‘సిగ్గు లేకుండా..’ బర్త్‌డే రోజు జగ్గూ భాయ్‌ పోస్ట్‌.. వైరల్‌! | Happy birthday Jagapathi Babu Post and Funny comments viral | Sakshi
Sakshi News home page

‘సిగ్గు లేకుండా..’ బర్త్‌డే రోజు జగ్గూ భాయ్‌ పోస్ట్‌.. వైరల్‌!

Published Mon, Feb 12 2024 5:00 PM | Last Updated on Mon, Feb 12 2024 5:29 PM

Happy birthday Jagapathi Babu Post and Funny comments viral - Sakshi

టాలీవుడ్‌లో పరిచయం అవసరం  లేని విలక్షన నటుడు జగపతి బాబు. ఫ్యామిలీ హీరోగా  ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న జగ్గూభాయ్‌  తరువాత విలన్‌గా,  కారెక్టర్‌ ఆర్టిస్టుగా తనను తాను  మల్చుకుని  మరింత సెన్సేషన్‌గా అవతరించాడు. పాత్ర ఏదైనా సరే..తనదైన స్టయిల్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తాడు. అందుకే  దర్శక నిర్మాతల ఫేవరెట్‌గా మారిపోయాడు. ఈ రోజు  ఆయన  పుట్టిన రోజుగా సందర్బంగా  తన ట్విటర్‌లో ఒక వెరైటీ పోస్ట్‌పెట్టాడు జగ్గూభాయ్‌.

‘‘ఎలాగోలా పుట్టేశాను.. సిగ్గు లేకుండా అడుగుతున్న.. మీ అందరి ఆశీస్సులు నాకు  కావాలి.  ఇక రెండోది.. తొందరగా డిసైడ్ చేయండి..ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు” అంటూ  అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్ట్‌లో  ఒక‌వైపు మిల్క్‌ బాటిల్ ఇంకోవైపు గ్లేన్‌ఫిడిచ్ మద్యం బాటిల్‌తో ఉన్న ఫొటో షర్‌ చేశాడు. దీంతో ఫన్సీ కామెంట్స్‌తో ఫ్యాన్స్‌ సందడిచేస్తున్నారు.   ప్ర‌స్తుతం ఈ పోస్ట్  నెట్టింట్‌ వైర‌ల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement