున్నారు మన జగ్గూభాయ్. ఇటీవలే జైపూర్‌లో రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి, రానా, ప్రభాస్, రామ్ చరణ్‌లు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ తమ ఇంట్లోకి రాబోతోన్న కొత్త అల్లుడికి జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా వెల్కమ్ చెప్పారు. ‘పూజ, కార్తికేయల వివాహ సంబరాల కారణంగా హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది. అల్లుడు గారి కుటుంబం మా జీవితాల్లోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది. వెల్కమ్ అల్లుడుగారు’అంటూ ట్వీట్ చేశారు. . @RVRPRO Hyderabad have captured some wonderful moments from Pooja and Karthikeya’s wedding celebrations!!! Now our family is complete with Alludu garu"s family into our lives😊 welcome Alludu garu @ssk1122 pic.twitter.com/Skw5gZOH2L — Jaggu Bhai (@IamJagguBhai) January 11, 2019 -
ఆ ట్రైలర్లో విలన్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి!
మాములుగా ఏదైనా సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే.. హీరో గురించి మాట్లాడుకుంటాం. కానీ మొన్న రిలీజ్ అయిన అజిత్ విశ్వాసం ట్రైలర్లో మాత్రం ప్రతినాయకుడి పాత్ర చేసిన జగపతి బాబు గురించి కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మన జగ్గూ భాయ్ అందులో స్టైలిష్ విలన్ లుక్ అదరగొట్టాడు. అజిత్‌కు ధీటుగా జగ్గూ భాయ్ కనిపించడం.. ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే పలు భాషా చిత్రాల్లో విలన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జగపతి బాబుకు.. కోలీవుడ్‌లో ఈ మూవీతో భారీగా డిమాండ్ పెరగుతుందని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలా జగపతి బాబు గురించి మాట్లాడేలా చేస్తున్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. దాదాపు 15మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి. -
ఇల్లేమో తెలుగిస్తానీ పెళ్లేమో రాజస్థానీ!
బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ మధ్య అంతా ‘పెళ్లి యాత్రలకు.. రాజస్థానే నందనవనమాయనే’ అంటున్నారు. మొన్న ప్రియాంకా చోప్రా, ఇవాళేమో రాజమౌళి తనయుడు కార్తికేయల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రాజస్థాన్ వేదికైంది. రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్ నేడు వివాహం చేసుకోనున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు టాలీవుడ్లో చాలామందిని తమ పెళ్లికి ఆహ్వానించారు కార్తికేయ, పూజా. వివాహమంతా మన సౌతిండియా స్టైల్లో జరగనున్నప్పటికీ కొంచెం రాజస్థానీ సంప్రదాయ టచ్ ఇవ్వనున్నారట. విందులో వడ్డించేవన్నీ అక్కడి వంటకాలే. పెళ్లికి విజిట్ చేసిన గెస్ట్స్ అందరికీ నెక్ట్స్ రెండు రోజులు రాజస్థానీ స్టైల్లోనే మర్యాదలు జరగనున్నాయి. సంగీత్‌లో రాజమౌళితో పాటు రామ్‌చరణ్, ప్రభాస్, అనుష్క డ్యాన్స్ చేయడం హైలైట్‌గా నిలిచిందని టాక్. అలాగే అందరూ కలసి అంత్యాక్షరీ కూడా ఆడారు. సుశాంత్, శేష్ అనుష్క రానా, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. -
రాజమౌళి ఇంట్లో పెళ్లి హడావిడి
రాజమౌళి ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది. పెళ్లెవరిదీ అంటే? రాజమౌళి కుమారుడు కార్తికేయది. జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కార్తికేయ వివాహం రేపు (డిసెంబర్ 30) జరగనుంది. ఈ వేడుకకు జైపూర్‌లో ఓ ప్రైవేట్ హోటల్ వేదిక. ఈ పెళ్లి పనుల కోసం రాజమౌళి ఓ నెల రోజుల పాటు హాలిడేస్ కూడా తీసుకున్నారు. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా గురువారమే జైపూర్ చేరుకున్నారు. ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యే అతిథులందరూ శుక్రవారం జైపూర్ ప్రయాణం అయ్యారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, అనుష్క Ôð ట్టి తదితరులు అతిథులుగా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఈరోజు సాయంత్రం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. మెహందీ కార్యక్రమంలో 300మంది అతిథుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ లంచ్ హైలెట్‌గా ఉండబోతోందని సమాచారం. ఈ స్పెషల్ లంచ్‌లో రాజస్థానీ తాలీను గెస్ట్లందరికీ ప్రత్యేకంగా సర్వ్ చేయనున్నారట. స్పెషల్ కార్డ్ స్టార్ హోటల్స్‌లోని రూమ్స్‌లోకి ప్రవేశించాలంటే రూమ్ కార్డ్ తప్పకుండా ఉండాల్సిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అతిథులందరికీ రూమ్‌ని అరేంజ్ చేస్తూ, ఓ స్పెషల్ రూమ్ కార్డ్‌ను ఏర్పాటు చేశారట రాజమౌళి ఫ్యామిలీ. ఎవరి రూమ్ కార్డ్‌కు వాళ్ల ఫొటోను జతపరిచారు. ఈ విషయాన్ని యన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకున్నారు. ‘‘సంబరాలు మొదలయ్యాయి. ఇంతకంటే పర్సనల్ కీ దొరకదేమో’’ అంటూ ఫ్యామిలీ ఫొటో ఉన్న రూమ్ కీ కార్డ్‌ను షేర్ చేశారు. హోటల్ కీ కార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, రానా -
‘మరి’ "బుల్లెట్ దిగిందా"
గ్యాంగ్ ఉంది... గన్నులున్నాయి..చూడ్డానికి ఆడియెన్స్ ఉన్నారు.రివాల్వర్ తిరిగినట్టు ఒక అరడజన్ ట్విస్టులున్నాయి.పండుగాడు లేకపోయినా దిమ్మతిరుగుద్ది.సగం టైం ఏం జరుగుతుందో తెలీక ఓ డజన్ ఎపిసోడ్స్ డజన్ అరటిపండ్లు జీర్ణమైనంత ఈజీగా అయితే కాదు..బాగా మైండ్ పెట్టాలంతే!బుల్లెట్ దిగిందా లేదా అన్న డౌట్ మాత్రం ఆడియెన్స్‌ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది. లొకేషన్ ఒక హోటల్ సూట్ (స్వీట్ అనాలి) లాంటి గది. అది విశ్వకు ఇచ్చిన బస. లోపలికి వచ్చి చూస్తే పడక గదిలో మంచం మీద ‘రెడ్’ పడుకొని ఉంటాడు. తన గదిలోకి ఎలా వచ్చావని రెడ్‌తో గొడవపడ్తాడు. రెడ్ కూడా తీవ్రంగానే గొడవకు సిద్ధమవుతాడు. విశ్వ తన మేనేజర్ కీర్తిని పిలిచి.. రెడ్ తన గదిలోకి ఎలావచ్చాడు అని ప్రశ్నిస్తాడు. కీర్తి కూడా అవాక్కవుతుంది రెడ్ను అక్కడ చూసి. వెళ్లిపొమ్మని చెప్తుంది. కాని రెడ్ వినడు. దాంతో ఘర్షణ పెద్దదవుతుంది. ఎటూ పాలుపోక కీర్తి.. అజయ్‌కు ఫోన్ చేస్తుంది. వస్తాడు. అతను విశ్వకు తోడవడంతో రెడ్ తన దగ్గరున్న గన్ తీస్తాడు.‘‘పేలుస్తావా.. పేల్చు’ అంటూ విశ్వ అతనిని రెచ్చగొడ్తాడు. అజయ్ అటు విశ్వకు, ఇటు రెడ్‌కు నచ్చజెçప్తూ వారిస్తుండగానే విశ్వ, రెడ్ ఒకరిపై ఒకరు తలపడ్తారు. వాళ్లను ఆపే ప్రయత్నంలో ఆ ఇద్దరి మధ్యలోకి అజయ్ వెళ్లి రెడ్ చేతిలో ఉన్న గన్ తీసుకోబోతుండగా పేలుతుంది. రెడ్‌కు బులెట్ తగిలి చనిపోతాడు. కీర్తి సహా ఆ ఇద్దరూ షాక్ అవుతారు. దాన్నుంచి బయటపడటం ఎలా? ఆ క్షణంలోనే అజయ్ స్నేహితురాలు జర్నలిస్ట్ జాహ్నవి అక్కడకు వస్తుంది. డెడ్ బాడీని చూసి ఆమె కూడా అవాక్కవుతుంది. సహాయం కోసం జాహ్నవికి అసలు విషయం చెప్పేస్తాడు అజయ్. హెల్ప్ చేస్తానని మాటిచ్చి బయటకు వచ్చి ఆ ఏరియా సీఐ ఆంజనేయులుకు ఫోన్ చేస్తుంది. సీన్లోకి ఆంజనేయులు ఎంటర్ అవుతాడు. చనిపోయిన రెడ్.. కేడీ బావమరిది. కేడీ.. సీఐకి బెస్ట్ ఫ్రెండ్. ఆ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే పదికోట్లు కావాలని డిమాండ్ చేస్తాడు. వీళ్లు ఒప్పుకుంటారు. ఇక్కడే కథ ఓ మలుపు తిరుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ విశ్వ.. సినిమా హీరో. కీర్తి.. అతని మేనేజర్. అజయ్.. విశ్వ నటిస్తున్న సినిమా హీరోయిన్ ఐశ్వర్య మేనేజర్. కీర్తి, అజయ్.. క్లాస్మేట్స్. కాలేజ్ డేస్‌లో ప్రేమికులు కూడా. కీర్తికి వచ్చిన మోడలింగ్ అవకాశాన్ని తన మేల్ ఈగోతో అడ్డుకుంటాడు అజయ్. దాంతో వాళ్లిద్దరి ప్రేమ బ్రేక్ అవుతుంది. ఇద్దరి ధ్యేయం ఒకటే, సినిమా ఫీల్డ్‌లోకి రావాలని. ప్రొడ్యూసర్ కావాలని కీర్తి, డైరెక్టర్ కావాలని అజయ్ సినీరంగంలో స్ట్రగుల్‌కి సిద్ధపడ్తారు . అంతకుముందు విశ్వకు మేనేజర్‌గా ఉన్న వ్యక్తికి ఛాతీనొప్పి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటాడు. అతని స్థానంలో కీర్తి మేనేజర్‌గా బాధ్యత తీసుకుంటుంది. అజయ్ తండ్రి ఒకప్పుడు హీరో కావాలనే తాపత్రయంతో సినీ రంగంలోకి వస్తాడు. బ్యాక్‌గ్రౌండ్ లేక.. జూనియర్ ఆర్టిస్ట్‌గానూ సెటిల్ కాలేక న్యూస్‌రీడర్‌గా స్థిరపడ్తాడు. తన కొడుక్కీ తనలాంటి అనుభవమే ఎదురవుతుందేమోననే భయంతో అజయ్‌ను సినిమాలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంటాడు. కొడుకు పట్టుదల చూశాక ఆఖరు చాన్స్‌గా ఓకే అంటాడు. డైరెక్టర్ కావాలని అడుగుపెట్టిన అజయ్‌కు మేనేజర్‌గా అవకాశం వస్తుంది. ఈ లైన్ ద్వారా లక్‌ను పరీక్షించుకుందామని చేరుతాడు. అలా కీర్తి, అజయ్ ఇద్దరూ హీరోహీరోయిన్ మేనేజర్లుగా ఒక సెట్ మీద తారసపడతారు. ఆ సినిమా వెనక కథ విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమాకు అనధికార నిర్మాత కుమార్ దాస్ ఉరఫ్ కేడీ. అతనొక గ్యాంగ్‌స్టర్. వడ్డీ వ్యాపారి కూడా. ఆయన వయసులో సగం వయసున్న అమ్మాయి కేడీని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఒక పాప. బయటివాళ్లతో కరుకుగా ఉండే కేడీ పెళ్లాం, బిడ్డలంటే ప్రాణం పెడ్తాడు. ఒకసారి చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన కేడీకి వైద్య పరీక్షలు చేసి.. క్యాన్సర్ అని తేలుస్తారు డాక్టర్లు. అదీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని, ఇంకెంతో కాలం బతకడనీ చెప్పేస్తారు. కుంగిపోతాడు కేడీ. తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసి.. తన తదనంతరం తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లేక బతికేలా చూడాలని ఆరాటపడ్తుంటాడు. అలాంటి ఏర్పాటు చేయమని మిత్రుడు సీఐ ఆంజనేయులు దగ్గరకు వెళ్తాడు. తన జబ్బు విషయమూ బయటపెట్టేస్తాడు. బాగా ఆలోచించిన ఆంజనేయులు ఆ మనీని సినిమాలో పెట్టుబడిగా పెట్టి వైట్ చేసుకోవచ్చని, అందుకు పాల సుబ్రహ్మణ్యమనే నిర్మాతను పట్టుకుందామని సలహా ఇస్తాడు. సుబ్రహ్మణ్యం పాల వ్యాపారంతో పైకెదిగి సినిమా నిర్మాతగా మారి పాల సుబ్రహ్మణ్యంగా పాపులర్ అవుతాడు. వీళ్ల ప్రపోజల్‌ను ఒప్పుకుంటాడు. అలా విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమా స్టార్ట్ అవుతుంది. మరి రెడ్ ఎలా ఎంటర్ అయ్యాడు? సినిమా సెట్స్ మీదున్నప్పుడు ఐశ్వర్య, విశ్వ అందరూ కలిసి పబ్‌లో పార్టీ చేసుకుంటారు. హఠాత్తుగా ఆ పార్టీలో ఐశ్వర్య మాజీ బాయ్‌ఫ్రెండ్ ప్రత్యక్షమవుతాడు. అసహనంగా ఉంటాడు విశ్వ. చిన్న రగడ అవుతుంది. ఆ గొడవతో చిరాకు పడ్డ ఐశ్వర్య.. విశ్వను, తన మాజీ బాయ్ ఫ్రెండ్‌ను తిట్టి వెళ్లిపోతుంది. విశ్వ హర్ట్ అవుతాడు. ఆ పార్టీకి అజయ్ ఫ్రెండ్ జర్నలిస్ట్ జాహ్నవి కూడా వస్తుంది. ఆ వ్యవహారాన్నంతా సెల్ఫోన్లో రికార్డ్ చేసి తన న్యూస్‌చానల్‌కు ఫీడ్ ఇస్తుంది. రచ్చవుతుంది. సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పాల సుబ్రహ్మణ్యం చాకచక్యంతో ఇద్దరినీ కన్విన్స్ చేసి సినిమా ఆగిపోకుండా చూస్తాడు. కాని హీరో, హీరోయిన్ ఒకరినొకరు సాధించుకుంటూ షూటింగ్‌కి ఆటంకం కలిగిస్తుంటారు. దీన్ని చక్కదిద్దడానికి తన బావమరిది రెడ్ను సెట్స్ మీదకు పంపిస్తాడు కేడీ. రెడ్ కూడా సినిమా హీరో కావాలనుకుంటుంటాడు. కాని బావ తనకు ఆ అవకాశం ఇవ్వకపోవడం పట్ల కొంచెం కోపంగా ఉంటాడు. రెడ్.. షారూఖ్ ఫ్యాన్. ట్విట్టర్ అంటే క్రేజీ. ఎప్పుడూ బొడ్లో గన్‌తో, నలుగురిని వెంటేసుకొని తిరుగుతుంటాడు. రెడ్‌కు తిక్కెక్కువ. ఆ తిక్కతోనే అదిగో.. తన గన్ తూటాకు తనే బలవుతాడు. తర్వాత కేడీకి తెలియకుండా అతని బావమరిది శవాన్ని మాయం చేయడానికి సీఐ ఆంజనేయులు అడిగిన పదికోట్ల రూపాయలను సర్దలేకపోతారు అజయ్, విశ్వ. దాంతో మండిపడ్డ ఆంజనేయులు .. రెడ్ శవాన్ని తీసుకుని స్టేషన్‌కు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రకారం శవాన్ని తీసుకుని ఆ గది బయటకు రాగానే కేడీ ఎదురుపడ్తాడు వీళ్లకు. రెడ్ శవాన్ని చూసి .. ‘‘ఎవడు నా బామ్మర్దిని చంపింది’’ అంటూ ఆంజనేయులు వారిస్తున్నా వినకుండా ఆవేశంతో విశ్వ, అజయ్ మీదకు కాల్పులు జరుపుతాడు కేడీ. అజయ్‌కు తూటా తగిలి నేలకొరుగుతాడు. కంగారు పడ్తాడు ఆంజనేయులు. అప్పుడు కేడీనే ఉపాయం చెప్తాడు. అజయ్ శవాన్ని నువ్వు తీసుకుపో.. నా బామ్మర్ది శవాన్ని నేను తీసుకుపోతాను అని. అలాగే జరుగుతుంది. అజయ్ శవాన్ని ఊరవతల కొండమీదకు తీసుకెళ్లి అక్కడినుంచి చెరువులో పడేస్తాడు. అది రికార్డ్ అయి ఆ వీడియో మళ్లీ చానళ్లలో ప్రసారం అవుతుంది. దీనికంతటికీ ముందు కేడీకి క్యాన్సర్ లేదని, వైద్య పరీక్షలకోసం తీసిన బ్లడ్ శాంపిల్స్ తారుమారవడం వల్ల ఆ పొరపాటు జరిగిందని డాక్టర్లు క్షమాపణ చెప్తారు కేడీకి. ఇక టీవీలో వచ్చిన ఆంజనేయులు నిర్వాకానికి పోలీస్ బాస్ గుస్సా అవుతాడు. వివరణ కోరుతాడు. ఆ హత్య కేడీ చేశాడని చెప్పేస్తాడు ఆంజనేయులు. కేడీని పిలిపిస్తారు. నేనెవరినీ చంపలేదు అంటాడు. అబ్ధమని వాదిస్తూ అజయ్ వాళ్లే రెడ్‌ని చంపారనే విషయాన్నీ బయటపెడ్తాడు. నిర్ధారణ కోసం విశ్వను పిలిపిస్తారు. అజయ్ కూడా వస్తాడు. ఆ ట్విస్ట్ వెనక సీఐ ఆంజనేయులు అడిగిన డబ్బును అరేంజ్ చేస్తానని ఆ స్వీట్ నుంచి బయటపడ్డ అజయ్ డైరెక్ట్‌గా కేడీ దగ్గరకు వెళ్లి నిజం చెప్తేస్తాడు పెనుగులాటలో రెడ్ చనిపోయినట్టు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఫీలవుతాడు కేడీ. దానికి కారణం.. కేడీకి క్యాన్సర్ ఉందని తేలగానే అతనికి దగ్గరున్న డబ్బును కొట్టేయాలనుకుంటాడు సీఐ ఆంజనేయులు. హీరో చాన్స్ ఇవ్వలేదని బావ మీద అసంతృప్తిగా ఉన్న రెడ్నూ రెచ్చగెట్టి అతనితో కేడీకి స్పాట్ పెట్టించాలని ప్లాన్ వేస్తాడు. రెడ్ ఒప్పుకుంటాడు. దీన్ని చూసిన కేడీ అనుచరుడు వీడియో తీసి కేడీకి చూపిస్తాడు. నా అనుకున్న, నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారని కలత చెందుతాడు కేడీ. వాళ్లపని పట్టేందుకు సమయం కోసం వేచి చూస్తుంటాడు. అజయ్ వాళ్ల వల్ల రెడ్ లైఫ్‌కి ఎండ్పడడంతో హ్యాపీగా ఫీలవుతాడు కేడీ. ఇక సీఐ అంతుతేల్చడానికి అజయ్‌తో ఓ పథకం వేస్తాడు కేడీ. అదే.. అజయ్‌కు డమ్మీ బుల్లెట్ తగిలినట్టు నాటకం ఆడటం. శవాన్ని పడేస్తుంటే వీడియో తీయడం ఎట్సెట్రా. ఇంతకీ చెరువులో పడేసింది రెడ్ శవమన్నమాట. కేడీ అజయ్‌ను కాల్చాక.. సీఐని మాటల్లో పెడ్తాడు. ఆ టైమ్‌లో తన ప్లేస్‌లో రెడ్ను సీఐ జీప్‌లో పడేస్తారు అజయ్ అండ్ విశ్వ. లాస్ట్ సీన్ విశ్వ, ఐశ్వర్య, కీర్తి, అజయ్‌ల మధ పొరపొచ్చాలు తొలగి ఒక్కటవుతారు. జరిగిన ఆ కథనంతా స్క్రిప్ట్‌గా రాసి డైరెక్ట్ చేసే చాన్స్ అజయ్‌కి ఇస్తాడు కేడీ. అలా ది ఎండ్‌కి అజయ్ డైరెక్టర్ అయిపోతాడు. కథ సుఖాంతం అవుతుంది. తొలి తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్లాట్ ఫామ్ మీద స్క్రీన్ అయిన తొలి తెలుగు వెబ్‌సిరీస్ గ్యాంగ్‌స్టార్స్. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే తెలుగు సినిమా ఫక్కీలో ఉండడం వల్ల వెబ్ సిరీస్‌గా ఇది ఆకట్టుకోలేకపోయింది. పెద్ద తారలను తీసుకున్నారు కథ, కథనం మీద కూడా అంతే శ్రద్ధ పెడితే ఇంకా బాగుండేది. కేడీగా జగపతిబాబు, విశ్వగా నవదీప్, ఐశ్వర్యగా శ్వేతాబసు ప్రసాద్, అజయ్‌గా సిద్ధు జొన్నలగడ్డ, కీర్తిగా అపూర్వ అరోరా, రెడ్‌గా రాహుల్ రామకృష్ణ, సీఐ ఆంజనేయులగా శివాజీ, పాల సుబ్రహ్మణ్యంగా పోసాని కృష్ణమురళి, విశ్వ తండ్రిగా కృష్ణ భగవాన్ నటించారు. – సరస్వతి రమ -
మదరాసులో మకాం
నరసింహారెడ్డి తన సైన్యంతో తమిళనాడు బయలుదేరారు. 18 రోజుల పాటు అక్కడే మకాం అట. స్వాతంత్య్ర ఉద్యమంలో ఏదైనా రహస్య సమావేశాల కోసమా? యుద్ధం తాలూకా వ్యూహ రచనలా? ప్రస్తుతానికైతే సస్పెన్స్. వచ్చే ఏడాది థియేటర్స్‌లో వీక్షించడమే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ న రసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ డిసెంబర్ 3న తమిళనాడులో ప్రారంభం కానుంది. హొగెనక్కల్ జలపాతం వద్ద ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఈ షెడ్యూల్ సుమారు 18 రోజుల పాటు సాగనుంది. చిత్ర తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారట. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో ఈ సినిమా సుమారు 60 శాతంపైగా పూర్తయిందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
వచ్చే ఏడాది జన నేత
దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జనరంజకమైన పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై ‘యాత్ర’ సినిమా తెరకెక్కింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘యాత్ర’ డిసెంబర్ 21న విడుదల కావడం లేదట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్రబృందం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘యాత్ర’ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
అధిపతి
-
నల్ల ధనంపై పోరాటం
జగపతిబాబు హీరోగా ఎన్.కె. దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ముద్ర’. నట్టి కుమార్ సమర్పణలో క్యూటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి సారధ్యంలో నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి. నట్టి కుమార్ మాట్లాడుతూ– ‘‘బ్లాక్ మనీ వల్ల సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. ఎన్నికల్లో నెగ్గడం కోసం రాజకీయ నాయకులు నల్ల ధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇది సమాజంపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన విపరీతమైన ప్రభావం చూపుతోంది. రాజకీయ నాయకులు బ్లాక్ మనీని ఎలా సంపాదిస్తున్నారు? దాన్ని ఎన్నికల్లో ఎలా ఖర్చుపెడుతున్నారన్న అంశాన్ని మా చిత్రంలో చూపించాం. నల్ల ధనంపై పోరాటం చేసే వ్యక్తిగా జగపతిబాబు కనిపిస్తారు. ఇందులో మూడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. దీపావళికి ‘ముద్ర’ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ బాబు, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ. -
మల్టీస్టారర్‌లో హీరోగా..!
విలన్‌గా టర్న్ అయిన తరువాత ఫుల్ బిజీ అయిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, అడపాదడపా హీరోగానూ ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల పటేల్ సర్ సినిమాలో హీరోగా నటించిన జగ్గుభాయ్ త్వరలో ఓ బహుభాషా చిత్రంలో హీరోగా నటించనున్నాడట. కొత్త దర్శకుడు అన్బరసన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్, జాకీష్రాఫ్‌లు కూడా హీరోలుగా నటిస్తున్నారట. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై వినాయకచవితి రోజు అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నారు ఫుల్ బిజీగా ఉన్నారు జగపతిబాబు. -
బాలీవుడ్ సినిమాలో జగపతి బాబు లుక్
లెజెండ్ సినిమాతో విలన్‌గా టర్న్ అయిన టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న జగ్గూభాయ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు నటిస్తున్న హిందీ సినిమాకు సంబంధించిన లుక్ లీకైంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ తానాజీ. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్ తానాజీ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.