
విప్లవ్
జగపతిబాబు, మలయాళ నటి మీరా నందన్ జంటగా 2015లో విడుదలైన చిత్రం ‘హితుడు’. కె.విప్లవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నంది అవార్డు కూడా పొందింది. విప్లవ్ తాజాగా కొత్త సినిమాని తెరకెక్కించనున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘ప్రేమకు రెయిన్ చెక్’ ఫేమ్ అభిలాష్, ‘అరవింద సమేత వీర రాఘవ, మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో నటించిన రాఘవ్ కథానాయకులు. విప్లవ్ మాట్లాడుతూ– ‘‘సున్నితమైన ప్రేమకథతో నిర్మించనున్న చిత్రమిది. నేటి తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు.