పాత్ర ఏదైనా సరే రఫ్ఫాడించేస్తాడు జగపతిబాబు. ఒకప్పుడు హీరోగా నటించిన జగ్గూభాయ్ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న పరంపర 2 సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీపై స్పందించాడు.
'సినిమానే ఒక మాయ.. పాలిటిక్స్ ఓ మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, ఓపిక అంతకన్నా లేదు. కాబట్టి రాజకీయాల గురించి నేను ఆలోచించడం లేదు. నలుగురితో మాట్లాడే తెలివే లేదు. అలాంటిది రాజకీయాల్లో జాయిన్ అయి వాళ్లతో ముందుకెళ్లడం కష్టం. నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల గురించి నాకున్న అవగాహన సున్నా. కాబట్టి పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం, నేను ఓ పార్టీ పెట్టడం అనేది జరగని పని' అని చెప్పుకొచ్చాడు జగపతిబాబు.
చదవండి: అప్పుడు నా కూతుర్ని ఇండస్ట్రీలో అడుగుపెట్టనివ్వలేదు!
తారక్ ధరించిన టీషర్ట్ అంత ఖరీదా?
Comments
Please login to add a commentAdd a comment