![Jagapathi Babu Green Signal For New Web Series - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/12/JB.jpg.webp?itok=rbs4mX8b)
‘లెజెండ్’ చిత్రంతో విలన్‌గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు నటుడు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళుతున్న ఆయన 2018లో ‘గ్యాంగ్‌స్టర్స్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్కా మీడియా నిర్మాణ సంస్థ ఈ సిరీస్‌ని నిర్మించనుందట. త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకునే ఈ వె»Œ æసిరీస్‌కు సంబంధించిన ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను నిర్మాణ సంస్థ త్వరలో అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment