అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్‌..! | Jagapathi Babu Turns Villain For Mahesh 26 | Sakshi
Sakshi News home page

అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్‌..!

Published Tue, Apr 23 2019 4:13 PM | Last Updated on Tue, Apr 23 2019 8:10 PM

Jagapathi Babu Turns Villain For Mahesh 26 - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టాడు మహేస్‌. కామెడీ స్పెషలిస్ట్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్‌ స్టార్‌.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్‌కు ప్రతినాయకుడిగా జగపతి బాబు కనిపించనున్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌కు తండ్రిగా కనిపించిన జగ్గుభాయ్‌, ఇప్పుడు ప్రతినాయకుడిగా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న మహర్షిలోనూ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాను లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి, నిర్మాత, కమెడియన్‌ బండ్ల గణేష్‌కు కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మహేష్‌కు జోడిగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిం‍చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే లో లాంచనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement