anil ravipudu
-
అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు మహేస్. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్‌కు ప్రతినాయకుడిగా జగపతి బాబు కనిపించనున్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌కు తండ్రిగా కనిపించిన జగ్గుభాయ్, ఇప్పుడు ప్రతినాయకుడిగా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహర్షిలోనూ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌కు కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మహేష్‌కు జోడిగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే లో లాంచనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హ్యాట్రిక్ ప్లాన్‌లో అనిల్
పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అనిల్ రెండో ప్రయత్నంలోనూ ఆకట్టుకున్నాడు. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాను తెరకెక్కించి మంచి వసూళ్లను సాధించాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించటంతో అనిల్ రావిపూడికి స్టార్ హీరోల నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. ఒక దశలో నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు అనిల్ దర్శకత్వం వహించనున్నాడని, రామారావు గారు పేరుతో అనిల్ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందన్న వార్తలు వినిపించాయి. అయితే బాలయ్య క్రిష్ సినిమాకు ఓకే చెప్పడంతో అనిల్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా తన మూడో సినిమాకు మరో స్టార్ హీరోను లైన్లో పెడుతున్నాడు పటాస్ డైరెక్టర్. చాలాకాలం తరువాత నేను శైలజ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన ఎనర్జిటిక్ హీరో రామ్‌తో తన మూడో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసున్న రామ్, ఆ సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.