జగ్గూభాయ్.. ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉన్నారు. షూటింగ్‌కు కాస్తా బ్రేక్ తీసుకున్న జగపతి బాబు.. ఫ్యామిలీతో కలిసి అరబ్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎప్పడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అయన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీకి కెటాయిస్తారు. అంతేకాదు తన వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జగ్గుభాయ్ గొప్యత పాటిస్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఆయన ప్రస్తుతం తాను ఛిల్ మూడ్‌లో ఉన్నానంటూ ఫ్యాన్స్‌తో దుబాయ్ ట్రిప్ ఫొటోను పంచుకున్నారు.
చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ఫొటోకి ‘దుబాయ్ వాటర్ పార్కులో అలసిపోయిన ఫ్యామిలీకి దాహం తీర్చడానికి’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇందులో ఆయన లుక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సినిమాల్లో విలన్‌గా సీరియస్‌గా కనిపించే జగ్గుభాయ్‌ని ఇలా ఎడారి దేశంలో ఛిల్ అవుతూ కనిపించడం చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయన ఫొటోపై రకరకాల కామెంట్స్‌తో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
చదవండి: శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లెటేస్ట్ పోస్ట్ వైరల్, ఏం అంటున్నాడంటే
కాగా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన తిరుగు లేని నటుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఏ తరహా పాత్రలో అయినా ఇమిడిపోతు తనలోని నటుడిని తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డిమాండ్ ఉన్న నటుడిగా మారారు. ఇటీవల ‘గుడ్‌లక్’ సఖీతో ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘గని’ చిత్రంతో పాటు పాన్ ఇండియా సినిమాలు ‘రాధేశ్యామ్’, ‘సలార్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Dubai water park lo aliasipoyana family ki daaham theerchadaniki. pic.twitter.com/CRWI4QWQ3l
— Jaggu Bhai (@IamJagguBhai) March 6, 2022
Comments
Please login to add a commentAdd a comment