Actor Jagapathi Babu Shares Interesting Things About His Career - Sakshi
Sakshi News home page

Jagapathi Babu: ఆస్తుల గురించి నేనెప్పుడు ఆలోచించలేదు: జగపతి బాబు

Feb 12 2023 3:07 PM | Updated on Feb 12 2023 3:45 PM

Actor Jagapathi Babu Shares Interesting things About His Career - Sakshi

టాలీవుడ్‌లో దశాబ్దాల పాటు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. హీరోగా, విలన్‌గా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆయన నటనకు నిదర్శనం. ఆయన కెరీర్‌లో వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ హీరోగా నిలదొక్కుకున్నారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో ఏడు నంది అవార్డులు అందుకున్నారంటే అంత కన్నా చెప్పాల్సిన అవసరం లేదు. జగపతి బాబు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో ఆయన మెప్పించారు. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, శ్రీమంతుడు, అరవింద సమేత వీరరాఘవ చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రలు చేశారు. శుభలగ్నం, హనుమాన్ జంక్షన్‌ సినిమాలు పోలిస్తే రెండు కూడా ప్రత్యేక పాత్రలు కనిపిస్తాయని అన్నారు.

ఆస్తులపై జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు ఆస్తులు ఎందుకు లేవు. మిగతా అందరూ అనుకున్నట్లు నా ఆస్తి ఎక్కడికి పోలేదు. ఆస్తి అనేది ఎలా పోయిందనేది నాకు తెలియదు. నన్ను ఎవరు మోసం చేశారో వారి గురించి ఆలోచించను. దాని గురించి పట్టించుకోను. ఎవరినీ ఇందులో బ్లేమ్ చేయదలచుకోలేదు. రూ.30 కోట్లు ఉంటే హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నా. ఆస్తులు మిగల్చకపోవచ్చు కానీ బిజినెస్‌ చేద్దామనుకున్నా. ఇది నా సామర్థ్యం. ఈ విషయాన్ని పిల్లలకు కూడా చెప్పేశా. లైఫ్‌ లాంగ్ సంతోషంగా ఉంటాం. లాస్ట్ ఇయర్ రూ.30 కోట్లు వచ్చేశాయి. కానీ నేను మళ్లీ ఎక్కువ సంపాదించాలనుకోలేదు. కోట్ల ఆస్తులు ఉంటే సంతోషంగా ఉంటామనేది రాంగ్. ఎన్ని  కోట్లున్నా కొవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చనిపోయిన వారున్నారు. కానీ అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకూడదు. చేతిలో రెండు ఫోన్లు చేతిలో పట్టుకుని అవకాశాల కోసం వెయిట్ చేసిన రోజులున్నాయ్.' అని అన్నారు.  ప్రస్తుతం ప్రభాస్ మూవీ సలార్‌లోను కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

పెళ్లి వద్దని చెప్పా

జగపతి బాబు మాట్లాడుతూ.. 'నా పిల్లలు నేను చెప్పినట్లు వినాలనేది రాంగ్ కాన్సెప్ట్. ఎవరినీ మనం తక్కువ చేయకూడదు. ఫ్యామిలీకి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. సెకండ్ మ్యారేజ్ గురించి నేను ఆలోచించను. రెండో పెళ్లి చేసుకుంటే లైఫ్ క్రాష్ అవుతుంది. చిన్న పాపకు పెళ్లి వద్దని చెప్పా. నేనైతే బలవంతం చేయను. నువ్వు చేసుకుంటే వద్దనను. అని నా ఒపినియన్ చెప్పా. పెళ్లి, పిల్లలు అనేది స్వార్థం. వాళ్లకేం కావాలో మనం ఆలోచించడం లేదు. నేను అందరి హీరోయిన్లతో బాగుంటాను. ఎవరైనా నా ఫ్రెండ్స్‌గానే భావిస్తాను.' అని అన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement