అల్లు అర్జున్-రష్మిక మందన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన జగపతిబాబు తాజాగా పుష్ప-2లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ పుష్ప-2లో కూడా సెంటిమెంట్ కంటిన్యూ చేయనున్నారు.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment