ఇండస్ట్రీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రతికథానాయకుడిగా మెప్పిస్తున్నారు. బాలకృష్ణ లెజెండ్ మూవీతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత తగ్గేదే లా అంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశమైన తన అభిప్రాయన్ని స్ట్రేట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తుంటాడు. అలా ఆయన చేసిన కామెంట్స్ వార్తల్లో నిలుస్తుంటాయి.
చదవండి: విష్ణు-మనోజ్ మధ్య విభేదాలు? మోహన్ బాబు ఏమన్నారంటే..
ఇదిలా ఉంటే గురువారం(మార్చి 30న) శ్రీరామ నవమి సందర్భంగా జగపతి బాబు ఆసక్తికర వీడియో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని తన తల్లి ఇల్లు చూపిస్తూ స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు. శ్రీరామ నవమి సందర్భంగా పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని చెప్పాడు. ‘అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పానకం తాగాలనిపిచ్చింది. అందుకు మా అమ్మ ఇంటికి వచ్చాను. ఈ ప్లేస్ అంతా ఒక అడవిలా ఉంటుంది. కానీ, హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు, నూకలతోప కావాలన్నా. ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది.
చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా
చాలా కాలం తర్వాత అమ్మ చేతితో మంచి భోజనం చేయబోతున్నాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. హ్యాపీగా ఉంటుంది. ఒక యోగి, యోగిని అంటారే ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది. ఓకే బై బై’ అంటూ జగపతి బాబు తన తల్లి ఇంటిని పరిచయం చేశారు. అయితే వాళ్ల అమ్మను మాత్రం చూపించకుండానే వీడియో ముగించారు. ఇక తన తల్లి ఇల్లు చూడటానికి తపోవనంను తలపిస్తోంది. అంతేకాదు ఆమె ఇంటి లోపలికి వెళ్లాగానే రుషి బొమ్మ కూడా దర్శనం ఇస్తుంది. చూట్టూ పచ్చని చెట్లతో ఆహ్లదకర వాతారవరణంతో అడవిని తలపిస్తున్న ఆమె ఇల్లు హైదరాబాద్ నడిబొడ్డున ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment