ఆ ట్రైలర్‌లో విలన్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి! | Huge Response To Jagapathi Babu In Viswasam Trailer | Sakshi
Sakshi News home page

Jan 1 2019 4:26 PM | Updated on Jan 1 2019 4:29 PM

Huge Response To Jagapathi Babu In Viswasam Trailer - Sakshi

మాములుగా ఏదైనా సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయితే.. హీరో గురించి మాట్లాడుకుంటాం. కానీ మొన్న రిలీజ్‌ అయిన అజిత్‌ విశ్వాసం ట్రైలర్‌లో మాత్రం ప్రతినాయకుడి పాత్ర చేసిన జగపతి బాబు గురించి కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. 

మన జగ్గూ భాయ్‌ అందులో స్టైలిష్‌ విలన్‌ లుక్‌ అదరగొట్టాడు. అజిత్‌కు ధీటుగా జగ్గూ భాయ్‌ కనిపించడం.. ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఇప్పటికే పలు భాషా చిత్రాల్లో విలన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జగపతి బాబుకు.. కోలీవుడ్‌లో ఈ మూవీతో భారీగా  డిమాండ్‌ పెరగుతుందని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలా జగపతి బాబు గురించి మాట్లాడేలా చేస్తున్న ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. దాదాపు 15మిలియన్ల వ్యూస్‌ దక్కించుకున్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement