![ss karthikeya, pooja prasad wedding in jaipur - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/30/DvkyScXU8AEGAhu.jpg.webp?itok=wFuJVPhO)
కార్తికేయ, పూజలతో సన్నిహితులు
బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ మధ్య అంతా ‘పెళ్లి యాత్రలకు.. రాజస్థానే నందనవనమాయనే’ అంటున్నారు. మొన్న ప్రియాంకా చోప్రా, ఇవాళేమో రాజమౌళి తనయుడు కార్తికేయల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రాజస్థాన్ వేదికైంది. రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్ నేడు వివాహం చేసుకోనున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు టాలీవుడ్‌లో చాలామందిని తమ పెళ్లికి ఆహ్వానించారు కార్తికేయ, పూజా. వివాహమంతా మన సౌతిండియా స్టైల్‌లో జరగనున్నప్పటికీ కొంచెం రాజస్థానీ సంప్రదాయ టచ్ ఇవ్వనున్నారట. విందులో వడ్డించేవన్నీ అక్కడి వంటకాలే. పెళ్లికి విజిట్ చేసిన గెస్ట్స్ అందరికీ నెక్ట్స్ రెండు రోజులు రాజస్థానీ స్టైల్‌లోనే మర్యాదలు జరగనున్నాయి. సంగీత్‌లో రాజమౌళితో పాటు రామ్‌చరణ్, ప్రభాస్, అనుష్క డ్యాన్స్ చేయడం హైలైట్‌గా నిలిచిందని టాక్. అలాగే అందరూ కలసి అంత్యాక్షరీ కూడా ఆడారు.
సుశాంత్, శేష్
అనుష్క
రానా, రామ్‌చరణ్, ఎన్టీఆర్..
Comments
Please login to add a commentAdd a comment