
అడవుల్లో డ్రైవింగ్ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను త్వరలో తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్ చేశారట. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి, విలన్‌గా జగపతిబాబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.